ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ మరో కొత్త సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ సొర్గవాసల్ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 27 నుంచి సొర్గవాసల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
సిద్దార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. జైలు బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుందని సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కథేంటంటే.. హీరో రోడ్డు పక్కన ఫుడ్‌స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అక్కడికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిత్యం వస్తుంటాడు.
అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ చొరవతో తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. అలా లోన్ సాంక్షన్ లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో అధికారి హత్య జరగ్గా అందుకు హీరోను నిందితుడిగా భావించి జైల్లో వేస్తారు. ఆ అధికారిని ఎవరు చంపారు? హీరోను కావాలని జైలుకు పంపించిందెవరు? తర్వాత ఎలా బయటకు వచ్చాడు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment