Anil Sharma
-
పొత్తు చిచ్చు.. కాంగ్రెస్‌ను వీడిన బిహార్ మాజీ చీఫ్
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జేడీతో పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మ పార్టీని వీడారు. ఆర్జేడీతో వినాశకరమైన పొత్తులో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో అనిల్ శర్మ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను ఇటీవల ఆర్భాటంగా పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీలో దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం కనిపించదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీ లేదా అతని సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు” అని శర్మ ఆరోపించారు. దాదాపు దశాబ్ద కాలంలో పార్టీని వీడిన నాల్గవ మాజీ బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శర్మ నిలిచారు. 2018లో అశోక్ చౌదరి పార్టీని వీడి జేడీయూలో చేరారు. అంతకుముందు, 2015లో రామ్ జతన్ సిన్హా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. అంతకు ముందు సంవత్సరం, మెహబూబ్ అలీ కైజర్ ఎల్జేపీలో చేరారు. "నేను 1985లో కాంగ్రెస్‌లో చేరాను. దాదాపు నాలుగు దశాబ్దాలలో రెండుసార్లు సంస్థాగత పదవులను నిర్వహించాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాను. నేనెప్పుడూ టిక్కెట్ కోసం గానీ, శాసన మండలి బెర్త్ కోసం గానీ లాబీయింగ్ చేయలేదు. అలాగే కాంగ్రెస్‌ను వీడే ముందు మరే ఇతర పార్టీలో అవకాశాలను అన్వేషించలేదు" అని అనిల్ శర్మ చెప్పుకొచ్చారు. -
ఆ సత్తా ఎన్టీఆర్ కే ఉంది..
-
బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం 2001 బ్లాక్‌బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథకు ఆధ్యాత్మిక సీక్వెల్‌గా పనిచేస్తుంది. తారా సింగ్ మరియు సకీనా వంటి వారి ప్రియమైన పాత్రలలో సన్నీ మరియు అమీషా తిరిగి రావడాన్ని ఆస్వాదిస్తూ ప్రేక్షకులు ఈ చిత్రం ద్వారా లోతుగా హత్తుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత కూడా హృదయాలను దోచుకునే వారి కెమిస్ట్రీపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు, ఇది ఇప్పటికీ ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది. అసలు గదర్ నేటి కాలంలో రూపొందితే తారా సింగ్ పాత్రలో ఎవరిని తీసుకుంటారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు అనిల్ శర్మను అడిగారు. ప్రస్తుత తరం నుండి ఆ ఐకానిక్ క్యారెక్టర్లోకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అడుగు పెట్టగలడని తన అభిప్రాయం అని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) అనిల్ శర్మ మాట్లాడుతూ.. ' ప్రస్తుత హీరోల్లో ఆ పాత్రకు సరిపోయే వారు ఎవరూ కనిపించలేదు. ముంబయిలో అయితే ఎవరూ లేరు. సౌత్‌లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు సరిపోతాడు. అతనైతేనే ఈ పాత్రను చేయగలడు. అతనికి ఏ పాత్రలోనైనా చేయగల సత్తా ఉంది.' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది విన్న జూనియర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అభిమానుల స్పందన త్వరలోనే ఎన్టీఆర్ దేవరతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను అలరిస్తాడని అంటున్నారు. తారక్ మాత్రమే అత్యంత పర్ఫెక్ట్గా ఎలాంటి పాత్రనైనా చేయగలడంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్! ) -
డైరెక్టర్‌తో మొన్న గొడవ.. ఇప్పుడేమో రోజంతా ఆయనతోనే!
హీరోయిన్ అమీషా పటేల్ యూటర్న్ తీసుకుంది. సరిగ్గా కొన్నిరోజుల ముందు ఏ దర్శకుడిపై అయితే ఆరోపణలు చేసిందో ఇప్పుడు అతడితోనే రోజంతా గడిపింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు బ్యూటీనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరు కలిసి నవ్వుతున్న ఫొటోని కూడా పోస్ట్ చేసింది. దీంతో.. అసలేం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ తల గోక్కుంటున్నారు. (ఇదీ చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) తెలుగు, హిందీలో హీరోయిన్ గా ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. ప్రస్తుతం హిందీలో నటిస్తోంది. త్వరలో 'గదర్ 2'తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈ చిత్ర షూటింగ్ లో తనకు ఫుడ్, వసతి, ట్రాన్స్పోర్ట్ లాంటి వాటికి ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ జూన్ 30న వరస ట్వీట్స్ చేసింది. ఇప్పుడేమో సడన్‌గా ఆ దర్శకుడు మంచోడు అని మాట మార్చేసింది. 'దర్శకుడు అనిల్ శర్మతో ఆయన ఆఫీసులోనే రోజంతా టైమ్ స్పెండ్ చేశాను. గత 24 ఏళ్ల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. ఎప్పటికీ ఆయన్ని గౌరవిస్తాను. కైరాత్ సాంగ్ చూస్తూ టీమ్ అంతా ఎంజాయ్ చేశాం' అని హీరోయిన్ అమీషా పటేల్ తన తాజా ట్వీట్లో రాసుకొచ్చింది. దీంతో తను చేసిన ఆరోపణలని తానే ఖండించినట్లు అయింది. Spent the entire day today with @Anilsharma_dir at his office .. a director who I have known and respected for 24 years n counting now !! Enjoyed seeing KHAIRAYAT SONG With him and the entire team 💖💖🙏🏻🙏🏻👍🏻 pic.twitter.com/4VAFGOIFnk — ameesha patel (@ameesha_patel) July 18, 2023 (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) -
‘ఇది కుటుంబ విషయం.. వదిలేయండి’
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా.. కొడుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే కొడుకు తరఫున తాను ప్రచారం చేయనంటున్నారు హిమాచల్ బీజేపీ మంత్రి అనిల్ శర్మ. మాజీ కాంగ్రెస్ నాయకుడు సుఖ్రామ్.. ఆయన కుమారుడు అనిల్ శర్మ 2017, అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ శర్మ మండి శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. అయితే అనిల్ శర్మ తండ్రి సుఖ్రామ్, కుమారుడు ఆశ్రయ్ శర్మ ఈ ఏడాది మార్చి 25న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆశ్రయ్ శర్మకు మండి పార్లమెంట్ టికెట్‌ను కేటాయించింది. ఈ విషయం గురించి అనిల్ శర్మ మాట్లాడుతూ.. ‘మా తండ్రి, కుమారుడు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాక ఆశ్రయ్‌కు కాంగ్రెస్ పార్టీ మండి నియోజకవర్గం టికెట్‌ను కూడా కేటాయించింది. ఈ విషయం గురించి నేను అధిష్టానంతో కూడా చర్చించాను. మండిలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేనని చెప్పాను. పార్టీ నా అభ్యర్థనను మన్నించింది. అలా అని నా కొడుకు తరఫున కూడా ప్రచారం చేయన’ని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సట్టి మాట్లాడుతూ.. ‘ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయం. మీడియా ఎందుకు దీని వెనకే పరుగులు తీస్తుందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ మండి పడ్డారు. మరో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ తరఫున మండి నియోజకవర్గంలో తప్ప ఎక్కడైనా ప్రచారం చేస్తానని స్పష్టం చేయడం గమనార్హం. -
బాహుబలి ఓ లెక్కా.. మాది 5000 కోట్లు!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2 సినిమా రూ. 1500 కోట్ల వసూళ్లు సాధించినా, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అనిల్ శర్మకు మాత్రం అది పెద్ద గొప్ప లెక్కలా ఏమీ కనిపించడం లేదు. 2001లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2007 నాటి అప్నే, 2010 నాటి వీర్, 2013 నాటి సింగ్ సాబ్ ద గ్రేట్ లాంటి సినిమాలు ఆయనే తీశారు. అయితే, ఇటీవల బాహుబలి-2 సినిమా బాక్సాఫీసు వసూళ్ల గురించి ఆయన దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. సన్నీ డియోల్‌తో తాను తీసిన గదర్ సినిమాతో పోలిస్తే ఇవి పెద్ద వసూళ్లే కావని ఆయన వ్యాఖ్యానించారు. కాకపోతే అప్పటి కాలం, అప్పటి టికెట్ ధరలు, నాటి డబ్బు విలువ అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దాదాపు 16 ఏళ్ల క్రితం ఆయన తీసిన గదర్ సినిమా అప్పుడే 265 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాని విలువ దాదాపు రూ. 5000 కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. గదర్ సినిమా వచ్చినప్పుడు టికెట్ ధర కేవలం రూ. 25 మాత్రమే ఉండేదని, ఆ లెక్కన ఇప్పటి టికెట్ ధరలు, ద్రవ్యోల్బణం కలిపి లెక్కేసుకుంటే అప్పటి రూ. 265 కోట్లు ఇప్పటికి రూ. 5000 కోట్ల లెక్క అవుతుందని ఆయన వివరించారు. అందువల్ల ఇప్పటివరకు బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లేమీ కాదని తేల్చి చెప్పేశారు. మంచి సినిమాలు ఎప్పుడూ రికార్డులను బద్దలుకొడతాయని, అయితే బాహుబలి2 మాత్రం ఎలాంటి రికార్డులూ బద్దలుకొట్టలేదని అనిల్ శర్మ అన్నారు. తనను ఈ విషయాలన్నింటిలో ఇరికించవద్దని, మంచి సినిమాలు వస్తే రికార్డులు ఆటోమేటిగ్గా బద్దలవుతాయని తెలిపారు. ఆయన ప్రస్తుతం తన కొడుకు ఉత్కర్ష్ హీరోగా వస్తున్న తొలి సినిమా జీనియస్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు బాహుబలి-2 హిందీ వెర్షన్‌కు రూ. 478 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ విడుదల చేసిన ఈ సినిమా ఆమిర్ ఖాన్ తీసిన దంగల్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. #Dangal and #Baahubali2 are akin to WAKE-UP CALL for Indian film industry... The *global biz* is an EYE-OPENER... Game changers, both... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 The resounding success of #Baahubali2 and #Dangal globally reiterates the fact that language is no deterrent if content is strong enough... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 The industry yearns for Hits... #Dangal and #Baahubali2 have achieved what we thought was IMPOSSIBLE and UNACHIEVABLE... Time to rejoice... — taran adarsh (@taran_adarsh) 23 May 2017 #Baahubali2 and #Dangal are PRIDE OF INDIAN CINEMA... Time to make success a habit... Concentrate on content... Positive results will follow — taran adarsh (@taran_adarsh) 23 May 2017 Indeed, #Baahubali2 has emerged the HIGHEST GROSSER EVER... Yeh jo public hain yeh sab jaanti hain... Audience knows it all! https://t.co/kEp0s6d8N0 — taran adarsh (@taran_adarsh) 22 May 2017 -
గుణపాఠం నేర్పిన నేరం పనితీరు మెరుగు
న్యూఢిల్లీ:ఏడాది క్రితంనాటి సామూహిక అత్యాచార ఘటన నగరంలోని ఓ కీలక స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులకు చక్కని గుణపాఠం నేర్పింది. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు దోహదపడింది. దక్షిణ ఢిల్లీలోని మూడంతస్తుల వసంత్‌విహార్ పోలీస్‌స్టేషన్ హఠాత్తుగా బిజీబిజీగా మారిపోయింది. ఆ స్టేషన్ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండడమే ఇందుకు కారణం. ఏడాదిక్రితం ఇదే నెల 16వ తేదీన జరిగిన సామూహిక అత్యాచార ఘటనతో చలించిపోయిన వందలాదిమంది నగరవాసులు ఈ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ పరిణామంతో అనేక అనుభవాలు నేర్చకున్న పోలీసు అధికారులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నించారు. ఇందులోభాగంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఈ స్టేషన్లో సేవలను మరింత సమర్థం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. ఆ రోజు రాత్రి పోలీసులు విధుల్లో ఉండగా స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిఉన్నారంటూ సమాచారమందించాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ రోజు రాత్రి కర్తవ్య నిర్వహణలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనిల్‌శర్మ ఆ తర్వాత స్టేషన్ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలను మీడియాతో పంచుకున్నారు. ‘ఈ ఘటన జరి గిన 17 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన అభియోగపత్రాన్ని కోర్టుకు దాఖలుచేశాం. అనంతరం ఈ స్టేషన్లో మౌలిక వసతులను మెరుగుపర చడం, సిబ్బంది సంఖ్యను పెంచడంపై దృష్టి సారిం చా. ఈ ఘటనకు ముందు మా స్టేషన్లో సిబ్బంది కొరత సమస్య ఉంది. 25 మంది మహిళలతోసహా మొత్తం 150 మంది సిబ్బంది ప్రస్తుతం ఈ స్టేష న్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడాది క్రితం ఈ స్టేషన్లో ఒకే ఒక మహిళా సబ్ఇన్స్పెక్టర్ ఉంది. ఇప్పుడు మొత్తం ముగ్గురు ఉన్నారు. ఇక మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య 20కి చేరుకుంది. ఈ స్టేషన్లో ప్రస్తుతం అత్యవసర స్పందన వాహనాలు (ఈఆర్ వీ) రెండు అందుబాటులో ఉన్నాయి. ఇతర పోలీస్స్టేషన్లలో ఒక్కటి మాత్రమే ఉంది. పెట్రోలింగ్ బాధ్యతలను నిర్వర్తిం చేందుకు ప్రభుత్వం మూడు జిప్సీ వాహనాలను అందజేసింది. 24 గంటలపాటు సేవలందించే సత్వర స్పందన బృందం (క్యూఆర్టీ)తోపాటు నేరాలకు అవకాశమున్న ప్రాంతాల్లో గస్తీ కోసం ఓ వాహనాన్ని అందజేసింది. మహి ళా నిందితులను విచారించేందుకు ఈ స్టేషన్లో ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాం. అంతేకాకుండా మరో లాకప్ గదిని కూడా ఏర్పాటు చేశాం. డిసెంబర్, 16 నాటి ఘటనకు ముందు షహీద్ జీత్‌సింగ్ మార్గ్‌లో విద్యుత్ దీపాలు వెలిగేవి కావు. ఆ ప్రాంతమంతా అంధకారంగా ఉండేది. మా చొరవతో ఇప్పుడు ఆ మార్గం విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. ఈ రోడ్డు మునిర్కా ఫ్లైఓవర్ సమీపంలోనే ఉంది. ఈ మార్గంలోనే బాధితులు ఎక్కిన బస్సు ఆ విషాద రాత్రి వచ్చింది’ అని అన్నారు. కాగా దీపాలు లేని కారణంగా చిమ్మచీకటిగా ఈ రోడ్డులో బస్సు వెళుతుండగా అందులో ఎక్కిన బాధితురాలిని దోషులు అత్యంత పాశవికంగా అనుభవించి, ఆమె వెంట ఉన్న స్నేహితుడిని హింసించి ఆ తర్వాత కిందికి తోసివేసిన సంగతి విదితమే. ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం ఇదే అంశంపై మరో అధికారి మాట్లాడుతూ ఈ కేసు విచారణను సత్వరమే పూర్తిచేసి, అభియోగపత్రం దాఖలు చేసేందుకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామన్నారు. కష్టాలను ఎదుర్కొన్నామన్నారు. రేయింబవళ్లూ శ్రమించడంతో తమ ప్రయత్నం సఫలమైందన్నారు. ఈ కేసును విజయవంతంగా చేధించినందుకు రివార్డు దక్కిందన్నారు.