
అదా శర్మ
అదా శర్మ లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’ విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించారు. విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంలోని ‘రామసక్కనోడివిరో..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను రఘు కుంచె స్వరపరచగా బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చారు. మంగ్లీ ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ పాట క్రెడిట్ అంతా రఘు కుంచెగారికి వెళ్తుంది. ఆయన ఈ సినిమాకి నేపథ్య సంగీతం కూడా బాగా ఇచ్చారు. అదా శర్మగారు ఎంత మంచి డ్యాన్సరో ఈ సినిమాతో తెలుస్తుంది.
త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో సినిమా చేయడమనేది ఎంతో రిస్క్. మా నిర్మాత సహకారం వల్లే చేయగలిగాం. మా టీమ్ కూడా ఎంతో సహకరించారు’’ అన్నారు విప్రా. ‘‘నిజానికి ‘రామసక్కనోడివిరో..’ పాట పెట్టాలనుకోలేదు. షూటింగ్ పూర్తయ్యాక అనుకొని చేశాం’’ అన్నారు రఘు కుంచె. ‘‘ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తోంది. నా గత చిత్రాల్లోలానే ఈ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. కరోనా టైమ్‌లో స్టార్ట్ చేసి కరోనా టైమ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న మొదటి సినిమా మాది’’ అన్నారు అదా శర్మ. సంజయ్, అభయ్, భానుశ్రీ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్.
Comments
Please login to add a commentAdd a comment