gadar
-
రూ.100 కోట్లిచ్చినా ఆ పాత్ర చేయను: హీరోయిన్
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన చిత్రాల్లో గదర్ 2 ఒకటి. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల మేర రాబట్టింది. అయితే ఈ సినిమాలో అత్త పాత్ర పోషించేందుకు హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు డైరెక్టర్ అనిల్ శర్మ.అమీషా ఒప్పుకోలేదుఓ ఇంటర్వ్యూలో అనిల్ శర్మ మాట్లాడుతూ.. vఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం కావాలి. తన ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో అని భయపడింది. అయినా అమీషాపై నాకెలాంటి కోపం లేదు, తను కూడా గదర్ సినీ ఫ్యామిలీలో ఒక భాగమే! అని చెప్పుకొచ్చాడు.అది నా ఇష్టంఈ వ్యాఖ్యలపై హీరోయిన్ అమీషా పటేల్ మండిపడింది. డియర్ అనిల్ గారు. ఇది సినిమా మాత్రమే, వ్యక్తిగత జీవితం కాదు! కాబట్టి ఏ సినిమాలు చేయాలి? ఎటువంటి పాత్రలు పోషించాలి? అనేది పూర్తిగా నా ఇష్టం. మీపై నాకు పూర్తి గౌరవం ఉంది. అయితే రూ.100 కోట్లు ఇచ్చినా సరే.. గదర్ సినిమాలోనే కాదు మరే సినిమాలోనూ అత్త పాత్ర పోషించలేను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా క్లారిటీ ఇచ్చింది.గతంలోనూ వివాదంకాగా గదర్ ఫస్ట్ పార్ట్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సీక్వెల్లో హీరో ఉత్కర్ష్ శర్మకు సన్నీ- అమీషా తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ అనిల్ శర్మ తనయుడే ఉత్కర్ష్ శర్మ. గతంలోనూ అమీషా.. అనిల్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. గదర్ 2 షూటింగ్లో తనకు కనీస వతి కల్పించలేదని ఆరోపించింది. అలాగే కుమారుడి పాత్రను పవర్‌ఫుల్‌గా మార్చడం కోసం సినిమా క్లైమాక్స్‌నే మార్చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజులకే డైరెక్టర్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఈ వివాదానికి ముగింపు పలికింది.చదవండి: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు -
గద్దర్ అవార్డ్స్.. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్!
త్వరలోనే గద్దర్ అవార్డ్స్ పై విధి విధానాలను రూపొందించి సీఎం రేవంత్ గారికి అందచేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.గద్దర్ అవార్డ్స్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డ్స్ ప్రకటించడం పట్ల ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడంపై చర్చించడం జరిగిందని తెలిపారు. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను (ఎఫ్డీసీ) కోరినట్లు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని లేఖ విడుదల చేశారు.కాగా.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తే.. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి స్పందన రాలేదని ముఖ్యమంత్రి మాట్లాడారు. దీంతో ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. TFPC & TFCC thanking Telangana Chief Minister @revanth_anumula for Prestigious Gaddar Awards #GaddarAwards pic.twitter.com/y3LJg8IKlE— Telugu Film Producers Council (@tfpcin) July 31, 2024 -
రూ.20 కోట్ల బడ్జెట్ సినిమా.. షారుక్ ఖాన్ పఠాన్‌కే షాకిచ్చింది!
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోట్లలో వసూళ్ల సాధించడమంటే మాటలు కాదు. ఎంతటి స్టార్ హీరోల చిత్రాలైన ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంఘటనలు కూడా చూశాం. కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించినప్పటికీ హిట్ కాకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్లో చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో థియేట్రికల్‌గా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!) అయితే రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వసూళ్ల పరంగా చూస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది. (ఇది చదవండి: సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్) View this post on Instagram A post shared by Ormax Media (@ormaxmedia) -
బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం 2001 బ్లాక్‌బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథకు ఆధ్యాత్మిక సీక్వెల్‌గా పనిచేస్తుంది. తారా సింగ్ మరియు సకీనా వంటి వారి ప్రియమైన పాత్రలలో సన్నీ మరియు అమీషా తిరిగి రావడాన్ని ఆస్వాదిస్తూ ప్రేక్షకులు ఈ చిత్రం ద్వారా లోతుగా హత్తుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత కూడా హృదయాలను దోచుకునే వారి కెమిస్ట్రీపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు, ఇది ఇప్పటికీ ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది. అసలు గదర్ నేటి కాలంలో రూపొందితే తారా సింగ్ పాత్రలో ఎవరిని తీసుకుంటారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు అనిల్ శర్మను అడిగారు. ప్రస్తుత తరం నుండి ఆ ఐకానిక్ క్యారెక్టర్లోకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అడుగు పెట్టగలడని తన అభిప్రాయం అని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) అనిల్ శర్మ మాట్లాడుతూ.. ' ప్రస్తుత హీరోల్లో ఆ పాత్రకు సరిపోయే వారు ఎవరూ కనిపించలేదు. ముంబయిలో అయితే ఎవరూ లేరు. సౌత్‌లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు సరిపోతాడు. అతనైతేనే ఈ పాత్రను చేయగలడు. అతనికి ఏ పాత్రలోనైనా చేయగల సత్తా ఉంది.' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది విన్న జూనియర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అభిమానుల స్పందన త్వరలోనే ఎన్టీఆర్ దేవరతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను అలరిస్తాడని అంటున్నారు. తారక్ మాత్రమే అత్యంత పర్ఫెక్ట్గా ఎలాంటి పాత్రనైనా చేయగలడంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్! ) -
ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!
పెద్ద సినిమాలు ఎప్పుడూ ఒకే టైంలో విడుదల చేయరు. ఎందుకంటే థియేటర్ల సమస్య, కలెక్షన్స్ తగ్గుదల లాంటివి వస్తాయని దర్శకనిర్మాతలు భయపడుతుంటారు. అయితే గత వీకెండ్ మాత్రం ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వీటి రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటా రికార్డ్? గత వారం రజినీకాంత్ 'జైలర్', చిరు 'భోళా శంకర్', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2', సన్నీ డియోల్ 'గదర్ 2'. వీటిలో రజినీ, సన్నీ చిత్రాలకు హిట్ టాక్ రాగా.. అక్షయ్ మూవీకి మిక్స్డ్ టాక్, చిరు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితేనేం వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే వసూళ్లు దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ నాలుగు సినిమాలకు ఆగస్టు 11-13 మధ్య రూ.390 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) దేశ సినీ చరిత్రలో ఓ వీకెండ్ ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే మూడు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల మంది థియేటర్లలోకి వచ్చారని పేర్కొంది. కరోనా తగ్గుదల తర్వాత థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏయే సినిమాలకు ఎంత? ఈ నాలుగు సినిమాల్లో 'జైలర్' కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన రజినీ చిత్రం.. ఓవరాల్‌గా రూ.300 కోట్ల మార్క్ దాటేసినట్లు సమాచారం. మరోవైపు 'గదర్ 2' వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.134 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలానే అక్షయ్ 'ఓ మై గాడ్ 2' చిత్రం రూ.50 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. చిరు 'భోళా శంకర్'కు రూ.20 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా గత వీకెండ్ సినీ ప్రియులకు వినోదం పంచింది. చాలారోజుల తర్వాత బాక్సాఫీస్ బద్దలైపోయేలా చేసింది. BIGGGEST NEWS… ⭐️ #Jailer ⭐️ #Gadar2 ⭐️ #OMG2 ⭐️ #BholaaShankar 🔥 COMBINED Gross BO of ₹ 390 cr+ 🔥 COMBINED Footfalls of 2.10 cr+ 🔥 ALL-TIME Theatrical Gross #BO record in 100+ year history Note: 11 - 13 Aug 2023 weekend Multiplex Association of India and Producers Guild… pic.twitter.com/kofNvtXNpc — taran adarsh (@taran_adarsh) August 14, 2023 (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కి సర్జరీ.. కారణం అదే!) -
డైరెక్టర్‌తో మొన్న గొడవ.. ఇప్పుడేమో రోజంతా ఆయనతోనే!
హీరోయిన్ అమీషా పటేల్ యూటర్న్ తీసుకుంది. సరిగ్గా కొన్నిరోజుల ముందు ఏ దర్శకుడిపై అయితే ఆరోపణలు చేసిందో ఇప్పుడు అతడితోనే రోజంతా గడిపింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు బ్యూటీనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరు కలిసి నవ్వుతున్న ఫొటోని కూడా పోస్ట్ చేసింది. దీంతో.. అసలేం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ తల గోక్కుంటున్నారు. (ఇదీ చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) తెలుగు, హిందీలో హీరోయిన్ గా ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. ప్రస్తుతం హిందీలో నటిస్తోంది. త్వరలో 'గదర్ 2'తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈ చిత్ర షూటింగ్ లో తనకు ఫుడ్, వసతి, ట్రాన్స్పోర్ట్ లాంటి వాటికి ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ జూన్ 30న వరస ట్వీట్స్ చేసింది. ఇప్పుడేమో సడన్‌గా ఆ దర్శకుడు మంచోడు అని మాట మార్చేసింది. 'దర్శకుడు అనిల్ శర్మతో ఆయన ఆఫీసులోనే రోజంతా టైమ్ స్పెండ్ చేశాను. గత 24 ఏళ్ల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. ఎప్పటికీ ఆయన్ని గౌరవిస్తాను. కైరాత్ సాంగ్ చూస్తూ టీమ్ అంతా ఎంజాయ్ చేశాం' అని హీరోయిన్ అమీషా పటేల్ తన తాజా ట్వీట్లో రాసుకొచ్చింది. దీంతో తను చేసిన ఆరోపణలని తానే ఖండించినట్లు అయింది. Spent the entire day today with @Anilsharma_dir at his office .. a director who I have known and respected for 24 years n counting now !! Enjoyed seeing KHAIRAYAT SONG With him and the entire team 💖💖🙏🏻🙏🏻👍🏻 pic.twitter.com/4VAFGOIFnk — ameesha patel (@ameesha_patel) July 18, 2023 (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) -
ఆ ఫోటోలు వైరల్ చేయకండి.. ప్లీజ్ సాటి ఆడదానిగా కోరుతున్నా: హీరోయిన్
అమీషా పటేల్- సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' ఆగస్ట్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' తో ఢీకొంటుంది. 'గదర్ 2'ను తాజాగా ఓ వివాదం వెంటాడుతుంది. ఈ సినిమాలో కనిపించనున్న నటి సిమ్రత్ కౌర్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గదర్-2 సినిమాలో బెడ్రూమ్లోని హాట్ ఫోటోలు అంటూ కొన్ని ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. దీంతో గదర్ లాంటి క్లీన్ సినిమాలో ఇలాంటి సీన్లు ఎలా పెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు సిమ్రత్ కౌర్‌ను ఈ సినిమాలోకి ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) దీనిని అమీషా పటేల్ ఖండించింది. ఆ లీక్ అయిన చిత్రాలు తమ రాబోయే చిత్రానికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సిమ్రత్ కౌర్‌పై కావాలనే ఎవరో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని అమిషా తెలిపింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి అంటూ ఒక ఆడదానిగా రిక్వెస్ట్ చేస్తున్నానని అమీషా పేర్కొంది. సినిమాల్లో కేవలం ఆమె టాలెంట్‌ను మాత్రమే గుర్తించండి. కానీ ఇలా ఆ అమ్మాయిని అవమానించవద్దని, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిద్దామని అమిషా తెలిపింది. సినిమాల్లో రొమాన్స్ ఉండటం తప్పులేదు కానీ అది లిమిట్స్‌లో మాత్రమే ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలు నిర్మించాలని ఆమె కోరింది. ఇంతటితో ఈ ఊహాగానాలు దయచేసి ఆపేయండి. ఆగస్ట్ 11న గదర్ 2ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని ఆమె తెలిపింది. These are not images from GADAR 2!! 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/sHdSNpbrlh — ameesha patel (@ameesha_patel) July 12, 2023 (ఇదీ చదవండి: తొలి పారితోషికంపై సితార కామెంట్స్.. నెట్టింట ప్రశంసల జల్లు) -
షూటింగ్లో కనీసం ఫుడ్ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!
