diarrhoea
-
ప్రాణం తీసిన ఫుడ్‌పాయిజన్
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్‌కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. యువతి మృతి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్‌కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్‌కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్‌రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్‌కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు. 25 మందికిపైగా.. గ్రిల్–9 హోటల్లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్‌కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్‌తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది. హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్లో వివరణ కోరగా, తాము సదరు హోటల్‌కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
గుర్లలో వైఎస్ జగన్ పరామర్శ అప్డేట్స్.. 👉గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 👉గుర్ల చేరుకున్న వైఎస్ జగన్👉రాష్ట్రంలో సెప్టెంబర్‌లోనే డయేరియా ప్రమాద ఘంటికలు మోగించించింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, వ్యాధి బారినపడి 14 మంది చనిపోయారు. 👉ఈ సందర్బంగా వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైఎస్ జగన్ కోసం వచ్చారు. 👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.👉వైఎస్ జగన్ విజయనగరం బయలుదేరారుు. మరికాసేపట్లో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.👉కాగా, కొద్దిరోజులుగా గుర్లలో డయేరియా కారణంగా పదుల సంఖ్యలో మరణాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. -
ఆస్పత్రిలో చేరిన ది కేరళ స్టోరీ నటి.. కారణమిదే !
ఇటీవలే ది కేరళ స్టోరీ మూవీతో సూపర్ కొట్టిన హీరోయిన్ అదా శర్మ. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అయితే తాజాగా అదా శర్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ, డయేరియాతో ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా... ఆగస్టు 1న ఆదా శర్మ తన రాబోయే షో 'కమాండో' ప్రమోషన్‌కు ముందు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయిదని ఆమె సన్నిహితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం నటించిన కమాండో అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె భావనా రెడ్డి పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్‌లో నటి అదాతో పాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' సక్సెస్ తర్వాత ఆదాశర్మ నటించిన వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు విపుల్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!) -
షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!
వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు. లక్షణాలు: విరేచనాల్లో బంక (మ్యూకస్), నెత్తురు కనిపించడం. కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్ క్రాంప్స్), కడుపు నొప్పి జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్‌హీట్ వరకు ఉండవచ్చు) వికారం, కొన్నిసార్లు వాంతులు. వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో : షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల. వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు. ఇది పిల్లల డే కేర్ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ద్వారా... అలాగే హైజీన్ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్‌లు, క్యాంపస్‌లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు. కొన్నిసార్లు కాంప్లికేషన్లు... డీ–హైడ్రేషన్‌తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్‌కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్); తేలిగ్గా అనిపించడం (లైట్ హెడెడ్నెస్); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. మూర్ఛ (సీజర్స్) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్ ప్రొలాప్స్) : జిగురుతో కూడిన మ్యూకస్ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. హీమోలైటిక్ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్ అనీమియా), ప్లేట్లెట్స్ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు. టాక్సిక్ మెగాకోలన్: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్ మూవ్మెంట్) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్‌గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది. బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్తో పేగుల లోపలి లైనింగ్ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ కేర్‌ఫుల్ డిస్పోజల్ ఆఫ్ డయపర్స్ : చిన్న పిల్లల డయపర్స్ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్ సోర్స్)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి. అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్ నుంచి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్ టాయెలెట్ హ్యాబిట్స్: పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి. స్ల్స్కూ, పిల్లల కేర్ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు. --డాక్టర్ శివనారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
