గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన చిత్రాల్లో గదర్ 2 ఒకటి. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల మేర రాబట్టింది. అయితే ఈ సినిమాలో అత్త పాత్ర పోషించేందుకు హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు డైరెక్టర్ అనిల్ శర్మ.
అమీషా ఒప్పుకోలేదు
ఓ ఇంటర్వ్యూలో అనిల్ శర్మ మాట్లాడుతూ.. vఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం కావాలి. తన ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో అని భయపడింది. అయినా అమీషాపై నాకెలాంటి కోపం లేదు, తను కూడా గదర్ సినీ ఫ్యామిలీలో ఒక భాగమే! అని చెప్పుకొచ్చాడు.
అది నా ఇష్టం
ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ అమీషా పటేల్ మండిపడింది. డియర్ అనిల్ గారు. ఇది సినిమా మాత్రమే, వ్యక్తిగత జీవితం కాదు! కాబట్టి ఏ సినిమాలు చేయాలి? ఎటువంటి పాత్రలు పోషించాలి? అనేది పూర్తిగా నా ఇష్టం. మీపై నాకు పూర్తి గౌరవం ఉంది. అయితే రూ.100 కోట్లు ఇచ్చినా సరే.. గదర్ సినిమాలోనే కాదు మరే సినిమాలోనూ అత్త పాత్ర పోషించలేను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా క్లారిటీ ఇచ్చింది.
గతంలోనూ వివాదం
కాగా గదర్ ఫస్ట్ పార్ట్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సీక్వెల్‌లో హీరో ఉత్కర్ష్ శర్మకు సన్నీ- అమీషా తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ అనిల్ శర్మ తనయుడే ఉత్కర్ష్ శర్మ. గతంలోనూ అమీషా.. అనిల్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. గదర్ 2 షూటింగ్‌లో తనకు కనీస వతి కల్పించలేదని ఆరోపించింది. అలాగే కుమారుడి పాత్రను పవర్‌ఫుల్‌గా మార్చడం కోసం సినిమా క్లైమాక్స్‌నే మార్చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజులకే డైరెక్టర్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఈ వివాదానికి ముగింపు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment