సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోట్లలో వసూళ్ల సాధించడమంటే మాటలు కాదు. ఎంతటి స్టార్ హీరోల చిత్రాలైన ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంఘటనలు కూడా చూశాం. కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించినప్పటికీ హిట్ కాకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో థియేట్రికల్‌గా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది.
(ఇది చదవండి: స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!)
అయితే రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.
వసూళ్ల పరంగా చూస్తే..
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది.
(ఇది చదవండి: సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్)
Comments
Please login to add a commentAdd a comment