విజయవాడ, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్యసెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ మీదకు సమైక్యవాదులు చీపుర్లు విసిసారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం విజయవాడలో రైలు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు రోడ్డు మార్గం గుండా వెళుతున్నట్టు సమాచారం తెలుసుకున్న సమైక్యవాదులు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు ఉద్యమకారులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.
ఈ సమయంలోనే మంత్రి కాన్వాయ్‌పైకి చీపుర్లు విసిరారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌పై అందరి హక్కు ఉందని మంత్రి జేడీ శీలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వ్యాఖ్యా నించారు. తెలంగాణ విడిపోతే ఉద్యో గులకు, విద్యార్థులకు భద్రత కల్పిం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.