తెలుగులో చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో స్టార్ హీరోలందరితో టాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. పంజాబీలో మూవీస్‌లోనూ నటిస్తోంది. తాజాగా గదర్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి ) అయితే ఇటీవలే గదర్-2 మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్న భామ చిత్ర యూనిట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మే నెల చివర్లో జరిగిన గదర్-2 షూటింగ్లో నిర్మాణ సంస్థ తీరు పట్ల అమీషా పటేల్ వరుస ట్వీట్లు చేసింది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తమకు ఆహారం, వసతి, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. తాము పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ వారు ఆహారం, వసతి, రవాణా కోసం బిల్లులు చెల్లించేదని అమీషా పటేల్ ఆరోపించింది | అమీషా ట్వీట్లో రాస్తూ..' మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి సరైన వేతన బకాయిలు చెల్లించలేదు. షూటింగ్ చివరి రోజున చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు, ఆహార బిల్లులకు కూడా డబ్బులు చెల్లించలేదు. నటీనటులు, సిబ్బందికి కార్లు కూడా సమకూర్చలేదు. అక్కడే ఒంటరిగా వదిలిలేశారు. కానీ వెంటనే జీ స్టూడియోస్ వారు రంగంలోకి దిగి అన్ని బకాయిలు చెల్లించారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పులను వారు సరిదిద్దారు. గదర్ 2 అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోందని అందరికీ తెలుసు. ఈ సమస్యను పరిష్కరించిన షరీక్ పటేల్, నీరజ్ జోషి, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. జీ స్టూడియోస్ టీమ్ ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సన్నీ డియోల్ సరసన గదర్ 2లో అమీషా పటేల్ నటించింది. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) All involved in the film are aware that the production of GADAR 2 was being handled by ANIL SHARMA PRODUCTIONS which unfortunately misfired numerous times but @ZeeStudios_ always rectified issues!! A special thanks to them especially Shariq Patel,Neeraj Joshi, Kabeer Ghosh and… — ameesha patel (@ameesha_patel) June 30, 2023 -
నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?
బాలీవుడ్లో సన్నీడియోల్, అమీషా పటేల్ నటిస్తున్న 'గదర్-2' వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల గురుద్వారా నిర్వాహకులతో పాటు సిక్కు మతస్థులు చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబ పోషణ భారమై డ్రైవర్‌గా మారిన హీరో? నిజమేంటంటే?) కొన్నిరోజుల క్రితం తిరుపతిలో కృతిసనన్ చెంపపై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరోకటి జరగడంతో ఛీ.. ఛీ దేవాలయాల్లో ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కనీసం వారు క్షమాపణలు చెబితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక పోతే, తెలుగులో అమీషా పటేల్ పవన్ సరసన 'బద్రి'తో మెప్పించింది. ఆ తరువాత మహేష్‌తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడులో నటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
లగాన్ వర్సెస్ గదర్: రెండూ గొప్ప సినిమాలే!
భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ‘లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా’. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్ ఎంట్రీకి వెళ్లడంతో పాటు ఎనిమిది జాతీయ అవార్డులు సాధించిన చిత్రం ‘లగాన్’. ఆమిర్ ఖాన్ హీరోగా నటించడమే కాదు.. నిర్మాతగా మారి, నిర్మించిన తొలి చిత్రం ఇది. అశుతోష్ గోవారీకర్ దర్శ కత్వం వహించిన ఈ చిత్రం విడుదలై జూన్ 15కి 20 ఏళ్లయింది. ఈ చిత్రంతో పాటు సన్నీ డియోల్ నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్‌కథ’ కూడా విడుదలై 20 ఏళ్లయింది. ఈ చిత్రాన్ని అనిల్ శర్మ డైరెక్ట్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైనప్పుడు పోలికలు సహజం. ఎక్కువ తక్కువలు ఉండటమూ సహజమే. ‘గదర్’కి జాతీయ అవార్డులు రాకపోయినా మంచి సినిమా అనిపించుకుని, మంచి విజయాన్ని అందుకుంది. ఇక 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లగాన్’ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనవలసిందిగా చిత్రబృందం ఇచ్చిన పిలుపుకు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. ‘మై లగాన్ స్టోరీ’ అంటూ ‘లగాన్’ సినిమా గురించిన తమ అభిప్రాయాలను, అనుభూతులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ‘‘లగాన్’ చిత్రం విడుదలైన రోజునే (జూన్ 15, 2001) ‘గదర్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గదర్’ కూడా మంచి సినిమాయే. వసూళ్ల పరంగా కూడా మంచి విజయం సాధించింది. కేవలం ‘లగాన్’ సినిమా గురించే ప్రస్తావించడం సరైంది కాదు. ‘గదర్’ సినిమాను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా ఇరవై ఏళ్ళ క్రితం ‘లగాన్’, ‘గదర్’ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడితే తాజాగా ఈ రెండు సినిమాల అభిమానులు సోషల్ మీడియాలో ‘లగాన్ వర్సెస్ గదర్’ అనే విధంగా కామెంట్లు విసురుకోవడం విశేషం. ఆ సంగతలా ఉంచితే... ‘లగాన్’ చిత్రబృందం రీ యూనియన్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రంగం సిద్ధం చేస్తోంది. ‘ఛలే ఛలో లగాన్: వన్స్ అపాన్ యాన్ ఇంపాజిబుల్ డ్రీమ్’ అనే టైటిల్‌తో జరగనున్న ఈ రీ యూనియన్ స్పెషల్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ చానెల్లో ప్రసారం కానుంది. ‘లగాన్’ గురించి ఆమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ..‘‘ఈ చిత్రప్రయాణంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ‘లగాన్’ నాకు అద్భుతమైన జర్నీ. నా జీవితానికి కొత్త స్నేహితులను, బంధాలను ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో పాటు ఈ బంధాలు కూడా ఇరవై ఏళ్ళ నుంచి నా జీవితంలో కొనసాగుతూనే ఉన్నాయి. ‘లగాన్’ గ్యాంగ్‌ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రజలందరూ కలిసి కష్టాలపై సమష్టిగా పోరాడే తత్వమే ‘లగాన్’ చిత్రానికి ప్రేరణ’’ అన్నారు దర్శకులు అశుతోష్. ‘‘ఇండియన్ సినిమా చరిత్రలో ‘లగాన్’ ఒక ఐకానిక్ మూవీ. భారతీయ కథలను విశ్వ వేదికపై నిలిపిన చిత్రం ఇది. ‘లగాన్’ 20 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నాం’’ అన్నారు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి షెర్గిల్. ‘గదర్’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘‘మేం ఒక సినిమా చేశాం. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో ఓ వేడుకలా చూశారు. ఈ హిస్టారిక్ ఫిల్మ్‌తో అసోసియేట్ ఉన్న అందరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు సన్నీ డియోల్. చదవండి: ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? -
ఎవరికి ఓటు వేయాలో అర్థం కావట్లేదు: గద్దర్
సాక్షి, హైదరాబాద్: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు 45 నిమిషాలు తమ మాట, పాట వినిపించానని ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు. రాహుల్‌కు ‘సేవ్ కాన్స్టిట్యూషన్– సేవ్ డెమోక్రసీ’ పుస్తకాన్ని అం దించానని చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ నెల 15 నుంచి పల్లెపల్లెకూ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను గురువారం సచివాలయంలో కలిసి తనకు భద్రత కల్పించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలిసారి ఓటు హక్కు లభించిందని, ఎవరికి ఓటు వేయాలన్నది సమస్యగా మారింద న్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. -
ఓట్ల కోసమే బీసీ జపం
బాబూ.. బీసీలపై ప్రేమ నిజమైతే ఇప్పటిదాకా పార్టీని వారికి ఎందుకివ్వలేదు అధికారం, బీఫామ్స్ నీ దగ్గర పెట్టుకొని అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు ఉద్యమ పార్టీ ఓట్ల రాజకీయం చేస్తోంది.. సీట్ల కోసం కొట్లాడుతోంది బంగారు తెలంగాణ మాకొద్దు.. భాగ్యాల తెలంగాణ కావాలి. పంటలు పండే తెలంగాణ కావాలి. నీటి కోసం, కూటి కోసం, నిలువ నీడ కోసం కష్టాలు పడని తెలంగాణ కావాలి ‘‘తెలంగాణ బీసీల మీద చంద్రబాబుకు ఒక్కసారిగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఆయన చెప్పే మాటలే నిజమైతే.. ఇప్పటిదాకా తన పార్టీని బీసీలకు ఎందుకు అప్పగించలేదు? సంపూర్ణ అధికారాలతో తెలంగాణ కమిటీని ఏర్పాటు చేశాడా..?’’ ప్రజాయుద్ధ నౌక గద్దర్ వేస్తున్న ప్రశ్న ఇది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడం దగ్గర్నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న అధికారాలన్నీ తన చేతుల్లోనే పెట్టుకున్న చంద్రబాబు.. బీసీ ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. ‘‘50 శాతానికిపైగా ఉన్న బీసీల ఓట్లు తీసుకుంటున్న చంద్రబాబూ... 15 శాతం కూడా లేని నీ సామాజిక వర్గం బీసీలను శాసించడం ఏమిటి? ఇదేనా నువ్వు బీసీలకిచ్చే స్వేచ్ఛ? ఇదేనా నువ్వు తీసుకొచ్చే బీసీ రాజ్యం? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇలాంటి అవకాశవాద రాజకీయాల ముసుగును ప్రజలే తొలగించాలి’’ అని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ కాదు.. భాగ్యాల తెలంగాణ, పంటలు పండే తెలంగాణ రావాలంటున్న గద్దర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... అవకాశవాద రాజకీయ వ్యూహాలు.. ‘తెలంగాణ వచ్చినాదో లచ్చువమ్మా.. మనకేమి తెచ్చినాదే మాయమ్మా....!’ పోరుగడ్డ వేసే ప్రశ్న ఇది. గుణాత్మక మార్పును కోరే ప్రతి బిడ్డా లేవనెత్తే సందేహమిది. దీనికి పార్టీలిచ్చే జవాబు అప్రజాసామికంగానే కన్పిస్తోంది. ఈ తెలంగాణను బీసీలకే అప్పగిస్తామని బాబు చెబుతున్నాడు. దళితుడికే రాజ్యాధికారమని కేసీఆర్ చెప్పాడు. గుణాత్మక మార్పులేని ఈ భావజాలంలో ఎన్నికల ఎత్తుగడలు, ఓట్ల రాజకీయమే కనిపిస్తోంది. దగాకోరు పరిష్కారాలే ముందుకొస్తున్నాయి. అభాగ్యుల తెలంగాణను భాగ్యాల తెలంగాణగా చేస్తామన్న భరోసా రావడం లేదు. ‘కుచ్చిపేల్కల లచ్చువమ్మకు.. అంచు చీర వస్తుందనే’ నమ్మకం కల్గడం లేదు. ‘బాంచన్ దొర’ అనే బతుకులు మారతాయన్న విశ్వాసం మచ్చుకైనా కన్పించడం లేదు. ఉద్యమాల యుగంలోనూ పార్టీల అవకాశవాద రాజకీయాలే వ్యూహాలే అమలవుతున్నాయి. ఉద్యమ పార్టీ.. ఓట్ల రాజకీయం ఉద్యమ పార్టీ ముసుగేసుకున్న మరో తెలంగాణ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. తెలంగాణ ఆకాంక్షలను పక్కనపెట్టి ఓట్ల రాజకీయ నడుపుతోంది. సీట్ల కోసం కొట్లాడుతోంది. దళితుడికే సీఎం, మైనార్టీలకే డిప్యూటీ సీఎం... అని నిన్న చెప్పిన నేత, ఈ రోజు మాట మార్చాడు. అశాస్త్రీయ పద్ధతిలో ఓట్ల స్లోగన్ అందుకున్నాడు. బంగారు తెలంగాణ తెస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. ఎంపీ సీట్లన్నీ తన ఖాతాలో వేయమంటున్నాడు. అసెంబ్లీ మొత్తం తనకే పట్టం కట్టమంటున్నాడు. బంగారు తెలంగాణ దేనికి? మెడలో వేసుకోవడానికా? ప్రజలు కోరుకునేది.. దగాబడ్డ తెలంగాణ బిడ్డ ఆశించేది.. భాగ్యాల తెలంగాణ. పంటలు పండే తెలంగాణ. ఉపాధి ఉండే తెలంగాణ. నీటి కోసం, కూటి కోసం, నిలువ నీడ కోసం కష్టాలు పడని తెలంగాణ. దుక్కి దున్నే జానెడు నేలున్న తెలంగాణ. ఇది ఇస్తానని భరోసా ఇవ్వడేం? భూమిపై హక్కు ఇస్తానని చెప్పడేం? ప్రశ్నించే వాళ్లంటే భయమా? తెలంగాణ కోసం తన్నులు తిన్న వాడేమయ్యాడు? జైలుపాలైనోడు ఏమయ్యాడు? ఊరికో జేఏసీ పెట్టినోళ్లు, రోడ్డెక్కిన విద్యార్థి, కాలి బూడిదైన ముద్దుబిడ్డ, వందల కేసుల్లో ఇరుకున్న వాళ్లు, ఒళ్లంతా లాఠీల దెబ్బలతో గాయాలైనవాళ్లు... వీరంతా ఏమయ్యారు? 17 ఎంపీ సీట్లవ్వండి.. కేంద్రాన్ని ఆడిస్తానంటున్న నేత... ఉద్యమించిన వాళ్లను అభ్యర్థులను చేస్తే విజయం తథ్యం కాదా? ఆ పని చేయడు. చేయలేడు. ఎందుకంటే ఉద్యమించే వాళ్లు పక్కలో బల్లెం. ఆడిందే ఆట అంటే ఊరుకోరు. నిలదీస్తారు. ప్రశ్నిస్తారు. మళ్లీ ఉద్యమిస్తారు. అవసరమైతే తిరగబడతారు. ఇలాంటి శక్తులు వాళ్లకు అవసరం లేదు. సై అంటే సై దొర అనే వాళ్లే కావాలి. వాళ్లతోనే పబ్బం గడుస్తుంది. ఉద్యమకారులకు టిక్కెట్లిచ్చి, వాళ్లతోనే సర్కారును కూల్చేసుకునే సాహసం ఏమాత్రం చేయలేరు. అలాంటప్పుడు దీన్ని ప్రజాస్వామ్యం అందామా? తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని భావిద్దామా? భూమిపై హక్కు ఇస్తామని ఎందుకు అనడం లేదు? అధికారమే రాకుండా పునర్ నిర్మాణం ఎలా సాధ్యం అనేది రాజకీయ పార్టీల వితండ వాదం. అసలు నిర్మాణమే లేకుండా మీరేం పునర్ నిర్మాణం చేస్తారని ఉత్పత్తి శక్తులు ప్రశ్నిస్తున్నాయి. పార్టీల మేనిఫెస్టోలో ఇలాంటి ఒక్క ఆనవాలూ కన్పించడం లేదు. బర్రె ఇస్తాం, గొర్రె ఇస్తాం, ఇంటికో గ్యాస్ కనెక్షన్ ఇస్తామంటున్నారు. భూమిపై హక్కు ఇస్తామని మాత్రం తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే వాళ్లు కూడా భరోసా ఇవ్వడం లేదు. పేద ప్రజల పోరాటమే భూమి కోసమైనప్పుడు.. చిత్తశుద్ధిలేని పార్టీలను ఎలా నమ్ముతాయి? హా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తెలంగాణను జనం కోరుతున్నారు. సంపదలో పునర్ నిర్మాణం జరగాలి. భూములు పంచుతామని చెప్పే నేతలు, ముందు వాళ్ల భూములు పంచాలి. అడ్డగోలుగా పోగైన ఫాంహౌస్‌లను పేదలకు ఇవ్వాలి. యావత్ కుటుంబానికి పదవులు ఇవ్వడం కాదు. యావత్ ప్రజల ఆకాంక్షలను నెత్తికెత్తుకోవాలి. హా రాజకీయ పునర్ నిర్మాణం అతి కీలకమైంది. ఏ తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టారో... ఆ ఉద్యమ శక్తులే ‘బీ’ఫామ్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. అంతే తప్ప నువ్వే అభ్యర్థులను నిర్ణయించి, పునర్ నిర్మిస్తామంటే అది కేవలం ఓట్ల నిర్మాణమే అవుతుంది. హా సాంస్కృతిక పునర్నిర్మాణం ఇంకో ముఖ్యమైన అంశం. పేద ప్రజలు తినే తిండి, వాళ్లు వేసుకునే దుస్తులు, నివసించే స్థలంతో సమానంగా రాజకీయ నేతల తిండి, దుస్తులు, నివాస స్థలం ఉండాలి. వారి పనుల్లోకి మీరు వెళ్లగలగాలి. అప్పుడే సాంస్కృతికంగా తెలంగాణ ప్రజలతో ఏకమవ్వడం సాధ్యమవుతుంది. వారి జీవన విధానాలకు దగ్గరవ్వడం సాధ్యం. ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? తెలంగాణ ఇచ్చామని ఒకరు.. తెచ్చామని ఇంకొకరు.. మద్దతునిచ్చామని మరొకరు.. ఎంత అందంగా చెప్పుకుంటున్నారు. నిజంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎత్తుగడల ద్వారానే తెలంగాణ వచ్చిందా? అదే నిజమైతే తెలంగాణపై పార్లమెంటులో గానీ, అసెంబ్లీలో గానీ ఏమాత్రమైనా చర్చ జరిగిందా? ఢిల్లీ సభలో చీకట్లోనే బిల్లు పాసయింది. మన అసెంబ్లీలో ఉరుములు, మెరుపులతో చర్చ ముగిసింది. ఇక్కడ అన్ని పార్టీలు స్వలాభమే చూసుకున్నాయి. ఇవన్నీ ఓట్లు, సీట్ల రాజకీయాలు మాత్రమే. నిజానికి ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చింది. అశేష ప్రజానీకం త్యాగాల ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ ఉద్యమ త్యాగాలను ఓట్లుగా పునర్నిర్మాణం చేసుకుని పార్టీలు పంచుకుంటున్నాయి. సెటిలర్స్ అంటే ఊరుకోం ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడూ ఈ ప్రాంతం వాడే. వారిని సెటిలర్స్ అని అనడం సరికాదు. అసలీ పదమే నిషేధించాలి. ‘కామోష్ క్యోం హై’ పాట ఆగలేదు. స్వరం మూగబోలేదు. ఉద్యమ ఎత్తుగడల్లో భాగంగానే మౌనం దాల్చాం. ఈనెల 26 నుంచి అన్ని టీవీ చానళ్లలోనూ నా పాట విన్పిస్తా. తెలంగాణ కోరుకునేదేంటో అందులో మేళవిస్తా. రాజకీయ కుతంత్రాలను బట్టబయలు చేస్తా. ఎన్నికల బహిష్కరణకు ఈసారి పిలుపిస్తున్నాం. అయితే ఉద్యమ పార్టీల ఈ నినాదాన్ని పాలకవర్గాలు తెలివిగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘నోటా’ పెట్టారు. అప్రజాస్వామికమైన ఈ ఎన్నికల విధానాన్ని గౌరవించేందుకు సాగుతున్న ఎత్తుగడ ఇది. -
ఐదేళ్లు ఆగితేనే తెలంగాణ అభివృద్ధి
నిస్వార్థంతో పనిచేసే పాలకులు రావాలి.. ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం కావు ఈటెల రాజేందర్ స్పష్టీకరణ కవాడిగూడ,న్యూస్‌లైన్: రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన గొప్ప మార్పులురావని..త్యాగం,అంకితభావం, నిస్వార్థం కలిగిన పాలకులు వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కనీసం 5 ఏళ్ల సమయం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య రద్దు, కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఉపాధ్యాయ భేరి ఆదివారం ఇందిరాపార్కు వద్ద జరిగింది. దీన్ని ప్రొ.కేశవరావు జాదవ్ ప్రారంభించగా, ముఖ్యఅతిథులుగా ఈటెల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రజాగాయకులు గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్క, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్రనేత గోవర్దన్ తదితరులు హాజరయ్యారు. ఈటెల ఈసందర్భంగా మాట్లాడారు. ‘మాటలు చెప్పడం వేరు, పాలనచేయడం వేరు. తెలంగాణను పాలించే వారికి త్యాగం,అంకితభావం, నిస్వార్థం కలిగిన పాలకులు రావాలి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఏడాదిలో పరిష్కారమవుతాయని అనుకోవడం లేదు. దాదాపు ఐదేళ్లు పాలిస్తే తప్ప సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సామాజిక చైతన్యాన్ని అందించిన ఉద్యమస్ఫూర్తితో నవతెలంగాణను నిర్మించుకుందామని’ పిలుపునిచ్చారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వశాఖల్లో 70 శాతానికిపైగా ఉద్యోగులు సీమాంధ్రులే ఉన్నారని, జనాభా నిష్పత్తి లెక్కన ఉద్యోగులను విభజిస్తే తెలంగాణ రాష్ర్టంలో మళ్లీ సీమాంధ్ర ఉద్యోగులే ఆధిపత్యం చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీటీఎఫ్ అధ్యక్షుడు రాములు, ప్రధానకార్యదర్శి రఘునందన్, ప్రొ.తిరుమలి, వేద కుమార్, జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకులు గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క, పైలం సంతోష్, అరుణోదయ కళాకారులు పాడిన పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి.