Visalandhra Mahasabha samiti
-
చిరంజీవి నివాసం ముట్టడికి యత్నం
-
చిరంజీవి నివాసం ముట్టడికి యత్నం
హైదరాబాద్ : కేంద్రమంత్రి చిరంజీవి నివాసాన్ని ముట్టడించేందుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు శనివారం యత్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి రాజీనామా చేయాలంటూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు .... ఆయన ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాళ్లు చిరంజీవి ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. -
కావూరి సాంబశివరావు నివాసం ముట్టడి
-
కావూరి సాంబశివరావు నివాసం ముట్టడి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేయాలంటూ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసాన్ని విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు గురువారం ముట్టడించారు. బంజారాహిల్స్‌లోని కావూరి ఇంటి ముందు మహాసభ కార్యకర్తలు ధర్నా చేశారు. తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి కోసం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాకు కావూరి తాకట్టు పెట్టారని వారు ఆరోపించారు. కావూరి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు కావూరి ఇంట్లోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం విశాలాంధ్ర ప్రతినిధులు బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో కూడా తమ ఆందోళన కొనసాగించారు. -
కావూరి ఇంటిని ముట్టడించిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు
-
సుపరిపాలనకు ప్రజలు ఉద్యమించాలి: ఎ. చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: సమాజంలో ఇప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థలకు విఘాతం కలుగుతున్న ఫలితమే నేటి ఉద్యమాలని శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి అభిప్రాయపడ్డారు. విశాలాంధ్ర ప్రచురణాలయం 60వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరిట ప్రచురించిన గ్రంథాన్ని చక్రపాణి శుక్రవారమిక్కడ ఆవిష్కరించారు. ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ కె.ఎస్.చలం అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, గ్రంథ అనువాదకుడు ప్రొఫెసర్ చందు సుబ్బారావు, విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ జీవితం, రచనలు జాతీయ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని వక్తలు పేర్కొన్నారు. ఉత్తమ రాజ్యాంగం ఉంటే సరిపోదని, దాన్ని సమర్థంగా అమలు చేసే సుపరిపాలన కోసం ప్రజలు ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉత్తమ పాలకులు, సాహసోపేతమైన ప్రభుత్వం, నిజాయితీ కలిగిన ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందో అక్కడ చట్టాలు సజావుగా అమలవుతాయని చక్రపాణి హితవుపలికారు. అటువంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలపైనే ఉంటుందని ఉద్బోధించారు. ఏదైనా సాధించాలంటే ఉత్తమ పాలకులే పరిష్కారమన్నారు. కుల,మతాల గోడలు బద్దలు కొట్టాలని, అందుకు అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ.. జాతి కోసం త్యాగం చేసిన వారిలో అంబేద్కర్ ఒకరని, ఎన్నో అవమానాలను భరించి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగారని చెప్పారు. పాలకుల్లో అంకితభావం కొరవడితే అనర్ధాలు తప్పవన్నారు. అంబేద్కర్ రచనలను ప్రభుత్వం ప్రచురించేందుకు ముందుకు రాకపోతే విశాలాంధ్ర ఆ పని చేస్తుందని సురవరం చెప్పారు. నారాయణ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యతను వామపక్షాలు సామాజిక అంశాలకు ఇవ్వలేదన్నారు. సమావేశానికి న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామకృష్ణ, వకుళాభరణం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. -

'కెసిఆర్‌పై హత్యాయత్న ఆరోపణలు హాస్యాస్పదం'
-
'కేసీఆర్‌పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'
చిత్తూరు : కెసిఆర్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ టిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని విశాలాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు. తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న టిఆర్ఎస్ నేతలు ఆ ఆధారాల్ని పోలీసులకు సమర్పించి కేసు పెట్టడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ మహాసభ నిర్వహించి ఆరు నెలలు కాకముందే రాష్ట్ర విభజన చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయడం దారుణమని పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన పరకాల చిత్తూరులో ఆగి నిరాహారదీక్ష విరమించిన ఎమ్మెల్యే సికె బాబును పరామర్శించారు.