
సమైక్యవాదులు కాకపోతే ఎమ్మెల్యేలే ఓడిస్తారు
రాజ్యసభ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు సమైక్యవాదులు కాకపోతే.. వారిని ఆ పార్టీల ఎమ్మెల్యేలే ఓడిస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు జాతిని ఎవరూ విడదీయలేరని, తనకు రాజకీయం కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి సభలో బిల్లును ఓడిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.