
కోలీవుడ్ నటుడు సూర్య, నటి త్రిష మాస్ జాతర సాంగ్‌తో తెరపై దుమ్ము రేపటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ పాటలో 500 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారు. ఇది ఏచిత్రం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సూర్య తన 45వ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఆయన ప్రతి నాయకుడిగానూ నటిస్తున్నట్లు సమాచారం. కాగా నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి శ్వాసిక , ఇందిరస్, యోగిబాబు, షివాద, సుప్రీత్‌రెడ్డి, నట్టి నటరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఇందులో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకటి న్యాయవాది పాత్ర అని సమాచారం. అదేవిధంగా ఇది న్యాయస్థానంలో జరిగే కేసు నేపథ్యంగా సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. తదుపరి చెన్నైలోని ఈ సీ ఆర్‌రోడ్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక మాస్ జాతర పాటను చిత్రీకరించడానికి యూనిట్ సన్నద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఫోక్ సంగీత బాణీలు కట్టిన ఈ మాస్ జాతర పాటలో సూర్య, త్రిషలతో పాటు 50 మంది డాన్సర్లు నటించబోతున్నట్లు తెలిసింది.
దీనికి శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహించనున్నారని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఒక్క పాట కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. నటి పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రం మే 1న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment