
రాజీనామా ఆమోదానికి లగడపాటి రిట్ దాఖలు
లోక్‌సభ సభ్యత్వానికి తాను ఇచ్చిన రాజీనామాను వెంటనే ఆమోదించేలా లోక్‌సభ స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
తన పిటిషన్‌లో స్పీకర్‌ను ప్రతివాదిగా పేర్కొన్న ఆయన, హైకోర్టు నిబంధనలు, ఆదేశాలకు లోబడి రిట్‌ను అత్యవసరమైనదిగా పరిగణించాలని విన్నవిస్తూ కోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ప్రత్యేక దరఖాస్తునూ అందజేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 227 కింద వేసిన రిట్‌లో ఆయన కోర్టుకు రావడానికి గల కారణాలను పొందుపరిచారు.