Odisha: జలమే గరళం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
రాయగడ(ఒడిశా): జిల్లాలోని కాసీపూర్‌లో అతిసార వ్యాధికి కారణం అక్కడి ప్రజలు కలుషితమైన నీటిని తాగడమేనని వైద్యులు ధ్రువీకరించారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు మృతి చెందడంతో పాటు వంద మందికి పైగా వ్యాధిబారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో టికిరి, కాసీపూర్‌లో పర్యటించిన వైద్య బృందం అక్కడ తాగునీటి కోసం వినియోగించే బావుల్లో నీటి నమూనాలను సేకరించారు. ఈ నీటి నమూనాలకు అన్ని పరీక్షలను నిర్వహించి, అతిసార వ్యాధికి కారణం ఆ నీరేనని నిర్ధారించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లాల్మోహన్ రౌత్రాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. చదవండి: వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ మరొకరు మృతి శనివారం నాటికి అతిసార వ్యాధితో ఆరుగురు మృతి చెందగా అదేరోజు అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన టికిరి పంచాయతీ పంచాలి గ్రామానికి చెందిన గొదాధర్ గొరడ (53) అనే వ్యక్తి ప్రాణాలను విడిచాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నా టికిరి, కాసీపూర్ ప్రాథమిక ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 60 మందికి పైగా రోగులు చికిత్స పొందుతుండగా, రాయగడ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటన రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి టికిరి గ్రామంలోని జొడియా వీధిలో ఆదివారం పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. సమీపంలోని తాగునీటి బావిని పరిశీలించారు. కలుషితమైన నీటిని తాగడం వల్లే అతిసార వ్యాపించినట్లు పేర్కొన్నారు. తక్షణమే తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని, దీంతో పాటు జొడియా వీధిలో సోలార్ విద్యుత్‌తో నడిచే మోటారు మరమ్మతులు చేయించాలని రూరల్ వాటర్, సప్లయ్ అండ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా మరో గొట్టపు బావిని ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం టికిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మజ్జి ఉన్నారు. దుడుకాబహాల్‌లో డయేరియా టికిరి, కాసీపూర్ ప్రాంతాలతో పాటు దుడుకాబహాల్‌లో డయేరియా విజృంభిస్తుండడంతో ఉషాపాడు ఆస్పత్రిలో గత వారం రోజుల్లో 122 మంది చేరారు. వీరిలో 48 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తూ, మిగతావారిని ఇళ్లకు పంపించినట్లు అధికారులు తెలియజేశారు. ఆస్పత్రిలో రోగుల పరిస్థితులను కలెక్టర్ సింగ్ స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. బావుల మరమ్మతులు కాసీపూర్, టికిరి ప్రాంతాల్లో అతిసార వ్యాపించడానికి కారణం కలుషితమైన నీటిని తాగడమేనని నిర్ధారణకు వచ్చిన జిల్లా యంత్రాంగం అయా ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు అదేశించారు. దీంతో ఆ శాఖకు చెందిన సిబ్బంది టికిరి, కాసీపూర్, దుడకాబహాల్ తదితర ప్రభావిత గ్రామాలకు చేరుకుని బావుల మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు. -
అక్టోబరు 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే : కరోనాకు చెక్ పెడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసంఅంతా కాదు. లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈ కరోనా మన దరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఒక్కటే మార్గం. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడంతోపాటు ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా కష్టకాలంలో పెద్ద నగరాలు, మారు మూల పల్లెల దాకా పెద్దలతో పాటు చిన్నారుల కూడా దీనిపై అవగాహన పెంచాలంటున్నారు నిపుణులు. ఫలితంగా అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అక్టోబరు 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 2021 థీమ్ : 2008 లో తొలిసారిగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరిగింది. ప్రతీ సంవత్సరం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ "మన భవిష్యత్తు మన చేతుల్లో- కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’. జాతీయ ఆరోగ్య మిషన్ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు. హ్యాండ్ వాష్ చేయడం వల్ల డయేరియా మరణాల రేటును 40 శాతానికి పైగా తగ్గించవచ్చు: యునిసెఫ్ -
ఆదిలాబాద్‌లో ప్రబలిన డయేరియా.. 50 మందికి అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా ప్రబలతోంది. సిరికొండ మండలం తుమ్మల్ పాడ్ గ్రామంలో డయేరియా ఛాయలు కనడబడుతున్నాయి. చాలా మంది డయేరియా బారిన పడుతున్నారు. ఇప్పటకే 50 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలవుతున్నాయి. వాంతులు, విరేచనాలతో నీరసంగా మారి గ్రామంలో చాలామంది మంచాన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.. -
మరో నాలుగు డయేరియా కేసులు
కారంపూడి మండలం మిరియాల గ్రామంలో గురువారం మరో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. దారెడ్డి కరుణాకరరెడ్డి అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. ఇప్పటి వరకు గ్రామంలో 57 మందికి డయేరియా సోకింది. మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో గురువారం మరో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. వీరికి డాక్టర్లు ఆంజనేయులు నాయక్, లక్ష్మీశ్రావణి వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వ్యాధి సోకిన వారిలో దారెడ్డి కరుణాకరరెడ్డి అనే బాలుని పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు గ్రామంలో మొత్తం 57 మందికి డయేరియా సోకింది. వ్యాధి వచ్చిన వారిలో 30 మందికి పూర్తిగా తగ్గిపోయిందని, మిగిలిన వారి ఆరోగ్యం కూడా మెరుగవుతోందని, కొత్త కేసులు నమోదు కాకుంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వైద్యులు తెలిపారు. డీఎల్పీవో కృష్ణమోహన్ గురువారం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న వైద్య శిబిరంలో సీహెచ్‌వో వి.రామాంజనేయులు, సూపర్ వైజర్ పట్టాభి, కారంపూడి పీహెచ్సీ సిబ్బంది దానమ్మ, రమణ, హెచ్వీ సరిత తదితరులు సేలందిస్తున్నారు. ఆర్డీవో, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది ఒక బాలుని పరిస్థితి విషమంగా ఉంటే అంబులెన్స్‌లో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారని, మిగిలిన వారు కోలుకుంటున్నారని తహసీల్దార్ సాయిప్రసాద్ తెలిపారు. డ్రైనేజిలో మురుగు పూడిక తీత పనులు పూర్తయ్యాయని, వాటిలో బ్లీచింగ్ చల్లుతున్నారని చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారని, ట్యాంకుల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని తెలిపారు. -
చేతులు కాలాయి.. ఆకులు పట్టుకున్నారు!
ముండ్లమూరు: అధికారుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంలా ఉంది. మండలంలోని పులిపాడులో గ్రామస్తులు డయేరియాతో బాధపడుతూ ఒకరు మృతి చెందగా మరికొంత మంది మంచంపట్టిన విషయం తెలిసిందే. పత్రికల్లో కథనాలు వచ్చిన అనంతరం అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. 16 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. నలుగురు చిన్నారులు బాగా నీరసంగా ఉండటంతో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యశిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఎ రాజ్యలక్ష్మి సిబ్బందితో పరిస్థితులపై ఆరా తీశారు. పూర్తిగా తగ్గేంత వరకూ మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారి కమలను ఆమె ఆదేశించారు. గ్రామంలో అధ్వానంగా పారిశుద్ధ్యం ఉన్నా పట్టించుకోని అధికారులు.. ప్రజలు ఇబ్బందులు పడ్డాక కళ్లు తెరిచి చర్యలు ప్రారంభించారు. ప్రధాన వీధుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ చల్లించారు. తాగునీటి వనరులు అధ్వానంగా ఉన్నా అధికారులు ఎన్నడూ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధ్యతగా పని చేయాలి మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం విడనాడి బాధ్యతగా పనిచేయాలని కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున ఆదేశించారు. మండలంలోని పులిపాడును ఆయన సోమవారం సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం గ్రామంలోని తాగునీటి వనరులు, ప్రధాన వీధులను పరిశీలించారు. ఎన్ఏపీ నీటి ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన నీటి వాల్వ్‌లో మురుగు పేరుకు పోయి ఉండటంతో ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రధాన వీధులన్నీ మురుగు, చెత్తతో పేరుకుపోయి ఉండడంతో పంచాయతీకి కేటాయించిన నిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులు గ్రామాలను సందర్శించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అధైర్యపడొద్దని, గ్రామంలో పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తారని ఆర్డీఓ భరోసా ఇచ్చారు. డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో బాధితుల పరిస్థితి అదుపులో ఉందన్నారు. 23 మంది అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. వారిలో నలుగురి కోలుకున్నారన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నలుగురు చిన్నారులను సమీపంలోని దర్శి వైద్యశాలకు తరలించినట్లు వివరించారు. ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని నీటి వనరుల నుంచి శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపామని వివరించారు. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పాటు దర్శి నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.రవి, తహసీల్దార్ గంగాధరరావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, వైద్యాధికారి కమల, ఏఈ హనుమాన్‌బాబు, కార్యదర్శి రమేష్ ఉన్నారు. మెరుగైన సేవలు అందించాలి: మంత్రి పులిపాడులో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పరిస్థితికి కారణాలను స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. బాధితులందరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. పూర్తిగా తగ్గేంత వరకు వైద్య శిబిరం నిర్వహించాలని డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మిని ఆదేశించారు. ఆమె స్పందిస్తూ ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. కొత్తగా ఎవరూ అస్వస్థతకు గురికాలేదని తెలిపారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో శిబిరం కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పంచాయితీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక అందజేయాలన్నారు. తక్షణమే పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రితో పాటు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవి, తహసీల్దార్ గంగాధర్‌రావు, ఈఓఆర్డీ చూడామణి, వైద్యాధికారులు కమల, వెంకట్రావు ఉన్నారు. -
దడ పుట్టిస్తున్న డయేరియా
* రోజురోజుకు పెరిగిపోతున్న బాధితులు * కలుషిత నీరు, ఆహారం తీసుకోవడమే కారణం * ఇప్పటివరకు 486మందికి వైద్యం * అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు గుంటూరు మెడికల్ : పుష్కరాల్లో డయేరియా దడపుట్టిస్తోంది. ప్రారంభ రోజు నుంచి డయేరియా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలిరోజు 52 మంది, 13వతేదీ 104 మంది, 14వ తేదీ 113 మంది, 15వ తేదీ 97 మంది, 16వ తేదీ మంగళవారం 120 మంది డయేరియాతో బాధపడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరాల్లో చికిత్స పొందారు. కలుషితమైన మంచినీరు తాగటం, శుభ్రంగా లేని ఆహారం భుజించటం వల్లే డయేరియా కేసులు నమోదవుతున్నాయి. డయేరియా సోకినప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు. పిల్లల విషయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్యుల సంఘం జిల్లా సెక్రటరీ డాక్టర్ టి. చంద్రశేఖరరెడ్డి తెలిపారు. డయేరియా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వైద్యులు, ౖవైద్యాధికారులు అప్రమత్తమవ్వటంతో పాటుగా పుష్కరాలకు వచ్చే భక్తులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. 13,297 మందికి వైద్యసేవలు.... జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో మొత్తం 13,297 మంది వివిధ రోగాలతో వైద్యసేవలను పొందారు. జ్వరంతో బాధపడుతున్న 403 మందికి, వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్న 871 మందికి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 3783 మందికి, ఆస్తమాతో బాధపడుతున్న 210 మందికి, కన్ను, చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 541 మందికి, డయేరియాతో బాధపడుతున్న 120 మందికి వైద్యసేవలను అందించినట్లు జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి వెల్లడించారు. పుష్కరాల్లో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు 54,239 మందికి వైద్యసేవలను అందించామని ఆమె వెల్లడించారు. -
అదుపులో అతిసార
ఊపిరిపీల్చుకున్న బండపోతుగళ్ గ్రామస్తులు కౌడిపల్లి : మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా గ్రామంలో అతిసార విజృంభించడంతో గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. గ్రామంలో నాలుగో రోజైన శనివారం కూడా డాక్టర్ విజయశ్రీ, డ్టాక్టర్ దివ్యజ్ఞ, సిబ్బంది ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. గ్రామానికి చెందిన 12 మందికి వాంతులు విరేచనాలు కావడంతో చికిత్స చేశారు. దీంతోపాటు 32 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, ఈఓ పీఆర్డీ సత్యనారాయణ ఎంపీహెచ్ఈఓ సురేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చిన్ని నాయక్, వైద్యసిబ్బంది గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామస్తులకు అధికారులు మినరల్ వాటర్ బాటిళ్లను సరఫరా చేశారు. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సంగారెడ్డి, జోగిపేటలో చికిత్స పొందుతున్నవారు సైతం కోలుకుంటున్నారు. సర్పంచ్ విఠల్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గ్రామస్తులు సయ్యద్ హుస్సేన్, షఫి, పోచయ్య, మాణిక్యం తదితరులు అధికారులకు సహకరించారు. -
అతిసారతో వ్యక్తి మృతి
తంబళ్లపల్లి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అతిసారతో పి.వెంకటేశ్(34) అనే వ్యక్తి మృతిచెందాడు. వారం రోజులుగా అతిసారతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం మృతి చెందాడు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
