ఇటీవలే ది కేరళ స్టోరీ మూవీతో సూపర్ కొట్టిన హీరోయిన్ అదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా అదా శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ, డయేరియాతో ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా... ఆగస్టు 1న ఆదా శర్మ తన రాబోయే షో 'కమాండో' ప్రమోషన్‌కు ముందు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
(ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు)
అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయిదని ఆమె సన్నిహితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం నటించిన కమాండో అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె భావనా రెడ్డి పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్‌లో నటి అదాతో పాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' సక్సెస్ తర్వాత ఆదాశర్మ నటించిన వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు విపుల్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
(ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!)
Comments
Please login to add a commentAdd a comment