Adha sharma
-
ఆస్పత్రిలో చేరిన ది కేరళ స్టోరీ నటి.. కారణమిదే !
ఇటీవలే ది కేరళ స్టోరీ మూవీతో సూపర్ కొట్టిన హీరోయిన్ అదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా అదా శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ, డయేరియాతో ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా... ఆగస్టు 1న ఆదా శర్మ తన రాబోయే షో 'కమాండో' ప్రమోషన్‌కు ముందు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయిదని ఆమె సన్నిహితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం నటించిన కమాండో అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె భావనా రెడ్డి పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్‌లో నటి అదాతో పాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' సక్సెస్ తర్వాత ఆదాశర్మ నటించిన వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు విపుల్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!) -
మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. మే 5న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. కేరళలో బాలికలను అక్రమంగా సౌదీకి తరలించడం, మత మార్పిడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వివాదస్పదం కావడంతో కొన్ని రాష్ట్రాలు నిషేధ విధించాయి. (ఇది చదవండి: చవక రేటుకే ఆదిపురుష్ త్రీడీ టికెట్లు.. సెటైర్లు వేస్తున్న నెటిజన్స్) ఈ నేపథ్యంలోనే మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు సుదీప్తో సేన్. ది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన ఆయన.. బస్తర్ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ది కేరళ స్టోరీ నిర్మించిన విపుల్ అమృత్ లాల్ షానే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో పెద్దసంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. వారితో పాటు 8 మంది సామాన్యులు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అటాక్‌పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) April 6, 2010. 76 CRPF jawan and 8 poor villagers were killed in an bloodiest attack by the terrorists, in Chintalner village of Dantewada District of Bastar, Chhattisgarh. After exactly 14-years, the poetic justice will be delivered.#Bastar ... Our humble presentation after… pic.twitter.com/qXZlOJsprp — Sudipto SEN (@sudiptoSENtlm) June 26, 2023 -
సొంత గొంతు
పరభాషా హీరోయిన్లకు ఎక్కువ శాతం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు తమ పాత్రలకు తమ గొంతునే వినిపించాలనుకుంటున్నారు. భాష నేర్చుకొని ఆ పాత్రకు మరింత న్యాయం చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ పాత్ర చేసిన హీరోయిన్లు డబ్ చేస్తేనే బావుంటుందని దర్శకులు భావిస్తే హీరోయిన్లు కూడా రెడీ అంటారు. తాజాగా అదా శర్మ తన గొంతును వినిపించడానికి రెడీ అయ్యారు. ‘?’(క్వొశ్చన్ మార్క్) అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారామె. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు అదా. ఈ చిత్రానికి ఆమె డబ్బింగ్ చెప్పాలనుకోవడం, దర్శక–నిర్మాతలు విప్రా, గౌరీకృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. ‘‘తెలుగు డైలాగులన్నింటినీ అదా హిందీలో రాసుకున్నారు. బాగా ప్రాక్టీస్ చేసి, చెప్పారు. రెండే రెండు రోజుల్లో డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆమె కమిట్మెంట్కి ఆశ్చర్యం అనిపించింది. అదా డబ్బింగ్ ఓ హైలైట్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
క్వశ్చన్ మార్క్ (?): రామసక్కనోడివిరో...
అదా శర్మ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’ విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించారు. విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంలోని ‘రామసక్కనోడివిరో..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను రఘు కుంచె స్వరపరచగా బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చారు. మంగ్లీ ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ పాట క్రెడిట్ అంతా రఘు కుంచెగారికి వెళ్తుంది. ఆయన ఈ సినిమాకి నేపథ్య సంగీతం కూడా బాగా ఇచ్చారు. అదా శర్మగారు ఎంత మంచి డ్యాన్సరో ఈ సినిమాతో తెలుస్తుంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో సినిమా చేయడమనేది ఎంతో రిస్క్. మా నిర్మాత సహకారం వల్లే చేయగలిగాం. మా టీమ్ కూడా ఎంతో సహకరించారు’’ అన్నారు విప్రా. ‘‘నిజానికి ‘రామసక్కనోడివిరో..’ పాట పెట్టాలనుకోలేదు. షూటింగ్ పూర్తయ్యాక అనుకొని చేశాం’’ అన్నారు రఘు కుంచె. ‘‘ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. నా గత చిత్రాల్లోలానే ఈ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. కరోనా టైమ్‌లో స్టార్ట్ చేసి కరోనా టైమ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న మొదటి సినిమా మాది’’ అన్నారు అదా శర్మ. సంజయ్, అభయ్, భానుశ్రీ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్. -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి. -
ప్రాజెక్ట్ లాక్
లాక్ డౌన్ లో కొత్త ప్రాజెక్ట్ లను లాక్ చేస్తున్నారు స్టార్స్. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించినట్టు ప్రకటించారు అదా శర్మ. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గించారు అదా. 2016లో ‘క్షణం’, గత ఏడాది ‘కల్కి’ తర్వాత అదా చేయబోతున్న తెలుగు సినిమా ఇదే. తెలుగులో వరుస సినిమాలు చేయకపోయినా హిందీ సినిమాల్లో కనిపిస్తున్నారు. ‘బై పాస్ రోడ్, కమాండో 3’ వంటి హిందీ సినిమాల్లో గత ఏడాది కనిపించారు అదా. అలాగే రెండు వెబ్ సిరీస్ ల్లోనూ నటించారామె. తెలుగులో అంగీకరించిన తాజా చిత్రం గురించి అదా మాట్లాడుతూ – ‘కొత్త సినిమా సైన్ చేశాను. చాలా ఎగ్జయిటింగ్ ఉంది. ఇందులో మంచి పాత్రను పోషిస్తున్నాను’’ అన్నారు అదా శర్మ. -
తారలు ఇంటికే పరిమితం
బంజారాహిల్స్: కరోనా.. కరోనా.. ఎటుచూసినా వైరస్ గురించే..జనం బయటకు అడుగుపెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు.. ఇక సిటీలో అనధికారికంగా బంద్ కొనసాగుతుండటతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. దీనికి సినీతారలేం అతీతం కాదు.. షూటింగ్‌లు బంద్ కావడంతోపాటు ఇతర కార్యకలాపాలన్నీ రద్దుచేసుకొని ఇళ్లల్లోనే ఉంటున్నారు. తమకిష్టమైన పనులు చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటున్నారు. రెండు వారాలు సమయం దొరకడంతో సరదాగా గడుపుతున్నారు. ఫిదా హీరో వరుణ్ తేజ్ తనకు ఇష్టమైన బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. తాను ఇంట్లోనే గడుపుతున్నానని ట్వీట్ చేశాడు. ఇక గత రెండు సంవత్సరాల నుంచి క్షణం తీరిక లేకుండా అగ్రహీరోలతో నటిస్తున్న రష్మిక షూటింగ్‌లు నిలిపివేయడంతో ఇంటికే పరిమితమయ్యారు. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఇలా తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబాలతో గడుపుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా సినిమా తారలు ఎక్కువరోజులు ఇండ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. బయటకు వెళ్లి వ్యాధులను కొని తెచ్చుకోవడంకంటే ఇంట్లోనే కుటుంబంతో గడిపితే మేలని చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. పార్టీలకు దూరమయ్యారు. పబ్‌లు, క్లబ్‌లతో పాటు రిసార్ట్‌లలో పార్టీలు కూడా బంద్ కావడంతో నటీ నటులంతా సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబాలతో గడుపుతున్నారు. ఫిలింనగర్ షూటింగ్‌లు లేక కళ తప్పింది. తారలు బయటకు రాకపోవడంతో స్టూడియోలు, షూటింగ్‌ల స్పాట్లు వెలవెల పోతున్నాయి. నిత్యం షూటింగ్‌లతో కళకళలాడే రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు బోసిపోయాయి. -
సత్తా చూపిస్తా
కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశారు హీరోయిన్ అదా శర్మ. తాజాగా ‘కమాండో 3’ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారామె. దాని గురించి అదా మాట్లాడుతూ– ‘‘కమాండో 3’లో పోలీసాఫీసర్ భావనా రెడ్డి పాత్రలో నటించాను. నా పాత్రలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. కేరళలో కళరియపట్టు, తమిళనాడులో సిలంబం వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత సంపాదించాను. నాన్చాక్ కూడా సాధన చేశా. నా కో–స్టార్ విద్యుత్ జమాల్ ఈ విషయంలో నాకు కొంతమేర సహాయం చేశారు. కానీ, నా శిక్షణ మొత్తాన్ని మా అమ్మగారు దగ్గరుండి చూసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌తో భావన సత్తా ఏంటో వెండితెరపై చూపిస్తా’’ అని పేర్కొన్నారు. విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
వరుడు వేటలో ఉన్నా!
పెళ్లి కొడుకు వేటలో ఉన్నానంటోంది నటి ఆదాశర్మ. తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో కనిపించింది. ముఖ్యంగా సంచలన జంట శింబు, నయనతార జంటగా నటించిన ఇదు నమ్మఆళు చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైంది. అందాలారబోతకు హద్దులు చెప్పని ఈ బ్యూటీని ఏ భాషలోనూ స్టార్డంను అందుకోలేకపోయింది. అయినా తరచూ ఫొటో సెషన్స్ నిర్వహించుకుంటూ ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అలాంటి ఆదాశర్మ దృష్టి పెళ్లిపైకి మళ్లిందట. అందుకే నేను పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లి కొడుకు వేటలో ఉన్నాను అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఆ వచ్చేవాడికి ఈ జాణ పెట్టే కండిషన్లే కాస్త విచిత్రంగా ఉన్నాయి. అవేంటో కూడా ఆదాశర్మ బయట పెట్టేసింది. ముఖ్యంగా ఉల్లిపాయలు తినకూడదు. ఇంటిలో జీన్స్ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు గానీ, బయటకు వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఇక అసలు విషయం ఏమిటంటే నిత్యం ముప్పూటలా చిరునవ్వు ముఖం మీద చెరగకుండా వంట చేయాలి. మద్యం, మాంసాహారాలు నిషిద్ధం. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి వంటి నిబంధనలు పాఠించాలని పేర్కొంది. అంతేనా అంటే జాతి, మతం, రంగు, జాతకం, షూ సైజ్, వీసా, ఈతలో ప్రతిభ, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ వంటి వాటి గురించి నాకేమీ అభ్యంతరాలు ఉండవు అని చెప్పింది. ఇదంతా సరే. ఈ లక్షణాలన్నీ కలిగిన పెళ్లి కొడుకు ఈ రోజుల్లో ఆదాశర్మకు దొరుకుతాడా అన్నదే ప్రశ్న. ఏదేమైనా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలని ముందుగానే బయట పెట్టేసింది. ఆమె నిబంధనలు నచ్చితే ఎవరైనా భర్త పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. -
పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్
ఆదాశర్మ పెళ్లికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. తనకో పెళ్లి కొడుకు కావాలంటూ పెళ్లి కూతురు గెటప్‌లో తయారై ఉన్న ఫోటోను షేర్ చేశారు. కాకపోతే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే వాడు ఎలా ఉండాలనే విషయంలో కొన్ని షరతులను విధించింది. 'అతను ఉల్లిపాయలు తినకూడదు. కులం, రంగు, మతం, కండలు తిరిగిన దేహం, స్విమ్మింగ్, వీసా, జాతకం లాంటి విషయాలు పట్టించుకోను. కాకపోతే అతను మూడు పూటలా నవ్వుతూ వండిపెట్టాలి. ఇంట్లో జీన్స్ ధరించినా పర్లేదు కానీ బయటకు వెళ్లేటప్పుడు మాత్రం భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. నేనే స్వయంగా రోజుకు 5లీటర్ల మంచినీరు అందిస్తా.. కానీ ఇంటా బయట మద్యం, మాంసాహారం ముట్టుకోవద్దు. క్రమం తప్పకుండా షేవ్ చేసుకోవాలి. అలాగే అతనికి భారతదేశంలోని అన్ని భాషా చిత్రాల మీద గౌరవం కలిగి ఉండాలి' అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆదాశర్మ చేసిన ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆదా ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో, ఆమె పెట్టిన షరతులను చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆదాశర్మ ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆదా కమాండో 3, బైపాస్ రోడ్, మ్యాన్ టు మ్యాన్ హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. WANTED : Groom who does'nt eat onions.Caste, colour, religion, shoe size, visa, swimming abilities, bicep size, instagram followers, horoscope no bar He should be willing to cook 3 times a day with a smiling face and shave regularly. Cont'd... pic.twitter.com/rqYh1dzFGv — Adah Sharma (@adah_sharma) September 21, 2019 -
హాలిడే కానీ వర్క్ డే!
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్గా ప్రూవ్ చేసుకున్న అదా శర్మ ఇప్పుడు డిజిటల్ రంగంవైపు కూడా దృష్టి పెట్టారు. ‘హాలిడే’ అనే వెబ్ సిరీస్ చేయడానికి ఆమె అంగీకరించారు. ‘‘హాలిడే వెబ్ సిరీస్ కోసం మారిషస్ వచ్చాం. కొత్త హెయిర్ కలర్ డిజైన్ ట్రై చేశాను. ఏ హీరోయిన్ అయినా నా హెయిర్‌స్టైల్‌తో ఇన్స్పైర్ అయినట్లయితే.. వారు నాకు కాపీరైట్ చార్జెస్ పే చేయాలి (సరదాగా)’’ అని పేర్కొన్నారు అదా శర్మ. మారిషస్‌లో కొన్ని రోజుల పాటు ఈ చిత్రీకరణ జరుగుతుంది. అదా వెబ్‌సిరీస్‌లో నటించడం ఇదే తొలిసారి. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాలో అదా శర్మ ఒక హీరోయిన్గా నటించారు. అటు హిందీలో ‘బైపాస్ రోడ్, కమాండో 3’ సినిమాలు చేస్తున్నారు. -
తను చాలా నచ్చింది!
‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’... ప్రభుదేవాని అభిమానులు ముద్దుగా ఇలానే పిలుచుకుంటారు. తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు హీరోల చేత కూడా తనదైన శైలిలో స్టెప్పులేయించి, ప్రేక్షకులు, అభిమానుల చేత ఈలకొట్టించి గోల చేయించగలరు. ప్రభుదేవా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్‌గా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులే. తాజాగా పాటల రచయితగా మరో అవతారం ఎత్తారాయన. ప్రభుదేవా, నిక్కీగల్రానీ, అదా శర్మ ముఖ్య తారలుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. 2002లో విడుదలై ఘన విజయం సాధించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రానికి ఇది రీమేక్. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ‘ఇవళ ఇవళ రొంబ పిడిచిరుక్కు...’ (తను తను చాలా నచ్చింది) అనే పాటను ప్రభుదేవా రాశారు. ఈ పాటకి అమ్రిష్ చక్కని స్వరాలు అందించారు. హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రభుదేవా రాసిన తొలి పాట వినేస్తే పోలా! -
‘కల్కి’కి జోడిగా అదా, స్కార్లెట్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు గ్యాప్ తీసుకున్నాడు. అ! సినిమాతో దర్శకుడు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు రాజశేఖర్. కల్కి పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో రాజశేఖర్‌కు జోడిగా ఇద్దరు అందాల భామలు కనిపించనున్నారట. తెలుగు హార్ట్ ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ తో పాటు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న స్కార్లెట్ విల్సన్ లు హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ సినిమాతో రాజశేఖర్ తన ఫాంను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. -
అభిమానులను ఫిదా చేస్తోన్న అదా
ముంబై పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ‘కికి చాలెంజ్’ తీసుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా వీరి కోవలోకి ‘క్షణం’ హీరోయిన్ చేరారు. అదా శర్మ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ ఎక్కువగా జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోలను, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా అదా ‘కికి చాలెంజ్’లో భాగంగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్‌మీడియాలో పోస్టు చేసిన ఒక్క రోజులోనే ఏడు లక్షల వ్యూస్ సంపాదించింది. ‘కికి చాలెంజ్’లో భాగంగా అదా ‘ఇన్ మై ఫీలింగ్స్’కు తన స్టైల్లో డ్యాన్స్ చేసి ట్విటర్లో షేర్ చేశారు. ఈ హాలీవుడ్ సాంగ్‌కు అదా దేవకన్యలా ముస్తాబై, కథక్, భరత నాట్యం, వెస్ట్రన్ రీతులు కలిపి చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను అదా తన ట్విటర్లో పోస్టు చేసిన 24 గంటల్లోనే 7 లక్షల మందికిపైగా వీక్షించారు. దాదాపు 3 వేల మంది కామెంట్లు చేశారు. ‘అద్భుతంగా చేశావ్, క్యూట్’, ‘నీ హావభావాలు అద్భుతంగా ఉన్నాయి’, ‘ఈ పాటకు నువ్వు ఇలాంటి దుస్తుల్లో డ్యాన్స్ చేయడం గొప్ప విషయం, అత్యుత్తమమైన డ్యాన్స్..’ అంటూ కామెంట్ చేశారు. హలీవుడ్ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్’ను కూడా జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి లేదా వాహనంలోనే ఉండి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా.. కదులుతున్న వాహహంతోపాటే డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అయితే కింద పడకూడదు, మధ్యలో ఆగకూడదు. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. కానీ అదా శర్మ మాత్రం తన ‘కికి చాలెంజ్’ను కదులుతున్న వాహనంలో కాక, కారును ఆపి పక్కన డ్యాన్స్ చేశారు. -
అదా శర్మ ‘కికి చాలెంజ్’
-
బాలీవుడ్‌లోనూ 'క్షణం'
అడవి శేష్ హీరోగా గత శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించిన సినిమా క్షణం. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా ద్వారా రవికాంత్ పేరుపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అదాశర్మ, అనసూయ భరద్వాజ్‌లు ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్న క్షణం నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. పీవీపీ సంస్థ మాత్రం తామే స్వయంగా బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావిస్తుంది. మరోసారి రవికాంత్ దర్శకత్వంలో, అడవి శేష్ హీరోగా క్షణం సినిమాను బాలీవుడ్ రూపొందించే ఆలోచనలో ఉంది పీవీపీ సంస్థ. -
సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా అలరించిన సాయి కుమార్, ఇప్పుడు తన కుమారుడి కోసం కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న తనయుడు ఆదిని ప్రమోట్ చేయటం కోసం నిర్మాతగా మారాడు ఈ సీనియర్ నటుడు. ప్రస్తుతం ఆది హీరోగా 'గరం' సినిమాను నిర్మిస్తున్నాడు సాయికుమార్. ఈ సినిమాకు నిర్మాతగా సాయికుమార్ భార్య సురేఖ వ్యవహరిస్తున్నారు. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆది కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయికుమార్. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా బడా డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నటుడిగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్, నిర్మాతగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.