'కేసీఆర్పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం' | should murder be attempted on kcr, questions Parakala prabhakar | Sakshi
Sakshi News home page

'కేసీఆర్పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'

Published Wed, Aug 7 2013 4:01 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

'కేసీఆర్పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం' - Sakshi

'కేసీఆర్పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'

చిత్తూరు : కెసిఆర్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ టిఆర్ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని విశాలాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్‌ అన్నారు. తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న టిఆర్‌ఎస్‌ నేతలు ఆ ఆధారాల్ని పోలీసులకు సమర్పించి కేసు పెట్టడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు.

తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ మహాసభ నిర్వహించి ఆరు నెలలు కాకముందే రాష్ట్ర విభజన చేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలు చేయడం దారుణమని పరకాల ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా  తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన పరకాల చిత్తూరులో ఆగి నిరాహారదీక్ష విరమించిన ఎమ్మెల్యే సికె బాబును పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement