వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలకు ముందే వివాదాలు చుట్టిముట్టినప్పటికీ అవేవీ సినిమాను ప్రభావితం చేయలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లోనే రూ. 112.87 కోట్లు రాబట్టి 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
కాగా తాజాగా ది కేరళ స్టోరి డైరెక్టర్ సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదా శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్‌లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా... ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు.
ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి.
చదవండి: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment