The Kerala Story
-
‘దూరదర్శన్‌లో వివాదాల చిత్రం ప్రసారమా?’
తిరువనంతపురం: భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ది కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రసారం చేయాలని డీడీ నేషనల్ నిర్ణయించడమే అందుకు కారణం. పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని దూరదర్శన్ ఛానెల్లో ప్రసారం చేయడం సరికాదని కేరళ సీఎం పినరయి విజయన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల వేళ ఈ చర్య మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారయన. బీజేపీ, ఆరెస్సెస్‌లకు ప్రచార యంత్రంగా మారొద్దంటూ డీడీ నేషనల్‌కు హితవు పలికారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. The decision by @DDNational to broadcast the film 'Kerala Story', which incites polarisation, is highly condemnable. The national news broadcaster should not become a propaganda machine of the BJP-RSS combine and withdraw from screening a film that only seeks to exacerbate… — Pinarayi Vijayan (@pinarayivijayan) April 4, 2024 ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించేలా దూరదర్శన్ ఏర్పాట్లు చేసుకుంది. మరోవైపు సీపీఐ(ఎం) కూడా డీడీ చర్యను తప్పుబట్టింది. సెక్యులర్ రాష్ట్రంగా ఉన్న కేరళలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ సినిమా విడుదల సమయంలో కేరళలో నిరసనలు జరిగాయి. సెన్సార్ బోర్డు సైతం పది సీన్లకు కత్తెర విధించింది. అలాంటి చిత్రాన్ని జాతీయ ఛానెల్లో ప్రదర్శించాలని నిర్ణయించడం ముమ్మాటికీ రెచ్చ గొట్టే చర్య అని ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కిందటి ఏడాది ఈ చిత్రం విడుదలకాగా.. ఆ సమయంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక ఈ చిత్రాన్ని కేరళ థియేటర్లలో ప్రదర్శించకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అనధికార నిషేధంపై బీజేపీ కోర్టులను ఆశ్రయించింది. ఇక కోర్టు మాత్రం చిత్ర విడుదలను అడ్డుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు కళ్లు మూసుకుని ఉండదు కదా అని ఆ సమయంలో చిత్ర రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. -
బిర్యానీ పార్టీకి పిలిస్తే మంచివాళ్లా?.. హీరోయిన్‌పై నెటిజన్ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఆదా శర్మ నటించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' సంచలన విజయం సాధించింది. కేరళలోని అమ్మాయిలను మతం పేరుతో విదేశాలకు తరలించారనే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది బస్తర్ సినిమాతో మార్చి 15న ప్రేక్షకులను పలకరించింది. గతంలో బస్తర్‌లో జరిగిన మావోయిస్టుల దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్ విందుకు హాజరైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో మెరిసింది. ఈ విందుకు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ ఇఫ్తార్ విందుకు హాజరు కావడంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఎంత మోసం.. ముస్లింలపై ద్వేషపూరిత సినిమాలు తీస్తారు.. ఇప్పుడేమో బిర్యానీ కోసం ఆహ్వానించగానే మంచివాళ్లు అయిపోయారా?’ అంటూ ఆదా శర్మ పార్టీలో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ది కేరళ స్టోరీ నటి స్పందించింది. దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. 'అప్పుడైనా..ఇప్పుడైనా ఉగ్రవాదులు అంటే విలన్లు. అంతేకాని ముస్లింలు కాదు' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా.. కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించారనే నేపథ్యంలోనే ది కేరళ స్టోరీని రూపొందించారు. అయితే గతంలో తాము ఈ సినిమాను ఏ మతానికి వ్యతిరేకంగా నిర్మించలేదని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారంతా మా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా.. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించారు. On odd and even days dear sir terrorists are villains . Not muslims. — Adah Sharma (@adah_sharma) March 26, 2024 What a fraud she is!!! On Odd Days Muslims are Villains for these people and you make hate movies against them!!! On Even Days Muslims are great for these people because you get invited for a Biryani!!! pic.twitter.com/ygNhPNMnkO — Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) March 25, 2024 -
రెండు వారాల నుంచి టాప్ ట్రెండింగ్‌లో.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
అప్పుడప్పుడు కొన్ని సినిమాలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఎంతలా అంటే వాటి గురించి దేశమొత్తం మాట్లాడుకునేలా! అలాంటి చిత్రాల్ని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చూస్తుంటారు. వచ్చిన తర్వాత మాత్రం అస్సలు విడిచిపెట్టరు. అలా రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ఓ మూవీ.. ట్రెండింగ్‌లో ఉండటంతో పాటు రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఏ సినిమా? ఏంటా రికార్డ్? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) పైన చెప్పినదంతా కూడా 'ద కేరళ స్టోరీ' సినిమా గురించే. కేరళలో జరిగిన అమ్మాయిలు అక్రమ రవాణా, మత మార్పిడి, విదేశాల్లో ఉగ్రదాడులు.. ఇలా చాలా కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తో తీశారు. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైంది. పలు వివాదాలు ఏర్పడినప్పటికీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలు వివాదాల వల్ల 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 15న జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గత 15 రోజుల నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ చిత్రం.. 300 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయ్యి రికార్డ్ సృష్టించినట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) The world is tuning in to hear their stories! 💯 With 300 million watching minutes, have you seen it yet?#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah #TheKeralaStory #SaveOurDaughters@sudiptoSENtlm @Aashin_A_Shah @sunshinepicture… pic.twitter.com/150BhPCpKc — ZEE5 (@ZEE5India) March 2, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన సంచలన సినిమా.. అప్పుడే ట్రెండింగ్!
కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్నే కాదు ఇన్ఫర్మేషన్నూ ఇస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతులను మతం మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసిన ఉదంతాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమా ప్రకటించిననాటి నుంచే ఎన్నో విమర్శలు చుట్టుముట్టాయి. రిలీజైనప్పుడు కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. మే నెలలో రిలీజ్.. అయినప్పటికీ అన్నింటినీ దాటుకుంటూ ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించాడు. గతేడాది మేలో రిలీజైన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఫిబ్రవరి 16న జీ5లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అప్పుడే ట్రెండింగ్‌లో.. ముందుగా చెప్పినట్లుగానే శుక్రవారం నాడు ది కేరళ స్టోరీని జీ5లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలా ఓటీటీలో విడుదలైందో లేదో ఇలా ట్విటర్లో ట్రెండ్ అవుతోందీ సినిమా. థియేటర్లో చూడటం మిస్ అయినా లేదంటే మరోసారి చూడాలనిపించినా ఆలస్యం చేయకుండా వెటనే ఓటీటీలో ది కేరళ స్టోరీపై ఓ లుక్కేయండి.. She said yes to love but what followed was nothing short of a nightmare.#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/YcQgNb8zlQ — ZEE5 (@ZEE5India) February 16, 2024 చదవండి: హీరోయిన్ కన్నడ సీరియల్ నటి.. త్వరలోనే అక్కడ కూడా! -
ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్
మరో వారం వచ్చేసింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం. నెట్‌ఫ్లిక్స్ • డంకీ (నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది) • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 15 • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 • ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 • సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది • సలార్ (హిందీ వర్షన్) - ఫిబ్రవరి 16 • ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- - ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్ వీడియో • రూట్ నం.17 ( తమిళ్ మూవీ) - ఫిబ్రవరి 15 • అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16 • లవ్‌స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది జీ5 • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 • క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్ అవుతుంది -
ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారంలో ఏకంగా 21 సినిమాలు!
మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద ఈగల్ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. అంతే కాకుండా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు సైతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మరీ ఈ వారంలో ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకోవాలని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేదుకు నాగార్జున వచ్చేస్తున్నాడు. సంక్రాంతికి సందర్భంగా రిలీజైన నా సామిరంగ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది. ఆ రెండు సినిమాలే ప్రేక్షకులకు కాస్తా ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వారంలో అలరించనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ కిల్ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 13 సదర్లాండ్ టిల్ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13 టేలర్ టామ్లిన్సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13 ఏ సోవేటో లవ్ స్టోరీ - ఫిబ్రవరి 14 గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14 లవ్ ఇజ్ బ్లైండ్- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 14 ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 హోస్ ఆఫ్ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 జీ5 ది కేరళ స్టోరీ(బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 -
పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?
గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్థాన్‌తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్‌లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. -
ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఎట్టకేలకు 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గతేడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చినప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు ఇప్పుడని అన్నారు. కానీ చివరకు ఇప్పుడు అధికారికంగా ఓటీటీ పార్ట్నర్, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అదాశర్మ.. 'ద కేరళ స్టోరీ' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. థియేటర్ రిలీజ్‌కి ముందే డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. కాంట్రవర్సీ వల్లో ఏమో గానీ స్ట్రీమింగ్ తేదీ లాంటివి ఏం చెప్పకుండా వచ్చింది. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?) ఫైనల్ ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని అధికారికంగా ట్వీట్ పెట్టి మరీ ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీకెండ్లో పక్కా చూసేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. 'ద కేరళ స్టోరీ' సినిమా కథ విషయానికొస్తే.. ముగ్గురు అమ్మాయిలు ప్రధానంగా ఉంటుంది. ఇందులో షాలినీ (అదా శర్మ) కథ మెయిన్ పార్ట్. ఈ అమ్మాయిలు ముగ్గురిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వేసుకొని ఇస్లాం మతంలోకి మార్చి విదేశాలకు తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తారు. షాలినీని అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. అలానే పెళ్లి చేసుకొని తీసుకెళతాడు. చివరకు షాలినీ పరిస్థితి ఏమైంది? తప్పించుకోగలిగిందా? అనేదే ఈ మూవీ. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) The wait is officially over! The most anticipated film is dropping soon on ZEE5!#TheKeralaStory premieres on 16th February, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/4mBGyTTp4S — ZEE5 (@ZEE5India) February 6, 2024 -
ఓటీటీలో ది కేరళ స్టోరీ మూవీ
-
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రిలీజై నెలలు గడుస్తున్నా ఓటీటీలో రాలేదు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఓటీటీ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారు మేకర్స్. చిన్న సినిమాగా వచ్చిన ది కేరళ స్టోరి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వివాదాలు ఎదురైనప్పటికీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగాా ఈ చిత్రాన్ని జనవరి 12న లేదా జనవరి 19న స్ట్రీమింగ్ వచ్చే అవకాశమున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలలో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
రూ.20 కోట్ల బడ్జెట్ సినిమా.. షారుక్ ఖాన్ పఠాన్‌కే షాకిచ్చింది!
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోట్లలో వసూళ్ల సాధించడమంటే మాటలు కాదు. ఎంతటి స్టార్ హీరోల చిత్రాలైన ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంఘటనలు కూడా చూశాం. కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించినప్పటికీ హిట్ కాకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్లో చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో థియేట్రికల్‌గా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!) అయితే రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వసూళ్ల పరంగా చూస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది. (ఇది చదవండి: సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్) View this post on Instagram A post shared by Ormax Media (@ormaxmedia) -
నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాని టాలీవుడ్ మూవీస్.. అసలు కారణాలేంటి?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల యుగం నడుస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లోపే ఓటీటీలో ప్రత్యక్షం కావాల్సిందే. ఇక చిన్న సినిమాలు వారంలోపే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరికొన్ని సినిమాలైతే డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు. ఇక సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మూడు వారాల్లోనే ఓటీటీకి రావడం మన చూశాం. అలాంటిది రిలీజ్ అయి కూడా నెలలు దాటిపోతున్నా ఇంకా ఓటీటీకి రాకపోవడమేంటి? ఆ సినిమాలు ఎందుకు ఓటీటీలోకి రావడం లేదు. ఈ ఏడాదిలోనే రిలీజై కూడా ఇప్పటివరకు రాలేదంటే.. ఆ సినిమాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అందులోనూ మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయంటే.. అందుకు గల కారణాలేంటో ఓ లుక్కేద్దాం. ఏజెంట్ ఇంకెప్పుడు? అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. (ఇది చదవండి: తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట) ఇప్పటికీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి సమాచారం లేదు. ది కేరళ స్టోరీ ఇంకా రాదా? ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తయ్యాక ఓటీటీకి వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఆదా శర్మ సైతం ఏ ఓటీటీకి ఇవ్వాలేనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. గతంలో జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఓటీటీకి గురిపెట్టని రామబాణం మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మే5న విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్భూ కీలక పాత్రలు పోషించారు. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రామబాణం మూవీ థియేటర్లలో విడుదలై నెలరోజులు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. గతంలోనే జూన్ 3 నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మరి రామబాణం ఓటీటీ రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్) జర హట్కే జర బచ్కే ఎప్పుడొస్తుంది? విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం జర హట్కే జర బచ్కే. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. ఇప్పటికే జియో సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. మరీ ఇన్ని రోజులైనా ఓటీటీకి రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూద్దామని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జ్విగాటో స్టాండప్ కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కపిల్ శర్మ. నందితా దాస్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జ్విగాటో. షహనా గోస్వామి హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు టొరంటో వరల్డ్‌వైడ్ ఫిల్మ్ సెలబ్రేషన్స్-2022లోనూ ప్రదర్శితమైంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆరునెలలైనా ఓటీటీకి రాకపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. అగ్ర హీరోల సినిమాలే నెల రోజుల్లోపే ఓటీటీకి వస్తుంటే.. ఈ చిత్రాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. -
ఆ ఫ్లాట్‌లో హీరో సూసైడ్.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
ఈ ఏడాది ది కేరళ స్టోరీ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న భామ ఆదా శర్మ. కేరళలో జరిగిన బాలికల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఆదా శర్మకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల కమాండో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతోంది. అయితే తాజాగా ఆదా శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) ఎంఎస్ ధోని చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఊహించని పరిణామాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలోని మాంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఇంటిని ది కేరళ స్టోరీ స్టార్ ఆదా శర్మ కొనుగోలు చేసినట్లు బీటౌన్ సమాచారం. అయితే గతంలో సుశాంత్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ ఇంటికి సుశాంత్ నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవారట. అయితే ఈ విషయంపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్దఎత్తున వైరలవుతోంది. అయితే త్వరలోనే ఆ ఇంటికి మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా.. 2009లో హిందీ హారర్ చిత్రం 1920తో రజనీష్ దుగ్గల్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆదాశర్మ. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
అదా శర్మ బీ టౌన్‌తో పాటు తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగులో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ.. ఇటీవల ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇప్పుడు అదా శర్మ పేరు ఇండియా అంతా మార్మోగిపోయింది. అయితే ఇటీవలే ఆస్పత్రిలో చేరిన అదా శర్మ.. తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ గురించి అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే? ) ఇన్‌స్టాలో అదా శర్మ రాస్తూ..' గత కొన్ని రోజులుగా నేను చర్మవ్యాధితో బాధపడుతున్నా. నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. అందువల్ల ఫుల్‌గా ఉండే డ్రెస్సులు ధరించాను. కానీ ఇటీవల ఒత్తిడి వల్ల నా ముఖంపై కూడా దద్దుర్లు ఏర్పడ్డాయి. వీటి కోసం నేను కొన్ని మందులు వాడాను. కానీ మందువల్లే దద్దుర్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇతర మెడిసిన్స్ వాడుతున్నా. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చా. అయినప్పటికీ ఫుల్ స్లీవ్స్ ధరించిన ప్రమోషన్స్ చేస్తా. ఆ తర్వాత ఆరోగ్యం కోసం కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. త్వరలోనే ఆయుర్వేది చికిత్స తీసుకోబోతున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. కమాండో సిరీస్‌పై ఇన్‌స్టాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేసింది. దయచేసి భయపడేవారు ఉంటే ఈ ఫోటోలు చూడొద్దని కోరుతున్నా.. ఎందుకంటే కొన్ని భయంకరమైన పిక్స్ ఇందులో ఉన్నాయి అంటూ సరదాగా అభిమానులకు సూచించింది. ప్రస్తుతం అదా శర్మ నటించిన కమాండో వెబ్ సిరీస్ ఈనెల 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్న ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఇటీవలే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. అదా శర్మ తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీతో అదా శర్మకు మరింత ఫేమ్ దక్కింది. కేరళలో 32 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
ఆస్పత్రిలో చేరిన ది కేరళ స్టోరీ నటి.. కారణమిదే !
ఇటీవలే ది కేరళ స్టోరీ మూవీతో సూపర్ కొట్టిన హీరోయిన్ అదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా అదా శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ, డయేరియాతో ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా... ఆగస్టు 1న ఆదా శర్మ తన రాబోయే షో 'కమాండో' ప్రమోషన్‌కు ముందు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయిదని ఆమె సన్నిహితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం నటించిన కమాండో అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె భావనా రెడ్డి పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్‌లో నటి అదాతో పాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' సక్సెస్ తర్వాత ఆదాశర్మ నటించిన వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు విపుల్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!) -
హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలని లేకపోతే మరో శాలినీ ఉన్నికృష్ణన్ అయ్యే అవకాశం ఉందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు సుమన్ జాదవ్, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకరతో కలిసి మాట్లాడుతూ... తన కూతురు సోనీజాదవ్(21) ఎంబీఏ పూర్తిచేసిందన్నారు. భర్త చనిపోవడంతో చిన్న టిఫిన్ బండి పెట్టుకుని కూతురు, ఇద్దరు కొడుకులను పోషించుకుంటున్నానని తెలిపారు. 10వ తరగతి వరకు కార్వాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తన కూతురు సోని చదువుకుందని, అప్పుడే అమ్రన్ బేగం అనే మరో యవతితో పరిచయం ఏర్పడి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. గత నెల 7వ తేదీన అమ్రాన్ బేగం మా ఇంటికి వచ్చి సోనీని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిందన్నారు. రాత్రి అయినా రాకపోవడం ఇద్దరికీ ఫోన్ చేసినా స్పందన లేదని.. దీంతో లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు వెతికి 11వ తేదీన వారిని మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువచ్చారని తెలిపింది. అప్పటివరకు నాకు తెలియదన్న అమ్రాన్ బేగం తన కూతురు సోనీని, న్యాయవాదులను తీసుకుని వచ్చిందన్నారు. సోనీ పోలీసులకు తాను మేజర్‌ను అని సర్టిఫికెట్లు చూపించి తన ఇష్టం ఉన్నచోట ఉంటానని పోలీసులకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయిందన్నారు. తాము ఎంతసర్ది చెప్పాలని చూసినా వినిపించుకోకుండా వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన కూతురు సోనీ ఆచూకీ లేదని చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో అడ్మిట్ ఉన్నానని చెప్పినా కనీసం స్పందించడం లేదని, అమ్రన్ బేగం తనకు తెలియదు తన ఇంటికి రావద్దు అని హెచ్చరిస్తుందన్నారు. సోనీ 21 సంవత్సరాలు వచ్చిన రెండు నెలలకే ఈ పనిచేశారని, రెండు నెలల ముందే పాస్‌పోర్టు కూడా తీయించినట్లు తెలిసిందని ప్రస్తుతం తన కూతురు ఎక్కడ.. ఎలా ఉందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తన కూతురు ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కేరళ స్టోరీని OTT ఎందుకు కొనుగోలు చేయడం లేదంటే..?
-
ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తి కావడంతో ఆదాశర్మ స్పందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం మొత్తం సినిమా ఇండస్ట్రీకే మంచిదని తెలిపారు. ఈ మూవీ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి తీయలేదని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి..!) నటి అదా శర్మ మాట్లాడుతూ.. 'ఈ విజయం నటీనటులకు, నిర్మాతలకు మాత్రమే కాదు.. మొత్తం పరిశ్రమకు కూడా వేడుక లాంటిది. ఈ రోజుకు మేము బిగ్ స్క్రీన్‌పై 50 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ సినిమా త్వరలోనే ఓటీటీకి వస్తుందని భావిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగాఈ వార్తలపై హీరోయిన్ ఆదా శర్మ స్పందించారు. నిర్మాతలు ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వాలనే విషయంపైనే ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ కావడంతో.. ఓటీటీ విడుదలలో కూడా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) -
మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. మే 5న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. కేరళలో బాలికలను అక్రమంగా సౌదీకి తరలించడం, మత మార్పిడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వివాదస్పదం కావడంతో కొన్ని రాష్ట్రాలు నిషేధ విధించాయి. (ఇది చదవండి: చవక రేటుకే ఆదిపురుష్ త్రీడీ టికెట్లు.. సెటైర్లు వేస్తున్న నెటిజన్స్) ఈ నేపథ్యంలోనే మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు సుదీప్తో సేన్. ది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన ఆయన.. బస్తర్ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ది కేరళ స్టోరీ నిర్మించిన విపుల్ అమృత్ లాల్ షానే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో పెద్దసంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. వారితో పాటు 8 మంది సామాన్యులు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అటాక్‌పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) April 6, 2010. 76 CRPF jawan and 8 poor villagers were killed in an bloodiest attack by the terrorists, in Chintalner village of Dantewada District of Bastar, Chhattisgarh. After exactly 14-years, the poetic justice will be delivered.#Bastar ... Our humble presentation after… pic.twitter.com/qXZlOJsprp — Sudipto SEN (@sudiptoSENtlm) June 26, 2023 -
'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?
ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా అయినా.. ఓటీటీల్లోకి రావడానికి పెద్దగా టైమ్ పట్టట్లేదు. కొన్నిసార్లు థియేటర్ లో ఉండగానే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. 'బలగం' చిత్రానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అలాంటిది దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన 'ద కేరళ స్టోరీ'ని మాత్రం ఓటీటీలు పట్టించుకోవట్లేదు. విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్న.. ఇప్పటికీ స్ట్రీమింగ్ కి నోచుకోవట్లేదు. దీనికి కారణమేంటి? 'ద కేరళ స్టోరీ' కథేంటి? కేరళలోని కాసర్గాడ్ ఊరిలో షాలినీ(అదాశర్మ), గీతాంజలి(సిద్ది ఇద్నానీ), నిమా(యోగితా భిహాని) నర్సింగ్ చదువుతుంటారు. అసిఫా(సోనియా బలానీ)తో హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటారు. ఐసిస్ లో అండర్‌కవర్ గా చేస్తున్న అసిఫా.. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాంలోకి మార్చే మిషన్ కోసం పనిచేస్తుంటుంది. ప్లాన్ లో భాగంగా ఇద్దరబ్బాయిలనీ రంగంలోకి దించి.. షాలినీ, గీతాంజలిని లవ్ జిహాద్ లోకి లాగుతుంది. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) ఇంతకీ గొడవేంటి? 'ద కేరళ స్టోరీ' ట్రైలర్ విడుదలైనప్పుడు.. లవ్ జిహాద్ ఉచ్చులోకి దాదాపు 32వేల మంది అమ్మాయిలని దింపినట్లు చూపించారు. థియేటర్లలో సినిమా వచ్చేసరికి ఆ సంఖ్యని ముగ్గురు అమ్మాయిలుగా మార్చారు. అయినాసరే గొడవలు ఆగలేదు. సినిమా కాస్త రాజకీయం అయిపోయింది. పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. అలా దాదాపు మేలో 10-20 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది. ఓటీటీ గందరగోళం 'ద కేరళ స్టోరీ'.. జూన్ 23న జీ5లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తేదీ వచ్చి వెళ్లిపోయినా సరే ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. కారణం ఏంటా అని ఆరా తీస్తే.. నిర్మాతలు డిమాండ్ చేస్తున్న మొత్తానికి కొనేందుకు ఓటీటీలు ముందుకు రావట్లేదని, అందుకే స్ట్రీమింగ్ ఆలస్యమవుతుందని సమాచారం. డీల్ కుదిరన వెంటనే ఓటీటీలో ఈ చిత్రం విడుదలైపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడొస్తుందో? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!) -
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!
'ఆదిపురుష్' కాస్త తగ్గింది. ఈసారి థియేటర్లలోకి దాదాపు తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి. కానీ అందులో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏం లేవు. దీంతో ఓటీటీల్లో ఏమేం కొత్త చిత్రాలు విడుదల కానున్నాయా అని మూవీ లవర్స్ చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తి లిస్ట్ తీసుకొచ్చేశాం. ఈ సోమవారం చూసినప్పుడు 21 సినిమాలు ఉన్నాయి. గురువారం వచ్చేసరికి ఆ నంబర్ కాస్త 28కి పెరిగింది. ఈ మొత్తం జాబితాలో మళ్లీ పెళ్లి, ద కేరళ స్టోరీ, జాన్ విక్ 4 సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది చూసేద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ - ఇంగ్లీష్ సినిమా ఐ నంబర్: జోజీ గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ తీర కాదల్ - తమిళ సినిమా త్రిశంకు - మలయాళ మూవీ త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) గ్లామరస్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా మళ్లీ పెళ్లి - తెలుగు సినిమా ఇంటింటి రామాయణం - తెలుగు చిత్రం జాన్ లూథర్ - తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ టీకూ వెడ్స్ షేరు - హిందీ మూవీ కళువెత్తి మూర్కన్ - తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్ జాన్ విక్ 4 - ఇంగ్లీష్ చిత్రం ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది) కొండ్రాల్ పావమ్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా కేరళ క్రైమ్ ఫైల్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ మూవీ జీ5 ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ మూవీ కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ - హిందీ సినిమా సోనీ లివ్ ఏజెంట్ - తెలుగు సినిమా కఫాస్ - హిందీ సిరీస్ జియో సినిమా అసెక్ - హిందీ సినిమా అడ్డా టైమ్స్ ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ (ఇదీ చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!) -
ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!
గతవారం అంతా 'ఆదిపురుష్' సందడి, హడావుడి నడిచింది. దాని రిజల్ట్ గురించి ఇక్కడ డిస్కషన్ వద్దులే గానీ.. ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు పెద్దగా లేవు. దీంతో ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఏంటా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఫుల్ లిస్ట్ తో వచ్చేసింది. ఒకటి రెండు కాదు ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు ఈ వారంలోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'ద కేరళ స్టోరీ', 'ఇంటింటి రామాయణం', 'జాన్ విక్ 4' తదితర చిత్రాలు ఉండటం విశేషం. మరి ఓటీటీ సినిమా లిస్ట్ ఏంటో చూసేద్దామా? (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) నెట్‌ఫ్లిక్స్ గ్లామరస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22 స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22 స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22 సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ - జూన్ 22 ఐ నంబర్ నంబర్: జోజి గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ - జూన్ 23 త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 క్యాచింగ్ కిల్లర్స్: సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - జూన్ 23 టేక్ కేర్ ఆఫ్ మాయ - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) నాట్ క్వైట్ నార్వల్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ టీకూ వెడ్స్ షేరు - హిందీ సినిమా - జూన్ 23 పొన్నియిన్ సెల్వన్ - హిందీ వెర్షన్ - జూన్ 23 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ క్లాస్ ఆఫ్ '09 - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21 సీక్రెట్ ఇన్వేషన్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21 జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 కేరళ క్రైమ్ ఫైల్స్ - మలయాళ మూవీ - జూన్ 23 వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 ఆహా ఇంటింటి రామాయణం - తెలుగు సినిమా - జూన్ 23 జీ5 కిసీ కా భాయ్ కిసీ కా జాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 23 ద కేరళ స్టోరీ - తెలుగు డబ్బింగ్ సినిమా - జూన్ 23 సోనీ లివ్ ఏజెంట్ -తెలుగు సినిమా - జూన్ 23 అడ్డా టైమ్స్ ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ - జూన్ 23 లయన్స్ గేట్ ప్లే జాన్ విక్ చాప్టర్ 4 - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23 (ఇదీ చదవండి: రష్మికను మోసం చేసిన మేనేజర్!) -
ముఖం నిండా గాయాలతో అదా శర్మ.. ఇది మేకప్ కాదు!
ది కేరళ స్టోరీ.. కల్పితం అంటారు కొందరు.. యదార్థ కథను కళ్లకు కట్టినట్లు చూపించారంటారు మరికొందరు. ఏదైతేనేం.. విమర్శల నడుమ మంచి వసూళ్లు రాబట్టింది. మే 5న విడుదలైన ఈ సినిమా రూ.230 కోట్లమేర వసూలు చేసింది. చూస్తుంటే మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఊహించని సక్సెస్‌తో ఉబ్బితబ్బిబవుతున్న అదాశర్మ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడిందో తెలియజేస్తూ ఆసక్తికర ఫోటోలు షేర్ చేసింది. కేరళ స్టోరీ సినిమా షూటింగ్లో భాగంగా అఫ్ఘనిస్తాన్‌లో దిగిన ఫోటోలను వదిలింది. ఇందులో అదా ముఖానికి గాయాలయ్యాయి. 'మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు ఉన్నాం. డీహైడ్రేషన్ కారణంగా నా పెదాలు పగిలిపోయాయి. ఫోటోలో కనిపిస్తున్న పరుపు నేను కింద పడే సమయానికి వేద్దామనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం.. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది, అందుకు ఆనందంగా ఉంది' అని రాసుకొచ్చింది. మరో వీడియోలో కుక్కపిల్లతో కాలక్షేపం చేసింది అదా శర్మ. 'ఇషాన్ నన్ను కొట్టడానికి వచ్చే సీన్ అది.. ఆ సన్నివేశాన్నంతా దగ్గరుండి చూసిన ఈ శునకం తర్వాత నేనెలా ఉన్నానో చూడటానికి నా దగ్గరకు వచ్చింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లు నొప్పిపెడుతున్నాయి. మరోపక్క తలనొప్పి.. ఇంకోపక్క గర్భిణిలా కనిపించేందుకు ప్రోస్థటిక్ మేకప్.. అది చాలా బరువుగా ఉంది. నడిచి నడిచి అలిసిపోయాను. ఆ సమయంలో నాకు ఈ శునకం నుంచి హగ్ దొరికింది' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) చదవండి: డబ్బు కోసమే సల్మాన్ చెల్లితో పెళ్లి? నా వల్ల పైకి వచ్చినవారే గీత దాటారు: అల్లు అరవింద్ -
థియేటర్లో ఫ్రీగా కేరళ స్టోరీ ప్రదర్శన, ఎక్కడంటే?
ది కేరళ స్టోరీ చిత్రాన్ని మతం కోణంలో కాకుండా ఉగ్రవాద కోణంతో చూడాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ది కేరళ స్టోరీ సినిమాను ఉచితంగా ప్రదర్శించగా నాయకులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదులు, తీవ్రవాదులు ఏ విధంగా హిందూ మహిళలు, యువతులను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఉగ్రవాద శిబిరాలకు తరలిస్తున్నారో ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. యువతులు, తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్, నాయకులు గుర్రం రాము, జిట్టవేణి అరుణ్, ప్రభాకర్, నారాయణరెడ్డి, బిట్టు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కేరళ స్టోరీ విషయానికి వస్తే.. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు చేరువలో ఉంది. చదవండి: ఇంటి పనంతా మాతోనే: స్నేహ -
ది కేరళ స్టోరీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
ది కేరళ స్టోరి చిత్రంపై ఇప్పటికే పలు రకాల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతుల మతం మార్చి ఆ తరువాత ఉగ్రవాదులుగా తయారు చేసే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇది. ఇది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని యూనిట్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇదే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం. దీంతో కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. తమిళనాడు థియేటర్ల యాజమాన్యం కూడా ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన రద్దు చేశాయి. అయితే బీజేపీ అధికార ప్రభుత్వాలు మాత్రం ఈ చిత్రానికి వినోదపు పన్నును రద్దు చేశాయి. ఇక సుప్రీంకోర్టు కూడా ది కేరళ స్టోరీ చిత్రంపై నిషేధాన్ని కొట్టివేసింది. ఇలాంటి రగడ మధ్య ఈ చిత్రం సుమారు రూ.200 కోట్లు వసూలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా ది కేరళ స్టోరీ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక భేటీలో తాను పబ్లిసిటీ చిత్రాలకు వ్యతిరేకినని అన్నారు. యధార్థ కథ అంటూ ఏదో ఒక అంశాన్ని చెబితే అది నిజం అవదన్నారు. వాస్తవంగా అది యదార్థ కథ అయి ఉండాలన్నారు. అయితే ది కేరళ స్టోరీ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజం కాదని కమల్ హాసన్ పేర్కొన్నారు. Woww 4th weekend and so many of you in theatres for #TheKeralaStory !! So so grateful 👻👻👻🦍🦍♥️♥️ Grateful to everyone in the industry who gave me every role in every movie, ad , music video sab kuch to get to be in theatres now with this one ❤️ . Thank uuuuuuuu !! pic.twitter.com/mXSYtXDt80 — Adah Sharma (@adah_sharma) May 28, 2023 చదవండి: నటుడికి చేదు అనుభవం.. భార్యతో అసభ్యంగా.. -
తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుదీప్తో సేన్ ఆస్పత్రిలో చేరారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వస్తున్నప్పటికీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన సుదీప్తో సేన్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలు బలవంతంగా ఐసిస్‌లో చేరారన్నకథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. (ఇది చదవండి: సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి) -
ది కేరళ స్టోరీ నటికి బిగ్ షాక్.. ఆ వివరాలు లీక్ చేసిన నెటిజన్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్‌ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్‌ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ
ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్ కేర్ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. (చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు) -
రూ.200 కోట్ల క్లబ్లో ది కేరళ స్టోరీ! చావు దెబ్బ కొట్టిందన్న ఆర్జీవీ
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు కనీస వసూళ్లు రాబట్టడానికి అపసోపాలు పడుతుంటే చిన్న సినిమాలు మాత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీగా కలెక్షన్స్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. చిన్న సినిమాల పని అయిపోయిందనుకున్న సమయంలో బలమున్న కంటెంట్‌తో బరిలోకి దిగి బడా సినిమాలను సైతం వెనక్కు నెట్టి విజయాలు సాధిస్తున్నాయి. ఆ కోవలేకే వస్తుంది ది కేరళ స్టోరీ. తీవ్ర వ్యతిరేకత మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ తొలి రోజు నుంచే దూసుకుపోతోంది. రికార్డుల దుమ్ము దులుపుతున్న ఈ సినిమా ఇప్పటిదాకా రూ.198 కోట్లు వసూలు చేసింది. నేడు వచ్చే కలెక్షన్స్‌తో రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్లో ఇటీవల వచ్చిన రణ్‌బీర్ తు ఝూఠీ మై మక్కర్ సినిమా లాంగ్ రన్లో రెండు వందల కోట్లు సాధిస్తే కేరళ స్టోరీ మాత్రం కేవలం రెండున్నర వారాల్లోనే ఆ మార్క్‌ను దాటేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రశంసలు కురిపించాడు. 'మనకు అబద్ధాలు అలవాటైపోయాయి. అలాంటిది ఎవరైనా నిజం చెప్తున్నారంటే, ఆ నిజాన్ని వెలికి తీసి చూపిస్తుంటే షాకవుతాం. కేరళ స్టోరీ విజయం బాలీవుడ్‌ను చావుదెబ్బ కొట్టింది' అని ట్వీట్ చేశాడు. కాగా ది కేరళ స్టోరీ సినిమాలో హీరోయిన్ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా విపుల్ షా నిర్మాతగా వ్యవహరించాడు. We are so comfortable in telling lies to both others and ourselves that when someone goes ahead and shows the truth we get SHOCKED..That explains the DEATH like SILENCE of BOLLYWOOD on the SHATTERING SUCCESS of #KeralaStory — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 The #KeralaStory is like a BEAUTIFUL GHOSTLY MIRROR showing the DEAD face of Main stream BOLLYWOOD to itself in all its UGLINESS — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 The #KeralaStory will haunt like a mysterious fog in every story discussion room and every corporate house in BOLLYWOOD forever — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 It’s difficult to learn from #KeralaStory because it’s EASY to copy a LIE but very DIFFICULT to copy TRUTH — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 DOUBLE CENTURY… #TheKeralaStory will hit ₹ 200 cr TODAY [Mon; Day 18]… The second #Hindi film to cross the coveted number in 2023, after #Pathaan [Jan 2023]… [Week 3] Fri 6.60 cr, Sat 9.15 cr, Sun 11.50 cr. Total: ₹ 198.97 cr. #India biz. Nett BOC. #Boxoffice pic.twitter.com/PIdIwl4c8J — taran adarsh (@taran_adarsh) May 22, 2023 చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే! గ్రాండ్‌గా నిర్మాత డీవీవీ దానయ్య తనయుడి వివాహం -
ది కేరళ స్టోరీ బ్యాన్పై సుప్రీం కోర్టు స్టే
ఢిల్లీ: ది కేరళ స్టోరీ చిత్ర విషయంలో పశ్చిమ బెంగాల్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మమతా బెనర్జీ చిత్రప్రదర్శనపై విధించిన నిషేదాజ్ఞాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మే 8వ తేదీన బెంగాల్ ప్రభుత్వం ది కేరళ స్టోరీ సినిమాపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బ్యాన్పై ఫిల్మ్ మేకర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. బ్యాన్ ఎందుకు చేశారో వివరణ కోరుతూ మమతా బెనర్జీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీం. వాస్తవాలను తారుమారు చేసి ఈ చిత్రం రూపొందించారని, పైగా సినిమాలో ద్వేషపూరిత ప్రసంగాలను ఉన్నాయని, ఈ సినిమాను ప్రదర్శిస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చనే ఉద్దేశంతోనే బ్యాన్ చేసినట్లు సుప్రీం నోటీసులపై బెంగాల్ ప్రభుత్వం బుధవారం వివరణ ఇచ్చుకుంది. ఈ క్రమంలో.. ఇవాళ్టి విచారణ సందర్భంగా బ్యాన్ ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. చట్టపరమైన నిబంధనలతో చిత్రప్రదర్శన అడ్డుకోవాలని చూడడం సరికాదని, అలా అనుకుంటే సినిమాలన్నీ కోర్టులకే చేరతాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) సర్టిఫికెట్ జారీ చేసింది. కాబట్టి, శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. చట్టపరమైన నిబంధనలతో ఆపే యత్నం చేయకూడదు అని బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం అప్రకటిత బ్యాన్‌ను విధించిందని ది కేరళ స్టోరీ నిర్మాతలు సుప్రీంలో విడిగా మరో పిటిషన్ వేయగా.. స్టాలిన్ ప్రభుత్వానికి సైతం గతంలో సుప్రీం నోటీసులు పంపింది. అయితే.. ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ తాము ఎలాంటి నిషేధం విధించలేదని, ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులే స్వచ్చందంగా సినిమా ప్రదర్శన ఆపేశారంటూ తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. తమిళనాడు ప్రభుత్వ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టు రికార్డు చేసింది. అంతేకాదు.. కేరళ స్టోరీ ప్రదర్శించబడే హాలు వద్ద తగిన భద్రత కల్పించాలని, ప్రేక్షకుల భద్రతకూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన కేరళ హైకోర్టు ఆదేశాలను జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ సుప్రీంలో ఓ పిటిషన్ వేశారు. ఇదీ చదవండి: ది రియల్ కేరళ స్టోరీ గురించి తెలుసా? -
‘అందుకే కేరళ స్టోరీ ప్రదర్శన ఆగిపోయింది’: తమిళనాడు సర్కార్
ఢిల్లీ: ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధాజ్ఞాలను వ్యతిరేకిస్తూ ఆ చిత్రనిర్మాతలు దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ నడుస్తోంది. అయితే గత విచారణలో సీజేఐ నేతృత్వంలోని బెంచ్.. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు అందించగా.. ఆ నోటీసులకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించారనే వాదనను తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని చెబుతూ ఆ చిత్ర నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిచిపోయిందే తప్ప.. ఆ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో.. ‘‘మే7వ తేదీ నుంచి జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే ఎగ్జిబిటర్లు వాళ్లంతట వాళ్లే సినిమాను ప్రదర్శించడం ఆపేశారు. సినిమా థియేటర్లకు భద్రత కల్పించడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేద’’ని అఫిడవిట్లో పేర్కొంది. అంతేకాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేకపోవడమో/ అందులోవాళ్ల నటన బాగా లేకపోవడమో.. ఏ కారణాలవల్లనో చిత్ర ప్రదర్శన ఆపేసి ఉంటారని అభిప్రాయపడింది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ థియేటర్ యజమానులపై, మల్టీప్లెక్స్ నిర్వాహకులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. సినిమా ఆగిపోవడంలో ప్రభుత్వ పాత్ర కూడా ఏం లేదు అని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను సైతం అఫిడవిట్లో పొందుపర్చింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: ప్రధానికి అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు -
'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే దాదాపుగా రూ.136 కోట్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్లో ఆదా శర్మ టాప్ ప్లేస్ దక్కించుకుంది. (ఇది చదవండి: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం) అంతకుముందు అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగుభాయి కతియావాడి పది రోజుల్లో రూ.129.1 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా ది కేరళ స్టోరీ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో బాలీవుడ్ హీరోయిన్లలో ఆదా శర్మ టాప్‌లో నిలిచింది. తాజాగా ఈ చిత్ర విజయంపై నటి ఆదా శర్మ స్పందించింది. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని చెప్పుకొచ్చింది. ఆదా శర్మ మాట్లాడుతూ.. 'నేను ఇంత ఘనవిజయం సాధిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది నా చేతిలో ఉందో లేదో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నేను చేస్తున్న పనిని కొనసాగిస్తాను. ఇలాంటి సినిమా తీస్తానని నేనెప్పుడూ ప్లానింగ్ చేయలేదు. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని ఎవరైనా గట్టిగా నమ్మితేనే ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది.' అని అన్నారు. ది కేరళ స్టోరీ ఆదివారం ఒక్కరోజే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.81.14 కోట్లు రాగా.. రెండో వారాంతంలో రూ.55.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొంతమంది మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో రిక్రూట్ చేయబడ్డారన్న కథాంశంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. Woahhh !! Audience 🙏❤️ thank u ! This is just ....... *no words' 👀😱❤️ https://t.co/6kV2j07Aq7 — Adah Sharma (@adah_sharma) May 15, 2023 -
ది కేరళ స్టోరీ టీమ్‌కు యాక్సిడెంట్.. స్పందించిన హీరోయిన్
మొన్నటి వరకు హార్ట్ ఎటాక్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న అదా శర్మ ఇప్పుడు ది కేరళ స్టోరీతో జాతీయ స్థాయిలో సెన్సేషన్ అవుతోంది. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే వంద కోట్లు రాబట్టంది. సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న దారిలో ఈ ప్రమాదం జరగడంతో గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్‌పై అదాశర్మ స్పందించింది. 'యాక్సిడెంట్ అయిందని తెలియడంతో చాలామంది నా యోగక్షేమాలను ఆరా తీస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కేరళ స్టోరీ సినిమా టీమ్ అంతా బాగానే ఉన్నాం. పెద్ద ప్రమాదమేమీ కాదు, కంగారుపడాల్సిన పని లేదు' అని ట్వీట్ చేసింది. ఈ ప్రమాదం వల్ల కరీంగనర్‌లో హిందూ ఏక్తాయాత్రకే కేరళ స్టోరీ టీమ్ హాజరు కాలేకపోయింది. ఈ సినిమా విషయానికి వస్తే కేరళలో తప్పిపోయిన నలుగురమ్మాయిలు తప్పని పరిస్థితుల్లో ఐసిస్‌లో చేరడం, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టం, అందుకు దారి తీసిన పరిస్థితులను చూపించారు. విపుల్ షా నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది I'm fine guys . Getting a lot of messages because of the news circulating about our accident. The whole team ,all of us are fine, nothing serious , nothing major but thank you for the concern ❤️❤️ — Adah Sharma (@adah_sharma) May 14, 2023 Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj — Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023 చదవండి: యాక్సిడెంట్‌కు గురైన ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, హీరోయిన్ -
‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలకు ముందే వివాదాలు చుట్టిముట్టినప్పటికీ అవేవీ సినిమాను ప్రభావితం చేయలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లోనే రూ. 112.87 కోట్లు రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా తాజాగా ది కేరళ స్టోరి డైరెక్టర్ సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదా శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా... ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. చదవండి: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్ -
నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్
పలు వివాదాల మధ్య మే 5 విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన ఆదా శర్మ తో పాటు మిగిలిన నటీనటులపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. (చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ ) అదా శర్మ కృతజ్ఞతలు తమ చిత్రానికి భారీ విజయం అందించిన ప్రేక్షకులను కృతజ్ఞతలు చెప్పింది అదా శర్మ. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. ‘నా నిజాయతీని కొందరు అపహాస్యం చేశారు. మా చిత్తశుద్దిని చులకనగా చూశారు. ‘ది కేరళ స్టోరీ టీజర్ వచ్చాక ఈ సినిమాను రిలీజ్ చేయొద్దని బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. అయినా కూడా ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇంతగా ఆదరించినందుకు అందరికి ధన్యవాదాలు. ఈ మూవీ విషయంలో ఆడియన్స్ గెలిచారు’ అని అదా శర్మ రాసుకొచ్చింది. ‘కేరళ స్టోరీ’లో ఏం చూపించారు కేరళలోని లవ్ జిహాద్, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్ మెంట్, లైంగిక బానిసత్వం లాంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ జిహాద్ వల్ల ముగ్గురు అమ్మాయిలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
ది కేరళ స్టోరీ.. బెంగాల్, తమిళనాడుకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ది కేరళ స్టోరీ.. ఈ సినిమాపై వివాదం కొనసాగుతున్నది. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ ఎందుకు చేశారని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బెంగాల్, తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది కదా? బెంగాల్ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి? అని ప్రశ్నించింది. బ్యాన్‌కు గల కారణాలను చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు ది కేరళ స్టోరీ బ్యాన్‌లో ఉన్న బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ ఆందోళనల కారణంగా థియేటర్ల యజమానులు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో, తమిళనాడులో ఈ సినిమా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. 'ది కేరళ స్టోరీ'ని నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ సినిమాను బ్యాన్ చేసిన సందర్బంగా బెంగాల్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ది కేరళ స్టోరీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్ అయ్యారు. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని మేకర్స్ స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. ‘ది కేరళ స్టోరీ’ వివాదం ఇది.. వివాహానంతరం ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐసిస్ క్యాంపులకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు మహిళలకు ఎదురైన కష్టాలను ‘ది కేరళ స్టోరీ’ వివరిస్తుంది. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరారని ట్రైలర్లో పేర్కొనడంతో సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది. "Why Should Bengal Ban 'The Kerala Story'?" Supreme Court Issues Notice https://t.co/AQBKL21gWE pic.twitter.com/RHBjP5neX4 — NDTV News feed (@ndtvfeed) May 12, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. కౌన్‌బనేగా కన్నడ సీఎం -
కాంట్రవర్సీ స్టోరీ దెబ్బకి మార్వెల్ హీరోస్ మటాష్
-
The Kerala Story : నటి అదా శర్మ బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
కేరళ స్టోరీ సినిమాపై నటి పోస్ట్.. నెటిజన్స్ ఫైర్
ఒక్కోసారి సినిమాతో పాటు అందులో నటించిన తారలు చిక్కుల్లో పడుతుంటారు. నటి సిద్ది ఇద్నానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ది కేరళ స్టోరి. వివాదాస్పద కథాంశంతో రూపొందిన ఈ చిత్రం రాజకీయ మంటలు రేపుతోంది. దేశంలో అధికార పార్టీ మద్దతుగా నిలిచినా, ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి. కారణం కేరళలో జరిగిన యదార్ధ సంఘటన ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందడమే! అదీ 32 వేల మందిని బలవంతంగా ఇస్లామిక్ మతస్తులుగా మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసినట్లు చూపడంతో చిత్రంపై ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఈ చిత్రంలో గీతాంజలి అనే ఒక ప్రధాన పాత్రలో సిద్ధి ఇద్నాని నటించింది. కేరళ స్టోరీ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో నటి సిద్ధి ఇద్నాని సినిమాలో తప్పుగా ఏం చూపించలేదే అంటూ ఓ పోస్ట్ పెట్టింది. కేరళ స్టోరీ వివాదాస్పద చిత్రం కాదని, అవగాహన కలిగించే సినిమా అని పేర్కొంది. ఇది ఏ మతాన్ని వ్యతిరేకించే చిత్రం కాదని, తీవ్రవాదాన్ని ఖండించే మూవీ అని స్పష్టం చేసింది. అలాంటి చిత్రంలో నటించడం బాధ్యతగా భావించానని పేర్కొంది. ఈ అమ్మడి వ్యాఖ్యలపై కొందరు మండి పడుతుండగా.. మరికొందరు మద్దతు ఇస్తున్నారు. కాగా సిద్ధి ఇద్నానీ.. హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన వెందు తనిందది కాడు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. నటుడు హరీష్ కల్యాణ్‌కు జంటగా నటించిన నూరు కోడి వానవిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్యకు జంటగా ఖాదర్ భాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జంబలకిడి పంబ(2018), అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, ప్రేమకథా చిత్రం 2 సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ -
ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ!
ది కేరళ స్టోరీ సినిమాపై వివాదం ముసురుకుంటోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ నుంచి ఏకంగా ఇందులో నటించినవాళ్లు బయట కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరింపుల దాకా వచ్చింది వ్యవహారం. ఓపక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సినిమాపై ఆ రాష్ట్రంలో నిషేధం విధించగా మరో పక్క ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కల్పించడం గమనార్హం. ప్రశంసలు, విమర్శల మధ్య ది కేరళ స్టోరీ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.45.72 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందని ఆరా తీస్తున్నారు అభిమానులు. ది కేరళ స్టోరీ ఓటీటీ హక్కులను జీ5 ఇదివరకే సొంతం చేసుకుంది. థియేటర్లో సక్సెస్‌గా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు. ది కేరళ స్టోరీని జీ5లో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే! హీరోయిన్ అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ నిర్మించారు. కేరళలో తప్పిపోయిన 32వేల మంది యువతలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చదవండి: బాలీవుడ్ నటి సోదరుడు అరెస్ట్ -
కాశ్మీర్ ఫైల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతకు లీగల్ నోటీసులు
ముంబై: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలోకి ఇటీవలే విడులైన ది కేరళ స్టోరీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేశాయి. ఇక, పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సినిమాను బ్యాన్ చేసింది తృణముల్ కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రెండు సినిమాలపై మమత స్పందిస్తూ.. "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్ అయ్యారు. అందుకే కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేసినట్టు తెలిపారు. What is "The Kashmir Files"? it is to humiliate one section. What is "The Kerala Story"?... It is a distorted story: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/yRFwhlumum — ANI (@ANI) May 8, 2023 కాగా, మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మమతకు లీగల్ నోటీస్ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్ నోటీస్ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. తాను తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు. BREAKING: I have, alongwith @AbhishekOfficl & Pallavi Joshi, sent a LEGAL NOTICE to the Chief Minister, Bengal @MamataOfficial for her false & highly defamatory statements made with malafide intention to defame us & our films #TheKashmirFiles & upcoming 2024 film #TheDelhiFiles. pic.twitter.com/G2SjX67UOB — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 9, 2023 ఇది కూడా చదవండి: The Kerala Story: యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం -
ది కేరళ స్టోరీ: యోగి సర్కార్ కీలక నిర్ణయం
ది కేరళ స్టోరీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.. విడుదలకు ముందే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం.. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. వివిధ పార్టీలు. ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళను కించపరిచేలా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సినిమాను విడుదల చేస్తే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని తమిళనాడులోని మల్టిప్లెక్స్ థియేటర్లలో కేరళ స్టోరీ షోలను రద్దు చేశారు. మరోవైపు సమాజంలో అశాంతి. అలజడులను సృష్టించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్‌లోని కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు. చదవండి: ‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. అయితే వివాదాస్పద ది కేరళ స్టోరి సినిమాకు బీజేపీ మాత్రం మద్దతు తెలుపుతోంది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి పన్ను మినహాయింపులు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించగా... తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్ సైతం చేరింది. 'ది కేరళ స్టోరీ'ని ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. సీఎం తన క్యాబినెట్‌తో కలిసి ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సినిమాను చూశారు. ఉగ్రవాద ప్రమాదకర కుట్రను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. సినిమాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కప్పి ఉంచిందని మండిపడ్డారు. ది కేరళ స్టోరీ' ఏ రాష్ట్రం లేదా మతానికి సంబంధించినది కాదని జేపీ నడ్డా పేర్కొన్నారు. కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ నిర్మించారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. -
ఆ సినిమా వివాదం ఓ రేంజ్లో ఉంది!..ఆఖరికి పశ్చిమబెంగాల్ కూడా..
బహుభాషా చిత్రం 'ది కేరళ స్టోరీ' సినిమా రిలీజ్ కష్టాలు ఓ రేంజ్లో ఉన్నాయనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదాల్లో కూరుకుపోయింది. ఆఖరికి ఎన్నోప్రయాసలు పడి ఎట్టకేలకు ప్రేక్షకులు మందుకు వచ్చిందనే లోపలే షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఈ సినిమాకి రాజకీయ వివాదం బంకుమన్నులా అతుక్కుపోయింది. ఏదోలా విడుదలైందని ఊపిరి పీల్చుకునేలోపే థియోటర్లో ప్రదర్శించనీయకుండా బ్యాన్ చేస్తున్నారు. ఓ పక్క తమిళనాడులో విడుదలైన రెండో రోజే థియటర్ యజామాన్యం బ్యాన్ చేసి షాక్ ఇచ్చింది. ఇది మరవుక మునుపే ఇప్పుడూ తాజగా పశ్చిమ బెంగాల్ కూడా ఈ సినిమాపై నిషేధం విధించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'ది కేరళ స్టోరీపై' నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె కూడా ఈ సినిమాని వక్రీకరించిన కథేనని అన్నారు. ఇది ద్వేషం, హింసాత్మక సంఘటనలను రేకెత్తించేలా ఉందని, దాన్ని నియంత్రించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మమతా. ఐతే మమత నిర్ణయంపై స్పందించిన నిర్మాత విపుల్ షా.. ఆమె కూడా అలానే చేస్తే తాము కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండిపడ్డారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సాధ్యమైనంత మేర పోరాడతామని తెగేసి చెప్పారు. కాగా, ఈ సినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు?, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. దీంతో ఒక్కసారిగా ఇది పెను రాజకీయ వివాదానికి దారితీసింది. కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ తోసహా, పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విడుదల చేయకుండా అడ్డుకునేందుకు కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. అయితే కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు దీన్ని విడుదల చేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం. దీని వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉన్నాయంటూ విపక్షాలు గట్టిగా మండిపడుతున్నాయి. (చదవండి: త్వరలో స్టాలిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! ఆ మంత్రి ఔట్) -
ఇదీ.. అసలైన పాన్ ఇండియా సినిమా: ఆర్జీవీ
ది కేరళ స్టోరీ.. దేశమంతటా ప్రకంపనలు రేపుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం దూసుకుపోతోంది. కొందరు సినిమా బాగుందని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఓ వర్గాన్ని కించపరిచిందని నొచ్చుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. 'తమిళ/ మలయాళీ అమ్మాయి హీరోయిన్. గుజరాతీ నిర్మాత, బెంగాలీ డైరెక్టర్.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే!' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు 'నువ్వు పాజిటివ్‌గా స్పందించావంటే ఆశ్చర్యంగా ఉంది', 'పాన్ ఇండియా సినిమా అంటున్నారు కానీ బాగుందా? బాలేదా? అని ఏమీ చెప్పట్లేదు ఏంటి?' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 2018-19లో 32,000 మంది అమ్మాయిలు కనబడకుండా పోయారు.. వారు ఎక్కడున్నారు? ఏమైపోయారు? అని పట్టించుకునేవాళ్లే లేరు. ఆ కథనే ది కేరళ స్టోరీ పేరిట సినిమాగా తెరకెక్కించారు డైరెక్టర్ సుదీప్తోసేన్. బాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. మొదటి రోజు రూ.8.02 కోట్లు, రెండో రోజు రూ.11.22 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఆదివారం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.35 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. A Tamil/Malyali girl playing the lead , a Gujrati producer , a bengali director, a Hindi film now a BLOCKBUSTER in all languages ..A TRUE PAN INDIAN FILM #TheKeralaStory — Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2023 #TheKeralaStory is UNSTOPPABLE and UNSHAKABLE... PHENOMENAL biz on Day 2 and 3 makes it a SMASH-HIT… Withstands two mighty opponents: #Hollywood film #GotGVol3 and #IPL2023… Fri 8.03 cr, Sat 11.22 cr, Sun 16 cr. Total: ₹ 35.25 cr. #India biz. #Boxoffice Growth / Decline… ⭐️… pic.twitter.com/kAL2jLbCQr — taran adarsh (@taran_adarsh) May 8, 2023 చదవండి: తొక్క తీస్తా.. ఆర్ఆర్ఆర్ మాస్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పిన రాజస్థాన్ రాయల్స్ -
‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. తమిళనాడులో షోలు రద్దు
ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ మూవీ అనేక అడ్డంకుల నడుమ మే 5న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత కూడా సినిమాను రాజకీయ వివాదం వదలడం లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మధ్యప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించింది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాకు తమిళనాడలో భారీ షాక్ తగిలింది. తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్ అర్చ్ స్కై వాక్ మాల్ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ జెండాలు పట్టుకొని థియేటర్లలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. చదవండి: The Kerala Story: ది కేరళ స్టోరీ రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులను, చూడవద్దని ప్రేక్షకులను సీమన్ విజ్జప్తి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు. కాగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై రాజకీయ దుమారం మొదలైన విషయం తెలిసిందే. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. చదవండి: కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’ ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. దీని వెనక ఆరెస్సెస్, బీజేపీలున్నాయని ఆరోపిస్తున్నాయి.సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కిన ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకే మొగ్గు చూపింది, -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ది కేరళ స్టోరీ, రెండో రోజు ఎంత వచ్చిందంటే?
ది కేరళ స్టోరీ.. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం చెలరేగింది. బలవంత మతమార్పిడికి గురై ఐసిస్‌లో చేరిన మహిళల కథే కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోకి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సైతం జరిగాయి. ఈ వివాదాల మధ్య కేరళ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.8.03 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు అంతకుమించిన వసూళ్లు రాబట్టింది. శనివారం ఒక్కరోజే రూ.11.22 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 39.73% వృద్ధి కనబర్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బల్రానీ ముఖ్య పాత్రలు పోషించారు. చాలామంది ఈ సినిమాను వ్యతిరేకిస్తుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ రద్దు చేయడం విశేషం. #TheKeralaStory is SENSATIONAL, sets the #BO on 🔥🔥🔥 on Day 2… Shows BIGGG GAINS across all circuits… Hits double digits, a REMARKABLE ACHIEVEMENT for a film that’s *not* riding on stardom, but word of mouth… Fri 8.03 cr, Sat 11.22 cr. Total: ₹ 19.25 cr. #India biz.… pic.twitter.com/3FDHvSApjt — taran adarsh (@taran_adarsh) May 7, 2023 చదవండి: బలవంతంగా బంధాల్లో ఉండేకంటే ఒంటరిగా ఉండటమే బెటర్: సదా -
కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’
కొచ్చిన్/బళ్లారి/న్యూఢిల్లీ: బహుభాషా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బలవంత మతమార్పిడికి గురై, ఐసిస్‌లో చేరిన కొందరు మహిళలే ఈ సినిమా ఇతివృత్తం. వారం క్రితం సినిమా ట్రయిలర్ రిలీజ్ నాటి నుంచే వివాదం రేగుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం, విపుల్ షా నిర్మాతగా ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. కర్ణాటకలోని బళ్లారి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం. స్టేకు కేరళ హైకోర్టు నో ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. సినిమా ట్రయిలర్ ఒక వర్గానికి వ్యతిరేకంగా లేదని పేర్కొంది. ‘ది కేరళ స్టోరీ’లో కొన్ని అంశాలను చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని, కేరళ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉన్నందున విడుదలను అడ్డుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘సన్యాసులు, క్రిస్టియన్ పూజారులు, ఇతరులను కూడా చెడ్డవారిగా చూపించిన ఘటనలు సినిమాల్లో అనేకం ఉన్నాయి. కొందరు మతబోధకులను చెడుగా చూపారనే కారణంతో సినిమాను నిషేధించలేం’అని పేర్కొంది. -
ఉగ్రవాదానికి కాంగ్రెస్ వెన్నుదన్ను
సాక్షి, బళ్లారి/తుమకూరు: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారి ముందు సాగిలపడుతోందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం గురించి ప్రస్తావించారు. సుందరమైన రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారని అన్నారు. కాంగెస్ మాత్రం ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. కేరళలో చోటుచేసుకున్న ఉగ్ర కుట్రలను ‘ద కేరళ స్టోరీ’ చిత్రం బట్టబయలు చేస్తోందని ప్రశంసించారు. కేవలం ఒక రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై ఈ చిత్రం నిర్మించారని పేర్కొన్నారు. దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతోందని, వారితో తెరవెనుక రాజకీయ బేరసారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో కర్ణాటక ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి కడుపు నొప్పి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తుమకూరులో భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఆ కుట్ర శబ్దాలు వినిపించవు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉగ్రవాదం కూడా స్వభావం మార్చుకుంటోందని, స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారం, మత ఘర్షణలకు ఉగ్రవాదంతో సంబంధం ఉంటోందని మోదీ గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో కొత్తరకం ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు. ఈ ఉగ్రవాదంలో సమాజాన్ని గుల్లబార్చే కుట్రల శబ్దాలు వినిపించవని చెప్పారు. నిశ్శబ్దంగానే కార్యకలాపాలు సాగిపోతుంటాయని, దీనిపై కోర్టులు కూడా ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. -
PM Modi:వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కేరళలో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసింగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ చిత్రంపై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు. 'కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గుట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని మోదీ పేర్కొన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్ సినిమాస్.. షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. చదవండి: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ -
ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక
ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం చల్లారడం లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ పేరే మార్మోగుతోంది. అంతలా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. మే 5న విడుదల కానున్న ఈ సినిమాను రిలీజ్ చేయవద్దంటూ కేరళ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా వివాదం కేరళలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా పాకింది. రిలీజ్ డేడ్ సమీపిస్తన్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వాన్నికి ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. తమిళనాడులో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన్నట్లు తెలిపాయి. అన్ని థియేటర్లలో పీఎస్-2(పొన్నియన్ సెల్వన్) నడుతస్తోందని, ప్రభుత్వంతోపాటు ధియేటర్ యాజమానులు ది కేరళ స్టోరీని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. బ్యాన్ కోరుకోవడం లేదు.. కానీ సినిమా మేకర్స్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం విమర్శలు గుప్పించారు. ఈ సినిమా హిందూ, ముస్లిం మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, దీనిని ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. కేరళను తప్పుగా చిత్రీకరిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శించారు. తాను సినిమాను బ్యాన్ చేయాలని కోరుకోవడం లేదంటూనే.. భావప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారదని మండిపడ్డారు. వాస్తవికతను తప్పుగా చూపించారని, దీనిపై గొంతెత్తి నినాదించే హక్కు కేరళ ప్రజలకు ఉందని ఉందని తెలిపారు. మరోవైపు ది కేరళ స్టోరీ చిత్రానికి బీజేపీ మద్దతిస్తోంది. Let me stress, I am not calling for a ban on the film. Freedom of expression does not cease to be valuable just because it can be misused. But Keralites have every right to say loud & clear that this is a misrepresentation of our reality. https://t.co/sEIG91mjSP — Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2023 కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్‌లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. -
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ వివాదం ఏంటి? సీఎం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది. ప్రేక్షకులు కూడా ఆ తరహా సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం.. ఆ సంఘటన జరిగినప్పుడు మనకు ఎవ్వరికీ తెలియని నిజాలను థియేటర్ లో చూపిస్తారని. ఇక ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అని తెలియడంతోనే వివాదాలు చుట్టుముడతాయి. సాధారణంగా జరిగిన ఒక హత్యపై బయోపిక్ తీస్తేనే.. ఇలాంటివి ప్రేక్షకులకు ఎలా చూపిస్తారు అని కొంతమంది మీడియా ముందే నిగ్గుతీసి అడుగుతున్నారు. అలాంటింది దేశాలు మొత్తం హడలిపోయే టాపిక్ ను సినిమాగా తీస్తే వివాదాలను ఆపడం ఎవరి వల్ల కాదు. (చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు ) కానీ కొంతమంది ధైర్యంగల దర్శకులు.. నిజాలను ప్రేక్షకులకు చూపించడమే పనిగా పెట్టుకున్నారు. అలా నిజాన్ని బయట పెట్టిన సినిమాల్లో ఒకటి ది కాశ్మీర్ ఫైల్స్.. కాశ్మీర్ లో పండితులు ఎలాంటి ఊచకోతకు గురయ్యారో.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ వివాదం ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉంది అంటే .. అందులో ఎలాంటి కథను చూపించి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంకా ఈ హీట్ తగ్గనే లేదు.. మరో బాలీవుడ్ డైరెక్టర్ మరో సంచలన ఘటనను తెరమీదకు తీసుకొచ్చాడు. అదే ది కేరళ స్టోరీ. ‘కేరళ స్టోరీ’లో చూపించేది ఏంటి? మూడేళ్ళ క్రితం అనగా 2018- 2019 లో కేరళనే కాదు భారతదేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన కథ ఇది. దాదాపు 32, 000 మంది అమ్మాయిలు కనపడకుండా పోతే.. వారు ఎక్కడ ఉన్నారు..? ఏమైపోయారు..? అని అడిగినవారు లేరు అంటే నమ్ముతారా..? ఇక ఆ కథనే డైరెక్టర్ సుదీప్తోసేన్.. ది కేరళ స్టోరీగా తెరకెక్కించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు ఒక్కొక్కటిగా ముసురుతున్నాయి. టీజర్లో ఏంముంది? కేరళకు చెందిన నలుగురు అమ్మాయిలు నర్సింగ్ కాలేజ్ లో చేరతారు. అక్కడ వారిని ట్రాప్ చేయడానికి ఐసీసీ ఎన్నో పధకాలు వేసి వారిని ఇస్లాం మతంలోకి రప్పిస్తుంది. అందుకోసం ఎంతటి నీచమైన పనికి అయిన సిద్ధమవుతుంది. ఆ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని, వారిని పెళ్లి వరకు తీసుకొచ్చి.. పెళ్లి చేసుకొనే సమయంలో వారి పేర్లు మార్చాలని చెప్పి వారిని బలవంతంగా ఇస్లాంమతంలోకి దింపుతారు. ఇక పెళ్లి తరువాత వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా మారుస్తారు. ఏడాదిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తారు. చూచాయగా చెప్పుకోవాలంటే ఇది కథ. ఇలాంటి కథను చూపించాలంటే డైరెక్టర్ కు ఘట్స్ ఉండాలి. సుదీప్తోసేన్ లో ఆ ఘట్స్ కనిపిస్తున్నాయి. వివాదం ఏంటి? ఇక ఇందులో వివాదం ఏంటి.. అంటే .. ఈ విషయంపై కొంతమంది మాజీ ముఖ్యమంత్రికి చెప్పడం, వారు పట్టించుకోలేదని టీజర్ లో చెప్పుకొచ్చారు. ఇలాగే చేస్తే కేరళ ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది అని ఒక జర్నలిస్ట్ చెప్పడాన్ని టీజర్ లో చూపించారు. అదే ఇప్పుడు రాజకీయ వివాదానికి పునాది వేసింది. అసలు ఇలాంటి ఘటన కేరళలో జరగలేదని రాజకీయ నేతలు అంటున్నారు. భావ స్వేచ్ఛ ఉంటే మాత్రం ఇలాంటి సినిమాలు తీయొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం పినరయి ఆగ్రహం ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళను తీవ్రవాదులకు హెల్ప్ చేసే రాష్ట్రంగా చూపిస్తున్నారు.. ప్రపంచం ముందు మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. విద్వేషాన్ని రగల్చడమే ధ్యేయంగా రూపొందిచిన ఈ చిత్రాన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తనికి ది కేరళ స్టోరీ ఎన్నో వివాదాలకు నెలవుగా మారింది. ఇంకోపక్క ఈ సినిమను తెరకెక్కించిన సుదీప్తో మాట్లాడుతూ.. ‘నేను ఈ కథ కోసం దాదాపు ఏడేళ్లు రీసెర్చ్ చేశాను.. కేరళ ప్రజలు నిరక్ష్యరాసులు అయితే కాదు. విద్య సహనాన్ని ఇస్తుంది.. టీజర్ కే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు.. సినిమా చూడండి .. చూశాకా మాట్లాడండి’ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ అదా సైతం.. ఈ కథ నిజమైంది అని, తాను కూడా ఆబాధిత యువతులతో మాట్లాడానని, సినిమా చూశాక అందరు కంటతడి పెడతారని చెప్పుకొచ్చింది . ఇన్ని వివాదాలు రేకెత్తించిన ఈ సినిమా మే 5 అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో..? ఎంతమంది రాజకీయ నాయకులకు చెమటలు పట్టిస్తుందో చూడాలి. -
విడుదలకు ముందే వివాదాలు.. ‘ది కేరళ స్టోరీ’కి సుప్రీంలో ఊరట
విడుదలకు ముందే వివాదాలను మూటగట్టుకుంది కేరళ స్టోరీ’ చిత్రం.. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై వివాదాలు చినికి చినికి గాలివానలా మారాయి. కేరళలోని అధికార ప్రభుత్వంతోపాలు పలు విపక్షాలు సైతం ఈ చిత్రంపై విమర్శల స్వరం వినిపిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ సైతం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ పంచాయితీ న్యాయస్థానం వరకు చేరింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ పిటిషన్లో ఆరోపించాయి. అయితే సుప్రీంకోర్టులో ది కేరళ స్టోరీకి భారీ ఊరట లభించింది. సినిమా రిలీజ్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చదవండి: The Kerala Story: నిరూపిస్తే కోటి రూపాయలు! సినిమా విడుదలకు ఇప్పటికే సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. కావాలంటే పిటిషనర్లు సినిమా సర్టిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చని సుప్రీం సూచించింది. జస్టిస్ కేఎమ్ జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, నిజాం పాషాల తమ వాదనలు వినిపించారు. అయితే ద్వేషపూరిత ప్రచారం వంటి కేసుతో సినిమాను కలపలేమని.. మూవీ విడుదలపై స్టే కోరడానికి ఇది సరైన కారణం కాదని తెలిపింది. ముందు హైకోర్టుకు వెళ్లండి ఇందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరంలేదని సర్టిఫికేషన్ బోర్డు లేదా హైకోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. అయితే హైకోర్టుకు వెళ్లే సమయం లేదని సినిమా శుక్రవారం విడుదలవుతుందని అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టినట్లు అడ్వకేట్ నిజాం పాషా చెప్పారు. పాషా వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంపై ముందుగా సంబంధిత హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిందని గుర్తుచేసింది. చిత్రం సర్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్ళిందని.. సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తే తప్ప, బెంచ్ ఏమీ చేయలేదని చెప్పింది. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా సినిమా నేపథ్యం ఇదీ సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్‌లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. -
The Kerala Story: నిరూపిస్తే కోటి రూపాయలు!
ది కేరళ స్టోరీ చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు మిన్నంటుతున్నాయి. మే 5వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా.. ఈలోపే దానిని బ్యాన్ చేయించే దిశగా రాజకీయంగానూ పావులు కదులుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు ఈ చిత్రాన్ని ప్రొపగాండా చిత్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో చిత్ర నిర్మాత విపుల్ మాత్రం ఆ నిరసలను స్వాగతిస్తూనే.. తాను వాస్తవాల్ని చూపించానని, అది అంతా అంగీకరించాలని అంటున్నాడు. ది కేరళ స్టోరీలో.. చూపించిన కథాంశం వాస్తవమని నిరూపించాలని ఆ చిత్ర దర్శకనిర్మాతలకు సవాల్ విసురుతున్నారు కొందరు. ఈ క్రమంలో భారీగా నజరానా సైతం ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో రెండో అతిపెద్ద భాగస్వామి పార్టీ ఐయూఎంఎల్ తరపున యువజన విభాగం ‘ది కేరళ స్టోరీ’పై నజరానా ప్రకటించింది. ఆ సినిమా స్టోరీ లైన్ నిజమని నిరూపిస్తే.. కోటి రూపాయలు ఇస్తామని ఐయూఎంఎల్ యూత్ విభాగం ముస్లిం యూత్ లీగ్ చీఫ్ పీకే ఫిరోజ్ ప్రకటించాడు. 👉 మరోవైపు.. నజీర్ హుస్సేన్ అనే బ్లాగర్ సైతం సినిమా కథ నిజంగా జరిగిందని నిరూపించాలని, అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే రూ.10 లక్షలు ఇస్తానంటున్నాడు. ఇక నటుడు కమ్ లాయర్ అయిన షుక్కుర్ సైతం.. మతం మార్చుకుని, ఐసిస్‌లో చేరిన మహిళల పేర్లతో కూడిన లిస్ట్ సమర్పించిన వాళ్లకు రూ.11 లక్షలు ఇస్తానని ఫేస్బుక్ ద్వారా ప్రకటించాడు. 👉 మరోవైపు అధికార, ప్రతిపక్షాలు కేరళలో ఈ చిత్రాన్ని నిషేధించాలని పట్టుబడుతున్నాయి. సంఘ్ పరివార్ ఈ చిత్రం వెనుక ఉందని ఆరోపిస్తున్నాయి. ‘‘వాళ్లు(సంఘ్‌పరివార్‌ను ఉద్దేశించి..) కేరళ నుంచి 32 వేల మందిని సిరియాకు తీసుకెళ్లారని, తమ దగ్గర లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు.. ప్రతీ పంచాయితీ నుంచి 30 మందిని తీసుకెళ్లారని అంటున్నారు. కానీ, వాళ్ల అడ్రస్‌లు అడిగితే మాత్రం వాళ్ల దగ్గరి నుంచి సమాధానం లేదు.. అని పీకే ఫిరోస్ ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశారు. 👉 ఒకవేళ చిత్రం గనుక ప్రదర్శించబడితే జనాలు స్వచ్ఛందంగా చిత్రాన్ని బహిష్కరించాలని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి షాజి చెరియన్ పిలుపు ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ది కేరళ స్టోరీ అనేది విద్వేషాన్ని రగల్చడమే ధ్యేయంగా రూపొందించినబడిన చిత్రమని మండిపడ్డారు. ఈ విద్వేష రాజకీయంతోనూ ఇక్కడి ఎన్నికలను సంఘ్ పరివార్ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారాయన. 👉 2018-19 నడుమ కేరళ నుంచి 32, 000 మంది హిందూ మహిళలు అదృశ్యమయ్యారని, వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేయడంతో మతం మార్చుకుని.. ఐసిస్‌లో, ఇతర ఉగ్ర సంస్థల్లో చేరారని, ఆపై భారత్‌లో.. విదేశాల్లో ఉగ్ర కుట్రలకు సాయం చేస్తున్నారన్నది ది కేరళ స్టోరీ కథాంశం. నలుగురు కాలేజీ యువతులపై ఈ కథ నడుస్తుంది. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధీ ఇద్నాని, సోనియా బలానీ ఇందులో లీడ్ రోల్లో నటించారు. సుడిప్టో సేన్ డైరెక్షన్లో.. విపుల్ అమృత్లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించాడు. సూర్యపాల్ సింగ్, విపుల్ అమృత్లాల్ షా ‘ ది కేరళ స్టోరీ’కి రచనా సహకారం అందించారు. విపుల్ స్పందన ఇదిలా ఉంటే.. రాజకీయపక్షాల నిరసనలను ఈ చిత్ర నిర్మాత, రచయిత విపుల్ అమృత్లాల్ షా స్వాగతించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని, అయితే వాస్తవాలు చేదుగా ఉన్నా సరే అంగీకరించి తీరాలని ఆయన అంటున్నాడు. కేరళకు చెందిన ఓ యువతి ఇస్లాంలోకి మారి, ఆపై సిరియాకు వెళ్లి.. చివరకు అఫ్గనిస్థాన్‌లో ప్రస్తుతం జైల్లో ఉందని, ఆమె నుంచి, ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారంతోనే తాము కథలో ముందుకు వెళ్లామని విపుల్ వివరించారు. పైగా.. 👉 ది కేరళ స్టోరీకి.. దాదాపు నెలన్నర పాటు కొనసాగిన ప్రక్రియ తర్వాత.. సెన్సార్‌బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్తున్నారాయన. రాజకీయ పార్టీలో లేదంటే ఒక నేతకు వ్యతిరేకంగా చిత్రం ఉంటే.. వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే అందులో అర్థం ఉంటుంది. కానీ, ఒక్కసారి సెన్సార్ క్లియరెన్స్ లభించాక.. దానిని ఎలా బ్యాన్ చేస్తారు?. షూట్అవుట్ ఎట్ లోఖాండ్వాలా చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంది. అలాగని ముంబై మొత్తం రౌడీలు ఉన్నట్లు అర్థమా? ఆ చిత్రం ముంబైకి వ్యతిరేకమా?.. దావూద్ కథను తీయాలంటే ముంబై నుంచే తీయాలి. ఎందుకంటే అతను అక్కడి నుంచే తన అరాచకాలను కొనసాగించాడు. అలాగని అది ముంబైకి వ్యతిరేకం అవుతుందా?. కేరళను భూలోక స్వర్గం అంటారు. అలాంటి అందమైన ప్రాంతంలో తప్పులు జరిగాయి. వాటి వెనుక ఎవరునా.. శిక్షించబడాలనే నేను కోరుకుంటా. ఎందుకంటే కేరళను నేనూ అభిమానిస్తాను కాబట్టి. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా తీసిన చిత్రం కాదు.. కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిందే. ఈ చిత్రం తెరకెక్కడం వెనుక ఎవరి ప్రొద్భలం లేదు. నా సొంత ప్రాంతమైనా సరే అక్కడ జరిగే అరాచకాలను కళ్లు మూసుకుని ఉండిపోలేను. అదే తరహాలో కేరళలో జరిగిన ఈ వాస్తవాన్ని తెర మీదకు తీసుకొచ్చా అని చెప్తున్నారాయన. ఇదీ చదవండి: మోదీ ‘అసమర్థుడైన కొడుకు’