అనంతపురం : అనంపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరులో డయేరియా విజృంభించింది. కలుషితమైన తాగునీరు సేవించటంతో ఇప్పటికే ఇద్దరు మహిళులు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వాంతులు, విరోచనాలతో నిన్న నారాయణమ్మ (75), లక్ష్మమ్మ (55) మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పైమంది డయేరియా బారిన పడ్డారు. బాధితుల్లో 18మంది తాడిపత్రిలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారు అనంతపురంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు.
పుట్లూరులో డయేరియాతో ముగ్గురు మృతి
Published Wed, Aug 7 2013 9:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM