
విశాఖపట్నం, సాక్షి: తన కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నగర పోలీసులు సైతం విద్యార్థులదే తప్పిదమన్నట్లు ప్రకటన ఇచ్చేశారు. అయితే పవన్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులకు ఆలస్యమైందని.. ఇందుకు ఆధారాలతో సహా పక్కగా జనసేన ఎమ్మెల్యే దొరికిపోయారు.
జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం వల్లే 30 మంది ఎమ్మెల్యేలు పరీక్ష రాయలేకపోయారు. పవన్‌కు గజమాల స్వాగతం ఏర్పాటు చేసిన ఆయన.. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయించారు. దీంతో సకాలంలో విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా బయటపడింది.