విభజనపై చంద్రబాబు మౌనం ఎందుకు?
అనంతపురం: ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనంగా ఎందుకు ఉన్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చేసిన తర్వాతే విభజనపై ఆలోచించాలని వివేకా తెలిపారు. విభజన అంశంపై మంగళవారే విలేకర్లతో మాట్లాడిన వివేకానంద రెడ్డి..చంద్రబాబు మౌనాన్ని ప్రశ్నించారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో ఆయన మౌనంగా ఉండటం తగదన్నారు. పదవీకాంక్షతోనే కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. జిల్లాలో అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం.. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం శాసనసభ స్థానాల పరిశీలకుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతలను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగించారు.