Rj Balaji
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ మరో కొత్త సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ సొర్గవాసల్ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 27 నుంచి సొర్గవాసల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సిద్దార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. జైలు బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుందని సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కథేంటంటే.. హీరో రోడ్డు పక్కన ఫుడ్‌స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అక్కడికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిత్యం వస్తుంటాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ చొరవతో తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. అలా లోన్ సాంక్షన్ లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో అధికారి హత్య జరగ్గా అందుకు హీరోను నిందితుడిగా భావించి జైల్లో వేస్తారు. ఆ అధికారిని ఎవరు చంపారు? హీరోను కావాలని జైలుకు పంపించిందెవరు? తర్వాత ఎలా బయటకు వచ్చాడు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: రూ.100 కోట్లిచ్చినా ఆ పాత్ర చేయను: హీరోయిన్ -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. గత నెల చివరలో తమిళంలో రిలీజైన క్రైమ్ డ్రామా ప్రశంసలు అందుకుంది.1999లో మద్రాస్ సెంట్రల్ జైలు అల్లర బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)రేడియో జాకీ నుంచి హీరో, దర్శకుడిగా మారిన ఆర్జే బాలాజీ.. రీసెంట్గా 'సొర్గవాసల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. చేయని నేరానికి జైలుకెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? జైలులో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? అసలు అల్లర్లు జరగడానికి కారణమేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.నవంబర్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. సరిగ్గా నాలుగు వారాల తర్వాత అంటే డిసెంబర్ 27న ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. జైలు బ్యాక్ డ్రాప్లో నడిచే క్రైమ్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కాకండి. 'సొర్గవాసల్' అంటే స్వర్గద్వారం అని అర్థం!(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం) -
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
సూర్య @ 45
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్ఆర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.– సాక్షి, తమిళ సినిమా -
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయన్ తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్‌తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. -
నవంబరులో స్టార్ట్
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనుంది. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను నవంబరులో ప్రారంభించి, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్‌లో ఆర్జే బాలాజీ బిజీగా ఉన్నారు. ఈ కథపై ఆయన ఏడాదిగా వర్క్ చేస్తున్నారు. చిత్రీకరణకు అనువైన లొకేషన్ల సందర్శన కూడా చేస్తున్నారాయన’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్ . -
దర్శకుడు మారాడా?
‘ముకుత్తి అమ్మన్ (2020)’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమా సీక్వెల్ ‘ముకుత్తి అమ్మన్ 2’కు తమిళ దర్శకుడు సుందర్. సి దర్శకత్వం వహించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. నయనతార, ఆర్జే బాలాజీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ముకుత్తి అమ్మన్’. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ ఫ్యాంటసీ కామెడీ సినిమా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని, ఈ చిత్రంలో త్రిష లీడ్ రోల్లో నటిస్తారని, ఆర్జే బాలాజీ కూడా ఓ లీడ్ రోల్లో నటించి, పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. కానీ తొలి భాగంలో నటించిన నయనతారయే మలి భాగంలోనూ లీడ్ రోల్ చేస్తారని, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ గత నెలలో ప్రకటించింది. అయితే దర్శకుడిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ‘ముకుత్తి అమ్మన్ 2’కు ఆర్జే బాలాజీయే దర్శకత్వం వహిస్తారా? లేదా అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. అయితే తాజాగా నటుడు–దర్శకుడు సుందర్. సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోపు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని భోగట్టా. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ఆ బాలీవుడ్ స్టార్‌తో నన్ను పోల్చవద్దు: హీరో
తమిళ హీరో ఆర్జే బాలాజి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింగపూర్ సెలూన్. మీనాక్షిచౌదరి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, లాల్, అరవిందస్వామి ముఖ్య పాత్రలు పోషించారు. గోకుల్ దర్శకత్వం వహించగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించారు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సింగపూర్ సెలూన్ సక్సెస్‌మీట్ నిర్వహించారు. అలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉంటే బాగుండు ఈ సందర్భంగా ఆర్జే బాలాజి మాట్లాడుతూ.. సింగపూర్ సెలూన్ చిత్ర విజయం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ మూవీలోని అరవిందస్వామి పాత్రను చూసి ఇలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే బాగుండని చాలా మంది అనుకున్నారన్నారు. అంత ఉత్తమ నటనను ప్రదర్శించిన అరవిందస్వామికి ధన్యవాదాలు తెలిపారు. తొలివారంలో ప్రేక్షకులకు నచ్చేసిన ఈ చిత్రం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబట్టాలనే ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఆయనతో పోల్చొద్దు నటుడు చిన్ని జయంత్ తనను సౌత్ ఇండియన్ అమీర్ ఖాన్ అని పేర్కొనడంతో భయం కలిగిందన్నారు. ఆయన లెజెండ్ అని, ఆయనతో తనను పోల్చరాదన్నారు. తనలోని నటనను బయటకు తీసిన దర్శకుడు గోకుల్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిర్మాత ఐసరి గణేశ్ తనకు తండ్రి లాంటివారని, ఎల్కేజీ 2, మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రాలను చేయాలన్న ఆలోచన ఉందని, వాటిని ఐసరి గణేశ్ సంస్థలోనే చేస్తానని చెప్పారు. చదవండి: 'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్ -
Animal Film: ఆడవారిపై హింస.. ఎంజాయ్ చేస్తున్నారు, నా వల్ల కాదు!
-
యానిమల్ చూసి జనాలు ఆనందిస్తున్నారు, బాధేసింది: హీరో
కొన్ని చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధిస్తాయి.. కానీ కొందరికి నచ్చవు. మరికొన్ని చిత్రాలు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేవు, కానీ ఎంతోమందికి ఇట్టే కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. ఒక్కో సినిమాది ఒక్కో రిజల్ట్. ఈ మధ్య కాలంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రాల్లో యానిమల్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ చిత్రంపై విమర్శలు కూడా వచ్చాయి. అమ్మాయిని చులకనగా చూడటం నచ్చలేదు తాజాగా తమిళ హీరో, దర్శకుడు ఆర్జే బాలాజీ యానిమల్ మూవీ నచ్చలేదంటున్నాడు. అతడు మాట్లాడుతూ.. 'థియేటర్లో నేను యానిమల్ సినిమా చూడలేదు, చూడాలనుకోలేదు కూడా! చాలామంది ఈ సినిమా చూడమని, అద్భుతంగా ఉందని సలహా ఇచ్చారు. నాకు నచ్చని అంశం ఏంటంటే.. ఒకమ్మాయిని కొడుతుంటే, తనను వేధిస్తుంటే థియేటర్లో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని నేను సహించలేను. అలాంటి సీన్లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తూ జనాలు ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. నా సినిమాలో అయితే ఒప్పుకోను అలాంటి సన్నివేశాలను చూసి ఆనందించడం సరైనది కాదు. ఇవి జనాలను ఏదో ఒకరకంగా ప్రేరేపిస్తాయి. అలాంటి సన్నివేశాలు నా సినిమాలో అయితే పెట్టనివ్వను. యానిమల్‌లో హీరో.. తృప్తి డిమ్రిని తన షూ నాకమన్నాడట. యూత్ ఇలాంటివి చూసినప్పుడు ఆడవాళ్లతో అలాంటి పనులు చేయించడం తప్పేం కాదని ఫీలవుతారు' అని ఆర్జే బాలాజీ చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా రాబట్టింది. చదవండి: పాన్ ఇండియా సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురు! -
ట్రైనింగ్ పూర్తి.. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన హీరో!
ఆర్జేగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ ఆ తరువాత హాస్యనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి ఆపై మెగాఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింగపూర్ సెలూన్. గోకుల్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, సత్యరాజ్, లాల్, జీవా, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు ఒక ప్రముఖ నటుడు కీలక పాత్రను పోషించినట్లు దర్శకుడు చెప్పారు. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న తెరపైకి రానుంది. సింగపూర్ సెలూన్ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందింది. ఈ చిత్రం చైన్నెలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గోకుల్ మాట్లాడుతూ.. చదువుకుంటున్న దశలోనే హెయిర్ స్టైలిస్ట్ కావాలని ఆశపడే ఒక సాధారణ వ్యక్తి కథే ఈ సినిమా అన్నారు. సింగపూర్ సెలూన్ చిత్రం తన కెరీర్లో 10 కాలాల పాటు గుర్తుండిపోతుందనే నమ్మకాన్ని బాలాజీ వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం హెయిర్ స్టైలిస్ట్‌గా ప్రాథమిక శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. చదవండి: 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు': ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్! -
రన్ బేబీ రన్ సక్సెస్.. హీరోకు గోల్డ్ రింగ్ గిఫ్ట్!
కార్తీ హీరోగా సర్ధార్, శశికుమార్ హీరోగా కారి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్.లక్ష్మణన్ నిర్మించిన తాజా చిత్రం రన్ బేబీ రన్. ఆర్జే బాలాజీ కథానాయకుడిగా నటించిన ఇందులో ఐశ్వర్యరాజేశ్ ప్రధాన పాత్ర పోషించారు. కృష్ణకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం చెన్నైలోని ఓ హోటల్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మణన్ మాట్లాడుతూ.. చిత్ర కథలోకి ఎప్పుడైతే ఆర్జే.బాలాజీ వచ్చారో అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు చెప్పారు. నటీనటులందరూ ఎంతగానో సహకరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. తమ సంస్థలో ఆర్జే.బాలాజీ హీరోగా మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు. నటుడు ఆర్జే.బాలాజీ మాట్లాడుతూ.. చిత్రానికి మౌత్ టాక్ చాలా ముఖ్యం అన్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచి అది ఉందన్నారు. అయితే మంచి కంటెంట్ లేకపోతే ఎంత ప్రచారం చేసినా నిరుపయోగమని తెలిపారు. రన్ బేబీ రన్ చిత్రంలో మంచి కంటెంట్ ఉందని అన్నారు. పొంగల్ సందర్భంగా పెద్ద హీరోల చిత్రాలు విడుదలై తమ చిత్రానికి ఎక్కువ థియేటర్లు లభించలేదని, అయితే రెండో వారం థియేటర్లు అధికం అయ్యాయని తెలిపారు. ఇప్పుడు మల్టీ థియేటర్లలోనే రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శితమవుతున్నాయని చెప్పారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో నిర్మాత ఐసరి గణేశ్ అభినందిస్తూ బంగారపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారన్నారు. మరి రన్ బేబీ రన్ చిత్ర నిర్మాత మిలాన్ జలీల్ ఏం కానుక ఇచ్చారన్న ప్రశ్నకు ఆ నిర్మాత తనతో మరో చిత్రం చేస్తాననడమే పెద్ద కానుక అన్నారు. చదవండి: డైరెక్టర్‌తో గొడవలు.. లియో నుంచి తప్పుకున్న త్రిష -
నిర్మాతల లాభాలపైనే నా పారితోషికం: నటుడు బాలాజి
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా సర్ధార్, శశికుమార్ హీరోగా కారి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేతలు ఏ.లక్ష్మణన్, వెంకట్ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రన్ బేబీ రన్. నటుడు దర్శకుడు ఆర్జే బాలాజి కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేష్ కథానాయకిగా నటించారు. నటి రితిక, వివేక్ ప్రసన్న, విశ్వ, రాజా అయ్యప్ప ప్రధాని పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ చాయాగ్రహణం, శ్యాంసిఎస్ సంగీతాన్ని అందించారు. చదవండి: నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్ మలయాళ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక టీనగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు జయన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తాను మలయాళంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో చిత్రం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ కథను లక్ష్మణన్‌కు చెప్పగా ఆయనే నటుడు ఆర్జే బాలాజీని హీరోగా సూచించారన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కథ వినగానే బాగా నచ్చిందని అంతగా దర్శకుడు కథను పకడ్బందీగా తయారు చేశారని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. నటుడు ఆర్జే బాలాజి మాట్లాడుతూ దర్శకుడు జయన్ కృష్ణకుమార్ తనను కలిసి చిరునవ్వుతోనే కథలు చెప్పారన్నారు. అంద 7 నాట్కళ్ చిత్రం కె..భాగ్యరాజ్‌కు మరుజన్మే ఆయన పేర్కొన్నారు. ఈయన ప్రతిభావంతులైన టీమ్‌ను నియమించుకున్నారన్నారు. నిర్మాత లక్ష్మణన్ ఖర్చుకు వెనకాడకుండా ప్రముఖ సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని భారీగా నిర్మించారన్నారని తెలిపారు. తన పారితోషికం గురించి అడుగుతున్నారని, అది నిర్మాతల లాభాలను బట్టి ఉంటుందని ఆర్జే బాలాజి పేర్కొన్నారు. -
సత్యరాజ్ లీడ్‌లో 'బదాయి హో' రీమేక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Badhaai Ho Movie Remake Veetla Vishesham Release Date Announced: ఆర్జే బాలాజీ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'వీట్ల విశేషం'. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో జీ.స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పీ, రోమియో పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జే బాలాజీ గురువారం (జూన్ 3) మీడియాతో మాట్లాడుతూ ఇది రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రమన్నారు. 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హిందీ చిత్రం బదాయ్ హోకు ఇది రీమేక్ అని, అయితే ఇప్పటి తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు చెప్పారు. నటుడు సత్యరాజ్, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో నటి అపర్ణ బాలమురళి తనకు జంటగా నటించారని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
ఆన్లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు తల్లి
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆదిశక్తిగా కనిపిస్తున్న చిత్రం ముక్తి అమ్మాన్. ఎప్పుడూ అందం, అభినయంతో అలరించే ఆమె తొలిసారి దేవత పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రం తెలుగులో అమ్మోరుతల్లిగా విడుదల కానుంది. ఎన్జె శరవణన్, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇశారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం సమకూర్చారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. (ఫ్యాక్ట్ : నయన్-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?) ఓ కుటుంబ కులదైవమైన ముక్కుపుడకల అమ్మవారు వారి ఎదుట ప్రత్యక్షమై ఎలాంటి వరాలు ఇచ్చారు? భక్తి పేరుతో మోసాలు చేసేవారిని అమ్మవారు ఏం చేశారు? అసలు అమ్మవారు భూమి మీదకు రావడానికి కారణమేంటి? ఆమె నిజంగా అమ్మవారేనా> అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో 'మీ జుట్టు ఎందకు నల్లగా లేకుండా ఫారిన్ అమ్మోరిలా గోధుమ రంగులో ఉందని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు అడ్డమైన నీళ్లతో అభిషేకాలు చేస్తే కలర్ మారదా? అని నయన్ కౌంటరిచ్చారు. మీ శక్తినుపయోగించి ఆన్లైన్ క్లాసులు రద్దు చేయమని ఓ భక్తురాలు కోరడంతో అమ్మోరు తల్లే షాకయ్యారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 14న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. (నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం) -
ఇలా తొలిసారిగా కనిపిస్తోన్న నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆదిశక్తిగా కనిపించనుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న "ముఖ్తి అమ్మాన్" చిత్రంలో ఆమె దేవత పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఇందులో పెద్ద పెద్ద ఆభరణాలు ధరించిన నయనతార ఓ చేతిలో త్రిశూలం పట్టుకుని ఎరుపు, ఆకుపచ్చ చీరలో ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. అమ్మవారి అవతారమెత్తిన నయనతార ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమ్మవారిగా నయనతార సరిగ్గా సరిపోయిందంటూ ఆమె అభిమానులు పేర్కొంటున్నారు కాగా నయనతార ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నటించింది కానీ, అమ్మవారిగా కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. (అమ్మా.. లవ్ యూ.. నయన్ తల్లికి విఘ్నేశ్ శివన్ విషెస్) As always, humbled by all your love and support ❤️ Thank you for the phenomenal response for the first and second look of #MookuthiAmman .!!!🙏🙏🙏 pic.twitter.com/m1kROaPcgB — RJ Balaji (@RJ_Balaji) March 1, 2020 ఈ సినిమా గురించి దర్శకుడు ఆర్జే బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక చిత్రమేనని తెలిపారు. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన భక్తి చిత్రాల్లో ఉన్న అంశాలన్నీ ఇందులోనూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఊర్వశి, స్మృతి వెంకట్, అజ ఘోష్ తదితరులు నటిస్తున్నారు. ఇశారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం సమకూర్చారు. ఇదిలా వుండగా నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా, విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ‘కాదువాక్కుల రెండు కాదల్’ సినిమా తెరకెక్కనుంది. దీనికి నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా నయనతార లాక్‌డౌన్‌కు ముందు రజనీకాంత్ "దర్బార్" చిత్రంలో చివరిసారిగా కనిపించిన విషయం తెలిసిందే. (స్టార్ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!) #MookuthiAmman on spot 📸 pic.twitter.com/pwXGqsGbUw — Nayanthara✨ (@NayantharaU) June 4, 2020 pic.twitter.com/g216dypx8X — RJ Balaji (@RJ_Balaji) June 4, 2020 -
పొంగల్ పోరులో...
సినిమా రిలీజ్‌లకు ‘బెస్ట్ సీజన్స్’లో సంక్రాంతి ఒకటి. తెలుగువారికి సంక్రాంతి అంటే తమిళంలో ‘పొంగల్’. మూడు నాలుగు రోజుల స్కూల్ సెలవులను, ఆఫీస్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి సరైన సమయం. వచ్చే ‘పొంగల్ పోరు’లో నిలిచేది ఎవరు? అనేది ఇప్పుడు తమిళనాడు కోడంబాక్కమ్ ఏరియాలో హాట్ టాపిక్. మనకు ఫిల్మ్ నగర్ అయితే.. అక్కడ కోడంబాక్కమ్ అన్నమాట. ఇక.. పొంగల్ సందడి గురించి తెలుసుకుందాం. 4 రోజుల ముందే పండగ పండగ స్టార్ట్ అవ్వడానికి 4 రోజులు ముందే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రం జనవరి 10న విడుదల కానుందని సమాచారం. ‘బాషా’ (1995) సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన ఏ సినిమా కూడా పొంగల్‌కి రిలీజ్ కాలేదు. అందుకే పొంగల్‌కి ‘పేట్టా’ అనగానే అభిమానుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ రెండు క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ‘పేట్టా’ సినిమాలో కూడా రజనీకాంత్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్‌ను ఆల్రెడీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి.. ‘బాషా’ రేంజ్లో ‘పేట్టా’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా? లేదా అని తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే... దాదాపు 15ఏళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా ఉన్న త్రిష కెరీర్లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తొలిసారి తమిళ సినిమాలో నటించారు. సిమ్రాన్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, మేఘా ఆకాష్, సనత్‌రెడ్డి, బాబీ సింహాలతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ ఏడాది జూన్‌లో ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ‘2.ఓ’ సినిమాతో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మళ్లీ 45 రోజులకే థియేటర్స్‌లో కనిపించనుండటం విశేషం. సంక్రాంతికి ‘పేట్టా’గా వస్తున్నారు. జస్ట్ ఏడు నెలల్లో రజనీకాంత్ నటించిన మూడు సినిమాలు రావడం అంటే ఫ్యాన్స్‌కు పండగే కదా. తలైవర్ వర్సెస్ తల? అజిత్ ‘విశ్వాసం’ సినిమాతో పొంగల్‌కి రాబోతున్నారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ‘వీరమ్, వేదాలం, వివేగమ్’ వంటి హిట్ మూవీస్ తర్వాత అజిత్–శివ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బట్టి అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మరి.. బాక్సాఫీస్ వద్ద తలైవర్ రజనీకాంత్‌తో తల అజిత్‌కు పోరు తప్పదా? అంటే అదేం లేదు అంటున్నాయి కోడంబాక్కమ్ వర్గాలు. ‘పేట్టా’ సినిమా జవనరి 10కి రిలీజ్ కానుందట. ‘విశ్వాసం’ చిత్రాన్ని జనవరి 14కి ప్లాన్ చేస్తున్నారు. సో.. 4 రోజులు గ్యాప్ ఉంది. ‘నో వార్’ అని జోస్యం చెబుతున్నారు. కానీ అధికారికంగా విడుదల తేదీని రెండు చిత్రవర్గాలూ ప్రకటించలేదు. అయితే రెండూ జనవరిలో విడుదలవ్వడం ఖాయం. ‘విశ్వాసం’లో అజిత్ రాజులా వస్తాను శింబు హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వందా రాజావాదాన్ వరువేన్’. తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో మేఘా ఆకాష్, కేథరిన్ కథానాయికలు. ఈ సినిమా కూడా పొంగల్ రేస్‌లో నిలిచింది. అయితే పేట్టా, విశ్వాసం సినిమాలు పొంగల్‌కి వస్తున్నాయి కాబట్టి ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమా పొంగల్ తర్వాత రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ పొంగల్‌కి వరోమ్ (పొంగల్‌కి వస్తున్నాం) అని ఓ స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు శింబు. అలాగే తన గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న రెడ్ కార్డ్ (‘ఏఏఏ’ సినిమాకి సంబంధించిన సమస్యని ఉద్దేశించి) గురించి కూడా ఆందోళన చెందవద్దని కూడా ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు శింబు. ‘వందా రాజావాదాన్ వరువేన్’లో శింబు బాలాజీ ఎల్కేజీ ఇంతకాలం హాస్యనటుడిగా వెండితెరపై ప్రేక్షకులను నవ్వించారు ఆర్జే బాలాజీ. ఇంతకు ముందు రేడియో జాకీగా వర్క్ చేశారు. ప్రస్తుతం ఆయన లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘ఎల్.కే.జీ’. టైటిల్ బట్టి ఇదేదో చిన్న పిల్లల సినిమా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది పొలిటికల్ సెటైరికల్ మూవీ. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్‌కి రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జే బాలాజీ తెలిపారు. మరి... రజనీకాంత్, అజిత్, శింబు వంటి స్టార్స్ సినిమాలు వస్తున్న టైమ్‌లో బాలాజీ ‘ఎల్.కే.జీ’ వస్తే? రావాలంటే దమ్ముండాలి. సినిమా మీద బోలెడంత నమ్మకం ఉండాలి. ఈ చిత్రబృందానికి ఈ రెండూ ఉన్నట్లున్నాయి. అందుకే పొంగల్ పోరుకి రెడీ అవుతున్నారు. ‘ఎల్కేజీ’లో ఆర్జే బాలాజీ -
రేడియో జాకీతో ప్రియాఆనంద్ రొమాన్స్
తమిళసినిమా: రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఏవరైనా నాయకుడు కావచ్చు. సినిమాల్లో ఎవరైనా కథానాయకుడు కావచ్చు. ఆ విధంగా కథానాయకుడిగా మారిన హాస్యనటుల పట్టికలో తాజాగా ఆర్జే.బాలాజీ చేరుతున్నాడు. చక్కని ఉచ్చరింపు, ఆకట్టుకునే అభినయం వంటి ప్లస్ పాయింట్స్‌తో అనతికాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయిన నటుడు ఆర్కే.బాలాజీ. ఇతనిప్పుడు ఎల్కేజీ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇది రాజకీయ సెట్టైరికల్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అట.వేల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ కే.గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్జే.బాలాజీకి జంటగా నటి ప్రియాఆనంద్ నటిస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త అయిన నాంజల్ సంపత్ ముఖ్య పాత్ర ద్వారా నటుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆర్జే.బాలాజీ తెలుపుతూ ఈ తరం యువతకు రాజకీయాల గురించి తెలియనివి ఉండవనే చెప్పవచ్చునన్నారు. బ్రేకింగ్ న్యూస్ అనే కాలంలో జీవిస్తున్న యువతకు రాజకీయాల గురించి, రాజకీయనాయకుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అధికం అవుతోందన్నారు. అలాంటి వారి కోసమే ఈ ఎల్కేజీ చిత్రం అని చెప్పారు. ఇందులో తనకు తండ్రిగా నాంజల్ సంపత్ నటిస్తున్నారని తెలిపారు. నేటి యువతరంలో నాంజిల్ సంపత్‌కు మంచి పేరు ఉందన్నారు. అదేవిధంగా తనకు చిరకాల స్నేహితురాలైన ప్రియాఆనంద్ నటిగా కంటే కూడా అధిక అక్కర చూపిస్తూ ఈ చిత్రంలో నటించడం ప్రశంసనీయం అన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని, మేయాద మాన్ చిత్ర ఫేమ్ విదు ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఈ ఎల్కేజీ చిత్రం రాజకీయ సెట్టైరికల్తో పాటు అన్ని వర్గాలను రంజింపజేసే సన్నివేశాలతో కూడి ఉంటుందని ఆర్జే.బాలాజీ చెప్పారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
ఎల్కేజీ హీరో
‘ఎల్కేజీ’ జాయిన్ అయ్యారు ఆర్జే బాలాజీ. మూడు పదుల వయసు తర్వాత ఆయన ‘ఎల్కేజీ’లో జాయిన్ అవ్వడం ఏంటీ? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది సినిమా పేరు. రేడియో జాకీగా కెరీర్‌ను స్టార్ట్ చేసి టీవీ ప్రజెంటర్, హాస్య నటుడిగా ఎదిగిన బాలాజీ ఇప్పుడు హీరోగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభు దర్శకునిగా పరిచయం అవుతూ ఆర్జే బాలాజీ హీరోగా నటించనున్న చిత్రం ‘ఎల్కేజీ’. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించనున్నారు. శుక్రవారం ‘ఎల్కేజీ’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని కోలీవుడ్ టాక్. ఇందులో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆర్జే బాలాజీనే అందించనుండటం విశేషం. ఈ సినిమాకు లియాన్ జేమ్స్ బాణీలు సమకూర్చనున్నారు. మూవీ టైటిల్‌ను బట్టీ ‘ఎల్కేజీ’ అనేది సినిమాలో ఓ పొలిటికల్ పార్టీ కూడా అయ్యి ఉండవచ్చన్నది కొందరి ఊహ. -
మణిరత్నం సినిమాలో రేడియో జాకీ
వడకర్రీ, యాచ్చన్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న నటుడు బాలజీ.., గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ రేడియో జాకీ నటించనున్నాడు. ఈ విషయం తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న బాలాజీ, ' ఇది నిజంగా జరిగింది. మణిరత్నం సినిమాలు చూస్తూ పెరిగా.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించబోతున్నా..! అంతా కలలా ఉంది'. అంటూ కామెంట్ చేశాడు. ఓకె బంగారం సినిమా తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న మణిరత్నం తాజాగా కార్తీతో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో కార్తీ స్లిమ్ లుక్ కనిపించనున్నాడు. కార్తీ సరసన అదితిరావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ శుక్రవారం నుంచి ఊటిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోంది. And this did happen for real. Grew up watchin his films n now to be part of a Maniratnam Film. Feels like a dream!☺️ pic.twitter.com/eq5kAiTf8h — RJ Balaji (@RJ_Balaji) 4 July 2016 -
సహాయ కార్యక్రమాల్లో సిద్దార్థ్
చెన్నైలో వర్షం కాస్త తగ్గటంతో సహాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితులపై అందరికంటే ముందుగా స్పందించిన హీరో సిద్దార్ధ్, తన సహాయ కార్యక్రమాలకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వాడుకుంటున్నాడు. సాయం చేయాలనుకుంటున్న వారు తమను ఎలా సంప్రదించాలి, ఎంతమందికి సాయం చేయగలం లాంటి విషయాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తమ వాలంటీర్లు ఇంటర్నెట్ యాక్సెస్‌తో సిద్ధంగా ఉన్నారంటూ తెలిపిన సిద్దార్థ్, పలు రకాల వాహనాలతో ఈ రోజంతా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ప్రకటించాడు. సోషల్ సైట్స్‌లో కొంతమంది లేనిపోని వదంతులు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపాడు. సరైన సమాచారం లేకుండా అలాంటి విషయాలను పోస్ట్ చేయొద్దని కోరాడు. చాలాప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నందున వాటర్ బాటిల్స్ పంపించాలంటూ కోరాడు. అందుబాటులో వాహనాలు ఉన్నవారు ఆహార పొట్లాలు తీసుకువచ్చి.. పామ్ గ్రోవ్ హోటల్ ఎదురుగా ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ ఆఫీస్‌లో అందజేయాలని, వాళ్ల వద్ద వాహనాలు లేకపోతే.. తనకు సమాచరం అందిస్తే తామే వచ్చి కలెక్ట్ చేసుకుంటామన్నాడు. Back in connectivity. We have trucks and vehicles going out all day today. Please use #ChennaiMicro to reach us. We need more supplies. — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 Only packaged food and snacks today PLEASE. Water bottles priority. Also lots of areas still need blankets. Please help. #ChennaiMicro — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 There is a lot or false information on social networks. Don't post without verification. It's a nuisance. Tweet responsibly. #ChennaiMicro — Siddharth (@Actor_Siddharth) December 5, 2015 If you have vehicles drop off supplies to big fm office opposite palmgrove hotel. If you don't, we will come and pick up. #ChennaiMicro — Siddharth (@Actor_Siddharth) December 5, 2015