సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో డయేరియా బాధితుల సంఖ్యల 15కు చేరుకుంది. వరుస డయేరియా కేసుల కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లావాసులు భయంతో వణికిపోతున్నారు. ఇక, డయేరియా ఎందుకు ప్రబలింది అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు.
వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని పరవాడ మండలం, భరణికం గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా డయేరియా బాధితుల సంఖ్య 15కు చేరుకుంది. ప్రస్తుతానికి ఇద్దరు, ముగ్గురు స్వల్పంగా కోలుకున్నారు. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో 11 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో ఇద్దరిని స్థానికంగా ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో డయేరియా కేసుల సంఖ్యల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో డయేరియా ఎందుకు ప్రబలిందో ఇప్పటికే స్పష్టత రాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డయేరియా కేసులు భారీ పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బారినపడి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, డయేరియా వ్యాధి ప్రబలకుండా చేయడం కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాధితులు, వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అంతకుముందు గుర్లాలో డయేరియా కారణంగా పలువురు ఇబ్బందులు ఎదుర్కొగా.. వ్యాధి కారణంగా మరికొందరు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment