samaikyandhra
-
నేడు జిల్లా బంద్
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జిల్లా బంద్ చేపట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీనికి విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు పలికాయి. విద్యార్థులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఆళ్ల నాని, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ పార్టీల నాయకులతో బంద్ విజయవంతంపై చర్చించారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. బంద్ సందర్భంగా మంగళవారం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు చింతలపూడిలో బైక్‌లపై తిరిగి ఆయా వర్గాలను కలసి విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మాముడూరి మహంకాళి ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం రాత్రి ఏలూరులో రథయాత్ర ప్రారంభించారు. -
పోరు బావుటా
సమైక్యాంధ్ర కోసం నినదిస్తే గొంతు నొక్కారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మభ్యపెట్టారు. హోదా ఏదని అడిగితే.. అంతా వట్టిదేనని చేతులు దులిపేసుకున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట చెబుతూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్న పాలకుల నయవంచనపై ‘పశ్చిమ’ కన్నెర్ర చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో పోరుబావుటా ఎత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి తీరాలంటూ నినదిస్తోంది. ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీని తక్షణమే అమలు చేయాలంటూ జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇదే నినాదాన్ని ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనింప చేసిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పార్టీ నాయకులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్షకు మద్దతుగా సోమవారం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాలు నిర్వహించారు. పెనుమంట్ర మండలం మార్టేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర నాయకత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తణుకులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు చీర్ల రాధయ్య పర్యవేక్షణలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. భీమవరంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ వివిధ పార్టీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉద్యమానికి సమాయత్తం చేశారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్లో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు సీపీఎం కార్యాలయంలో కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న మునికోటికి సంతాపం తెలిపారు. ఉండిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. -
గల్లీనుంచి ఢిల్లీదాకా సమైక్యాంధ్ర ఉద్యమం
-
తండ్రి మాటే బాటగా.. ఆశయ సాధనే లక్ష్యంగా..
-
జోరందుకున్న నామినేషన్లు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. బుధవారం ఒక్కరోజే 33 నామినేషన్లు దాఖలయ్యూరుు. చిత్తూరు లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంధవరపు సామాన్య ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కె.నారాయణస్వామితో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. చిత్తూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ కూడా ఒక సెట్నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేట ఎంపీ స్థానానికి ఒక్కనామినేషన్ కూడా రాలేదు. మూడురోజులే గడువు ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీ ఫారం అందకపోయినా, అధికారికంగా ప్రకటించకపోయినా తిరుపతిలో వెంకటరమణ టీడీపీ తరపున నామినేషన్ వేయడం గమనార్హం. ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నామినేషన్లు వైఎస్సార్ సీపీ తరపున కుప్పం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నుంచి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ సునీల్‌కుమార్, తంబళ్లపల్లె నుంచి ఏవీప్రవీణ్కుమార్రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్లు వేశారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు శ్రీకాళహస్తి నుంచి టీడీపీ నాయకుడు బొజ్జలగోపాలక్రిష్ణారెడ్డి,పుంగనూరునుంచి వెంకటరమణరాజు, జీడీ నెల్లూరు నుంచి కుతుహలమ్మ, పలమనేరు నుంచి ఆర్వి.చంద్రబోస్, తిరుపతి నుంచి వెంకటరమణ, పూతలపట్టు నుంచి లలితకుమారి నామినేషన్లు దాఖలు చేశారు. తంబళ్లపల్లె నుంచి సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా సీపీ సుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. మదనపల్లె నుంచి బీజేపీ అభ్యర్థి చల్లపల్లి నరసింహారెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బి.నరేష్‌కుమార్‌రెడ్డి, బి.కవిత, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఒకరు నామినేషన్ వేశారు. చంద్రగిరి నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరు కాంగ్రెస్ తరపున, ఇద్దరు స్వతంత్రులు, ఒకరు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి. శ్రీకాళహస్తి నుంచి జైసమైక్యాంధ్ర పార్టీ తరపున సీ.ఆర్.రాజన్, సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పెనుబాల చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. చిత్తూరు, నగరికి నామినేషన్లు రాలేదు. పూతలపట్టు నుంచి కాంగ్రెస్ తరపున ఎ.ప్రవీణ్ నామినేషన్ వేశారు. పలమనేరులో టీడీపీ నుంచి జయంతి అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి పార్థసారథిరెడ్డి నామినేషన్ వేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కె.శ్రీనివాసులు నామినేషన్ వేశారు. -
స్థానిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ
ఆచంట, న్యూస్‌లైన్ : నియోజకర్గంలోని అన్ని మండలాల్లోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటించారు. స్థానిక కమ్మ కల్యాణ మండపంలో మంగళవారం ఆచంట, పోడూరు మండలాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర పార్టీ నిర్మాణం ఇంకా జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నాయకులను, క్యాడర్‌ను కోరారు. సమైక్యాంధ్ర అభ్యర్థులను ఓడిస్తామని కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రకటనలు చేయడం సిగ్గుచేటని అన్నారు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఎన్ని ఎంపీపీలు, ఎన్ని జెడ్పీటీసీలు గెలుచుకుంటుందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సమైక్య సదస్సుకు నియోజకవర్గం నుంచి తరలి రావడంతోపాటు, తనకు అండగా నిలిచినవారికి ఈ సందర్భంగా పితాని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆచంట మండల అధ్యక్షునిగా తమ్మినీడి ప్రసాదును నియమిస్తున్నట్టు ప్రకటించారు. డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ, భీమలాపురం, పెదమల్లం, కందరవల్లి, కరుగోరుమిల్లి సర్పంచ్‌లు చింతపర్తి సత్యనారాయణ, కె వీరాస్వామి, గుండుబోయిన సతీష్, ముత్తాబత్తుల రామచంద్రుడు నాయకులు పాల్గొన్నారు. -
'కిరణ్‌తో పాటు ఎంపీలను చేర్చుకునేందుకు సిద్ధం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమని సీమాంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆవేశంతో పార్టీని వీడినవారు తిరిగి కాంగ్రెస్‌లోకి రావచ్చని అన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని రఘువీరా అన్నారు. సమైక్యాంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని రఘువీరా మండిపడ్డారు. కిరణ్ ఏం త్యాగం చేశారో చెప్పాలన్నారు. స్వలాభం కోసమే కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు ఇస్తున్న హామీలను ప్రజల గమనించాలని రఘువీరా విజ్ఞప్తి చేశారు. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో రఘువీరా భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ను వీడే విషయంలో తొందరపడవద్దని, మాట్లాడుకుందాం రండి అంటూ పక్క పార్టీలవైపు చూస్తున్న పలువురు నేతలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ విడతారని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకూ ఫోన్ చేసి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీ వీడతారని అనుమానం ఉన్న నాయకుల జాబితా తనకు పంపాలని 13 జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కమిటీ అధ్యక్షులను ఆదేశించారు. -
కమలంతో దోస్తీకి సైకిల్ సై
భీమవరం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కమలంతో దోస్తీ కట్టేందుకు సైకిల్ సై అంటోంది. ఒక పక్క రాష్ట్ర విభజనలో కమలనాథులే ప్రధాన భూమిక పోషించారంటూ గొంతెత్తి అరిచిన తెలుగు తమ్ముళ్లు చీకటి ఒప్పందంతో బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌తో కలసి కుట్ర పూరితంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించిన కమలనాథులు, రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించిన టీడీపీ తొలుత ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని భావించినప్పటికీ ప్రస్తుతం అవేమి తమకు అడ్డు కాదంటూ బరితెగించి మరీ కమల దండుతో కలిసి రానున్న ఎన్నికల్లో జతకడుతుండడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ అనుకోని విధంగా వచ్చిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిలో భాగంగా జిల్లాలోని కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో సీట్లు సర్దుబాటు కోసం ఇరు పార్టీల నేతలు ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు అధికారికంగా వెల్లడి కానప్పటికీ నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగుస్తుండడంతో వార్డుల సర్దుబాటులో ఇరు పార్టీల నేతలు తలమునకలై ఉన్నారు. జిల్లాలో కీలకమైన భీమవరం, నర్సాపురం వంటి మునిసిపాలిటీల్లో పొత్తులు ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు వంటి మునిసిపాలిటీల్లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. భీమవరం మునిసిపాలిటీలో 10 వార్డులను బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా టీడీపీ నేతలు 5 నుంచి 6 వార్డులు కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. గురువారం వీటినే అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉందని టీడీపీ నియోజకవర్గ నేత ఒకరు ‘న్యూస్‌లైన్’ వద్ద ధృవీకరించారు. -
పదవుల మేళా
స్వల్ప వ్యవధిలోనే ఐదు ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు పండగ ఏ పదవులకైనా సై అంటున్న నేతలు ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్న పార్టీలు కొత్తవాళ్లతో నిండిపోతున్న వైనం సాక్షి, ఏలూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలన్నీ ఒకేసారి రానే వచ్చేశాయి. రాజకీయ నిరుద్యోగుల నెత్తిన పాలుపోశాయి. ఈసారి ఏదో ఓ పదవి తప్పక వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న నేతలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించాలని వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఆశావహులకు సీట్లు సర్దుబాటు చేయడంలో అధినాయకులు తల మునకలయ్యారు. రాజకీయం అనే రొంపిలోకి వెళ్లకూడదనే అపోహల నుంచి బయటపడి కొత్తవారు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరికి చావోరేవో! ఎన్నికల్లో ఏదో ఓ పదవి సంపాదించకపోతే ఈసారి కొందరికి రాజ కీయ భవిష్యత్ ఉండని పరిస్థితి. వారిలో గల్లీ నాయకుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్య మం కారణంగా కొందరికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయే ప్రమా దం ఏర్పడింది. ఈ కోవకు చెందినవారే జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రి. సమైక్యాంధ్ర నినాదంతో పదవిని చేపట్టి అనంతరం అధిష్టానానికి జై కొట్టడంతో అతనిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ఆయనకు చావోరేవోగా మారాయి. అలాగే జిల్లాకు చెందిన మరో మంత్రికీ ఇవి చివరి ఎన్నికలు కానున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధికార చెలాయించిన పార్టీ లో ఉన్న ఈ నేతా ప్రజాగ్రహాన్ని చవిచూడనున్నారు. స్థానిక సమరంపై దృష్టి మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొందరు మునిసిపల్ చైర్మన్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. తమ అనుయాయులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీల అధిష్టానాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలు కూడా టికెట్ పంపకాల్లో సమస్యలు తలెత్తకుండా ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్నాయి. అసెంబ్లీ టికెట్ కుదరకపోతే మునిసిపల్ చైర్మన్, అదీ కుదరకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరికి ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటున్నారంటే ప రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇవేవీ కుదరకపోతే వాటిని మించిన నామినేటెడ్ పదవి ఇస్తామంటూ ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాతవారిపై వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని బరిలోకి దిం చాలని భావిస్తున్నారు. ఏదైనా పర్లే దు టికెట్ ఇస్తే చాలంటూ కొందరు నేతలు సర్దుకుంటున్నారని పలువు రు గుసగుసలాడుతున్నారు. -
'పురందేశ్వరి వెళ్లినంతమాత్రాన నష్టం లేదు'
గుంటూరు: కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన పురందేశ్వరిపై కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని ఆమె సోమవారమిక్కడ అన్నారు. పురందేశ్వరి బీజేపీలోకి వెళితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందేమోనని పనబాక వ్యంగ్యంగా విమర్శలు చేశారు. పురేందశ్వరి ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. -
మంత్రి బాలరాజును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
విశాఖ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ఆమెదం పొందిన అనంతరం సీమాంధ్ర నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేయడం, అనంతరం ఆ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించడంతో సీమాంధ్ర లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి . కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను విశాఖ నగరానికి తీసుకురావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. బాలరాజును నగర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని కార్యకర్తలు అడ్డుకుని సమైక్య ద్రోహి అయిన జైరాం రమేష్ ను విశాఖకు ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. సమైక్య ద్రోహులకు సీమాంధ్రలో అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'టీడీపీలో ఉన్నానో, లేనో తెలియడం లేదు'
హైదరాబాద్: తాను టీడీపీలో ఉన్నానో, లేనో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని నందమూరి హరికృష్ణ వాపోయారు. ఎన్టీఆర్ భవన్లో ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందువల్లే తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని మీడియా ద్వారా తెలుసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నిర్వహించిన కార్యక్రమాలకు హరికృష్ణను ఆహ్వానించలేదు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి నుంచి హరికృష్ణ, చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెరిగింది. సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవిని వదులుకున్న హరికృష్ణకు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించకపోవడంతో ఉద్దేశపూర్వకంగా ఆయనను పక్కనపెట్టారని స్పష్టమయింది. -
జై సమైక్యాంధ్ర అని అనని చంద్రబాబు
-
'తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో వ్యతిరేకత లేదు'
తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో ఎలాంటి వ్యతిరేకత లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన అధికార, ధనబలంతోనే లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కావాలనే కిరణ్ రెచ్చగొట్టారన్నారు. తెలంగాణ ఏర్పాటును చివర వరకు అడ్డుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో పాస్ కాగానే సీమాంధ్రకు చెందిన నేతలు తనకు శుభాకాంక్షలు తెలిపారన్న సంగతిని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఐక్యతకు కిరణ్ కుమార్ రెడ్డే పెద్ద అడ్డంకి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియా సాకారం చేశారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు దేవత అని అభివర్ణించారు. -
రాజ్యసభలోనూ నిరాశే
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశంపై జిల్లా ప్రజల గరం గరం కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, పనబాకల తీరుపై అసంతృప్తి ఒంగోలు : రాజ్యసభలోనూ రాష్ట్ర విభజన బిల్లు పాస్ కావడంతో జిల్లా వాసులు అసంతృప్తికి లోనయ్యారు. జిల్లాకు ఏ మాత్రం అనుకూలంగా లేని బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల వైఖరిని దుయ్యబడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం రాజ్యసభ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తుంటే ఆంధ్రుల అభిమాన నటుడు చిరంజీవి, జిల్లాతో అనుబంధం ఉన్న జెడీ శీలం, నాలుగు నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పనబాక లక్ష్మి తమకు ఏమీ పట్టనట్లుగా తమ స్థానాల్లో కూర్చోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాల విభజనకు వ్యతిరేక మంటూ నిరసన గళం విప్పిన రాజ్యసభ టీడీపీ ఎంపీ సుజనాచౌదరి.. గురువారం సభలో టీడీపీ విభజనకు అనుకూలమని ప్రకటన చేయడం విస్మయానికి గురి చేసింది. విభజన వల్ల జిల్లాకు ఒరిగిందేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధికి జిల్లా ఆమడదూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడా ప్రత్యేకంగా పరిశ్రమలు లేవు. యూనివర్సీటీ, ప్రముఖ విద్యా సంస్థలు, ప్రత్యేకత పొందిన ఆస్పత్రులూ అంతకన్నా లేవు. ఇటువంటి సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలు బిల్లులో ఉంటే బాగుండేదని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. అసలు సీమాంధ్ర తరఫున మాట్లాడేందుకు రాజ్యసభలో ఒక్క నాయకుడు కూడా లేక పోవడం శోచనీయమంటున్నారు. బీజేపీకి చెందిన వెంకయ్యనాయుడు మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. యూపీఏ మళ్లీ అధికారంలోకి రాకుంటే సీమాంధ్రకు న్యాయం చేస్తామన్న ప్రధాని మాటలు నీటి మీద రాతల్లా మారే అవకాశం లేకపోలేదని జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పడం గమనార్హం. తెలుగుదేశం బండారం గురువారం బయట పడిందన్నారు. టీడీపీ నాయకుడు సుజనాచౌదరి కూడా తాము రాష్ట్ర విభజనను ఆహ్వానిస్తున్నామని చెప్పడంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి ఏమిటో వ్యక్తమవుతోందన్నారు. కాంగ్రెసు పార్టీతో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు లాలూచీపడి రాష్ట్ర విభజన చేశాయని ఆరోపించారు. -
వీధుల్లో నుంచి విధుల్లోకి..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగులు వీధులను వదిలి విధులకు హాజరు కానున్నారు. 15 రోజుల నిరవధిక సమ్మె అనంతరం గురువారం నుంచి యథావిధిగా కార్యాలయాలకు చేరుకోనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ గత ఏడాది ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 66 రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టారు. అటెండర్ నుంచి గజిటెడ్ ఆఫీసర్ వరకు ఉద్యోగులు సమ్మె చేశారు. అదే సమయంలో వీధుల్లోకి వచ్చి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. విద్యార్థులతో కలిసి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వస్తుండటంతో ఉద్యోగులంతా ఢిల్లీ బాట పట్టారు. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు వేలాదిగా ఢిల్లీ చేరుకొని అక్కడ మహా ధర్నా నిర్వహించారు. పార్లమెంటులో ఏకపక్షంగా తెలంగాణ బిల్లును ఆమోదించడంతో ఉద్యోగులు తిరుగుముఖం పట్టారు. రెండోమారు నిర్వహించిన నిరవధిక సమ్మెలో ఏపీఎన్జీఓ అసోసియేషన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కాన్ఫడరేషన్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో గురువారం నుంచి ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. వారి రాకతో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి కళకళలాడనున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు రెండో మారు నిరవధిక సమ్మెకి దిగిన ఉద్యోగులకు ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులుగా తమవంతు పోరాటం నిర్వహించామని, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా అంతే పోరాటాన్ని నిర్వహించి ఉంటే విభజన జరిగేది కాదన్నారు. -
'రెండు కళ్ల సిద్ధాంతంతో కొంపముంచిన చంద్రబాబు'
-
సమైక్యమే ఊపిరిగా...జగన్
-
కేంద్రం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన జగన్
-
సొనియా పై మండిపడ్డ కొడాలి నాని
-
రాహుల్ ఫ్లెక్సీల ధ్వంసం
అనకాపల్లి, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లును లోక్ సభ ఆమోదించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న రాహుల్‌గాంధీ ఫ్లెక్సీలను మంగళవారం రాత్రి ఆ పార్టీ కార్యకర్తలు చించివేశారు. రాహుల్ అమర్ రహే హై అంటూ నినాదాలు చేశారు. నెహ్రూ చౌక్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీలను తగులబెట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనియా నియంతృత్వ పోకడలను పట్టణ కన్వీనర్ మందపాటి జానకీరామరాజు ఎండగట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్మోహన్రెడ్డి పోరాడిన సంగతిని ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలుగుజాతిని విడదీశాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రమణఅప్పారావు, వాకాడ బాబు, మాజీ కౌన్సిలర్లు కెఎం నాయుడు, పొట్ల అప్పారవు, బుద్ద రాజేశ్, బొబ్బిలి గోవింద, మడగల శ్రీను, పిళ్లా కొండయ్య నాయుడు ఎంఎల్‌వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
-
మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడే నేతల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఆయన పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ విభజన ప్రక్రియతో రాయలసీమ ప్రజల బతుకును అంధకారంలోకి వెళ్లిందని.. రాయలసీమకు తాగు, సాగు నీరు కోసం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. తెలంగాణ ప్రాంత నాయకుల్లో ఉన్న ఐకమత్యం సీమాంధ్ర నేతల్లో లేకపోవడం వల్లే విభజన ప్రక్రియ సాధ్యపడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందని ఏరాసు విమర్శించారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వారి వెంటే తాను నడుస్తానని స్పష్టం చేశారు. -
పల్లెల్లో విభజనపై జోరుగా చర్చ
సాక్షి, కడప: జిల్లాలోని పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా విభజన చర్చ జోరందుకుంది. రెండురోజులుగా టీకొట్లు.. బస్టాండ్లు.. దుకాణాలు... ఎక్కడ నలుగురు ఒకచోట కలిసినా... అందరి నోట ఒకే చర్చ.. రాష్ట్రం విడిపోతుందా.. కలిసుంటుందా.. రాష్ట్రం విడిపోతున్నందుకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా బాధపడుతున్నారు. బిల్లు ఆమోదానికి గురైతే రాష్ట్రం విడిపోయే నోట ‘సమైక్య’మాట రాకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. విభజనబిల్లుపై 48 రోజులపాటు అసెంబ్లీలో చర్చ జరిగినట్లు సీమ ప్రజలు పేర్కొంటున్నారు.రాష్ట్రం విడిపోతే తెలంగాణకు, కోస్తా ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే హామీలు బిల్లులో ఉన్నాయంటున్నారు. అయితే సీమ అభివృద్ధిపై ఎటువంటి హామీలు లేవని మండిపడుతున్నారు. రాష్ట్రం విడిపోతే సీమకు వాటిల్లే నష్టం గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుతో పాటు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సాకే శైలజానాథ్ ఎందుకు చర్చ లేవనెత్తలేదని ప్రశ్నిస్తున్నారు. సీమ ఒకటి ఉంది...అది వెనకబడి ఉంది...దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు బిల్లులో ఎక్కడా కనపడలేదని ఆరోపిస్తున్నారు. పార్టీకి నష్టమని తెలిసినా ‘సమైక్య’మే అజెండాగా ఉద్యమాన్ని నడుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీమ వాసులు అభినందిస్తున్నారు. సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని పేర్కొంటున్నారు. -
రాబోయే మూడు రోజులు రాష్ట్రానికి కీలకం
-
రాష్ట్ర విభజనను అడ్డుకుంటే మోడీకి కూడా మద్దతిస్తాం
-
సమైక్య పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీం
-
సమైక్య పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలంటూ దాఖలైన పిటీషన్లును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్లు తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడు పిటీషన్లు దాఖలైయ్యాయి. దీనిని సోమవారం విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ప్రస్తుతం బిల్లు పార్లమెంట్ లో ఉన్నందును జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఫిబ్రవరి 7వ తేదీన విచారించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్ఏ బాబ్డెలతో కూడిన ధర్మాసనం స్టే విధించడానికి నిరాకరించింది. అయితే పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలను ఓపెన్‌గానే ఉంచుతున్నాం. సరైన సమయంలో పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ
-
అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ : పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసేందుకు మిగిలింది అయిదు రోజులే. నేటి నుంచి జరుగనున్న చివరి విడత సమావేశాలే తెలంగాణ భవితవ్యాన్ని తేల్చనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఉదయం హుటా హుటీన హస్తిన వెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేందుకు అవసరమయిన మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో ఎప్పుడేం జరుగుతుందో... ఏ పార్టీ ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ భవితవ్యం మీద సందిగ్ధం నెలకొంది. అలాగే నేడు, రేపు ఢిల్లీలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల ప్రభావం తెలంగాణ అంశం మీద ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సమైక్య ఆందోళనల ప్రభావంతో తెలంగాణ వెనక్కి పోకుండా మరింత పట్టుదలతో కృషి చేయాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు. మంగళవారం కానీ, బుధవారంకానీ బిల్లు మీద చర్చ జరిగే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజులే కీలకంగా మారాయి. -
హస్తినకు సమైక్య సెగ
-
కేసీఆర్‌కు ఇంటి వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వారిని లోనికి వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. తాము కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సమైక్యాంధ్రకు మద్దతు కోరడానికి వచ్చామని జేఏసీ నేతలు చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. -
సమైక్య సేనాని జగన్
-
మంత్రి కమల్‌నాథ్ ఇంటి వద్ద విద్యార్థి జేఏసీ ఆందోళన
ఢిల్లీ: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్నికేంద్రం వేగవంతం చేసిన తరుణంలో సమైక్య వాదుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యా వాదులు కదం తొక్కుతున్నారు. తొలుత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అనంతరం కేంద్ర మంత్రి కమల్ నాథ్ ఇంటి ఎదుటు కూడా విద్యార్థి జేఏసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ను విడదీయటానికి అధికారం ఎవరిచ్చారంటూ ధర్నా చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. అక్కడి పరిస్థితి శృతిమించడంతో పోలీసులు భారీగా మోహరించారు. -
ఏఐసీసీ కార్యాలయం వద్ద విద్యార్థుల సమైక్య ఆందోళన
ఢిల్లీ: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రం వేగవంతం చేసిన తరుణంలో సమైక్య వాదుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యా వాదులు కదం తొక్కుతున్నారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు కేంద్రాన్నిహెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే సమైక్యాంధ్ర విద్యార్థులు ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విభజన అంశాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు సమైక్యావాదులు శనివారం రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 17న జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టే సమైక్య ధర్నాకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది. -
అన్యాయాన్ని ఒప్పుకుంటే చెడుసంప్రదాయానికి తెరతీసినట్లే!
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి, తమ ఉద్యమానికి మద్దతు కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ను కలిశారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కారత్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఒప్పుకోకపోయినా పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టారన్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు అప్రజాస్వామికం అన్నారు. బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవ్వరూ ఎస్, నో చెప్పకపోయినా, 10 సెకన్లలో అంతాకానిచ్చేశారని విమర్శించారు. ఈ అప్రజాస్వామిక తీరును తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తమవంతు సహాయాన్ని అందిస్తామని కారత్ చెప్పినట్లు తెలిపారు. అందుకు కారత్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవాల్సిన సమయం ఇదని చెప్పారు. ఒకవేళ ఈ అన్యాయాన్ని ఒప్పుకున్నట్లైతే ఒక చెడు సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని జగన్ హెచ్చరించారు. -
దేశ సమగ్రతకే ముప్పు
విభజనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తున్న తీరు దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీలకు వివరించారు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే ఈ చర్యను విపక్షాలన్నీ ఏకమై అడ్డుకోవాలని కోరారు. జగన్ శనివారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ, జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా, పార్లమెంట్ సభ్యుల ఆందోళనను ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని, సంప్రదాయాలను లెక్కపెట్టకుండా రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని వారికి వివరించారు. పూర్తి నిరంకుశత్వంతో, అడ్డగోలుగా జరుగుతున్న ఈ విభజనను అడ్డుకోవడానికి జాతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గతంలోనే పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసి పార్లమెంట్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకోవాలని కోరారు. శనివారం మరోమారు సహచర ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి జాతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అంతా పథకం ప్రకారమే.. జగన్ శనివారం ముందుగా బీజేపీ నేత అరుణ్ జైట్లీని కలిశారు. గురువారం లోక్‌సభలో జరిగిన ఘటనలను వివరించారు. కేంద్రం ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే బిల్లును ప్రవేశపెట్టిందని తెలిపారు. ‘‘సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా కాంగ్రెస్ పథకరచన చేసి, దానిని అమలు చేసింది. బయటి రాష్ట్రాల నుంచి బలమైన ఎంపీలను వెల్‌లోకి పంపింది. సీమాంధ్ర ఎంపీలను ఇతర సభ్యులు అడ్డుకోవడమే కాకుండా చేయి చేసుకున్నారు. వెల్‌కు సంబంధించిన వీడియో చిత్రాలను చూస్తే ఎవరెవరు దాడిచేశారో స్పష్టంగా తెలుస్తుంది’’ అని జగన్ వివరించారు. ‘‘సభ సజావుగా నడవాలన్న సాకుతో సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయించారు. వారు లేకుండానే బిల్లు తేవాలన్నది కాంగ్రెస్ కుతంత్రం. ఇది పార్లమెంటు సంప్రదాయాలను పూర్తిగా మంటకలపడమే. ఈరోజు ఓ రాష్ట్రాన్ని, రేపు మరో రాష్ట్రాన్ని విభజిస్తారు. ఇలా చేస్తూపోతే దేశ సమగ్రతకే ముప్పు రావడం ఖాయం. అందువల్ల ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ బిల్లును అడ్డుకోండి’’ అని కోరారు. దీనిపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ ‘‘సభలో జరిగిన సంఘటన దురదృష్టకరం. బిల్లు ఆఖరు దశలో కాంగ్రెస్ ఇలాంటి పనులు చేయకూడదు. మీరు చెప్పిన అంశాలపై పార్టీలో మాట్లాడతా’’ అని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మంతనాలు.. ఇంటికొచ్చిన గెగాంగ్ అపాంగ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని వైఎస్ జగన్ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. శనివారం మధ్యాహ్నం జగన్ ఫోన్లో ఠాక్రేతో మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాన్ని వివరించారు. పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటెయ్యాలని కోరారు. రాష్ట్రాల విభజనకు శివసేన మొదటి నుంచీ వ్యతిరేకమని ఠాక్రే తెలిపినట్లు మైసూరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారన్నారు. కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి మిత్రుడైన అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంతి గెగాంగ్ అపాంగ్ శనివారం సాయంత్రం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ అంశంపై చర్చించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ చేస్తున్న పోరాటాన్ని అపాంగ్ ప్రశంసించినట్లు తెలిసింది. అంతా కలసివస్తారని విశ్వసిస్తున్నాం: జగన్ శరద్‌యాదవ్‌తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు విభజనను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి వస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని శరద్‌యాదవ్‌కు విన్నవించాం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రతిఘటించాలని రెండో మారు కోరాం. విభజన బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసినా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోదు. మిగతా రాష్ట్రాలకు పాకుతుంది. 272 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే చాలు ఎవరినీ అడగకుండా గీతలు గీస్తారు. ఇప్పుడు ఏపీకి జరుగుతున్నదే భవిష్యత్‌లో తమిళనాడు, యూపీ, కర్ణాటకలకు జరగవచ్చు. అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి దీన్ని అడ్డుకోవాలని కోరాం. జేడీ(యూ)తో పాటు మూడో ఫ్రంట్‌లో ఉన్న 11 పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి ఫ్లోర్ మేనేజ్మెంట్ కార్యక్రమం చేపట్టాలని శరద్ యాదవ్‌ను కోరాం. ఆ 11 పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఈ పార్టీల్లో కమ్యూనిస్టులు, ఏఐడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు విభజనను వ్యతిరేకిస్తూ వాటి నిర్ణయాన్ని తెలిపాయి. మిగతావారంతా కలసి వస్తారనే భావిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా థర్డ్ ఫ్రంట్‌లో చేరే విషయాన్ని ప్రస్తావించగా.. రాజకీయ చర్చలేవీ జరపలేదని జగన్ తెలిపారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రవేశపెట్టడంలో సభా సంప్రదాయాలను పాటించలేదని, సభ అనుమతి తీసుకోకుండానే పది సెకన్లలోనే ప్రవేశపెట్టినట్లు చెప్పారని అన్నారు. ‘‘విభజనపై కేంద్రం పూర్తి అప్రజాస్వామికంగా ముందుకెళుతోంది. బిల్లు ప్రవేశపెట్టడానికి సభ అనుమతి కోరాలి. బిల్లుకు అనుకూలంగా ఎక్కువ మంది చేతులు పెకైత్తితే దానిని సభలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పాలి. వ్యతిరేకంగా ఎక్కువ మంది చేతులు ఎత్తితే ప్రవేశపెట్టలేదని చెప్పాలి. కానీ ఇక్కడ అలాంటి సంప్రదాయాలు ఏవీ పాటించలేదు. సభలో సభ్యుల ఆమోదం తెలుసుకోకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఏ ప్రజాస్వామ్యంలోనూ ఇలా జరగదు. దీనిని వ్యతిరేకిస్తున్నా. బీజేపీ, ఎస్పీ సహా అన్ని పార్టీలూ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. శరద్‌యాదవ్, ఎస్పీ, బీజేపీ నేతలు స్పీకర్‌ను కలవగా ఆమె బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అనంతరం మమ్మల్ని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సభలో లేకుండా, వారిని చర్చలో పాల్గొననివ్వకుండానే విభజన చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా అన్యాయం’’ అని అన్నారు. బిల్లుపై ఏకాభిప్రాయం తెస్తా : శరద్‌యాదవ్ జగన్ శనివారం సాయంత్రం శరద్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. విభజన తీరును వివరించి, బిల్లును అడ్డుకోవాలని కోరారు. దీనిపై శరద్‌యాదవ్ స్పందిస్తూ, థర్డ్ ఫ్రంట్‌లోని 11 పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే విభజనను ఏఐడీఎంకే, ఎస్పీ, సీపీఎంలు వ్యతిరేకిస్తున్న దృష్ట్యా మిగతా పార్టీల వైఖరిని కూడా తెలుసుకుని ముందుకెళతామని హామీ ఇచ్చారు. తెలంగాణకు న్యాయం చేసే సమయంలో సీమాంధ్రకు అన్యాయం చేయకూడదని తాము గట్టిగా కోరుతున్నామని చెప్పారు. అనంతరం శరద్‌యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫ్రంట్‌లో మా ఒక్క పార్టీయే లేదు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునే విషయంలో ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ విషయాన్నే జగన్‌కి చెప్పాను’’ అని తెలిపారు. పార్లమెంటులో జరిగిన సంఘటనలను ప్రస్తావించగా.. ‘‘దేశంలో మొదటిసారి ఇలా జరిగింది. దీన్ని సహించేది లేదు. అత్యున్నత పార్లమెంటులో జరిగిన సంఘటనను ఖండించడంతోనే వదిలిపెట్టం. దాని వెంటపడతాం’’ అని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాల్సిన బాధ్యత ఆ ఐదుగురిదే: రఘువీరా
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా), న్యూస్‌లైన్/సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నేతలు ఐదుగురిపై ఉందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరాడాలన్నారు. ఈ ఐదుగురు కలిసి కృషి చేస్తే రాష్ట్రం విడిపోదనే నమ్మకం తనకుందన్నారు. గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. లేఖను ఉపసంహరించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎం పార్టీల అధినేతలు, ఆయా పార్టీల శాసనసభ, మండలి పక్ష నేతలతో మాట్లాడాలంటూ రఘువీరారెడ్డి సీఎం, పీసీసీ చీఫ్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ పార్టీల నేతలందర్నీ సోమవారం ఢిల్లీకి తీసుకెళ్లి.. ప్రధాని, వివిధ పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి విభజనను నిలిపివేయాల్సిందిగా అభ్యర్థిస్తే ఫలితముంటుందని పేర్కొన్నారు. -
ఢిల్లీకి ‘సమైక్య’ రైళ్లు
సాక్షి, నెట్వర్క్: తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ, యూపీఏ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి, వారికి కనువిప్పు కలిగేలా చేసేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. ఈ నెల 17న జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన చేపట్టనున్న ‘సమైక్య ధర్నా’కు రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో బయలుదేరి వెళ్లాయి. మొదటి రైలు శనివారం ఉదయం 10.15 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి బయలుదేరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ రైలులో నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. మొదటి రైలుకు ఇన్చార్జిగా వైఎస్సార్ సీపీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండో రైలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి సాయంత్రం 4.45గంటలకు బయలుదేరింది. పార్టీ మహిళా కార్యకర్తలు హారతులు పట్టగా, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ రైలులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. రెండో రైలుకు ఇన్చార్జిగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లు 36 గంటలపాటు ప్రయాణించి 17న ఢిల్లీకి చేరనున్నాయి. వైఎస్సార్ సీపీ ధర్నాకు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు: విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ ధర్నాకు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది. విద్యార్థి జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదలచేశారు. ఆయనతో పాటే సీమాంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సైతం ధర్నాకు మద్దతు తెలిపారు. -
జగన్‌ను కలిసి మద్దతు తెలిపిన అరుణాచల్ మాజీ సీఎం
ఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకుకు వైఎస్ఆర్ సిపి చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. జగన్ దేశవ్యాప్తంగా పర్యటించి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని కోరిన విషయం తెలిసిందే. పలువురు నేతలు జగన్ చేపట్టిన సమైక్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు అపాంగ్ కూడా మద్దతు తెలిపారు. -
పనబాకపై భగ్గు..భగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రమంత్రి పనబాక లక్ష్మిపై జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా..సమైక్యాంధ్రకు కూడా మద్దతు ఇవ్వలేకపోయిన ఆమె వైఖరిపై భగ్గుమంటున్నారు. జిల్లాలోని చీరాల, అద్దంకి, పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు శాసనసభా నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఆమె చేపట్టకపోవడాన్ని జనం దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా.. ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. జౌళి శాఖా మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజున, చీరాలలోని నేత కార్మికులు తమకు మంచి రోజులు వచ్చాయని భావించారు. అయితే చీరాల ప్రజలను పనబాక కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల సమీపంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012 బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనిపై పలుసార్లు ఇక్కడి చేనేత కార్మికులు పనబాకను కోరగా..రెండేళ్ల తరువాత శుక్రవారం (ఈనెల 14) శంకుస్థాపన చేసేందుకు అంగీకరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అది కూడా రాష్ట్ర విభజన హోరులో కొట్టుకుపోయింది. టెక్స్టైల్ పార్కును రూ. 70 కోట్లతో ఏర్పాటు చేయదలచుకుని, దానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించినా..పనబాక లక్ష్మి అలసత్వం వల్ల కార్యరూపం దాల్చలేకపోయింది. కనీసం భూసేకరణ కూడా చేయలేదు. టెక్స్టైల్ పార్కు వల్ల కొత్తగా ఉపాధి లభించకపోయినా..జౌళి రంగంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం లభించి ఉండేదని అంటున్నారు. గతంలో జౌళి పరిశ్రమకు పుట్టినిల్లుగా ఉన్న చీరాలలోని ఈ వృత్తివారు ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. చీరాలలో ప్రస్తుతం వంద మంది కూడా జౌళి ఉత్పత్తిదారులు లేకపోవడానికి ప్రభుత్వ చిన్నచూపే కారణమని నిపుణులంటున్నారు. విభజనకు అనుకూలతపై భగ్గుమంటున్న జనం... ఇదిలా ఉండగా సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో పాఠశాల విద్యార్థులు కూడా సమైక్యాంధ్ర కోసం రోడ్డు మీదకు వస్తుంటే, జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విభజనకు అనుకూలత తెలియజేయడంపై తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలోకి వస్తే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాదని భావిస్తున్న పనబాక, ఉన్నంత వరకు అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఆమె స్వంత ప్రయోజనం చూసుకోవడం తప్ప, జిల్లాకు ఒరిగిందేమీలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అవసరమైతే సోనియా గాంధీ ఆశీస్సులతో రాజ్యసభలో సభ్యత్వం సంపాదించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. పనబాక నియోజకవర్గంలోకి అడుగు పెడితే కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఆమెను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
మంత్రి జేడీ శీలం కాన్వాయ్‌పై చీపుర్లు
విజయవాడ, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్యసెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ మీదకు సమైక్యవాదులు చీపుర్లు విసిసారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం విజయవాడలో రైలు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు రోడ్డు మార్గం గుండా వెళుతున్నట్టు సమాచారం తెలుసుకున్న సమైక్యవాదులు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు ఉద్యమకారులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సమయంలోనే మంత్రి కాన్వాయ్‌పైకి చీపుర్లు విసిరారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌పై అందరి హక్కు ఉందని మంత్రి జేడీ శీలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వ్యాఖ్యా నించారు. తెలంగాణ విడిపోతే ఉద్యో గులకు, విద్యార్థులకు భద్రత కల్పిం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
సమైక్యపోరు
-
ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకం అయ్యింది: జగన్
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తోందో ఆయనకు వివరించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు విభజనను వ్యతిరేకిస్తున్నా, సొంత పార్టీ మనుషులు కూడా విభజన వద్దంటున్నా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని.. చివరకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంలో కూడా అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారని రాజ్‌నాథ్ దృష్టికి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లారు. వారి భేటీ సుమారు అరగంట పాటు సాగింది. అనంతరం జగన్, రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. జగన్ మీడియాతో మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి.. ''రాజ్‌నాథ్ సింగ్‌తో చాలా వివరంగా మాట్లాడాం. ఆయన మాకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై తన పార్టీ సభ్యులతో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి, ఈ అన్యాయంపై స్పందిస్తాయని ఆశిస్తున్నాను. ఆయనతో చాలా సుదీర్ఘంగా చర్చించాము. ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించడం మొదలైతే, అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకించినా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇలా చేయడం మొదలైతే రేపు అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని ఆయనకు చెప్పాం. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని, అందరూ కలిసి ప్రతిఘటించాలని ఆయనకు విన్నవించాం. దేవుడు కూడా వీరందరికీ మంచి చేసే ఆలోచనలు ఇస్తాడని ఆశిస్తున్నాం. అసలు నిన్న జరిగిన అన్యాయం అయితే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికుందో లేదో అర్థం కావట్లేదు. తమకు విభజన వద్దని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టామని చెప్పేస్తారు, ఆమోదం పొందిందని కూడా చెప్పేస్తారు. మామూలుగా అయితే బిల్లు పెట్టినప్పుడు చేతులు పైకెత్తాలని మొదట అడుగుతారు. ఆమోదయోగ్యం అవునో కాదో తెలుసుకుంటారు. ఆమోదించినట్లు ఎక్కువ చేతులు పైకి లేస్తేనే బిల్లును ప్రవేశపెట్టాలి. ఇక్కడ మాత్రం ఇలా అడగలేదు, ఎవరూ చేతులు పైకెత్తలేదు. అయినా బిల్లును ప్రవేశపెట్టేశామని చెప్పడం తీవ్ర అన్యాయం. అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ చూశారు. పార్లమెంటులో జరిగిన విషయాలను ప్రతిపక్ష సభ్యులు కూడా తీవ్రంగా విమర్శించారు. మాతోపాటు సమాజ్ వాదీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీజేపీ.. అన్ని పార్టీలూ కూడా వాకౌట్ చేసిన సంఘటన ఇంతవరకు పార్లమెంటులో ఎప్పుడూ జరగలేదు. అందుకే ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తాయన్ననమ్మకం మాకుంది''. మేకపాటి, ఎస్పీవై రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి తదితరులు కూడా వైఎస్ఆర్సీపీ బృందంలో ఉన్నారు. గతంలో అద్వానీ, సుష్మా స్వరాజ్లతో కూడా భేటీ అయిన జగన్, ఇప్పుడు పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో ఈరోజు సమావేశమయ్యారు. -
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
తూ.గో.జిల్లాలో సమైక్య బంద్
-
ప.గో. జిల్లాలో బంద్ సంపూర్ణం
-
నెల్లూరులో నారాయణకు చేదు అనుభవం
సమైక్య ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యక్రమం నిమిత్తం నెల్లూరు వచ్చిన నారాయణను అక్కడ సమైక్యరాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న ఎన్జీవో నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదాన్ని బలపర్చాలని ఆయనను డిమాండ్ చేశారు. అయితే, ఇంతలో పోలీసులు వచ్చి, సమైక్యవాదులను అడ్డుకుని అక్కడినుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉండటంతో, దానిపై పార్టీ వర్గాలతో చర్చించేందుకు నారాయణ నెల్లూరు వచ్చారు. దాంతోపాటు స్థానికంగా పార్టీ పరిస్థితిపై కూడా చర్చించారు. -
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
-
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమైక్యవాదులు వేలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా కొంతమంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సీత, రమణమ్మ అనే మహిళలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
కర్నూలులో రోడ్డెక్కిన సమైక్యవాదులు
-
బంద్ విజయవంతం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్‌పై ముందే సమాచారం ఉండడంతో స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలను మూసివేశారు. దీంతో జిల్లా కేంద్రం బోసి పోయింది. ప్రజ లు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ఉదయానికే రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధానంగా విజయనగరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకున్నారు. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాన కూడళ్లలో అక్కడక్కడ తెరిచి ఉన్న దుకాణాలను మూయించా రు. బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసీ కార్యాలయాలను మూయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాణిజ్య సముదాయాలు బోసిపోయాయి. ప్రతి కూడలిలో రాస్తారోకోలు నిర్వహించి...కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం తదితర నియోజకవర్గాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలు, ఎన్జీవోలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు..... బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఖజానా, కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాలలో ఉద్యోగులతో పాటూ వివిధ కార్యాలయాల నుంచి జిల్లా అధికారులను సైతం బయటకు పంపించి ఎన్జీఓలు నిరసన తెలిపారు. కలెక్టరేట్లోని పలు కార్యాలయాలకు వె ళ్లాల్సిన మార్గాలను మూయించారు. దీంతో కలెక్టరేట్ బోసిపోయింది. ఉదయం నుంచే బ్యాంకులు ,పోస్టల్ కార్యాలయాలను మూసి నిరసన తెలిపారు. స్తంభించిన రవాణా వ్యవస్థ..... బంద్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సరుకుల రవాణా కూడా జరగలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. మూతపడ్డ పెట్రోల్ బంకులు.. పట్టణంలోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అయితే కొంత మంది యజమానులు మాత్రం ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు. రంజినీ యాడ్ లేబ్స్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ బంకుతో పాటూ పట్టణ శివారుల్లోని పలు బంకుల్లో బాటిళ్ల ద్వారా అధిక రేట్లకు పెట్రోల్‌ను విక్రయించారు. లీటరు పెట్రోలు రూ.100 నుంచి రూ. 140 వరకూ విక్రయించారు. దాడులు అన్యాయం.... పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయడాన్ని సమైక్యవాదులు ఖండించారు. అడ్డగోలుగా విభజన చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు స్పందించి విభజన బిల్లును అడ్డుకోవాలన్నారు. ఎటువంటి చర్చ జరగకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అంతేకాకుండా సమైక్య వాణి వినిపించినందుకు 18 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. మిగిలిన పక్షాలపై నేతలు ఒత్తిడి తెచ్చి బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు గంటా వెంకటరావు, ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె.శ్రీనివాసరావు, పి.పద్మనాభం, ఏపీ నాన్ టీచింగ్ సంఘ సెక్రటరీ పిడిపర్తి సాంబశివశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనలకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. -
తిరుపతి లో సమైక్య బంద్
-
రేపు సమైక్య బంద్‌కు వైఎస్ఆర్సీపీ పిలుపు
తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గురువారం నాడు సమైక్య బంద్ పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సమైక్య బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ కోరింది. బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపించేలా పార్టీ శ్రేణులన్నీ ఈ బంద్‌లో ముందుండాలని తన పార్టీ కేడర్‌ను ఆదేశించింది. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా విభజించే ప్రయత్నం, ఒక జాతిని చీల్చే ప్రయత్నం మునుపెన్నడూ జరగలేదని పేర్కొంది. ఇది ఢిల్లీ అహంకారానికి.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో అందరూ కలిసి ఢిల్లీ విభజన వాదం మీద దండెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. -
పనబాక దర్శన భాగ్యం కష్టమే!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశ రాజధాని నగరంలో ఉద్యమిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులకు కేంద్ర మంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి దర్శన భాగ్యం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కేంద్ర మంత్రిని కలవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. తమకు మద్దతు చెబుతారేమోనన్న ఆశతో ఏపీఎన్జీవో నాయకులు కొందరు ఢిల్లీలోని పనబాక లక్ష్మి నివాసానికి బుధవారం నాడు వెళ్లారు. కానీ, కలిసేందుకు మంత్రిగారి నుంచి ముందస్తు అనుమతి మీకు లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపేశారు. ఒక్కసారి కలిసి మాట్లాడి వెళ్లిపోతామని చెప్పినా ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని ఏపీఎన్జీవో నాయకులు సమైక్య నినాదాలు చేసుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
రైల్వేమంత్రి బడ్జెట్.. సహాయ మంత్రి నిరసన
పార్లమెంటులో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షాత్తు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, అదే శాఖకు చెందిన సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి మాత్రం వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక శాఖకు చెందిన మంత్రి ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతుంటేనే ఆ శాఖకు చెందిన సహాయ మంత్రులు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండి, తోటి సభ్యుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు, అలాగే సీనియర్ మంత్రికి ఏమైనా అవసరమైతే సహాయపడుతుంటారు. కానీ బుధవారం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్‌సభ సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే జాబితాలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కూడా ఉన్నారు. రైల్వే బడ్జెట్‌ను తన సీనియర్ మంత్రి ప్రవేశపెడుతున్నా దానికంటే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం, నిరసన తెలియజేయడమే ముఖ్యంగా భావించారు. దాంతో తోటి సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో కలిసి తాను సైతం వెల్‌లోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర ఎంపీలతో పాటు డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందినవారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో అచ్చం మన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లాగే రైల్వే బడ్జెట్ కూడా పది నిమిషాల్లోనే ముగించి, మిగిలినది కూడా చదివినట్లు భావించాలని చెప్పి వదిలేశారు. బడ్జెట్ ప్రతులను మాత్రం సభ్యులందరికీ పంచిపెట్టారు!! -
తెలుగు ప్రజల రక్తంతో విందులా?
తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ నాయకులతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విందు రాజకీయాలు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా ఆ పార్టీ అభిప్రాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల రక్తంతో మీరు విందులు చేసుకుంటారా అని నిలదీశారు. రాష్ట్రాన్ని బలిపీఠంపై పెట్టారని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లు మంటల్లో కాంగ్రెస్ నాయకులు మాడి మాసైపోతారుని జూపూడి దుయ్యబట్టారు. అసలు రైల్వే బడ్జెట్‌ను 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఎప్పుడైనా జరిగిందా అని ఆయన అడిగారు. ఒకవేళ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. -
పోడియం వద్దకు దూసుకెళ్లిన వైఎస్ జగన్
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మరోసారి సమైక్యవాణి వినిపించారు. రాష్ట్ర విభజన ఆపండంటూ ఫ్లకార్డుతో ఆయన పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. స్పీకర్ పోడియం వద్ద పార్టీ ఎంపీలతో కలిసి జగన్ నిరసన తెలిపారు. మరోవైపు తొలిసారిగా సీమాంధ్ర మంత్రులు వెల్‌లోకి రాగా, సీమాంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు వెల్‌లోకి దూసుకు వచ్చి పోటా పోటీగా నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. ఇక సీమాంధ్ర సభ్యులు బిల్లు ప్రతులను చింపి ఎగురవేశారు. కాగా సమైక్యాంధ్ర ఆందోళనల మధ్యే కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభ్యుల ఆందోళనలతో ఖర్గే తన ప్రసంగాన్ని కేవలం పది నిమిషాల్లోనే ముగించారు. మరోవైపు ఖర్గే బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెల్ వద్ద నిరసన తెలియ చేయటం విశేషం. -
కొనసాగుతున్న ఎన్జీఓల దీక్షలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఒకవైపు కార్యాలయాల్లో విధులను అడ్డుకుంటూనే...దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. త్యాగాలు చేసి అయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రొంగలి ఎర్రన్నాయుడు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడదీయాలని చూడడటం దుర్మార్గమన్నా రు. కొన్ని పార్టీల నాయకులు ద్వంద్వ ప్రమాణాలు అవలంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమైక్య వాణి విన్పించాలన్నారు. కాగా దీక్షలకు విశాలాంధ్ర మహా సభ నాయకలతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
గ్రీవెన్స్‌సెల్‌కు సమైక్య సెగ
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రీవెన్స్‌సెల్‌కు సమైక్య సెగ తగిలింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్ కార్యాలయాలనూ మూయించారు. అలాగే మిగిలిన కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించి కార్యకలాపాలను స్తంభింపజేశారు. గ్రీవెన్స్‌సెల్‌లో హోరెత్తిన సమైక్య నినాదం నేరుగా గ్రీవెన్స్‌సెల్ జరగుతున్న ఆడిటోరియంలోకి ఎన్జీఓలు ప్రవేశించి సమైక్య నినాదాలు విన్పించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అధికారులను కోరారు. అలాగే బయటన అర్జీలు రాస్తున్న వారిని సైతం అడ్డుకున్నారు. కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాలని పిలుపు నిచ్చారు. దీంతో కొంతమంది ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గ్రీవెన్స్‌సెల్‌ను అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. బయట అర్జీలు రాయకపోవడంతో కొంత మంది నిరాశతో వెనుదిరిగారు. దీంతో జెడ్పీ సీఈఓ మోహనరావు బయటకు వచ్చి పరిస్థితి సమీక్షించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని సమైక్యవాదులు కలెక్టర్‌ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మీ పని మీరు చేయండి.. మా పని మేము చేస్తామం’టూ బదులిచ్చారు. ఈ సందర్భంగా ఎన్జీఓ నాయకులు ప్రభూజీ, కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల వారూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ సేవలు బంద్
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీల సేవలు మంగళవా రం అర్ధరాత్రి నుంచి బంద్ కానున్నాయి. మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. సోమ, మంగళవారాల్లో కేవలం పెన్‌డౌన్ ప్రకటిస్తూ నిరసన తెలిపిన మున్సిపల్ ఉద్యోగులు, తాజా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పూర్తిగా విధులకు గైర్హాజరుకానున్నారు. దీంతో జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, రాజాం, పాలకొండ మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వేతనాలు పెంచాలని, ఉద్యోగభత్ర కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పారిశద్ధ్య కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులు కూడా సమ్మెలోకి రావడంతో పట్టణ ప్రజలు బెంబెలెత్తుతున్నారు. సోమవారం నుంచి విద్యుత్ దీపాల నిర్వహణ, తాగునీరు సరఫరా విభాగాల సేవలను కూడా పూర్తిగా నిలిపివేశారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కమిషనర్లు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. నిరవధిక సమ్మెలో పాల్గొనండి... జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులను నిలిపివేస్తూ నిరవధిక సమ్మెలో దిగుతున్నట్లు స్థానిక మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. సింహాచలం, ఐ.గౌరి శంకర్లు తెలిపారు. -
సమ్మెకు సై అంటున్న ఎపిఎస్ ఆర్టీసీ
-
సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ప్రదర్సన
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎందరు వద్దంటున్నా.. ఎంతకైనా తెగించి!
ఎంతమంది వద్దని చెబుతున్నా వినకుండా మొండిగా రాష్ట్ర విభజనపై ముందుకెళ్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రాజ్యసభలో సోమవారం నాడు నిరసన తీవ్రతను కళ్లారా చూశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. కాగితాలను చించేసి.. చివరకు చైర్మన్ మైకును కూడా విరగ్గొట్టారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో, ఎలాగైనా తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అధికార పక్షం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆందోళన చేస్తున్న ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసి, వారు రాకుండా చేసి అప్పుడు బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే శుక్రవారం నాడు రాజ్యసభలో పది మంది ఎంపీల పేర్లను కూడా చదివారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీని ఎలాగోలా ఒప్పించి, నచ్చజెప్పి రాజ్యసభలో తెలంగాణ బిల్లును గట్టెక్కించుకోవాలనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పెద్దలు మునిగి తేలుతున్నారు. మంగళవారం నాడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుతో ఇప్పటికే జైరాం రమేష్ తదితరులు మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు ఇవే చిట్టచివరి సమావేశాలు కావడంతో ఎలాగోలా తెలంగాణ ప్రక్రియను కొంతవరకు ముందుకు నడిపించి, తాము ప్రయత్నం చేశామని చెప్పుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 'రాహుల్ గాంధీ ఎన్నికల ఎజెండా' అని తెలంగాణ బిల్లును బీజేపీ అభివర్ణిస్తోంది. దీన్ని బట్టే కాంగ్రెస్ వ్యూహాలు అర్థమవుతాయి. ''ప్రజలు వద్దనుకుంటున్నప్పుడు, అసెంబ్లీ కూడా విభజన బిల్లును తిరస్కరించినప్పుడు కూడా పార్లమెంటులో ఎలాగోలా బిల్లును ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తగదు'' అంటూ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా సైతం వ్యాఖ్యానించడంతో ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు తెలుసుకుంటారేమో!! -
రాజ్యసభలో సమైక్య నినాదాలు: రేపటికి వాయిదా
న్యూఢిల్లీ:సమైక్య నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో ఇరు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. కాగా ఈరోజు ఉదయం సీమాంధ్ర సభ్యుల నిరసనల హోరు మధ్యే సమావేశాన్ని నిర్వహించేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ప్రయత్నించారు. స్పీకర్ విజ్ఞప్తిని సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే హైడ్రామా నడిచింది. సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసనలు తెలపడంతో తొలుత రాజ్యసభను పది నిమిషాలు వేయిదా వేశారు. అనంతరం ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా వేశారు. ఆతర్వాత సమావేశాలు ప్రారంభమైనా సభ్యులు నిరసనలు కొనసాగటంతో సభ రేపటికి వాయిదా వేశారు. -
ఆఖరి పోరాటం
సాక్షి, కాకినాడ :తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే తరుణం సమీపిస్తుండడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏపీఎన్జీఓలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలను సైతం సమ్మెలో భాగస్వాముల్ని చేస్తున్నారు. వైద్యులు కూడా సోమవారం నుంచి సమ్మెలోకి రానుండడంతో వైద్యసేవలు స్తంభించనున్నాయి. కాగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం 2కే రన్ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీఒలు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఆదివారం జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలో సమైక్య పరుగు నిర్వహించారు. కాకినాడలో ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో ఈ పరుగును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, ఐడియల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినికుమారి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి బాలాజీచెరువుసెంటర్ మీదుగా తిరిగి కలెక్టరేట్‌కు సాగిన ఈ పరుగులో ఉద్యోగులు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు అడ్డుకుని సమైక్యతను కాపాడాలని ఆశీర్వాదం కోరారు. బిల్లును అడ్డుకోని వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అమలాపురం గడియారస్తంభం సెంటర్ నుంచి నల్లవంతెన వద్ద గల తహశీల్దార్ కార్యాలయం వరకు సమైక్యాంధ్ర పరుగు నిర్వహించారు. పీఈటీ ల సంఘ జిల్లాఅధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి సమైక్యాంధ్ర జ్యోతితో పరుగులో పాల్గొనగా, ఏపీఆర్ఎస్ఏ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ దివాకర్, కోనసీమ జేఏసీ నాయకులు నక్కా చిట్టిబాబు నాయకత్వం వహించారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు సమైక్య పరుగు నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ సంఘ నగరాధ్యక్షుడు గెద్దాడ హరిబాబు, మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి, సీమాంధ్ర న్యాయవాదుల కో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి అమర్నాథ్ పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడుతూ తెలంగాణా బిల్లును అడ్డుకోనిసమైక్యాంధ్ర ద్రోహుల భరతం పడతామని హెచ్చరించారు. జీజీహెచ్‌లో నేటి నుంచి వైద్యసేవలు బంద్ సోమవారం నుంచి ప్రభుత్వ వైద్యులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. దీంతో కాకినాడ జీజీహెచ్‌లో అత్యవసర మినహా వైద్యసేవలను నిలిపి వేస్తున్నట్టు జీజీహెచ్ వైద్యుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. రాజమండ్రి ఆస్పత్రిలో కూడా వైద్యసేవలు స్తంభించనున్నా యి. సోమ, మంగళవారాల్లో పెన్‌డౌన్ చేస్తామని, బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని మున్సిపల్ ఉద్యోగులు ప్రకటించారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో ఇప్పటికే ఊళ్లలో చెత్త పేరుకుపోయింది. ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టనుండడంతో పౌరసేవలు స్తంభించనున్నాయి. సహకార, ప్రభుత్వ బీమా ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు కూడా సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు ఏపీఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి.ఆశీర్వాదం వెల్లడించారు. సోమవారం ప్రారం భమయ్యే డిపార్టమెంటల్ పరీక్షలకూ హాజరుకావద్దని ఉద్యోగులకు పి లుపునిచ్చారు. మొత్తమ్మీద జిల్లాలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చనుంది. మహిళా బిల్లు గతే పడుతుంది : మాజీ ఎంపీ శ్రీహరిరావు సాక్షి, రాజమండ్రి : మహిళా బిల్లుకు పట్టిన గతే విభజన బిల్లుకూ పడుతుందని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు అన్నారు. రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణపై సీడబ్ల్యుసీ నిర్ణయం ప్రకటించినప్పుడే సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసి, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇస్తే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజ్యసభలో దొడ్డిదారిన ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు భావిస్తున్న విభజన బిల్లుకు మహిళా బిల్లు గతే పడుతుందని, పదేళ్లైనా కదలిక ఉండదన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు గతంలో ప్రకటించిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా ఇది కొత్త పార్టీలపై చర్చించాల్సిన సమయం కాదని దాటవేశారు. -
రేపటి నుండి సీమాంధ్ర ప్రభుత్వ వైద్యుల సమ్మె
-
కావూరికి సమైక్య సెగ
ఢిల్లీలో మంత్రి నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర విద్యార్థి జేఏసీ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం మొండిగా ముందుకు వెళుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో కావూరి ఇంటిని ముట్టడించారు. విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కావూరి నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేత అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాద్‌ల నేతృత్వంలో 30 మంది విద్యార్థులు కావూరి ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా కావూరి వారిని కలిసేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. ఇంటిముందు బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యతను కాపాడతానని ప్రతిజ్ఞ చేసిన కావూరి నేడు పదవి కాపాడుకునేందుకు అధిష్టానానికి సహకరిస్త్తున్నారని ఆరోపించారు. కావూరి ఇంటిముం దున్న నేమ్‌ప్లేట్‌కు ‘రాష్ట్రాన్ని కాపాడండి’ ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అన్న పోస్టర్లను అతికించారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి నేత కిశోర్‌తోపాటు ఇతరులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టా రు. 15 రోజుల్లో పోయే పదవి కోసం కావూరి సమైక్య నినాదాన్ని పక్కనపెట్టారని విద్యార్థి నేత కిశోర్ విమర్శించారు. -
17న ఢిల్లీలో సమైక్య ధర్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం యూపీఏ ప్రభుత్వపు మూర్ఖపు నిర్ణయానికి నిరసన ఢిల్లీలోని తెలుగువారినీ సమీకరించి ఏడువేల మందితో ధర్నా చేస్తాం సమైక్యవాదులందరం 15న రెండు రైళ్లలో బయల్దేరి వెళ్తాం: ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వం మూర్ఖంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... ఈ నెల 17న ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డితో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘విభజన బిల్లు ఈ నెల 12న రాజ్యసభకు, 18న లోక్‌సభకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బిల్లు రాజ్యసభలో ముందుగా పెట్టడానికి చాలా సాంకేతిక సమస్యలున్నాయి. కనుక ముందుగా రాజ్యసభలో బిల్లు పెట్టరేమో అని భావిస్తున్నాం. బిల్లుపై లోక్‌సభలో పూర్తిగా చర్చించిన తర్వాతే రాజ్యసభలో పెట్టాల్సి ఉంటుంది. కనుక వారు మూర్ఖంగా బిల్లును 18న లోక్‌సభలో పెట్టాలని భావిస్తే వారికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయడం కోసం ఈ నెల 15న ఇక్కడి నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ బయలుదేరి 17న జంతర్‌మంతర్ వద్ద బహిరంగసభ, ధర్నా చేపట్టాలని నిర్ణయించాం. ఇక్కడి నుంచి వెళ్లే ప్రత్యేక రైలులో 24 బోగీలుంటాయి. రెండు రైళ్లలో కలిసి మొత్తం నాలుగువేల మంది దాకా వెళ్లే అవకాశముంది. అలాగే ఢిల్లీలోని తెలుగువారందరినీ సమీకరించి ఏడు వేల మందితో పెద్దఎత్తున ధర్నా చేపట్టి కేంద్రానికి కనువిప్పు కలిగిస్తాం’ అని అన్నారు. కాంగ్రెస్ పథకానికి.. టీడీపీ వత్తాసు.. విభజన బిల్లు కేంద్ర కేబినేట్ ఆమోదం పొందినప్పటికీ, బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆమోదం పొందడానికి అనేక ఆటంకాలున్నందున, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ఆశాభావం తమలో ఉందని ఉమ్మారెడ్డి చెప్పారు. సమైక్యాన్ని కోరుకుంటూ ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రానికి పట్టడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని తయారుచేసుకుంటే దానికి టీడీపీ వత్తాసు పలుకుతున్న వైనం ప్రజానీకమంతా గమనిస్తూనే ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని మొదటి నుంచి కూడా వైఎస్సార్సీపీ చెబుతూనే, సమైక్యంగా ఉంచడం కోసం ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపట్టిందని ఆయన వివరించారు. ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు.. ట్రైన్ నెం.1: తిరుపతి-కడప-గుత్తి-కర్నూలు-సికింద్రాబాద్-రామగుండం-న్యూఢిల్లీ ట్రైన్ నెం.2: రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-ఖమ్మం-ఖాజీపేట-మంచిర్యాల-న్యూఢిల్లీ ఇక్కడి నుంచి 15న బయలుదేరే ప్రత్యేక రైళ్లు, ధర్నా ముగియగానే 17వ తేదీ రాత్రికి తిరుగు ప్రయాణమవుతాయి. (రైళ్లు బయలుదేరే సమయాన్ని తర్వాత ప్రకటిస్తారు) -
17న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి మహాధర్నా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 17 వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సుమారు 7వేల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల15న రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. తిరుపతి నుంచి ఒకటి, రాజమండ్రి నుంచి మరొక రైలు బయల్దేరుతుందని వివరించారు. ఒక్కొక్క రైలులో సుమారుగా 1800 మంది కార్యకర్తలు, రెండీంటిలో కలిపి మొత్తం 3600 మంది ఢిల్లీ వెళతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలని విజ్ఙప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి నిమిషం వరకు పోరాడుతామని ఉమ్మారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మెజారిటి ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పథకం ప్రకారం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజను మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 3ను సవరించాలని, రాష్ట్రాల అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలో బిల్లు పెట్టడానికి సాంకేతికపరమైన అడ్డంకులున్నాయని తెలిపారు. -
17న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి మహాధర్నా
-
జగన్‌కు సమైక్యవాదుల నుంచి ఘనస్వాగతం
-
ఉద్యమ బావుటా
తెలంగాణ బిల్లును నిరసిస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులు మద్దతుగా కదం తొక్కిన విద్యార్థులు రెండో రోజూ మూతపడిన కార్యాలయాలు స్తంభించిన పాలన ఏలూరు, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరింది. దాదాపుగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలన్నీ మూతపడ్డారుు. దీంతో పాలన స్తంభించింది. ఏలూరు సహా అన్ని పట్టణాల్లోనూ ఎన్జీవోలు, ఉద్యోగులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. పలుచోట్ల విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉద్యోగులతో కలసి కదం తొక్కార్జు. ఏలూరు ఎన్జీవోలు కళా జాతాలు, డప్పు వారుుద్యాల సందడి నడుమ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంగణంలో గల అన్ని విభాగాల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించివేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాలకు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, అసోసియేషన్ ప్రతినిధులు ఆర్ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాస్, పి.సోమశేఖర్, రమేష్‌కుమార్, నర సింహమూర్తి నాయకత్వం వహించారు. ఆకివీడులో ఎన్జీవోలు రాస్తారోకో చేసి ప్రభుత్వ కార్యాలయాలను మూ రుుంచివేశారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యు డు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వారికి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలో ఎన్జీవోలు ర్యాలీ, మానవహారం చేశారు. నరసాపురంలో ఎన్జీవోలు పంచాయతీరాజ్, ముని సిపాలిటీ, సబ్ ట్రెజరీ కార్యాలయాలను మూరుుంచివేశారు. సమ్మెలో లేని ఆ శాఖల ఉద్యోగులను బయటకు పంపించివేశారు. నిడదవోలులో ఎన్జీవోలు మానహారం ఏర్పాటు చేశారు. అనంత రం ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ముట్టడించారు. భీమవరం జువ్వలపాలెం రోడ్డులో చైతన్య కళాశాల విద్యార్థులు రాస్తారోకో జరి పారు. ఎన్జీవోలు ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. తణుకులో మునిసిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ చేసి ధర్నా నిర్వహించారు. ఎన్జీవోలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకొల్లు లాకుల సెంటర్లో ఎన్జీవోలు రాస్తారోకో చేసి నిరసన గళమెత్తారు. ఇరిగేషన్, ఎంపీడీవో కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, వైఎస్సార్ సీపీ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్ పాల్గొన్నారు. కొవ్వూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు ధర్నా చేశారు. తాళ్లపూడిలో నిరసన ప్రదర్శన జరిగింది. -
అదే సంకల్పం..ఆగలేదు సమరం
కడవరకూ పోరాడదాం సాక్షి, కాకినాడ : ‘కడ వరకు పోరాడదాం... రాష్ర్ట సమైక్యతను కాపాడుకుందాం’ అంటూ ఏపీఎన్జీఓలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌తో సహా వీఆర్వో కార్యాలయం వరకు పరిపాలన పూర్తిగా స్తంభించింది. సమ్మె బాటపట్టిన ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. రెండో రోజు వీరి ఆందోళనలకు పలు చోట్ల ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు. విభజన బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితులు కన్పిస్తుండడంతో సోమవారం నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ట్రెజరీ, హౌసింగ్, సహకార శాఖ సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మె బాటపట్టనున్నారు. మరొక పక్క తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అర్ధరాత్రి నుంచే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పారిశుద్ద్య సిబ్బంది సమ్మె బాట పట్టనుండడంతో మిగిలిన ఉద్యోగులు సోమవారం నుంచి సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మెలోకి రావాలని ఏపీ ఎన్జీఓలు పిలుపునిచ్చారు. వినూత్న నిరసనలు ఏపీఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వే శారు. కలెక్టరేట్ రోడ్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయం, జెడ్పీ, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాలను కూడా దగ్గరుండి మూయించి వేశారు. జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. జెడ్పీ ఉద్యోగిని తెలుగుతల్లి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై జరిగిన ప్రదర్శనలో ‘తెలుగుప్రజలందరం ఒక్కటిగా ఉందాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం అంటూ నినదించారు. విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఏపీ ఎన్జీఓలు, ఏయూ పూర్వవిద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీఓలు నిరసన ప్రదర్శన చేయగా, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ శిబిరాన్ని జేఏసీ నాయకులు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. 10న కేంద్ర కార్యాలయాల ముట్టడి 10వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 12వ తేదీన రహదారులను దిగ్బంధించాలని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపు నిచ్చారు. 10వ తేదీన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట అధ్యక్షుడు పి. అశోక్‌బాబు ముఖ్యఅతిథిగా జరుగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
-
పది సవరణలకు సరేనంటే.. విభజనకు ఓకే: జేడీ శీలం
తెలంగాణ బిల్లుకు తాము 10 సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలని, తెలంగాణలో అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలని తాము కోరామన్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే జీహెచ్ఎంసీ పరిధిని యూటీ చేయాలని శీలం అన్నారు. అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని, సీమాంధ్రలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు ఉండేలా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు భాగం కావాలని, సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయితీలు ఇవ్వాలని శీలం అన్నారు. ఉమ్మడి సదుపాయాలను అలాగే కొనసాగించాలని, ఇప్పుడున్న సంస్థల్లో రెండు ప్రాంతాలకూ అవకాశమివ్వాలని తెలిపారు. సీమాంధ్రలో కొత్త విద్యాసంస్థలు ఏర్పడేవరకు ఇప్పుడున్న విద్యాసంస్థల్లో అందరికీ అవకాశాలు కల్పించాలని, ఈ సవరణలకు ఆమోదం తెలిపితే రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. -
గందరగోళం మధ్య బిల్లులు.. లోక్‌సభ వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాయి. ముగ్గురు ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. సభ ముందుకు వివిధ కమిటీల నివేదికలు వచ్చాయి. పోడియం వద్దే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు ఉన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన కొనసాగింది. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఎంపీలు ఆందోళన చేశారు. అయితే, ఈ ఆందోళన మధ్యనే కేంద్ర మంత్రులు చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్ లాంటి కొందరు వివిధ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం తెలంగాణ బిల్లు వ్యతిరేక ఆందోళనలకు దూరంగానే ఉండిపోయారు. కేవలం ఎంపీలు మాత్రమే వీటిలో పాల్గొంటున్నారు. స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలు ఇచ్చారు. దీంతో మళ్లీ లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. -
జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలుకు దక్షిణం వైపుగల జాతీయ రహదారిపై ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గురువారం రాస్తారోకో చేశారు. పది నిమిషాలకుపైగా రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకుడు ఆర్.జగదీశ్ మాట్లాడుతూ ఆరుకోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన కోర్ కమిటీ మీటింగ్‌లో కూడా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలని కోరారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎక్కడా రాష్ట్ర విభజన జరగలేదని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒంగోలు సెంటర్ పీడీ ఆసిఫ్ ఉద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కువ నష్టపోయేది విద్యార్థులేనన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీంద్రకుమార్, పి.వెంకటరావు, జె.అరుణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆఖరి పోరు...!
రాష్ట్ర విభజన ప్రక్రియ ఆఖరి దశకు చేరుకోవడంలో సమైక్యవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఎన్జీఓలు, న్యాయవాదులు, విద్యార్థులు గురువారం విభజనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయూలను మూసివేసి, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. వైద్య ఉద్యోగులు కేంద్రాస్పత్రి వద్ద ధర్నా నిర్వహించగా.. టీడీపీ నాయకులు గంట స్తంభం వద్ద మానవహారం చేపట్టారు. విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని సమైక్య రా ష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించా రు. తొలుత కలెక్టరేట్లోని అన్ని విభాగాలను మూయించారు.అలాగే ఐసీడీ ఎస్ వీడియో కాన్ఫరెన్సును అడ్డుకుని, ఉద్యోగులను బయటకు పంపించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎన్జీఓ సంఘం జిల్లాఅధ్యక్షుడు ప్రభూజీ, రెవె న్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు మాట్లాడుతూ విభజన బిల్లుపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.సమైక్యం కోసం పార్టీలకు అతీతం గా ప్రజాప్రతినిధులంతా ఒకే వాణి వినిపించాలని డిమాం డ్ చేశారు. విభజనకు సహకరించిన వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. శుక్రవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. గెజిటెడ్ అధికారుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు డివి రమణ, ఆర్ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె. శ్రీని వాసరావు, రత్నం, రామరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయూల మూసివేత కలెక్టరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలను మూసివేశారు. విజయనగరంలో కార్మిక శాఖ,తదితర కార్యాలయాలను మూయించారు. సాలూరులో ఎన్జీఓ, మున్సిపల్ అధికారులు రాస్తారోకో నిర్వహించారు. విజయనగరం మున్సిపాలిటీలో ఉద్యోగులు పెన్‌డౌన్ చేసి, నిరసన తెలిపారు. కొన్ని కార్యాలయూలు పూర్తిగా మూతపడగా, మరికొన్ని కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో విధులు నిర్వర్తించారు. నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన ఉద్యమంలో భాగంగా నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టనున్నారు. కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకూ నిరసనలు కొనసాగిస్తామని ఎన్జీఓ నేతలు తెలిపారు. తెలుగు జాతి ద్రోహులకు శిక్ష తప్పదు విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వినూత్న నిరసన విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే తెలుగు జాతి ద్రోహులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. గురువారం విశాలాం ధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట వి నూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు జాతిని ని లువునా చీల్చేందుకు కుట్ర పన్నుతున్న కేసీఆర్, కోదండరామ్ దిష్టిబొమ్మలను బహిరంంగా ఉరి తీసి, కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లతో కొట్టారు. ఈ సందర్భంగా మామిడి మాట్లాడుతూ తెలంగాణ వాదులతో కుమ్మక్కైన సీమాం ధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా కో కన్వీనర్ మద్దిల సోంబాబు, కార్యదర్శి ఇట్ల కిషోర్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు జగన్, విద్యార్థి సంఘం నాయకుడుఅనిల్, పాల్గొన్నారు. -
ఉద్యోగుల ‘సమైక్య’ సమ్మె
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఒకటి, రెండు రోజుల తేడాతో జేఏసీలో భాగస్వామ్యం కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి సమ్మె పార్లమెంట్ సమావేశాలు జరగనున్న రోజులు మాత్రమే కొనసాగనుంది. పరీక్షలు ముంచుకొస్తుండటంతో ఉపాధ్యాయులు సమ్మెలో పాల్పంచుకోవడం అనుమానమని తెలుస్తోంది. టెజరీ, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టు 13వ తేదీ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మికులు 66 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుతం విభజన బిల్లు పార్లెమెంటులోకి ప్రవేశించనున్న నేపథ్యంలో బిల్లును అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు మళ్లీ సమ్మె చేసేందుకు నిర్ణయించాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి పెంచి విభజన బిల్లును అడ్డుకునేలా చూడాలనేది ఉద్యోగ సంఘాల ఉద్దేశం. సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పాలనను స్తంభింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 6వ తేదీ నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేల పరీక్ష జరిపితే విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్నికల విధులను సైతం బహిష్కరించాలని నిర్ణయించడం గమనార్హం. -
సమైక్యంగా మళ్లీ..సమరసీమకు..
సాక్షి, కాకినాడ :ప్రభుత్వోద్యోగులు మళ్లీ పోరుబాట పట్టారు. ‘సమైక్యాంధ్రే’ తమ సమరలక్ష్యమని ఎలుగెత్తారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో నేపథ్యంలో.. విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని ఎన్జీఓలు సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 32 వేలమంది విధులు గురువారం నుంచి విధులను బహిష్కరించనున్నారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది మినహా రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, కమర్షియల్, రవాణా, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, చేనేత, విద్య, వైద్యఆరోగ్యం, పశుసంవర్ధక, గంథాలయ, కార్మిక, సాంఘిక, బీసీ, వికలాంగుల, మైనార్టీ సంక్షేమ తదితర శాఖలతో పాటు ఎక్సైజ్ మినిస్టీరియల్ స్టాఫ్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో గురువారం లగాయతు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి. గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ వరకు అధికారులు, సిబ్బందితో పాటు కలెక్టర్, జేసీ, ఏజేసీ, డీఆర్వోల వద్ద పనిచేసే అటెండర్లు, డ్రైవర్లతో సహా సమ్మెలోకి వెళ్లనున్నారు. శుక్రవారం నుంచి కార్పొరేషన్, మున్సిపాలిటీల సిబ్బంది కూడా సమ్మెలోకి రానున్నారు. ఈనెల 10 నుంచి సమ్మె బాటపట్టాలని హౌసింగ్ సిబ్బంది నిర్ణయించారు. ట్రెజరీ, కోఆపరేటివ్, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల సిబ్బంది సమ్మెలో పాల్గొనే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియపై సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని ఈనెల 10లోగా బదిలీ చేయాల్సి ఉంది. అయితే వారు సమ్మె బాట పట్టనుండడంతో ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవచ్చు. అన్ని శాఖలూ సమ్మెలోకి రావాలి.. కాగా బుధవారం సాయంత్రం కాకినాడలోని ఏపీ ఎన్జీఓ సంఘ భవన్లో రాష్ర్ట ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ నేతలతో పాటు గతంలో జరిగిన సమైక్య సమ్మెలో పాల్గొన్న వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నాయకులు, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జవహర్ అలీ, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, మున్సిపల్ జేఏసీ నాయకులు డీవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. ఎన్జీఓల సంఘం పిలుపు మేరకు గతంలో మాదిరిగానే సమ్మెలో పాల్గొంటామని వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న సమ్మెలో ప్రతి ప్రభుత్వోద్యోగీ పాల్గొనాలని ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపునిచ్చారు. విభజనను అడ్డుకునే ఆఖరి ఘట్టంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన బాధ్యత సమైక్యవాదులపై ఉందన్నారు. సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ విభజన బిల్లును అడ్డుకునేందుకు గత ఏడు నెలలుగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విభజన బిల్లును కూడా అడ్డుకొని సమైక్యతను కాపాడాలన్నారు. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి తెలియాలంటే గతంలో మాదిరిగానే ప్రభుత్వశాఖలన్నీ సమ్మెబాట పట్టాలన్నారు. ప్రస్తుతానికి పోరుబాట పడుతున్నది వీరే.. గెజిటెడ్ అధికారులు 3,354 ఎన్జీఓలు 16,823 క్లాస్-4 ఉద్యోగులు 6680 ప్రభుత్వ డ్రైవర్లు 530 వీఆర్ఏలు 2631 వీఆర్వోలు 2185 -
ఏపీ భవన్లో ఉద్రిక్తత
తెలంగాణ, సమైక్య నినాదాలతో ఏపీ భవన్ బుధవారం దద్దరిల్లింది. తెలంగాణ బిల్లును అడ్డుకోవదంటూ ఆ ప్రాంత వాదులు సీఎంకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న సమైక్య వాదులు సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నినాదాలు చేశారు. దాంతో ఇరుప్రాంతవాసుల నినాదాలతో ఏపీ భవన్ పరిసర ప్రాంతాలు దిక్కులు పెక్కుటిల్లాయి. ఏపీ భవన్లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అయితే అదే సమయంలో ఏపీ భవన్లో ఉన్న సీఎం కిరణ్ క్వాన్నాయ్లో బయటకు బయలుదేరారు. దాంతో అక్కడే ఉన్న తెలంగాణవాదులు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్‌లోకి దూసుకెళ్లారు. తెలంగాణ వాదుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ భవన్‌తో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు ప్రాంతాల వారిని శాంతింప చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. -
నేటి అర్ధరాత్రి నుంచి ‘రెవెన్యూ’ సమ్మె
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవో సంఘం పిలుపు మేరకు.. జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ విషయాన్ని జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా ఆధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీకాంత్‌లు మంగళవారం తెలిపారు. గురువారం నుంచి వీఆర్ఏ, వీఆర్ఓ నుంచి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటామన్నారు. సమ్మెకు అందరూ సహకరిం చాలని కోరారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఉద్యోగ సంఘాలు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పడుతున్నాయి. రాష్ట్ర విభజనపై యూపీఏ చర్యలకు నిరసనగా ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేయాలని నిర్ణయించాయి. సమైక్యరాష్ట్ర పరిరక్షణ పిలుపు మేరకు ఏపీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో కలెక్టరేట్ నుంచి పంచాయతీ కార్యాలయం వ రకు అన్నీ మూతపడనున్నాయి. గురువారం నుంచి ప్రజా సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్న సమయంలో ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి వరుసగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి రెవెన్యూ సదస్సులకు ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయం మేరకు జిల్లాలో ఉన్న 3200 వీఆర్ఏ, 1200 మంది వీఆర్వో, 800 మంది రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం చివరి పోరాటంగా ఈ సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. -
6నుండి ఏపీఎన్జీఓల సమ్మె
-
జంతర్ మంతర్‌కు మారిన సీఎం దీక్షావేదిక
-
జంతర్ మంతర్‌కు మారిన సీఎం దీక్షావేదిక
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేయ తలపెట్టిన నిరాహార దీక్ష వేదిక మారింది. తొలుత ఇందిరాగాంధీ సమాధి ఉన్న శక్తిస్థల్ వద్ద దీక్ష చేయాలని ముఖ్యమంత్రి తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే, శక్తిస్థల్ వద్ద మరమ్మతులు చేస్తున్నారని, అందువల్ల అక్కడ ఎలాంటి దీక్షలు వద్దని అధికారులు సూచించినట్లు తెలిసింది. దీంతో దేశ రాజధాని నగరంలో పోరాటాలకు వేదిక అయిన జంతర్ మంతర్ వద్దకు సీఎం కిరణ్ దీక్షావేదిక మారింది. -
నేడు ఢిల్లీకి వైఎస్ జగన్
-
నేడు ఢిల్లీకి వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కోరిన జగన్.. ఇదే సమయంలో పార్లమెంటు వేదికగా మరోసారి పలు పార్టీల మద్దతు కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు వీలుగా ఇప్పటికే అపాయింట్మెంట్ను కోరారు. కాగా రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన సభ్యులందరూ సహకరించాలని కేంద్ర మంత్రి కమల్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. -
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు మళ్లీ సమ్మె భేరి మోగించబోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుంచి ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. 7, 8, 9 తేదీల్లో కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించారు. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ పాటించనున్నారు. ఆ తర్వాత 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. -
సమైక్య రాష్ట్రం కోసం మీరేం చేశారు?
ధర్నాలు చేశారా? దీక్షలు చేశారా? రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారా? కిరణ్, చంద్రబాబులపై జగన్ ధ్వజం చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో తెలంగాణ నేతలతో విభజన అనిపిస్తారు.. సీమాంధ్ర నేతలతో సమైక్యమనిపిస్తారు 8 నెలల కిందటే కిరణ్ తన రాజీనామాను సోనియా ముఖాన పడేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు ‘ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాయకుడంటే కార్పొరేటర్ నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు ఒకే తాటి మీద ఉండాలి. తమ వాదన ధైర్యంగా వినిపించి ప్రజలను ఓట్లు అడగాలి. 8 నెలల కిందటే కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను సోనియా గాంధీ ముఖాన పారేసి ఉంటే ఈ రోజు విభజన ఇక్కడి దాకా వచ్చేది కాదు. సమైక్య ముసుగులో డ్రామాలు చేస్తున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏరోజైనా సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేశారా? ఏ రోజైనా ధర్నాలు చేశారా? రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారా? ఆర్టికల్ 3 దుర్వినియోగం గురించి ఏ రోజైనా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారా? మీ ఇద్దరిలో ఒకరైనా ఒక లైన్ మీద ఉన్నారా? కేసీఆర్, చంద్రబాబు, కిరణ్‌కు తేడా ఏమీ లేదు. మూడు ప్రాంతాల్లోనూ సమైక్యాన్ని కోరే ప్రజలున్నా.. వారి మధ్య చిచ్చు పెట్టి విభజిస్తున్న మీరు విభజనవాదులు కాదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించినవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్రజాప్రస్థానం(ప్లీనరీ)లో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో నీతి లేని రాజకీయం.. 2011 జూలై 8వ తేదీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పార్టీ తొలి ప్లీనరీ జరిగింది. ఈ రెండున్నరేళ్లలో చాలా చూశాం. చాలా కష్టాలు, చాలా చాలా కుతంత్రాలు, అన్యాయమైన, నిజాయితీ లేని రాజకీయాలు చూశాం. ఇన్ని జరుగుతున్నా ఎక్కడా, ఎవ్వరూ, ఎప్పుడూ కూడా తొణకలేదు.. బెణకలేదు, అదరలేదు.. బెదరలేదు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించేందుకు, ఓట్ల కోసం, సీట్ల కోసం చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరూ కూడా కుమ్మక్కై, కోర్టుల దాకా ఒక్కటిగా వెళ్లి కేసులు పెట్టిన రోజులు చూశాం. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నేరం రుజువు కాకుంటే మూడు నెలల్లోపు ఆ వ్యక్తి ఎవరైనా సరే బెయిలిచ్చి బయటకు పంపాలి. అయినా కూడా దర్యాప్తు పేరుతో, విచారణసైతం జరగకుండా ఒక వ్యక్తిని 16 నెలలపాటు జైల్లో ఉంచిన నీచమైన రాజకీయాలు చూశాం. 16 నెలలు జైల్లో పెట్టి నన్ను కనపడకుండా చేయాలనుకున్నారు. వైఎస్సార్ సీపీని లేకుండా చేయాలనుకున్నారు. నేను ఎవరినీ కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఇంత చేసినా వెంట్రుక కూడా పీకలేకపోయారు. జైల్లో ఉన్నప్పుడు భయాల మధ్య, అన్యాయమైన రాజకీయాల మధ్య ఎప్పుడూ కూడా నిజాయితీని, ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వసనీయతను ఏ రోజూ నేను వమ్ము చేయలేదు. నేను జైల్లో ఉన్నా కూడా పార్టీ బాధ్యతలను స్వీకరించిన నా తల్లి విజయమ్మ, నా చెల్లి షర్మిల, నాకు తోడుగా నిలిచిన నా భార్య భారతి, పార్టీలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నేను మరచిపోలేని రోజులవి.. జైల్లో ఉన్న ఆ 16 నెలలు నేను మరచిపోలేని రోజులు. బయట జరుగుతున్న నీచమైన రాజకీయం చూసి నా గుండె తట్టుకోలేకపోయింది. అప్పట్లో పార్లమెంటులో ఎఫ్‌డీఐ బిల్లు మీద ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. జగన్‌ను జైల్లో పెట్టారు.. కార్యకర్తలను బెదిరించారు. జగన్ ఇక బయటకు రాడనీ, తీహార్ జైలుకు తీసుకు వెళతారని ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు రాయించారు. ఇంత చేసినా ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో పేదలు, చిల్లర వర్తకుల భవిష్యత్తు కోసం జగన్ నిజాయితీగల రాజకీయం చేశాడు. అదే చంద్రబాబు అయితే ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో సీబీఐ కేసులు ఎదుర్కోకుండా ఉండటంకోసం కాంగ్రెస్‌తో లాలూచీ పడి తన ఎంపీలను ఓటింగ్‌కు గైరు హాజరు చేయించారు. రాష్ట్రంలోని కిరణ్ సర్కారు ప్రజల మీద 32 వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బాదుడు బాదితే ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపెట్టాయి. జగన్ జైల్లో ఉండి కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతోపాటు తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో, ఆరుగురు టీడీపీ శాసనసభ్యులతో కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించాడు. కానీ చంద్రబాబు బయటే ఉన్నా.. కేసులకు భయపడి కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయించి కాంగ్రెస్ సర్కారును కాపాడాడు. చంద్రబాబు భయానక పాలన.. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి... వైఎస్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు భయానక పాలన సాగుతూ ఉండేది. ఆ సమయంలో గ్రామాల్లోకి వెళితే అవ్వలు, తాతలు మాకు ఫించన్ రావడం లేదని చెప్పిన రోజులు గుర్తున్నాయి. పెన్షన్ చూస్తే రూ.70 మాత్రమే ఇచ్చేవారు. అది కూడా గ్రామాల్లో 200 మంది లేదా 150 మంది వృద్ధులుంటే.. కేవలం పది పదిహేను మందికే పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి మంజూరు చేస్తామని అధికారులు చెబుతుంటే గుండెలు తరుక్కుపోయేవి. పేదల పిల్లలు ఇంజనీరింగ్ చదవాలంటే రూ.30 వేల ఫీజు కట్టాల్సి వచ్చేది. ఇది కట్టడానికి ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. చంద్రబాబు సీఎంగా ఒక్క రోజైనా వారి బాధలు విన్నారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి. రైతన్నలకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండి అని రాజశేఖరరెడ్డి ధర్నాలు, దీక్షలు చేసి అడిగితే.. కరెంటు ఉచితంగా ఇస్తే.. ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాకుండా పోతాయన్నారు చంద్రబాబు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం.. ‘‘సమైక్యం అంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు. కానీ 70 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు ముందుకు పోతోంది. సోనియా గాంధీ డెరైక్షన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకవైపు రాష్ట్ర విభజనకు సహకరిస్తూనే మరోవైపు సమైక్యాంధ్ర ఛాంపియన్ అనిపించుకునే నీచమైన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు సభలోనే ఒక చేత్తో సైగ చేసి తన పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలతో జై తెలంగాణ అనీ, మరో చేత్తో సైగ చేసి సీమాంధ్ర ఎమ్మెల్యేలతో జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేయిస్తున్నారు. సోనియా, కిరణ్, చంద్రబాబు ఎవరూ చూడటం లేదనుకుని విభజన రాజకీయం చేస్తున్నారు. కానీ పైన దేవుడు చూస్తున్నాడు. మనం సింహాల్లా ముందుకు పోయి 30 ఎంపీ సీట్లు గెలిచాక.. ఈ రాష్ట్రాన్ని విభజించే దమ్ము, ధైర్యం ఎవరికుందో చూద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానిని చేద్దాం.’’ - జగన్ -
‘ముఖ్యమంత్రివి డ్రామాలు’
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. శనివారం ఆయన పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన కు అనుకూలంగా సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని కేం ద్రం ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి, రాజ కీయ సంక్షోభం సృష్టిస్తే... పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదన్నారు. ఇప్పు డు తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకునే సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఏసీబీ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ప్రశంసాపత్రాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజమన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు కెఎ నాయుడు, డీవీజీ శంకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మన్యాల కృష్ణ, ఎస్ఎన్ఎం రాజు, తదితరులు ఉన్నారు. -
సీఎం కిరణ్ సమైక్య విలన్
కర్నూలు : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య హీరో అనిపించుకోవాలని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య విలన్ అని వ్యాఖ్యానించారు. ఉవ్వెత్తిన సమైక్య ఉద్యమాన్ని అణిచివేసింది ముఖ్యమంత్రి కాదా అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. సోనియా గాంధీ కనుసన్నల్లోనే కిరణ్ రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. -
రాజు తొలగె.. చైతన్యం చెదరగ..
ఒత్తిళ్లు తట్టుకోలేకే తప్పుకొన్నా... ఒత్తిళ్లు తట్టుకోలేకే నామినేషన్ ఉపసంహరించుకున్నా. సమైక్యాంధ్ర ఆకాంక్షను బలంగా వినిపించేందుకు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పోటీలో ఉండాలని భావించాను. మద్దతుగా నిలిచిన వారు తటపటాయించారు. మరో పక్క అధిష్టానంతో పాటు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్ర మంత్రులతో పాటు చివరకు సోనియా ప్రత్యేక సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. చివరి నిమిషంలో తప్పనిసరై నామినేషన్ ఉపసంహరించుకోవల్సి వచ్చింది. - కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్సీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘సమైక్యాంధ్ర’ పరిరక్షణ కోసమే రాజ్యసభ బరిలో నిలుస్తున్నానని, ఐటీ దాడులు, పోలీసు కేసుల బూచిని చూపినా రామబాణంలా వెనుతిరిగేది లేదని, ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు పన్నినా స్వతంత్రునిగా కదనం కొనసాగిస్తానని అన్న ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారా యణరాజు (చైతన్యరాజు).. కాంగ్రెస్ అధిష్టానంపై దూసింది నిజమైన కత్తి కాక కొయ్యకత్తేనని తేలిపోయింది. తన విజయంతో సమైక్యాంధ్రను పరిరక్షించుకుందామన్న ఆయన పలుకులు.. చివరికి ఉత్తర కుమార ప్రగల్భాలుగానే మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం వచ్చేసరికి రాజు గారిలోని ‘చైతన్యం’ ఎందుకో జావ కారిపోయింది. ‘నిజంగానే సమైక్యాంధ్ర కోసం మన జిల్లావాసి కంకణం కట్టుకున్నా‘రన్న ప్రజల మురిపెం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సింహంలా గర్జించిన వ్యక్తి.. ఒక్కరోజు వ్యవధిలోనే తోకముడిచినట్టు.. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కారణం.. ఆయన చెపుతున్నట్టు ఒత్తిళ్లతోనేనా, ఇంకా ఏమైనా జరిగిందా అన్న సందేహం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్యుల వరకూ అందరినీ వేధిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరాన్ని వినిపించిన చైతన్యరాజు స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్న ప్రజల అభిమతాన్ని గుర్తించేలా అధిష్టానం కళ్లు తెరిపించేందుకు ఇదే సరైన సమయమని కూడా హుంకరించారు. చైతన్యరాజు, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి, రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, పలువురు ఒత్తిడి చేయడంతో బరిలోకి దిగుతారనుకున్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్లలో ఒకరు మాత్రమే స్వతంత్రునిగా పోటీలో ఉంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మద్దతుతో గెలుపు సునాయాసమవుతుందన్న అంచనాలు వెలువడ్డాయి కూడా. దివాకరరెడ్డిని ఒప్పించి బరి నుంచి వైదొలగజేశారు. ఆదాల కూడా మడమ తిప్పుతారని, ఇక స్వతంత్రంగా బరిలో నిలిచే ఏకైక అభ్యర్థి చైతన్యరాజే అవుతారని, తద్వారా జిల్లా పేరు పెద్దల సభకు జరిగే ఎన్నికల్లో మారుమోగుతుందని అంతా ఆశించారు. అంత మద్దతున్నప్పుడు.. మడమ తిప్పడమెందుకో? జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప మిగిలిన 12 మంది మద్దతు తనకేనని, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 52 మంది అండతో గెలుపు ఖాయమని చైతన్యరాజు ధీమా వ్యక్తం చేశారు. మరి, అలాంటప్పుడు బరి నుంచి ఎందు కు తప్పుకోవాల్సి వచ్చిందో ప్రశ్నార్థకం. సీఎం కోటరీ నుంచి సానుకూల సంకేతా లు అందడంతోనే స్వతంత్రంగా బరిలోకి దిగడానికి చైతన్యరాజు సిద్ధపడ్డారని సమాచారం. అయితే చివరికి సీఎం కిరణే ఆయన బరి నుంచి వైదొలగేలా చేశారనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును తిరస్కరించామని గొప్పలకు పోయిన అధికారపార్టీ పెద్దలే చైతన్యరాజుకు కళ్లెం వేయడం వారి నైజానికి అద్దం ప డుతోందని పరిశీలకులంటున్నారు. తొలుత నామినేషన్ వేయించడం, ఆనక ఉపసంహరింప చేయడం అధిష్టానం వద్ద మార్కులు కొట్టే వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద తామంతా ఒకే తాను ముక్కలమని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్పకనే చెప్పారు. -
ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధించుకుందాం
ఢిల్లీ కోటను బద్దలు కొట్టి సమైక్యాంధ్రను సాధించుకుందామని నాయుడుపేట సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో 44 రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన సమైక్య శంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ప్రతి పేదవాడి చదువు రాజశేఖరుడి స్వప్నమని, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకతీతంగా పలికే పేరు వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుల గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెట్టిస్తున్న నేత వైఎస్ఆర్ అని ఆయన చెప్పారు. రాజకీయనాయకుడంటే నేనున్నానని ప్రజలందరికీ భరోసా ఇచ్చేవాడిలా ఉండాలని, చంద్రబాబుకు అది లేదని జగన్ అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకటమేనని వైఎస్ఆర్ నిరూపించారని, ఈసారి ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలు సాధించి మనమే ప్రధానిని నిర్ణయిద్దామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి - తెలుగు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే రైతన్నకు నీరెక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. అలాగే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ తాగునీరు ఎలా తెస్తారని నిలదీశారు. -
ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధిద్దాం
-
బిల్లును ఓడించామనడంలో అర్థం లేదు: అరుణ
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఓడించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరూ చెప్పుకొంటున్నారు గానీ, అందులో అర్థం లేదని రాష్ట్ర మంత్రి డీకే అరుణ అన్నారు. రాష్ట్రపతి బిల్లును పంపేటప్పుడు దానిపై కేవలం అభిప్రాయాలు మాత్రమే కోరారు తప్ప ఓటింగ్ పెట్టి ఆమోదించారో లేదో చెప్పాలని అడగలేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి పెట్టిన తీర్మానంతో అసలు సంబంధం లేదని, లగడపాటి రాజగోపాల్ లాంటి వారు తాము భ్రమల్లో ఉంటూ ప్రజలను కూడా మభ్య పెడుతున్నారని అరుణ విమర్శించారు. ఇకనైనా సీమాంధ్ర ప్రాంతానికి, ప్రజలకు ఏం కావాలో అడిగితే మంచిదని ఆమె హితవు పలికారు. తాము ఫిబ్రవరి 3వ వేదీన ఢిల్లీ వెళ్లి జీవోఎం సభ్యులను కలిసి తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరతామని డీకే అరుణ తెలిపారు. -
ఆపేందుకు చాలా అస్త్రాలున్నాయి
పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆపేందుకు తమ వద్ద చాలా అస్త్రాలున్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 15 రోజుల పాటు రాజకీయ పార్టీలన్నింటినీ ప్రజలు పరుగులు పెట్టించాలని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం ఇప్పటికీ తమకుందని, బీహార్ విభజనతో ఆంధ్రప్రదేశ్ విభజనను పోల్చి చూడకూడదని లగడపాటి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక్కటవ్వడం చాలా హర్షణీయమని రాజగోపాల్ అన్నారు. -
ఇది సమైక్యాంధ్ర తొలి విజయం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో టీ-నోట్‌ను మూజువాణీ ఓటుతో తిరస్కరించడం సమైక్యాంధ్ర ఉద్యమం తొలి విజయంగా ఏపీ ఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు పేర్కొన్నారు. గురువారం ఎన్జీవో హోంలో సమైక్యాంధ్ర సాధన సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీ నోట్‌ను తిరస్కరించడంపై పురుషోత్తం నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 66 రోజుల ఉద్యోగుల సమ్మెకు ఫలితం దక్కిందని, సీమాంధ్ర ఉద్యోగుల, నాయకులు, విద్యార్థుల, వివిధ సంఘా ల విజయమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం, కొందరు నాయకులు మాటలు మారుస్తున్నారన్నారు. టీ నోట్ తిప్పిగొట్టిన తర్వాతైనా కొన్ని పార్టీలు తమ జెండా, అజెండా వీడి సమైక్య ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సమైక్యవాదం వినిపించేందుకు సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు ఏకతాటిపై నిలిచి ఇతర ప్రాంతాలకు చెందినవారిని, పార్టీలను కలుపుకుని కృషి చేయాలని కోరారు. ఇదే పంథాలో పార్లమెంట్లో బిల్లును ఓడించాలన్నారు. బీజేపీ కూడా సమైక్యాంధ్రకు సానుకూలంగా ఉందని, గతంలో ఆ పార్టీ అధినేతను కలిశామని, అసెంబ్లీలో బిల్లు ఓడిస్తే పార్లమెంట్లో ఓడించేందుకు కృషి చేస్తామని చెప్పారన్నారు. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో జరగనున్న సమావేశంలో పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఉద్యం కొనసాగించాల్సి ఉందన్నారు. సీమాంధ్రవాసులు మరికొన్నాళ్లు అప్రమత్తంగా మెలగాలని కోరారు. ఫిబ్రవరి నెలలో అధిక సంఖ్యలో ఢిల్లీ వెళుతున్నామని, యూపీఏ ప్రభుత్వం తీరు మారే లా ఉద్యమం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సందర్బగా ఆరు నెలల నుంచి ఉద్య మం చేస్తున్న ప్రజలను ఆయన అభినందించారు. జామి భీమ శకంర్, దుప్పల వెంకటరావు, గీతా శ్రీకాంత్, వేణుగోపాల్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నర్సునాయుడు, శోభారాణి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, కాయల శ్రీనివాసరావు, వై.జయరాం పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ సమైక్య నినాదానికి ప్రజల మద్దతు
సాక్షి, కాకినాడ :గడపగడపకు వైఎస్సార్సీపీ సమైక్య నినాద పాదయాత్రలకు గ్రామీణ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఈ పాద యాత్రల్లో పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు ముఖ్యనేత లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రూరల్ మండల పరిధిలోని కొంతమూరులో గడపగడపకు వైఎస్సార్ సీపీ పాదయాత్ర నిర్వ హించారు. ఇంటింటికి తిరిగి సమైక్యాంధ్ర కోసం ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 1వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ కార్య క్రమంలో పాల్గొని సమైక్యనినాదాలతో హోరెత్తించారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయ పురం మండలం తాడిపూడిలో గడపగడపకు వైఎస్సార్సీపీ నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్ పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పట్టణ పరిధి లోని 2వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పి.గన్న వరం మండలం కె.ఏనుగుపల్లిలో నిర్వహించిన గడగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రైతు విభాగం రాష్ట్రకమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యరాష్ర్ట ఆవశ్యకతను వారు గ్రామస్తులకు వివరించారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ రూరల్ మండల పరిధిలోని కొవ్వూరు గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది కార్యకర్తలు వెంటరాగా పార్టీ విధి విధానాలను వేణు ప్రజలకు వివరించారు. -
కదంతొక్కిన విద్యార్థులు
తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోరుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు కదం తొక్కారు. విభజనతో ఇరు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ బిల్లును తిప్పి పం పాలంటూ నినాదాలు చేశారు. తణుకులో 60 బస్సుల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేంద్ర సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల నాయకులు బసవ రామకృష్ణ, అనపర్తి ప్రకాశరావు మాట్లాడుతూ విభజనతో విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వెంటనే బిల్లును వెనక్కి పంపించాలని కోరారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులు మేకా నరేంద్రకృష్ణ, ఎన్.రాజేంద్రప్రసాద్, అనపర్తి ఉమ, జి.సత్యనారాయణ, ఎం.సుబ్బారావు, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భీమవరంలో... భీమవరం : ఇంజినీరింగ్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీలో ఓటింగ్ పెట్టి ఎమ్మెల్యేలంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి సమైక్యవాదాన్ని చాటిచెప్పాలని విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్రం కలిసి ఉంటే విద్యార్థి, యువకులకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందువలన యువత ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించి సమైక్యాంధ్ర సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల జేఏసీ నేతలు ఉద్దరాజు వేణుగోపాలరాజు, సీతా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బీవీ సుబ్బారావు, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఎన్వీఆర్ దాసు, గంటా సుందరకుమార్, వడ్డి సుబ్బారావు, కోళ్ళ నాగేశ్వరరావు, నల్లం గంగాధరరావు, సయ్యద్ నసీమా బేగం, బోడపాటి పెదబాబు, జంపన ఫణిబాబు, వేగి రాము, టీవీవీ ప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, కమ్మంపాటి బాబ్జీ పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ గురువారం భీమవరం, ఉండి ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
ఉద్యమంలా వైఎస్సార్ సీపీ సమైక్యనాదం
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడగపడకు సమక్యనినాదం ఉద్యమంలా సాగుతోంది. ఊరు..వాడా అనే తేడా లేకుండా సమైక్యహోరు మారుమోగుతోంది. యువకులు, మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ పార్టీ శ్రేణులతో కలసి సమైక్యాంధ్ర కోసం నినదిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెల్లువెత్తుతున్న జనాదరణ, రోజురోజుకు బలపడుతున్న వైఎస్సార్ సీపీని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీలు ఎల్లో మీడియాతో కలిసి దుష్ర్పచారం చేస్తున్నాయని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. మామిడికుదురు మండలం ఆదుర్రులో బుధవారం గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.గన్నవరం, రాజోలు కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావులతో పాటు జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం జంబూపట్నంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ పాదయాత్ర చేశారు. ప్రత్తిపాడు కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం పులిదిండిలో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడేది జగన్ ఒక్కరే సమైక్యాంధ్ర కోసం అలుపెరగక పోరాడుతున్నది జననేత ఒక్కరేనని పిఠాపురం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం పట్టణ పరిధిలోని 1వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సమైక్యాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు. వైఎస్సార్సీపీ విధి విధానాల కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంచిపెట్టారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంద్రపాలెంలో గడప గడపకు వైఎస్సార్సీపీ నిర్వహించారు. ఈసందర్భంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరులో గడపగడపకు వైఎస్సార్సీపీ నిర్వహించారు. వందలాది మంది సుబ్బారావు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు రూరల్ మండల పరిధిలోని కొంతమూరులోనూ, తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా పట్టణంలోని ఒకటవ వార్డు పరిధిలోనూ గడపగడపకు వైఎస్సార్ సీపీ పాద యాత్రలు చేశారు. రాజమండ్రి 29వ వార్డు పరిధిలోని కొత్తపేట ప్రాంతంలో గడపగడపకు వైఎస్సార్సీపీ నిర్వహించారు. పార్టీ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలను పంచిపెడుతూ విభజన వల్ల కలిగే నష్టాలను వివరించారు. -
ఇందిరా పార్క్ వద్ద టిడిపికి చేదు అనుభవం
-
ఆళ్ల నాని పాదయాత్రకు బ్రహ్మరథం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఇప్పటివరకూ ఒకే కుటుంబంలా ఉన్న తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టడంపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆందోళనా కార్యక్రమాలు చేయించారు. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని గడపగడపకూ సమైక్య శంఖారావం పేరిట నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలను స్వయంగా కలిసి ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. గత డిసెంబర్ 5న నగరంలో ప్రారంభమైన నాని పాదయాత్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రతిపక్ష టీడీపీ కుట్రలను బహిర్గతం చేస్తూ 45 రోజులుగా ముందుకు సాగుతోంది. పేదల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న వైనంపై ప్రజలకు వివరించారు. ప్రపంచ రాజకీయాలకే మార్గదర్శకంగా నిలిచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసి ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టిందని తెలిపారు. వైఎస్ మరణం తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కంకణబద్ధుడై చేస్తున్న పోరాటాలను నాని ప్రజలకు గుర్తు చేశారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయనను జైలుపాలు చేసిన ఉదంతాన్నీ కళ్లకు కట్టినట్టు వివరించారు. అభిమాన బలంతోనే జగన్మోహన్రెడ్డి బయటకు వచ్చారని గుర్తుచేశారు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పలు సర్వేల నివేదికలు స్పష్టం చేస్తుండడంతో మునిసిపాలిటీల పదవీ కాలం ముగిసి నాలుగేళ్లకు పైగా గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం జంకుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంత ప్రజలు గత నాలుగేళ్లుగా అభివృద్ధికి దూరంగా కాలం వెళ్లదీయాల్సిన దారుణ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. నాని పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పలుకుతూ వైసీపీకి తమ మద్దతును తెలుపుతున్నారు. నాని పాదయాత్ర నగరంలో ఈ నెలాఖరునాటికి పూర్తిచేసి, ఫిబ్రవరి ఒకటి నుంచి ఏలూరు మండలంలో కొనసాగించనున్నారు. -
'సమైక్యంపై హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా'
హైదరాబాద్ : సమైక్యవాదం కోసమే తాను రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి చైతన్య రాజు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇస్తే పోటీనుంచి తప్పుకుంటానని కూడా ఆయన ప్రకటించారు. అయితే సమైక్యవాద తీవ్రతను అధిష్టానానికి తెలియజెప్పేందుకు చైతన్యరాజుకు మద్దతిస్తున్నట్టు చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. చైతన్య రాజు అభ్యర్థిత్వాన్ని సీమాంధ్ర మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బలపరిచారు. విశాఖ ఎంఎల్ఏలు..రమణమూర్తి రాజు, వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్, రమేష్, ముత్యాలపాప బలపరిచారు. చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని బలపరిచినంత మాత్రాన తాము కాంగ్రెస్ పార్టీకి.. ఆపార్టీ అభ్యర్థులకు వ్యతిరేకం కాదని ఆయన వివరించారు. మరోవైపు.. రాజ్యసభకు రెబెల్‌గా పోటీచేసే యోచనలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. పోటీలోకి దిగద్దని.. చైతన్యరాజు మద్దతుదారులు ..ఆదాలను వారిస్తున్నా.. నామినేషన్లు వేయడానికే ఆదాల సిద్ధమవుతున్నారు. రెబెల్ అభ్యర్థిగా ఒకరు మాత్రమే రంగంలో ఉంటే గెలుపుకు ఆస్కారం ఉన్నందున ఆఖరి నిమిషంలో జేసీ పోటీనుంచి వెనక్కు తగ్గారు. -
హోరెత్తిన సమైక్యనినాదం
సాక్షి, కాకినాడ : గ్రామాల్లో సమైక్యనినాదం హోరెత్తుతోం ది. గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్య నినా దం పేరిట పార్టీ కో ఆర్డినేటర్లు నిర్వహిస్తున్న పాదయాత్రలకు ప్రజల మద్దతు లభిస్తోంది. రాజమండ్రి 32వ డివిజన్లో నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ పాదయాత్ర నిర్వహిం చారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకటరమణచౌదరి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులతో కలసి పర్యటించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ధవిళేశ్వరం శివారు ఎర్రకొండలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పార్టీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మం డలం జంబుపట్నంలో చేసిన పాదయాత్రలో పలువురు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు మండలం వాకపల్లిలో, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కుమార్ జగ్గంపేట మండలం సీతారామపురం, కృష్ణాపురంలలో నిర్వహించిన పాదయాత్రకు మంచి స్పందన లభించింది. జెడ్పీ మాజీ చైర్మన్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రూరల్ మండ లం ఇంద్రపాలెంలో పాదయాత్ర నిర్వహించారు. తుని 1వ వార్డులో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీలో పలువురి చేరిక పి.గన్నవరం మండలం ఉడిమూడిలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అధికార ప్రతినిధి పి.కె. రావు, నాయకులు మిండగుదిటి మోహన్ పాల్గొన్నా రు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్లమెంట్ కో- ఆర్డినేటర్ బొడ్డు వెంకట రమణచౌదరి సమక్షంలో బొమ్మూరులో సాయిలక్ష్మి నేతృత్వంలో పలువురు మహిళలు వైఎస్సార్ సీపీలో చేరారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. నేటి వైఎస్సార్ సీపీ సమావేశం రద్దు సాక్షిప్రతినిధి, కాకినాడ : పులివెందులలో రెండు రోజులు జరగాల్సిన పార్టీ శిక్షణ తరగతులు రద్దవడంతో మంగళవారం కాకినాడలో జరగాల్సిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావే శం రద్దు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూ డి చిట్టబ్బాయి సోమవారం రాత్రి విలేకరులకు ఈ సంగతి తెలిపారు. కాగా తొలుత నిర్దేశించి న రీతిగా ఇడుపులపాయలో వచ్చే నెల 2న ప్లీనరీ జరుగుతుందని, దీనికి నాయకులంతా తరలి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. -
సమైక్యవాదులు కాకపోతే ఎమ్మెల్యేలే ఓడిస్తారు
రాజ్యసభ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు సమైక్యవాదులు కాకపోతే.. వారిని ఆ పార్టీల ఎమ్మెల్యేలే ఓడిస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతిని ఎవరూ విడదీయలేరని, తనకు రాజకీయం కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి సభలో బిల్లును ఓడిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన సభ
హైదరాబాద్ : శాసనసభలో సోమవారం వాయిదాల పర్వం కొనసాగుతోంది. నినాదాలు, నిరసనలతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. శాసనసభ ఈరోజు ఉదయం ప్రారంభమైన ఐదు నిమిషాలకే.. అరగంటపాటు వాయిదా పడింది. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఓటింగ్ నిర్వహించవద్దని, సీఎం కిరణ్ ఇచ్చిన తీర్మానం నోటీసును అనుమతించకూడదని.. తెలంగాణ మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ సభ్యులు స్పీకర్ పోడీయంను చుట్టుముట్టడంతో.. సభలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోటాపోటీగా సమైక్యాంద్ర, తెలంగాణ నినాదాలతో అసెంబ్లి హోరెత్తింది. దీంతో సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సభను స్పీకర్ మరో గంట పాటు వాయిదా వేశారు. -
గడప గడపకు సమైక్యనినాదం
సాక్షి, కాకినాడ : రాష్ర్ట సమైక్యత కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీకి అండగా నిలవండి.. సమై క్యాంధ్ర కోసం అలుపెరగక పోరు సల్పుతున్న వైఎస్ జగన్‌కు బాసటగా నిలవండి.. విభజన కుట్రలను అడ్డుకోండి అంటూ పార్టీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం గుమ్మిలేరులో సమైక్య నినాద పాదయాత్ర చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకుడు బొడ్డు అనంత వెంకట రమణచౌదరితో కలిసి పురవీధుల్లో పాదయాత్ర చేసి రాష్ర్టం ముక్కలైతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. రాజమండ్రి 32వ డివిజన్ పరిధిలో నగర కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు వైఎస్సార్సీపీ సమైక్య పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ నయీం, మైనార్టీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు అహ్మద్ పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ పార్టీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు హుకుంపేటలో, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏలేశ్వరంలో గడపగడపకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ నాయుడు వాలుతిమ్మాపురంలో, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఇంద్రపాలెంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ సమైక్యపాదయాత్ర నిర్వహించారు. అలాగే జగ్గంపేట మండలం గుర్రప్పాలెంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీని నిర్వహించారు. -
విజయమ్మతో గాదె వెంకటరెడ్డి భేటీ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన గాదె.. విజయమ్మను కలిసి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న గాదె వెంకటరెడ్డి.. సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిని కలిసి చర్చించడం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చింది. -
'తెలుగు జాతి సమైక్యంగానే ఉండాలి'
-
ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ
-
ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ
హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీకీ రాష్ట్ర విభజన సెగ తగిలింది. హైదరాబాద్ ఏవీ కళాశాలలో జరుగుతున్న ఆప్ సభలో శనివారం గందరగోళం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే నేపథ్యంలో ఏవీ కాలేజీలో ఆమ్ఆద్మీపార్టీ కార్యకర్తలు ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ఆప్ ముఖ్యనేత ప్రశాంత్ భూషణ్ హాజరు అయ్యారు. ఆయన ఎదుట తెలంగాణ, సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోటా పోటీ నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఎన్టీఆర్ సమైక్యవాదా.. విభజనవాదా?
ఎన్టీఆర్ వర్ధంతిని కూడా తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా తన ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయాలకు ఉపయోగించుకుంది. రెండు ప్రాంతాలకు చెందిన నాయకులు అక్కడకు వచ్చి, పెద్దాయనకు నివాళులు అర్పించి, తమకు తోచిన రీతిలో ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఇప్పుడు మాత్రం కొంతమంది తమ స్వార్థం కోసం తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మరోవైపు పార్టీ తెలంగాణ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి, ఎన్టీఆర్ బతికుంటే ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయి ఉండేదని చెప్పారు. పరిపాలన సౌలభ్యంకోసమే మండల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఇంతలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికొచ్చి, ఎన్టీఆర్ బతికుంటే అసలు రాష్ట్ర విభజన అంశమే తెరమీదకు వచ్చేది కాదని చెప్పారు. తాము ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. పనిలోపనిగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. -
అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు
-
కిరణ్ విభజనవాదే: సీమాంధ్ర ఎమ్మెల్యేలు
విభజన బిల్లుపై ఓటింగ్ కోసం వైఎస్ విజయమ్మ పట్టుపట్టినా ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం ముందుకు రాలేదని పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీ లాబీల్లో వారు విలేకరులతో మాట్లాడారు. కనీసం తన అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా సీఎం ముందుకు రాలేదని, దాంతో ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయని వారు అన్నారు. విభజనను మరోసారి వ్యతిరేకించే అవకాశం వచ్చినా ఏఐసీసీ భేటీకి సీఎం డుమ్మాకొట్టారని, అసెంబ్లీ లేకపోయినా కూడా ఆయన వెళ్లలేదని విమర్శించారు. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాసుల నిరాకరణ అంతా డ్రామాయేనని, రెన్యువల్ చేసుకోని సభ్యులకు పాస్‌లు రాలేదని వారు చెప్పారు. సాంకేతికమైన అంశాన్ని దాచి విభజన వ్యతిరేకించినందుకు పాసులు రాలేదని వారు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీఎం కిరణ్‌పై ఉన్న భ్రమలన్నీ తొలగిపోతున్నాయని, ఇన్నాళ్లుగా ఆయనను నమ్ముకుని మోసపోయామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హైకమాండ్ మనిషని, ఆయన విభజనవాదేనన్న విషయం అర్థమవుతోందని సీమాంధ్ర ఎమ్మెల్యేలు అన్నారు. -
వీర తెలంగాణ మాది - వేరు తెలంగాణ కాదు
-
నేనైతే కాంగ్రెస్ లోనే ఉంటా
-
'రాష్ట్రం సమైక్యంగా ఉన్నా..విడిపోయినా కాంగ్రెస్ లోనే ఉంటా'
హైదరాబాద్: భవిష్యత్తులో రాష్ట్రం సమైక్యంగా ఉన్నా..విడిపోయినా తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటానని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ చర్చల్లో అన్ని పార్టీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 'సాక్షి'తో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ విడబోనన్నారు. అసెంబ్లీ సమావేశం ఆరో రోజుల పాటు జరిగితే రాష్ట్రపతిని అదనపు సమయం అడగాల్సిన సమయం ఉండదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు చివరి నిముషం వరకూ ప్రయత్నం చేస్తానన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశానికి సంబంధించి రఘువీరా స్సందించారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారని అనుకోవడం లేదన్నారు. కొత్త పార్టీ ఆలోచన తనకు లేదని సీఎం తనతో చెప్పినట్టు రఘువీరా పేర్కొన్నారు. విభజనకు 2009 వ సంవత్సరం డిసెంబర్ నెలలోనే బీజం పడిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు..చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తామన్నారు. -
ఫిబ్రవరి నెలాఖరుకల్లా విభజన పూర్తి: సర్వే
ఫిబ్రవరి నెలాఖరు కల్లా విభజన ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విభజన ఆగిపోతుందని కొంతమంది సీమాంధ్ర నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోతుందని, ఆ గడువును పొడగించాలని కోరడం సరికాదని సర్వే అన్నారు. గడువును పొడగించవద్దని తాను రాష్ట్రపతిని కోరుతున్నట్లు చెప్పారు. విభజన బిల్లుపై ఓటింగ్ ప్రస్తావన లేదని, ఒకవేళ మొత్తం ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా విభజన ఆగదని, అసలు అసెంబ్లీ అభిప్రాయాన్ని ఆమోదించాల్సిన అవసరం పార్లమెంట్‌కు లేదని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విభజన అధికారం పూర్తిగా పార్లమెంటుదేనన్నారు. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ఉందని, తానెక్కడ సీఎం అవుతానో అని తన వ్యతిరేకులు కొందరు ప్రతిష్టను డ్యామేజ్ చేస్తున్నారని వాపోయారు. రాహుల్ ప్రధానమంత్రి కావాలని, ఆయన కేబినెట్లో మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. -
సమైక్య రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు
రాబోయే సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ అన్నారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన ప్రక్రియ అయిపోతుందంటూ కొందరు చెబుతున్న మాటలు సరికాదని ఆయన చెప్పారు. విభజన ప్రక్రియ ఇప్పటికి కేవలం 10 శాతం మాత్రమే జరిగిందని, ఇంకా 90 శాతం జరగాల్సి ఉందని మురళీకృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ ఆ ప్రాంతా నాయకులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, అలాంటి భ్రమలు కల్పించడం సరికాదని చెప్పారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే: ఆశోక్‌బాబు
-
సమైక్య నినాదంతో సీమాంధ్రలో కొత్త ప్లెక్సీలు
-
'విభజన బిల్లును కాల్చడం ప్రజాస్వామ్యానికి అవమానం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను సమైక్య వాదులు భోగి మంటల్లో కాల్చడం ప్రజాస్వామ్యానికి అవమానమనం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో వారిపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి..సమైక్య వాదులు ఎన్ని ఆటంకాలు కల్గించినా విభజన ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్రం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును ఆమోదింప జేస్తుందన్నారు. ఈ నెల 17 వ తేదీన ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సదస్సులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. -
బాబు, కిరణ్ దొంగ నాటకాలు ఆడుతున్నారు: వైఎస్ జగన్
-
నాలుగో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు
-
సమైక్య తీర్మానం చేయాలి... లేదా ఓటింగ్ పెట్టండి
హైదరాబాద్ : శాసన సభలో సమైక్య తీర్మానం చేయాలి.. ఇది సాధ్యం కాకపోతే.. విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌తో అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. అయితే దీనిపై సందర్భాన్నిబట్టి వ్యవహరిస్తామని మాత్రమే చెబుతున్న స్పీకర్, ప్రభుత్వం.. ఓటింగ్ ఉంటుందో లేదో ఏమాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. మరోవైపు.. కీలకమైన విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పటికీ..సీఎం, ప్రధాన ప్రతిపక్షనేత, శాసనసభా వ్యవహారాలశాఖా మంత్రి శైలజానాత్‌తోపాటు పలువురు మంత్రులు, సభ్యులు ఈ అంశాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడంలేదు. ఈ ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైనప్పుడు చాలా పల్చగా కనపడింది. నినాదాల మధ్య ప్రారంభమైన అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టిసభను అడ్డుకోవడంతో సభ పట్టుమని మూడు నిమిషాలు కూడా సాగలేదు. సమావేశాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట వాయిదా వేశారు. -
తీర్మానం ఉండాల్సిందే...
రాష్ర్ట విభజన అంశంలో చర్చకు మద్దతిస్తూ సమైక్య తీర్మానం అంశాన్ని మరచిపోతున్న వారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన సమైక్యవాదులు తీర్మానం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదం వినిపిస్తూ విభజనకు సహకరిస్తున్న నాయకులకు కొందరు ఉద్యోగ నేతలు వత్తాసు పలుకుతుండడాన్ని ఖండిం చారు. సమైక్యవాదానికి అనుకూలంగా తీర్మానం చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కుమ్మక్కయ్యారు.. సమైకాంధ్ర ముసుగులో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షంతో ఎన్జీఓ సంఘ నాయకుడు ములాఖత్ అయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నోటి వెంట ఏ మాటలు వస్తున్నాయో అశోక్‌బాబు కూడా అవే మాట్లాడుతుండడం దీనికి నిదర్శనం. రెండు నెలలుగా ఉద్యోగాలు వదిలి ఉద్యమాలు చేస్తే వచ్చిన ఫలితం ఏమిటో అర్థం కావడం లేదు. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అవ్వలేదు. - చందాన మహందాతనాయుడు, చైర్మన్, ఎన్జీఒ సంఘం, బొబ్బిలి తీర్మానం ఉండాలి... అసెంబ్లీలో విభజన బిల్లుపై ఓటింగ్ జరగకుండా చర్చ జరిపితే పరోక్షంగా రాష్ట్ర విభజనను ఆమోదించినట్లే. సమైక్య తీర్మానం తప్పకుండా చేయాల్సిందే. వైఎస్ఆర్ సీపీని అడ్డుకోవడం అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగదు. - ఎ. అశోక్, ఎస్ఎఫ్ఐ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు... ఎన్జీఓ సంఘ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు. ఉద్యమం చేయడం ద్వారా సొంత లాభం చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడిచి సీమాంధ్ర ప్రజలను మోసగించారు. ఇది క్షమించరానిది. సమైక్యాంధ్ర సాధన చేతకానప్పడు మొదట్లోనే వదిలేయాల్సింది. ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలకు అమ్మేశారు. - డి.రఘు, విద్యార్థి సంఘ నాయకుడు, బొబ్బిలి తీర్మానం, చర్చ రెండూ జరగాలి బిల్లును తిప్పికొట్టేందుకు పనికొచ్చే చట్టబద్ధత గల తీర్మానం, చర్చ రెండూ అవసరమే. ఇందులో ఏ ఒక్కటి చేపట్టకపోయినా సమైక్యానికి అన్యాయం జరుగుతుం ది. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యా య, ఉద్యోగ సంఘాలు ఆ దిశగా శాసన సభ, మండలి సభ్యులపై డిమాండ్ చేయకపోవడం అన్యాయం. - కొన్నాన శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు, వీఆర్ఓ సంఘం. టీడీపీ వైఖరి మారింది విభజన బిల్లుపై టీడీపీ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. సీమాంధ్ర టీ డీపీ నేతలంతా చర్చకు వ్యతిరేకమని ముందు చెప్పి చర్చలో పాల్గొనడం ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. వారంతా డ్రామాలు ఆడుతున్నారు. వారికి కొందరు వత్తాలు పలుకుతుండడం సరికాదు. - బూతాల వెంకటరమణ, ప్రైవేట్ టీచర్ తీర్మానం చేయకపోతే విభజనను అడ్డుకోలేం సమైక్య తీర్మానం చేసి పార్లమెంటుకు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు పంపకపోతే విభజన బిల్లును అడ్డుకోలేం. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆ దిశగా చట్టసభల్లో వ్యవహరిం చేలా ఒత్తిడి చేయాలి. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు వక్రభాష్యం చెబుతుండడం దురదృష్టకరం.- సామల సింహాచలం, రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ టీచర్ల సంఘం మోసం చేయవద్దు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చట్టసభల్లో తీర్మానం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేయాలి. ఈ విషయంలో రాష్ట్రస్థాయి సంఘం నాయకులు తమ సొంత నిర్ణయాలు రుద్దడం శోచనీయం. చట్టబద్ధమైన ప్రక్రియను అమలు చే యాలని ఒత్తిడి తేవడంలో బేషజానికి పోవడం సమైక్యవాదులను మోసం చేయడమే. - బంకపల్లి శివప్రసాద్, ప్రచారకార్యదర్శి, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి. కిరణ్ కోవర్టుగా అశోక్‌బాబు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు చర్చకు డిమాండ్ చేయడంతో ఆయన వైఖరి తేటతెల్లమయ్యింది. చర్చలో పాల్గొనడం విభజనను ఆమోదించినట్లే. ఈ విషయంలో అశోక్‌బాబు కిరణ్‌కుమార్‌రెడ్డికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. - ఎస్. శ్రీనివాసరావు, యువజన సంఘం నాయకుడు -
సమైక్య తీర్మానమే శరణ్యం
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయడం ద్వారానే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చునని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు అభిప్రాయపడ్డారు. చర్చను అడ్డుకునే ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలని ఎన్జీవో సంఘ నేత అశోక్‌బాబు పిలుపు ఇవ్వడంపై మండిపడ్డారు. చర్చకు అవకాశం కల్పిస్తే విభజనకు సహకరించినట్టేనన్నారు. న్యాయవాదులు, విద్యావేత్తలు, రైతులు, డాక్టర్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు వ్యక్తం చేశారు. విభజనకు సీమాంధ్ర నాయకులు అడ్డుకోవాలి బిల్లుకు వచ్చిన రోజున చర్చకు నోచుకోకపోవడం అన్యాయం. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా విభజనను అడ్డుకోవాలి. డి.విజయభాస్కరరావు, మండల వ్యవసాయాధికారి, జలుమూరు ఓటింగ్ జరగాలి వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు సమగ్ర ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరపాలి. క్లాజ్ వారీగా మాత్రం ఓటింగ్ చేపట్టరాదు. ఒక ఎమ్మెల్యే ఒక అభిప్రాయం చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. దానివల్ల పరోక్షంగా విభజన వాదానికి సమ్మతిని తెలియజేసినట్లవుతుంది. -ఆర్.జోగేశ్వరరావు, కరస్పాడెంట్, గాయత్రీ డిగ్రీ కళాశాల, హిరమండలం చర్చ తప్పనిసరి ఎజెండా తీర్మానం మీద సమగ్రమైన చర్చ జరిగినపుడే విలువ ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి ఒక్కో చట్టాన్ని తయారు చేస్తున్న శాసనసభ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నపుడు మాత్రం మౌనం దాల్చడం అప్రజాస్వామికం. చట్ట సభల్లో చర్చించినపుడు మాత్రమే ప్రజల మనోభావాలను గౌరవించినవారవుతారు. ఈ విషయంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అశోక్‌బాబు వాదనను సమర్థిస్తున్నాం. - ఎ.శ్రీనాథస్వామి, ఎంపీడీఓ, హిరమండలం సమైక్య తీర్మానం చాలా అవసరం రాష్ట్ర ప్రజలంతా సమైక్యాన్ని కోరుకుంటున్నప్పుడు చట్ట సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి సమైక్యాన్ని కోరడంలో తప్పు ఏముంది. సమైక్యతీర్మానం అనంతరం బిల్లుపై చర్చించే అవకాశం ఉంటుంది. చర్చకు ముందు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల సమైక్యవాదం స్పష్టంగా తెలుస్తుంది. ఎం.కె.రాము, వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు, నరసన్నపేట సమైక్య తీర్మానమే ఉత్తమం అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే దానికి ప్రాధాన్యం ఉంటుంది. చర్చ వల్ల న్యాయం జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వ కిరణ్‌కుమార్ రెడ్డి చేత ఆడిస్తున్న నాటకంలో భాగమే చర్చ. దీనిని కొనసాగిస్తే బిల్లు ఆమోదం చేసుకోవడానికి వీలవుతుంది. సీమాంధ్ర ఎమ్యెల్యేలు సమైక్య తీర్మానానికి కట్టుబడి.. దానిని సాధించేందుకు ముందుకుపోవాలి. -పేరాడ సోమేశ్వరరావు, అధ్యక్షుడు, సమైక్యాంధ్ర ఫోరం, వజ్రపుకొత్తూరు అశోక్‌బాబు మాటలు విభజన కోసమే అశోక్‌బాబు మాట లు రాష్ట్ర విభజన కోసమే అన్నట్టు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా ఆదేశాలతోనే కిరణ్కుమార్డ్, అశోక్‌బాబులు మాట లాడుతూ విభజన కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. వైఎస్సార్ిసీపీ ఓటింగ్ కోసం అసెంబ్లీలో అడ్డుపడుతుంటే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి విజయకుమార్, సీనియర్ అడ్వకేట్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడులు,రాజాం. బిల్లే కీలకం ప్రస్తుతం అసెంబ్లీలో చర్చల కంటే బిల్లే కీలకం. విలువైన సమయం వృథా చేయటం వల్ల బిల్లు పెట్టకుండా కాలం గడిచిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్రం కాంగ్రెస్ పెద్దలు కూడా బిల్లు లేకుండా సభలో చర్చలతో సరి పెట్టాలని చూస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం. బిల్లు ఓడిస్తేనే సమైక్యాంధ్రకు మద్దతు లభిస్తుంది. ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, చీఫ్ వార్డెన్,బీఆర్‌ఏయూ బిల్లును ఓడించి పార్లమెంటుకు పంపాలి అసెంబ్లీలో చర్చ జరగటం వల్ల ప్రయోజనం లేదు. ఎవరి ప్రాంతానికి అనుకూలంగా వారు వాదనకు దిగుతారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించదు. అందుకే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలి. దాన్ని ఓడించి పార్లమెంటుకు పంపించాలి. అప్పుడే పార్లమెంట్ ఎటు వంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుంది. అసెంబ్లీలో ఓడించిన బిల్లుకు మద్దతు ఇవ్వట మంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించక పోవటమే. న్యాయపరంగా కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. - డాక్టర్ పి.శ్రీసుధ, ఎల్ఎల్బీ బోధకురాలు,బీఆర్‌ఏయూ చర్చను ప్రారంభిస్తే విభజనకు అంగీకరించినట్టే రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చను ప్రారంభిస్తే పరోక్షంగా విభజనకు అంగీకరించినట్టే. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంతో సమర్ధనీయం. సమైక్య తీర్మానం చేసి బిల్లును వెనక్కు పంపించేస్తే సరిపోతుంది కదా. అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఏకాభిప్రాయానికి వచ్చి విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానాన్ని చేపడితే చాలు. ఈ విషయంలో అశోక్‌బాబు ఎందుకలా ధర్నాలు చేయమని పిలుపునిచ్చారో అర్థం కావడం లేదు. ఉత్తరావల్లి మురళీమోహనరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, -
నేటికీ వివక్ష..
చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్: స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాల్లో నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొట్టిపాడు పంచాయతీ పరిధి మిట్టపాలెంలో ఉన్న రెండు మంచినీటి చెరువుల్లో ఒకటి గ్రామంలో మరొకటి ఎస్సీ కాలనీలో ఉండటం ప్రత్యేకం. ఈవూరివారిపాలెం గ్రామంలోని ఎస్టీలకు ఇదే విధానం అమలు చేస్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించే అవకాశం లేదు. ఎన్నికల సమయంలో వారి ఓట్లను గ్రామస్తులే వినియోగించుకున్న సంఘటనలు వున్నాయి. గోవిందపురం గ్రామం సర్వే నంబర్ 563లో ఎస్సీలకు నివేశన స్థలాలు, శ్మశాన స్థలాలను కేటాయించారు. అయితే వాటిని రద్దు చేసి గ్రానైట్ క్వారీలకు లీజుకు ఇచ్చారు. ఇదే తరహాలో యడవల్లి గ్రామం సర్వే నంబర్ 381లో అసైన్డ్ భూమిని ఎస్సీలకు కేటాయించి విడతల వారీగా రద్దు చేసి ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తున్నారు. కావూరు గ్రామం సర్వే నంబర్ 164లో సాగు భూమిని దశాబ్దాల క్రితమే ఎస్సీలకు కేటాయించారు. పూర్వీకులు మరణిస్తే వారి వారసులకు నేటికీ పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పులు చేయలేదు. ఇలా అన్నింటా వివక్ష కొనసాగుతూనే వుంది. చైతన్య కార్యక్రమాల ఊసేలేదు ... ప్రతి నెల చివరి రోజైన 30,31 తేదీల్లో మండలంలోని ఏదైనా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రెవెన్యూ, మండల పరిషత్, పోలీసు అధికారులతో పౌరహక్కుల దినోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజలు పాల్గొని వారి సమస్యలను తెలియజేస్తుంటారు. సంవత్సర కాలం నుంచి ఈ కార్యక్రమాల ఊసే లేదని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇక నుంచి గ్రామాల్లో నిర్వహిస్తాం సమైక్యాంధ్ర సమ్మె ప్రభావంతో గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించలేదు. అనంత రం వివిధ సమావేశాలతో సమయం లేకపోవటంతో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. జనవరి నెల నుంచి క్రమం తప్పకుండా ప్రతినెలా గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తాం.- జీవీఎస్.ఫణీంద్రబాబు, తహశీల్దార్, చిలకలూరిపేట -
సీఎం కిరణ్ తో సీమాంధ్ర నేతల భేటీ
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం సాయంత్ర సమావేశమైయ్యారు. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన పక్షంలో సీమాంధ్ర నేతలు సీఎంతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి మంత్రులు వట్టి వసంత కుమార్, శైలజానాథ్, పితాని సత్యనారాయణ, మహీధర్ రెడ్డి, గంటా శ్రీనివాస్ లు హాజరవ్వగా, ఎమ్మెల్యేల్లో గాదె వెంకట రెడ్డి, ఈలి నాని, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, ద్రోణం రాజు శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లు హాజరైయ్యారు. రాష్ట్ర విభజన బిల్లులో సవరించాల్సిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనునన్నట్లు తెలుస్తోంది. -
'అశోక్ బాబు వైఖరి మార్చుకోవడం సరికాదు'
అనంత: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వైఖరిపై అనంతపురం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు దేవ్ రాజ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన బిల్లుపై అశోక్ బాబు అకస్మాత్తుగా తన పంథా మార్చుకోవడంపై మర్మమేమిటని ప్రశ్నించారు. ఇన్నాళ్లు తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన అశోక్ బాబు..ఇప్పుడు అసెంబ్లీ లో చర్చించాలనడం సరికాదన్నారు. అసలు అసెంబ్లీలో టి.బిల్లుపై చర్చ మొదలవడమే బాధాకరమన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్న పార్టీలు, ప్రజాప్రతినిధులు విభజనకు అనుకూలంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని అశోక్ బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బిల్లు వచ్చి ఇన్ని రోజు లైనా చర్చకు నోచుకోకపోవడం విచారకరమని అశోక్ బాబు మాట్లాడటంపై విమర్శలకు తావిస్తోంది. ఇన్నాళ్లు రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించిన ఆయన.. తన వైఖరి మార్చుకోవడమేమిటని ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘ నేతలే ప్రశ్నిస్తుండటం గమనార్హం. -
ధైర్యముంటే టి-బిల్లుపై ఓటింగ్ జరపాలి: శోభా నాగిరెడ్డి
ముఖ్యమంత్రికి ధైర్యముంటే, శాసనసభలో విభజన బిల్లుపై ఓటింగ్ జరుపుతామని ప్రకటించాలని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో శాసనసభ నడుస్తోందని, కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్ మేరకే శాసనసభలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ రాత్రికి రాత్రే తమ విధానాన్ని ఎందుకు మార్చుకుందని, విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటారా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. అసలు విభజన బిల్లుపై సభలో చర్చించిన తర్వాత ఓటింగ్ అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. -
15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
-
15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సమైక్యాంధ్ర గొంతును వినిపించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు.. అంటే గురువారం నాడు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభా నిర్వహణకు అడ్డుపడుతున్నారన్న కారణంతో వీరిని సస్పెండ్ చేశారు. ఓటింగ్ జరిపేందుకు స్పీకర్ నిరాకరించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు వినిపించారు. దీంతో శాసన సభ వ్యవహారాల మంత్రి సాకే శైలజానాథ్ మొత్తం 15 మంది సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో ఆమోదించి, అందరినీ సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించారు. అయితే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో అందుకు నిరసనగా తాము కూడా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. కాగా సభ నుంచి తమను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మార్షల్స్ నుంచి విడిపించుకుని మళ్లీ సభలోకి ప్రయత్నించేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దాంతో వారిని మార్షల్స్ సభ నుంచి ఈడ్చుకొచ్చారు. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేలు బైఠాయించి, సమైక్య నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు వీరే.. అమర్ నాథరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుర్నాథరెడ్డి, భూమన, ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, మేకతోటి సుచరిత, వెంకట్రామిరెడ్డి -
మడమ తిప్పని సమరం
సాక్షి, కాకినాడ : చీకటి పడినంత మాత్రాన గోదావరి తన నడక ఆపబోదు. మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడు జ్వలించక మానడు. తెలుగుజాతిని నిలువునా చీల్చే ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తూనే ఉన్నా.. ‘సమైక్యత ఒక్కటే తెలుగుజాతి శ్రేయస్సుకూ, యశస్సుకూ, ఉషస్సుకూ శ్రీరామరక్ష’ అన్న ప్రగాఢ విశ్వాసంతో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ పోరు మొక్కవోని సంకల్పంతో, మడమ తిప్పని స్థైర్యంతో సాగుతూనే ఉంది. రాష్ర్ట విభజన బిల్లును శాసనసభకు పంపిన తీరును నిరసిస్తూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా చేపట్టిన సమైక్యదీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. పార్టీ శ్రేణులు దీక్షలు కొనసాగిస్తూనే మానవహారాలు, రాస్తారోకోలు, ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం’ పాదయాత్రలు కొనసాగించారు.రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు, కడియంలలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో మామిడికుదురులో పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రైతు విభాగం రాష్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. తునిలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. అనపర్తి దేవీచౌక్‌లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. తొలుత వందలాది మంది పార్టీ శ్రేణులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ యూత్ సభ్యులు తాడి సూరారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురంలో పట్టణ కన్వీనర్ పేర్నీడి ఈశ్వరరావు, సామర్లకోటలో పట్టణ కన్వీనర్ గుణ్ణం రాజబ్బాయిల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. పిఠాపురం రామా టాకీస్ సెంటర్లో రెండవ రోజు దీక్షలో కొత్తపల్లికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆదేశాల మేరకు ఏలేశ్వరంలో రెండవ రోజు దీక్షలో ఉత్తరకంచి, రౌతుపాలెం గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆజాద్‌చౌక్‌లో మానవహారం.. రాజమండ్రి ఆజాద్‌చౌక్‌లో నగర నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సమైక్య నినాదాలతో చౌక్ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరంలోని పార్టీ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కోరుకొండ మండలం మునగాల గ్రామంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం’ పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం’ పాదయాత్ర జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని వివరించే కరపత్రాలను ప్రజలకు పంచారు. -
‘సమైక్య’ దీక్ష.. సడలని ఆకాంక్ష
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలో బుధవారం రెండో రోజూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరసిస్తూ చేపట్టిన నిరసనకు సమైక్య వాదులు స్వచ్ఛందంగా మద్దతిచ్చారు. నంద్యాలలోని సిటీకేబుల్ కార్యాలయం వద్ద మహిళలు అధిక సంఖ్యలో దీక్షబూనారు. ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో హుళేబీడు గ్రామానికి చెందిన పది మంది మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు. ఆదోని భీమాస్ సర్కిల్లో వైఎస్సార్సీపీ యువజన విభాగానికి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ప్రసాదరావు, చంద్రకాంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలు వీరికి పూలమాలలు వేసి మద్దతు పలికారు. ఆళ్లగడ్డలో పార్టీ నేత బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన శిబిరంలో ఆచారి కాలనీకి చెందిన 13 మంది పార్టీ శ్రేణుల్లో దీక్ష చేపట్టారు. డోన్‌లోని పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఐదుగురు కార్యకర్తలు నిరాహార దీక్ష నిర్వహించారు. కోడుమూరు పాతబస్టాండ్ వద్ద దీక్ష చేస్తున్న 11 మంది వర్కూరు గ్రామస్తులకు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యు.వి.రాజారెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నందవరం మండలానికి చెందిన పది మంది పార్టీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. నందికొట్కూరు పటేల్ సెంటర్లో పార్టీ నాయకుడు బండిజయరాజు ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు.. ఆత్మకూరు మండల కన్వీనర్ ఏరువా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద 30 మంది పార్టీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది పార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొనగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. -
ఒక్కటే లక్ష్యం.. ‘ఒక్కటి’గా ఉండాలని
సాక్షి, కాకినాడ : రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు వారిని విడదీయబోతున్న కాంగ్రెస్ కుటిలత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ మడమ తిప్పని పోరాటం సాగిస్తూనే ఉంది. జాతి ఐక్యతే లక్ష్యంగా దీక్షబూని ముందుకు సాగుతూనే ఉంది. రాష్ర్ట విభజన బిల్లును అసెంబ్లీకి పంపిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సమైక్యదీక్షలు చేపట్టారు. ఈ నెల 11 వరకు జరిగే దీక్షలకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టగా, పార్టీ కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు శిబిరాలను ప్రారంభించారు. రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు, కడియంలలో రిలే నిరాహార దీక్షలను పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర సాధనకు అలుపెరగని పోరు సాగిస్తున్నారని చెప్పారు. అనపర్తి దేవీచౌక్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద సమైక్య రిలే నిరాహార దీక్షలను నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. తొలుత వందలాది మంది పార్టీ శ్రేణులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ యూత్ సభ్యులు తాడి సూరారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్షాశిబిరం వద్ద సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ విభజన చిచ్చు పెట్టిన కాంగ్రెస్, రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం నేతలు సమైక్యాంధ్ర ముసుగులో ఉన్న సమైక్యాంధ్ర ద్రోహులని ధ్వజమెత్తారు. పి.గన్నవరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు ప్రారంభించారు. తుని తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. పెద్దాపురంలో పట్టణ కన్వీనర్ పేర్నీడి ఈశ్వరరావు, సామర్లకోటలో పట్టణ కన్వీనర్ గుణ్ణం రాజబ్బాయిల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రత్తిపాడులో దీక్షలను పార్టీ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య ప్రారంభించారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో దీక్షా శిబిరాన్ని తణుకువాడ పీఏసీఎస్ అధ్యక్షుడు నల్లమిల్లి ఈశ్వరరెడ్డి ప్రారంభించారు. పిఠాపురం రామా టాకీస్ సెంటర్లో మాజీ కౌన్సిలర్ బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. క్వారీ సెంటర్లో మానవహారం రాజమండ్రి నగర నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్లో వందలాది మంది పార్టీ శ్రేణులతో మానవహారం నిర్వహించి సమైక్యనినాదాలతో హోరెత్తించారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని, బీసీ సెల్ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు మార్గాని రామకృష్ణగౌడ్, ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు మాసా రామజోగి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం శివారు రఘుదేవపురంలో, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్యనాదం పాదయాత్రలు నిర్వహించారు. జగ్గిరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్ పాల్గొన్నారు. -
16 నుంచి సకల జనుల సమ్మె
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకుని ఈనెల 16 నుంచి సకల జనుల సమ్మె చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం సహాధ్యక్షునిగా గెలుపొందిన తర్వాత జిల్లాకు వచ్చిన సందర్భంగా శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమనాయుడు మాట్లాడుతూ ఈనెల 5న జరిగిన సంఘ ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానెల్‌ను గెలిపిం చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటు సమైక్యాంధ్ర కోసం, అటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు విఫలమవడంతో అశోక్‌బాబు నేతృత్వంలో ఉద్యమించామన్నారు. పార్టీలు ఎలా ఉన్నా ఆ పార్టీల స్థానిక నాయకులు తమ ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలు ఏవైనా ఎన్జీవోలంతా సంఘటితంగా ఎదుర్కొందామన్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణా కోసం అన్ని పార్టీలు, ఉద్యోగులు ఒకే వేదికపైకి వ చ్చారని, సీమాంధ్రలో ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్జీవో సంఘం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టిందన్నారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన 66 రోజులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించామని, దీనికి ఐదారు నెలలు పడుతుందని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయన్నారు. ఘన స్వాగతం సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికై వచ్చిన చౌదరి పురుషోత్తమ నాయుడుకు జిల్లా ఎన్జీవోలు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం ముఖద్వారం నుంచి కొత్తబ్రిడ్జి, డే అండ్ నైట్ జంక్షన్, పాలకొండ రోడ్, వైఎస్ఆర్ కూడలి, పాతబస్టాండ్ మీదుగా ఎన్జీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా ఆయనను తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుక్కూరు ఉమామహేశ్వరరావు, ఎన్జీవో సంఘ ప్రతినిధులు ఎం. కాళీప్రసాద్, వీఎస్ఎస్ కేశవరావు, కిలారి నారాయణరావు, బమ్మిడి హరి కృష్ణ, బమ్మిడి నర్సింగరావు, పూజారి జానకిరాం, ఆర్.వి.ఎన్.శర్మ, చల్లా శ్రీను, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి), శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొంక్యాణ వేణుగోపాల్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ గీతా శ్రీకాంత్ పాల్గొన్నారు. -
'విభజనకు పార్లమెంట్ ఒప్పుకోకపోవచ్చు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగేలా అన్ని పార్టీలను సంప్రదిస్తున్నామని మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు తెలిపారు. విభజిస్తే వచ్చే సమస్యలను త్వరలో రాష్ట్రపతికి వివరిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఒప్పుకోకపోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ చర్చ ద్వారా టి.బిల్లును అడ్డుకోగలమని వారు తెలపారు. టీ.బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకునే అవకాశం ఉందన్నారు. -
నినాదాలు, నిరసనలు, వాయిదాలు
హైదరాబాద్ : శాసనసభలో తీరు మారలేదు. నినాదాలు, నిరసనల మధ్య అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. సమైక్య నినాదాల మధ్య అసెంబ్లీలో ఎటువంటి చర్చ చేపట్టే పరిస్థితి లేకపోవడంతో డిప్యుటీ స్పీకర్ మల్లు భట్టీ విక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీలో తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమైక్య తీర్మానంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సభలో గందరగోళం తలెత్తడంతో తొలుత స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా వాయిదా పర్వం చోటుచేసుకుంది. -
నిరసనలతో హోరెత్తిన సిక్కోలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు జిల్లాలో సోమవారం నిరసనల హోరు కొనసాగింది. నియోజకవర్గ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో సిక్కోలు హోరెత్తింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీమాంధ్రప్రాంత ప్రజలు ఎంతగా ఉద్యమించినా కేంద్రం కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కూడలి వద్ద ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, జిల్లా కమిటీ సభ్యులు అంధవరపు సూరిబాబు, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు టి.కామేశ్వరి, పీస శ్రీహరి, ఎన్ని ధనుంజయ్‌లు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో నాయకులు మానవహారం నిర్వహించారు. బస్డాండ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్లు పిలక పోలారావు, పిన్నింటి ఈశ్వరరావు, జిల్లా ఎస్పీ సెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, బల్లాడ రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాతపట్నం: నియోజకవర్గ కేంద్రంలో ఆల్ ఆంధ్రా కూడలి వద్ద సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి, టెక్కలిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో కోటబొమ్మాళి జాతీయ రహదారిపై విద్యార్థులతో మానవహారం నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రైనీ డిఎస్పీ శ్రీలక్ష్మీ వైఎస్ఆర్ సీపీ నాయకులను అరెస్ట్ చేసి అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. టెక్కలి వైఎస్ఆర్ కూడలిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.కోత మురళీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పార్టీ నాయకులు బాడాన మురళీ, చింతాడ ధర్మారావు, చింతాడ మంజుగణపతి పాల్గొన్నారు. రాజాం: రాజాం వైఎస్ఆర్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు భారీ మానవహారం నిర్వహించారు. అనంతరం కొద్దిసేపు ధర్నా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త పిఎంజె బాబు, మాజీ ఎంఎల్ఏ కంబాల జోగులు పాల్గొన్నారు. ఆమదాలవలస: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన రహదారిపై ర్యాలీ, రైల్వేస్టేషన్కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్రావు, బొడ్డేపల్లి మాధురి, నాయకులు దవళ అప్పలనాయుడు, జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పలాస: సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ పెట్రోల్ బంకు నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జై జగన్, జై సమైక్యాంధ్ర, కాంగ్రెస్ డౌన్ డౌన్, సోనియా గాంధీ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ సమైక్యవాదుల నినాదాలతో రహదారులు దద్దరిల్లాయి. అక్కడ నుంచి ప్రారంభమైన ర్యాలీ కాశీబుగ్గ పాత జాతీయ రహదారి మీదుగా మూడు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిటీ కన్వీనర్ బళ్ల గిరిబాబు, వజ్రపుకొత్తూరు మండల కన్వీనర్ తామాడ చంద్రభూషణ్ పాల్గొన్నారు. పాలకొండ: పాలకొండ ఆంజనేయ కాంప్లెక్స్ సమీపంలో నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో ధర్నా చేశారు. సీతంపేటలో మండల కన్వీనర్ జి.సుమిత్రరావు నేతృత్వంలో మండల కేంద్రంలో మానవహారాలు చేపట్టారు. పాలకొండలో జరిగిన కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ చందకజగదీష్కుమార్, వీరఘట్టం మండల కన్వీనర్ దమలపాటి వెంకటరమణ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ సమైక్య ఆందోళన
అనంతపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాయదుర్గం, గుంతకల్లు, కదిరిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళనలు నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి అధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత సర్కిల్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుటిలయత్నం చేస్తోందని, పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కదిరి, గుంతకల్లులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ నేతలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. -
ఇంకా కుమ్మక్కే
ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం కందుకూరులో నిర్వహించిన మానవహారం, సమైక్య ర్యాలీలో ఆయన మాట్లాడారు. సమైక్య హీరోనంటూ ప్రచారం చేసుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండేందుకు పాటుపడుతున్న జగన్మోహన్రెడ్డికే అండగా ఉండేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలాజీ చెప్పారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మల నాయకత్వంలో మానవహారంగా ఏర్పడ్డారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి చర్చి సెంటర్ వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారేనని వైఎస్సార్సీపీ ఆది నుంచి గగ్గోలు పెడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం టీడీపీ, కాంగ్రెస్‌లు కృషి చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతుందని ప్రకటనలు వచ్చినప్పుడల్లా అన్నదాత కుంగిపోతున్నాడని విచారం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే భూములన్నీ సస్యశ్యామలమవుతాయని ఇప్పటివరకూ భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో మానవహారంగా ఏర్పడి సమైక్య ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలుగు జాతి గుండెల్లో గుణపాలు దించుతున్న సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, వారికి సహకరిస్తున్న చంద్రబాబునాయుడుకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కృషి చేశారని, ఆయన మరణం తరువాత కొందరు అనుచితంగా మాట్లాడుతున్నారని మరో అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొగర్త చెంచయ్య, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నాయకులు సింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత పాల్గొన్నారు. టంగుటూరు ట్రంకురోడ్డులో పార్టీ మండల కన్వీనర్ బొట్ల రామారావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. -
దిక్కుమాలిన రాజకీయం
అసెంబ్లీలో చంద్రబాబు వైఖరిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యేలతో విభజన ప్లకార్డులు పట్టిస్తున్నారు సోనియా గీసిన గీత దాటకుండా కిరణ్ మోసం చేస్తున్నారు రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరితేగాని కిందికిరాని పరిస్థితి మధ్యలో ఇంకొక రాష్ట్రం తెస్తే నీళ్లకు దిక్కేది? వైఎస్ వెళ్లిపోయాక ప్రజలను పట్టించుకునేవారే లేరు సీఎం కాగానే ‘అమ్మ ఒడి’ పథకంపైనే నా రెండో సంతకం పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులేస్తాం ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. ఇదే గడ్డమీద పుట్టిన చంద్రబాబు తన పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. మళ్లీ ఆయనే తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విభజన చేయండీ అని ప్లకార్డులు పట్టిస్తారు. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని ఇటువంటి దిక్కుమాలిన, నీతిమాలిన రాజకీయాలు చేయాలా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరోవైపు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఆలోచన పక్కనబెట్టి సోనియా గాంధీ గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తూ పోతున్నారని విమర్శించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర మూడో విడత, రెండో రోజు సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. నీరుగట్టువారిపల్లిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. పేదరికాన్ని దగ్గరగా చూశాను.. ‘‘ఇవాళ రాజకీయాలు చెడిపోయాయి. చదరంగం ఆడుతున్న ట్టు.. ఒక మనిషిని తీసుకొని వెళ్లి జైల్లో పెట్టడం, మరో మని షిని తప్పించడం, ప్రాంతాలను విడగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించుకునే రాజకీయాలను చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. రాజకీయాలంటే ప్రతి పేదవాని గుండె చప్పుడు వినాలి.. ప్రతి పేదవాని మనసు ఎరగాలి. చనిపోయిన తరువాత తన ఫొటో ప్రతి పేదవాని ఇంట్లో ఉండాలని ఆరాటపడటమే రాజకీయం అంటే. రాష్ట్రంలో పేదరికాన్ని దగ్గర నుంచి చూసి న నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది నేను మాత్రమేనని గర్వంగా చెప్పగలను. ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేద కుటుంబం బాధలూ చూశాను. దాదాపు 700 గుడిసెలకు వెళ్లాను. చిన్నచిన్న పిల్లలను వాళ్లు తమతో పాటు పనులకు తీసుకుపోవడం చూశాను. చాలా సందర్భాల్లో ఆ తల్లిదండ్రులను అడిగా... ‘అమ్మా..! చిన్నచిన్న పిల్లలచేత కూడా పనులు చేయిస్తుంటే.. పేదరికం ఎలా పోతుంది? వీళ్లు చదువుకుంటేనే కదమ్మా పేదరికం పోతుంది’ అని నేను అన్నప్పుడు వాళ్లు చెప్పిన మాటలు వింటే నా గుండె బరువెక్కింది. ‘‘అన్నా... మేం కూడా మా పిల్లలను చదివించుకోవాలనే ఆశపడుతున్నాం.. కానీ మొదట కడుపు నిండితేనే కదన్నా.. పిల్లల చదువు గురించి ఆలోచన చేసేది’’ అని వాళ్లు చెప్పిన మాటలు ఇప్పటికీ నా గుండెలను పిండి వేస్తూనే ఉంటాయి. ప్రతి అక్కా, చెల్లెమ్మలకు నేను మాటిచ్చి చెప్తున్నా. చాలా సందర్భాల్లో కూడా నేను ఈ మాట చెప్పా. ముఖ్యమంత్రిని అయిన తరువాత నేను పెట్టబోయే రెండో సంతకం గొప్ప సంతకం. ఆ గొప్ప సంతకం ‘అమ్మ ఒడి’ అనే పథకానికి శ్రీకారం చుడుతుంది. ఆ పథకం కింద ప్రతి తల్లి చేయాల్సింది ఏమిటంటే తన పిల్లలను బడికి పంపడమే. బడికి పంపిన పిల్లాడిని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లో మేం చదివిస్తాం. చదివించడమే కాదు... ఆ పిల్లాడిని ఇంజనీర్నో.. డాక్టర్నో చేస్తాం.. కలెక్టర్ లాంటి పెద్దపెద్ద చదువులు చదివిస్తాం. అలా బడికి పంపినందుకు ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున, ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1,000 తల్లి అకౌంటులోనే పడుతుంది. ఎందుకు ఆ డబ్బు వేస్తున్నామంటే.. తన పిల్లలను బడికి పంపినందుకు ఆ తల్లి ఈ నెల ఎలా బతకాలి? ఇల్లు ఎలా గడవాలి? అనే ఆలోచన చేయకూడదు. అందుకే ప్రతి నెలా అమ్మ అకౌంటులోనే డబ్బు వేస్తాం. వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టివ్వడం.. ఇలాంటివి సునాయాసంగా జరిగిపోతాయని చెప్తున్నా. మధ్యలో మరో రాష్ట్రం తెస్తే నీళ్లెలా ఇస్తారు? ఇవాళ ఇక్కడికి వస్తున్నప్పుడు దారిపొడవునా రైతన్నలు నన్ను చూడటం కోసం వస్తున్నారు. వారిని నీళ్ల పరిస్థితి ఏమిటన్నా అని అడిగాను. 1,000 అడుగులు బోరు వేసినా నీళ్లు పడుతాయో.. పడవో తెలియని అధ్వాన పరిస్థితుల్లో మేం ఉన్నామని ఆ రైతన్నలు చెప్పారు. ఈ మదనపల్లెలో చూస్తే.. రూపాయో... రెండు రూపాయలో పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీ నీవా ఇలా ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేవారే కరువయ్యారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు.. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండిన తరువాత గాని కిందికి రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? అని సోనియాగాంధీని, చంద్రబాబును, కిరణ్‌కుమార్ రెడ్డిని అడుగుతున్నా. వైఎస్ వెళ్లిపోయాక రూపాయి రుణమైనా వచ్చిందా? ఇక్కడే దాదాపు 30 వేల మంది చేనేత కార్మికులు అప్పుల్లో ఉన్నారు. రూ.320 కోట్లు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తూ నాడు వైఎస్సార్ సంతకం చేశారు. ఇవాళ ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఒక్క రూపాయి అయినా లోన్ వచ్చిందా? మాకు లోన్ వచ్చిందని ఒక్క చెయ్యి కూడా లేవదు. అంటే ఆ ఒకే ఒక వ్యక్తి వెళ్లిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల గురించిగాని, రైతుల గురించిగాని, చదువుకుంటున్న పిల్లల గురించిగాని ఆలోచన చేసే వ్యక్తి ఎవరూ లేకుండా పోయారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య ఆ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మనందరం కలసికట్టుగా ఒక్క తాటిమీదకు వద్దాం.. 30 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందామని గట్టిగా చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’ జగన్మోహన్రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులున్నారు. విభజిస్తే 2 రాష్ట్రాలూ నాశనమే ఆలోచన చేయాల్సిన మన పాలకులకు బుర్ర లేకుండా పోతోంది. దేశంలో 28 రాష్ట్రాలుంటే.. మన రాష్ట్ర బడ్జెట్ మూడో స్థానంలో ఉంది. ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే అప్పుడు ఒక రాష్ట్రం తొమ్మిదో స్థానం కోసం.. మరో రాష్ట్రం 13వ స్థానం కోసం పోటీ పడతాయి. విభజిస్తే రెండు రాష్ట్రాలు కూడా నాశనమయ్యే పరిస్థితి కనిపిస్తున్నా ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రం బాగుపడాలంటే ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు ఒక్కటిగా ఉండాలి. మహానగరాలు, సముద్ర తీరాలు ఒక్కటిగా ఉండాలి.. వాటిని విడదీస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది? - వైఎస్ జగన్ రెండు కుటుంబాలకు ఓదార్పు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. సోమవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు నుంచి బయలుదేరిన జగన్ తట్టివారిపల్లెలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నీరుగట్టువారిపల్లెకు చేరుకున్నారు. ఇక్కడి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ను చూడ్డానికి అడుగడుగునా జనం పోటెత్తడంతో నాలుగు గంటల ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లె చేరుకున్నారు. ఇక్కడ కంచుకొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి గంగపురం చేరుకునేసరికి రాత్రి పది గంటలు దాటింది. గంగపురంలో చెనిక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదార్చారు. సోమవారం రాత్రి 11 గంటల తరువాత జగన్మోహన్రెడ్డి పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం చేరుకుని మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ఇంట బస చేశారు. -
సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్ : సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. జై సమైక్యాంధ్ర అన్న నినాదాల మధ్యనే సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర తీర్మానానికి పట్టుబడ్డారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్.. సభ్యులు ఎటువంటి సంప్రదాయాలను పాటించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో పదిగంటలకు బీఏసీ భేటీ తర్వాత..సభ తిరిగి ప్రారంభమవుతుందని.. స్పీకర్ సభను వాయిదా వేశారు. సమైక్యతీర్మానం చేయాలన్న వైఎస్ఆర్సీపీ డిమాండ్‌తో .. వరుసగా మూడో కూడా సభ స్తంభించింది. సభలో ప్రతిష్ఠంభన తొలగించేందుకు ఎట్టకేలకు స్పీకర్ చొరవ చూపుతూ.. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో.. బీఏసీ భేటీ నిర్వహించనున్నారు. గతంలో జరిగిన రెండు బీఏసీ భేటీల్లోకూడా.. సమైక్యాంధ్ర తీర్మానానికి పట్టుపట్టిన వైఎస్ఆర్సీపీ.. సమైక్య తీర్మానానికి ఆస్కారంలేదని సర్కారు చెప్పడంతో రెండుసార్లు బీఏసీ నుంచి వాకౌట్ చేసింది. శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
సమైక్య హోరు
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రను కాంక్షిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో పార్టీ శ్రేణులు పలుచోట్ల మోటారుబైక్ ర్యాలీలు నిర్వహించాయి. దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. 3 వేలకుపైగా మోటారు బైకులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం తాళ్లూరు మండలంలోని గుంటిగంగ భవాని ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ నిర్వాహకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆహ్వానించగా.. శివప్రసాదరెడ్డి తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకొని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయాలని వేడుకున్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా శివప్రసాదరెడ్డి మోటారుబైకు నడుపుతూ ర్యాలీకి ముందుభాగంలో నిలిచారు. ఆయన తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారునితో పాటు బైక్‌పై తిరుగుతూ నియోజకవర్గ మొత్తం పర్యటించి సమైక్యాంధ్ర ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటిగంగ వద్ద బయల్దేరిన ర్యాలీ గంగవరం, తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, దొనకొండ, కురిచేడు వరకు సాగింది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నివాళులర్పించారు. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పామూరుల్లో మోటారుబైకు ర్యాలీలు జరిగాయి. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాట అరుణమ్మ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర వాదులమంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు తీరా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయంలో మౌనం వహించడం దారుణమన్నారు. దీన్ని బట్టే వారి రెండు కళ్ల సిద్ధాంతం స్పష్టమవుతోందన్నారు. యర్రగొండపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి సూరా సామిరంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు దప్పిలి రాజేంద్రప్రసాద్ తదితరులు సమైక్యాంధ్రకు సంఘీభావంగా జరిగిన మోటారు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మోటారు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఒక్కటే సమైక్యాంధ్రే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. చీమకుర్తిలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణి, చీమకుర్తి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు స్థానిక నేతలతో కలిసి మోటారు బైకు ర్యాలీ చేపట్టారు. ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సమైక్య మోటారు బైకు ర్యాలీ ప్రారంభమైంది. నగరంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు సమైక్యాంధ్ర నినాదాలను హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, వైఎస్సార్సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు తదితరులు ర్యాలీకి అగ్రభాగంలో నిలిచారు. స్థానిక చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే అని, త్వరలో జరిగే ఎన్నికల్లో ద్వంద్వ వైఖరిని పాటించే పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. -
వందల బైక్‌లు... ఒకటే నినాదం
బొబ్బిలి, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన ప్రక్రియను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీలు నిర్వహించారు. వందలాది మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహిస్తూ పెద్ద ఎత్తున జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలు చేశారు. విజయనగరం పట్టణంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సమన్వయకర్త అవనాపు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ మయూరి, కోట, మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి, రైల్వే స్టేషను జంక్షన్ల మీదుగా సాగింది. బొబ్బిలిలో అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు ( బేబినాయన) ఆధ్వర్యంలో వందలాది మోటార్ సైకిళ్లతో దాదాపు 25 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. బొబ్బిలి కోట నుంచి బయలుదేరిన ర్యాలీ పట్టణంలోని పలు వీధులతో పాటు రామభద్రపురం మండల కేంద్రం వైపు సాగింది. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మోటారు సైకిళ్లతో తరలివచ్చారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ పతాకాలే రెపరెపలాడాయి. సమైక్యనినాదాలు మిన్నంటాయి. కోట నుంచి పోలీస్‌స్టేషను రోడ్డు, రైల్వే స్టేషను రోడ్డు, కాంప్లెక్స్ జంక్షన్ మీదుగా రామభద్రపురం వైపు వెళ్లి తిరిగి మళ్లీ అదే రూటులో కోటకు చేరుకున్నారు. వీరికి సమ్య్యైవాదులు, ప్రజలు సంఘీభావం తెలిపారు. సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిగింది. బోసుబొమ్మ, శివాజీ బొమ్మ, ఎన్టీఆర్ జంక్షన్, సూర్యమహాల్, పెదకోమటిపేట, డబ్బీవీధిల మీదుగా సాగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు గరుడబిల్లి ప్రశాంత్, ఇతర నేతలు జర్జాపు ఈశ్వరరావు, సూరిబాబు, గొర్లె మధుసూధనరావులతో పాటు వందలాది మంది పాల్గొన్నారు. పాచిపెంట మండలంలో డోల బాబ్జీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. పార్వతీపురం నియోజకవర్గంలో వందలాది మోటారు సైకిళ్లతో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభానుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వైఎస్ సర్కిల్ నుంచి పాత బస్టాండు వరకూ వెళ్లి అక్కడ నుంచి నర్సిపురం వెళ్లారు. తిరిగి పార్వతీపురం వచ్చారు. ర్యాలీలో ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కాపారపు సత్యనారాయణ, మజ్జి వెంకటేష్, ఆర్వీఎస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో సమన్వయకర్త బోకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్.కోట నుంచి ఈ ర్యాలీ మొదలై ఎల్.కోట, కొత్తవలసల్లో సాగింది. డాక్టరు గేదెల తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎల్.కోట, వేపాడల్లో నిర్వహించగా, వేచలపు చినరామినాయుడు ఆధ్వర్యంలో వేపాడలో ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. మూడు వందల బైక్‌లతో నియోజకవర్గంలోని చీపురుపల్లి, మెరకమొడిదాం, గరివిడి, గుర్ల మండలాల్లో ర్యాలీ నిర్వహించారు. -
సమైక్యమే జగన్ ఊపిరి
బొబ్బిలి/మక్కువ, న్యూస్‌లైన్:రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. వైఎస్సార్ సీపీతోనే సమైక్యాంధ్ర సాధ్యమని చెప్పారు. ఇందుకు కోసం చివరి వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. శని వారం మక్కువ మండల కేంద్రంలో జరిగిన సమైక్య శం ఖారావం సభలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట విభజన కు కారణమైన కాంగ్రెస్, టీడీపీ మోసాలను ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణాలో అధిక స్థానాలు తెచ్చుకోవడానికి, రాహుల్‌ను ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ విభజనకు సిద్ధమైతే, రాష్ట్రాన్ని విడగొట్టడానికి చంద్రబాబు వారితో కుమ్మక్కు అయ్యూరని ఆరోపిం చారు. విభజన లేఖను వెనక్కి తీసుకోవాలని ఎంత డిమాండ్ చేసినా.. ఆయన స్పందించకపోవడమే అం దుకు నిదర్శనమన్నారు. విభజన వల్ల రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. సమైక్య పోరాటం ద్వారా జగన్ మరోసారి తన చిత్తశుద్ధిని ని రూపించుకున్నారని చెప్పారు. జగన్ నాయకత్వాన్ని బలపరిచి, టీడీపీ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెను మత్స సాంబశివరాజు మా ట్లాడుతూ సమైక్యమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ తెలుగుజాతి, భాషను కాపాడుకోవడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. వైఎస్ తన హయాంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్యీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. అరుకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ ప్రపంచానికి విలువైన సందే శం, మార్గదర్శకం చూపిన గాంధీ, అంబేద్కర్, మథర్‌థెరిసా లక్షణాలన్నీ మహానేత వైఎస్సార్‌లో ఉన్నాయన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయూలని పిలుపునిచ్చారు. పార్టీ అరుకు పరి శీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) మా ట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, టీడీపీ విభజనకు తెర తీశాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహిం చారు. జేఎం విల్సన్ సమకూర్చిన మహాత్మాగాంధీ, అంబేద్కర్, మథర్ థెరిసా విగ్రహాలను నాయకులు ఆవిష్కరించారు. గ్రామీణ కళాకారులు తప్పెటగుళ్లు, దొమ్మరి మేళాలు వంటి వాటి ద్వారా సమైక్య గళాన్ని వినిపించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు మావుడి ప్రసాదనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఆదాడ మోహనరావు, కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు గరుడబిల్లి ప్ర శాంత్, పార్వతీపురం నియోజవర్గ సమన్వయకర్తలు కొ య్యాన శ్రీవాణి, గర్బాపు ఉదయభాను, సాలూరు నేత లు జరజాపు ఈశ్వరరావు, సూరిబాబు, గొర్లె మధుసూదనరావు, చింతల రామకృష్ణ, కర్రోతు తిరుపతి రావు, బొగ్గు పద్మజ, పూడి సూర్యనారాయణ, బొంగు చిట్టినాయుడు, కొంచాడ తవిటిరాజు, నరసింహమూర్తి, మూడడ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మక్కువ , శంబర గ్రామాలకు చెందిన 150 కుటుంబాలు బొగ్గు పద్మజ ఆధ్వర్యంలో పార్టీలో చేరారుు. వారికి నాయకు లు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అంతకు ముందు మక్కువ ప్రధాన మార్కెట్లో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు.