రాజకీయ కోణంలోనే విభజన: పయ్యావుల | State divided on political grounds: Payyavula Keshav | Sakshi
Sakshi News home page

రాజకీయ కోణంలోనే విభజన: పయ్యావుల

Published Mon, Aug 5 2013 10:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాజకీయ కోణంలోనే విభజన: పయ్యావుల - Sakshi

రాజకీయ కోణంలోనే విభజన: పయ్యావుల

అనంతపురం : కాంగ్రెస్ పార్టీపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని, రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. సీమాంధ్రుల కష్టాలను పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ను స్తంభింప చేయాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందని పయ్యావులు విమర్శించారు. ఎంపీలు హైకమాండ్ తొత్తులుగా మారారని ఆయన ధ్వజమెత్తారు.

సీమాంధ్రుల్లో చీలిక తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు. కావూరి సాంబశివరావు, చిరంజీవి, లగడపాటి రాజగోపాల్లకు వ్యాపారాలే ముఖ్యమని పయ్యావుల విమర్శలు చేశారు. లగడపాటి టీవీలకే పరిమితం కాకుండా సీమాంధ్రులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ఉండవల్లివి ఊసరవెల్లి ప్రసంగాలని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement