ఆఖరి పోరు...!
Published Fri, Feb 7 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
రాష్ట్ర విభజన ప్రక్రియ ఆఖరి దశకు చేరుకోవడంలో సమైక్యవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఎన్‌జీఓలు, న్యాయవాదులు, విద్యార్థులు గురువారం విభజనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయూలను మూసివేసి, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. వైద్య ఉద్యోగులు కేంద్రాస్పత్రి వద్ద ధర్నా నిర్వహించగా.. టీడీపీ నాయకులు గంట స్తంభం వద్ద మానవహారం చేపట్టారు.
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని సమైక్య రా ష్ట్ర పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించా రు. తొలుత కలెక్టరేట్‌లోని అన్ని విభాగాలను మూయించారు.అలాగే ఐసీడీ ఎస్ వీడియో కాన్ఫరెన్సును అడ్డుకుని, ఉద్యోగులను బయటకు పంపించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎన్‌జీఓ సంఘం జిల్లాఅధ్యక్షుడు ప్రభూజీ, రెవె న్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు మాట్లాడుతూ విభజన బిల్లుపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.సమైక్యం కోసం పార్టీలకు అతీతం గా ప్రజాప్రతినిధులంతా ఒకే వాణి వినిపించాలని డిమాం డ్ చేశారు. విభజనకు సహకరించిన వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. శుక్రవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. గెజిటెడ్ అధికారుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీఓ నేతలు డివి రమణ, ఆర్‌ఎస్ జాన్, పెద్దింటి అప్పారావు, కె. శ్రీని వాసరావు, రత్నం, రామరత్నం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయూల మూసివేత
కలెక్టరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలను మూసివేశారు. విజయనగరంలో కార్మిక శాఖ,తదితర కార్యాలయాలను మూయించారు. సాలూరులో ఎన్‌జీఓ, మున్సిపల్ అధికారులు రాస్తారోకో నిర్వహించారు. విజయనగరం మున్సిపాలిటీలో ఉద్యోగులు పెన్‌డౌన్ చేసి, నిరసన తెలిపారు. కొన్ని కార్యాలయూలు పూర్తిగా మూతపడగా, మరికొన్ని కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో విధులు నిర్వర్తించారు.
నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల
ఎదుట నిరసన
ఉద్యమంలో భాగంగా నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టనున్నారు. కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకూ నిరసనలు కొనసాగిస్తామని ఎన్‌జీఓ నేతలు తెలిపారు.
తెలుగు జాతి ద్రోహులకు శిక్ష తప్పదు
విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే తెలుగు జాతి ద్రోహులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. గురువారం విశాలాం ధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆర్‌టీసీ కాంప్లెక్స్ ఎదుట వి నూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు జాతిని ని లువునా చీల్చేందుకు కుట్ర పన్నుతున్న కేసీఆర్, కోదండరామ్ దిష్టిబొమ్మలను బహిరంంగా ఉరి తీసి, కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లతో కొట్టారు. ఈ సందర్భంగా మామిడి మాట్లాడుతూ తెలంగాణ వాదులతో కుమ్మక్కైన సీమాం ధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా కో కన్వీనర్ మద్దిల సోంబాబు, కార్యదర్శి ఇట్ల కిషోర్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు జగన్, విద్యార్థి సంఘం నాయకుడుఅనిల్, పాల్గొన్నారు.
Advertisement
Advertisement