వ్యాధుల కాలం వచ్చేసింది. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాగునీరు, ఆహారం కలుషితమై భయంకరమైన డయేరియా, అతిసార, వైరల్ ఫీవర్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అంటువ్యాధుల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. ♦ పొంచి ఉన్న భయంకరమైన అంటువ్యాధులు ♦ డయేరియా, అతిసార ప్రబలే అవకాశం ♦ వైరల్ ఫీవర్లు రావచ్చంటున్న వైద్యులు ♦ జాగ్రత్తలు తప్పనిసరి లబ్బీపేట : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం చిత్తడిగా మారింది. డ్రెయినేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మంచినీటి పైపులైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయి. భయంకరమైన ఈ వాతావరణంతో తాగునీరు కలుషితమై అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం కారణంగా డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా సోకుతాయి. కొన్ని రకాల వైరస్ల కారణంగా నీళ్ల విరేచనాలతో పాటు రక్త విరేచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు వెంట.. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో.. ఈగలు వాలుతున్న ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా అంటువ్యాధులు సోకే అవ కాశం ఉందంటున్నారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవటం వంటి కారణాలతో జలుబుతో పాటు వైరల్ ఫీవర్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆయా వ్యాధుల ఠమొదటిపేజీ తరువాయి లక్షణాలు, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వాస్పత్రి పిడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ విఠల్‌రావు ‘సాక్షి’కి వివరించారు. డయేరియా వ్యాధికి కారణాలు : కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం లక్షణాలు : నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరేచనం అయితే డయేరియాగా భావించాలి. చికిత్స : ఎక్కువసార్లు విరేచనాలు కావడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు. పొటాషియం, గ్లూకోజ్ తగ్గి షాక్‌లోకి వెళ్లిపోతారు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు, మూడు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. అతిసార వ్యాధి కారణాలు : కలుషిత నీరు, ఆహారంతో పాటు తాగునీటిలో విరేచనం కలవడం లక్షణాలు : రోజులో 10 నుంచి 20సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి కుటుంబ సభ్యులందరితో పాటు ఆ ప్రాంతంలోని చాలామందికి ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్‌కు గురై షాక్‌లోకి వెళ్లిపోతాడు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్లు లోతుకుపోవడం, నీరసించి పోవడం, చురుకుదనం తగ్గిపోయి మాట్లాడలేకపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రం కూడా తగ్గడంతో ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. చికిత్స : అతిసారకు గురైన వారిని ఎంత త్వరగా ఆస్పత్రి తీసుకెళ్తే అంత మంచిది. రక్త విరేచనాలు వ్యాధి కారణం : ఫుడ్ పాయిజన్ లక్షణాలు : తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం కావడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరితో మల పరీక్ష చేసి, వ్యాధి కారకాన్ని గుర్తించడం జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంది. ♦ రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు. ♦ వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, కూల్‌డ్రింక్స్, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. ♦ విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు (బాగా పండినది తినకూడదు), అన్నం, పప్పు తీసుకోవచ్చు. ♦ ఈ సీజన్లో సాధ్యమైనంత వరకూ బయట ఆహారం తినకుండా ఉండటం, కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది. ♦ విరేచనం తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ♦ విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండండి విజయవాడ సెంట్రల్ : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ సూచించారు. తన చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఉత్పత్తి అయ్యి మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు, అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. వ్యాధులపై అవగాహన కలిగించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ర్యాలీలు, మంగళవారం మాస్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాంతులు, విరేచనాలు అయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. చెత్తను సైడ్ డ్రెయిన్లలో పడేయడం వల్ల పారిశుధ్యం క్షీణించే అవకాశం ఉందని, నిల్వ ఉన్న, మాంసాహారాన్ని తినడం మంచిది కాదని పేర్కొన్నారు. ఏఎన్ఎం, కమ్యూనిటీ ఆర్గనైజర్లు రోజూ ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, మలేరియా విభాగం అధికారి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
పానకం వల్ల ప్రబలిన అతిసారం
శ్రీశైలం : శ్రీశైలంలో అతిసార వ్యాధి ప్రబలింది. రెండు రోజుల వ్యవధిలో సుమారు 64 మంది బాధితులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రాజెక్టు వైద్యశాలలో చికిత్స పొందారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 28వ తేదీన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పానకం పంపిణీ చేశారు. దాని కారణంగానే అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. దేవస్థానం ఆలయ పూజారి యోగేంద్రసాయి, ఆయన భార్య మంజుల సైతం తీవ్ర అస్వస్థతకు లోనై సోమవారం దేవస్థానం వైద్యశాలలో చేరారు. అతిసార వ్యాధికి తోడు తీవ్రమైన ఆందోళనకు గురికావడంతో మంజుల మృతి చెందారు. ప్రస్తుతం పూజారి కర్నూలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. -
నిర్లక్ష్యపు డయేరియా!
చదువుల తల్లి కొలువుదీరాల్సిన విశ్వవిద్యాలయం వ్యాధుల నిలయంగా మారింది. గత నాలుగు రోజులుగా నిర్లక్ష్యపు డయేరియాతో నీరసించిపోయింది. విద్యార్జన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆడపిల్లలు అతిసార బారిన పడి అస్వస్థులయ్యారు. ఒకపక్క సెమిస్టర్ పరీక్షలు.. మరోవైపు అనారోగ్యంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వంటశాల, కొళాయిలు, నీళ్ల ట్యాంకు పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నా పట్టించుకోని వర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యమే పరీక్షల ముందు తమను ఆరోగ్యపరంగా విషమ పరీక్షకు గురిచేసిందని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. శనివారం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అదుపు చేయడంలో వర్సిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బుధవారంనాటికి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా పరిస్థితి ఇప్పటికీ గంభీరంగానే ఉంది. ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: పరిసరాల పరిశుభ్రతపై అంతులేని నిర్లక్ష్యం డయేరియా రూపంలో దాడి చేసింది. వందలాది విద్యార్థు లు బస చేసే వసతిగృహం, వంటశాలల్లో పరిశుభ్రత పాటించే విషయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారులు అవలంభించిన నిర్లిప్త ధోరణి వారి పాలిట శాపంగా పరిణమించింది. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరగడంతో విద్యార్థినులు ఇటు అనారోగ్యంతోనూ, అటు పరీక్షలు సరిగ్గా రాయలేక నానా ఇబ్బందులు పడ్డారు. హఠాత్తుగా డయేరియా ప్రబలడానికి కారణాలు అన్వేషించి, నివారణ చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీ ఉన్నతాధికారులు రకరకాల సాకులతో కాలక్షేపం చేసి ఆలస్యంగా స్పందించారు. నష్టం జరిగిపోయిన తర్వాత తీరిగ్గా పారిశుధ్య చర్యలు చేపట్టారు. శనివారం నుంచే మొదలు వర్సిటీలోని మహిళావసతి గృహం నాగావళిలో బస చేస్తున్న విద్యార్థినులు శనివారం నుంచి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారికి హాస్టల్లోనే ఉంచి చికిత్స చేయించిన అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి ఈ విషయం తెలుసుకున్న ‘న్యూస్‌లైన్’ హాస్టల్‌కు వెళ్లి ఆరా తీయగా అక్కడి దుర్భర పరి స్థితులను విద్యార్థినులు వెల్లడించారు. సోమవారం ఈ వార్త పత్రికల్లో రావడంతో ఉలిక్కిపడిన అధికారులు ఆ తర్వాతే నివార ణ, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేశారు. అయినా బుధవారానికి గాని పరిస్థితి కాస్త అదుపులోకి రాలేదంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట ఆహా రం కలుషితం కావడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న వాదన వినిపిం చింది. అయితే తర్వాత అది డయేరియా అని ప్రకటించారు. శనివారం అస్వస్థతకు గురైన వారిలో సుమారు 13 మంది ఆది వారం సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోయారు. సుమారు 42 మంది విద్యార్థినులు డయేరియా బారిన పడగా వర్సిటీ అధికారులు మాత్రం 15 మందేనని చెబుతున్నారు. మిగ తా విద్యార్థినులు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని వాదిస్తున్నారు. అయితే అంతమందికి ఒకేసారి ఆరోగ్య సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయో అధికారులే వివరించాలి. ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ విద్యార్థినులు అస్వస్థులు కావడం తో 3న జరగాల్సిన ఆ రెండు పరీక్షలను ఏడో తేదీకి వాయిదా వేశారు. డయేరియా ప్రబలడం వల్ల కాకుండా సాంకేతిక కారణాలతోనే పరీక్షలు వాయిదా వేశామంటున్న అధికారులు, ఆ కారణాలేమిటన్నది ఇప్పటికీ వెల్లడించలేదు. అసలు డయేరియా ఇంత తీవ్రంగా ఎందుకు దాడి చేసిందన్నదానిపైనా అధికారలు దృష్టి పెట్టలేదు. పరీక్షల ఫోబియా కారణమట! పారిశుధ్య దుస్థితిని, డయేరియా తీవ్రతను తక్కువ చేసి చూపిస్తున్న వర్సిటీ ఉన్నతాధికారులు మరోవైపు వింత వాదన కూడా చేస్తున్నారు. పరీక్షల ఫోబియా వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొస్తున్నారు. బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రం వేరే కారణాలు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి విద్యార్థినులకు పెట్టిన అన్నం గట్టిగా ఉండటం, వంట గది లో పారిశుధ్యం పాటించకపోవడం, మంచి నీళ్ల ట్యాంకులో క్లోరినేషన్ చేయకపోవడం వంటి కారణాల వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వారు విశ్లేషించారు. వర్సిటీ వైద్యుడు మనోజ్, హెల్త్ అసిస్టెంట్ మౌళీశ్వర రావు రెండు రోజల నుంచి విద్యార్థులకు చికిత్స అందించగా, మంగళవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ వైద్య బృందం, ఎచ్చె ర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం వైద్య పరీక్షలు నిర్వహించాయి. ఆహార పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపామని చెప్పిన వర్సిటీ అధికారులు.. పరిస్థితి తీవ్రరూపం దాల్చిన తర్వాతే వంటగది, వసతి గృహం ఆవరణ, మరుగుదొడ్లలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారని విద్యార్థినులు చెప్పారు. నీళ్ల ట్యాంకుపై చెత్తా చెదారం పేరుకుపోయినా ఇంతకాలం పట్టించుకోలేదని వాపోయారు. బయట ఆహారంపై ఆంక్షలు ఇదిలా ఉండగా బుధవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా పెట్టారు. దాన్ని తినలేక కొందరు విద్యార్థినులు తోటి విద్యార్థుల ద్వారా బయట నుంచి అల్పాహారం తెప్పించుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది, వసతి గృహం వార్డెన్ యు.కావ్యజోత్స్న అడ్డుకున్నారు. డయేరియాకు బయటి ఆహారమే కారణమంటూ టిఫిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు మరోవైపు బుధవారం సెమిస్టర్ పరీక్షలు వైద్యుల పర్యవేక్షణలో జరిగాయి. డయేరియా బారిన పడిన కాస్త కోలుకున్న విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వైద్యులు వారిని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ద్రవ ఆహారాన్ని అందజేశారు. ఒక విద్యార్థిని మాత్రం అనారోగ్యంతో పరీక్షకు హాజరు కాలేకపోయింది. ఆమె వేరే అనారోగ్యంతో బాధపడుతోందని వర్సిటీ వైద్యుడు మనోజ్ చెప్పారు. విద్యార్థునులు తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో వర్శిటీ అధికారులు వసతి గృహం వద్ద అంబులెన్సు అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, చీఫ్ వార్డెన్ బిడ్డిక అడ్డయ్య వసతి గృహాన్ని పరిశీలించారు. పలువురి పరామర్శ బాధిత విద్యార్థులను మహిళా పోరాట కమిటీ నాయకురాలు తాండ్ర అరుణ, జిల్లా స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి పరామర్శించారు. వైద్య సేవలు, పారిశుధ్య పరిస్థితుల గురించి వర్సిటీ అధికారులను అడిగారు. అయితే పరామర్శలు, పరిశీలనలు కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు సూచించారు. పరిస్థితి అదుపులో ఉంది: రిజిస్ట్రార్ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. వైద్యుల ను అప్రమత్తం చేశామన్నారు. పరీక్షలు కుడా సజావుగా జరుగు తున్నాయని చెప్పారు. -
పుట్లూరులో డయేరియాతో ముగ్గురు మృతి
అనంతపురం : అనంపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరులో డయేరియా విజృంభించింది. కలుషితమైన తాగునీరు సేవించటంతో ఇప్పటికే ఇద్దరు మహిళులు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో నిన్న నారాయణమ్మ (75), లక్ష్మమ్మ (55) మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పైమంది డయేరియా బారిన పడ్డారు. బాధితుల్లో 18మంది తాడిపత్రిలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారు అనంతపురంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు.