The Kerala Story Director Sudipto Sen Ready To Make One More Film - Sakshi
Sakshi News home page

Sudipto Sen: 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్ కొత్త సినిమా.. ఈ సారి ఏకంగా!

Published Mon, Jun 26 2023 6:57 PM | Last Updated on Mon, Jun 26 2023 7:23 PM

The Kerala Story Director Sudipto Sen Ready To Make One More Film - Sakshi

ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. మే 5న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. కేరళలో బాలికలను అక్రమంగా సౌదీకి తరలించడం, మత మార్పిడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వివాదస్పదం కావడంతో కొన్ని రాష్ట్రాలు నిషేధ విధించాయి.
(ఇది చదవండి: చవక రేటుకే ఆదిపురుష్‌ త్రీడీ టికెట్లు.. సెటైర్లు వేస్తున్న నెటిజన్స్‌)

ఈ నేపథ్యంలోనే మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు సుదీప్తో సేన్. ది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన ఆయన.. బస్తర్ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ది కేరళ స్టోరీ నిర్మించిన విపుల్ అమృత్‌ లాల్‌ షానే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్‌ అటాక్‌లో పెద్దసంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. వారితో పాటు 8 మంది సామాన్యులు కూడా మృతి చెందారు. ఈ  నేపథ్యంలోనే అటాక్‌పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సుదీప్తో సేన్‌ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement