
ఆపేందుకు చాలా అస్త్రాలున్నాయి
పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆపేందుకు తమ వద్ద చాలా అస్త్రాలున్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 15 రోజుల పాటు రాజకీయ పార్టీలన్నింటినీ ప్రజలు పరుగులు పెట్టించాలని ఆయన అన్నారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం ఇప్పటికీ తమకుందని, బీహార్ విభజనతో ఆంధ్రప్రదేశ్ విభజనను పోల్చి చూడకూడదని లగడపాటి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక్కటవ్వడం చాలా హర్షణీయమని రాజగోపాల్ అన్నారు.