కావూరి సాంబశివరావు నివాసం ముట్టడి | Kavuri Samba siva Rao house stormed by Visalandhra Mahasabha Protesters | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 12 2013 5:31 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేయాలంటూ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసాన్ని విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు గురువారం ముట్టడించారు. బంజారాహిల్స్‌లోని కావూరి ఇంటి ముందు మహాసభ కార్యకర్తలు ధర్నా చేశారు. తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి పదవి కోసం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాకు కావూరి తాకట్టు పెట్టారని వారు ఆరోపించారు. కావూరి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులు కావూరి ఇంట్లోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ అనంతరం విశాలాంధ్ర ప్రతినిధులు బంజారాహిల్స్‌ పోలిస్ స్టేషన్‌లో కూడా తమ ఆందోళన కొనసాగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement