Ameesha Patel Spends 'Entire Day' With Gadar 2 Director Anil Sharma - Sakshi
Sakshi News home page

Ameesha Patel: దర్శకుడితో హీరోయిన్ గొడవ.. ఇప్పుడు ఆ ఫొటో?

Published Wed, Jul 19 2023 9:21 PM | Last Updated on Thu, Jul 20 2023 10:27 AM

Ameesha Patel Latest Tweet Gadar 2 Director Anil Sharma  - Sakshi

హీరోయిన్ అమీషా పటేల్ యూటర్న్ తీసుకుంది. సరిగ్గా కొన్నిరోజుల ముందు ఏ దర్శకుడిపై అయితే ఆరోపణలు చేసిందో ఇప్పుడు అతడితోనే రోజంతా గడిపింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు బ్యూటీనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరు కలిసి నవ్వుతున్న ఫొటోని కూడా పోస్ట్‌ చేసింది. దీంతో.. అసలేం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్‌ తల గోక్కుంటున్నారు.

(ఇదీ చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?)

తెలుగు, హిందీలో హీరోయిన్ గా ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. ప్రస్తుతం హిందీలో నటిస్తోంది. త్వరలో 'గదర్ 2'తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈ చిత్ర షూటింగ్ లో తనకు ఫుడ్, వసతి, ట్రాన్స్‌పోర్ట్ లాంటి వాటికి ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ జూన్ 30న వరస ట్వీట్స్ చేసింది. ఇప్పుడేమో సడన్‌గా ఆ దర్శకుడు మంచోడు అని మాట మార్చేసింది.

'దర్శకుడు అనిల్ శర్మతో ఆయన ఆఫీసులోనే రోజంతా టైమ్ స్పెండ్ చేశాను. గత 24 ఏళ్ల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. ఎప్పటికీ ఆయన్ని గౌరవిస్తాను. కైరాత్ సాంగ్ చూస్తూ టీమ్ అంతా ఎంజాయ్ చేశాం' అని హీరోయిన్ అమీషా పటేల్ తన తాజా ట్వీట్‌లో రాసుకొచ్చింది. దీంతో తను చేసిన ఆరోపణలని తానే ఖండించినట్లు అయింది.

(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement