
ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ
హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీకీ రాష్ట్ర విభజన సెగ తగిలింది. హైదరాబాద్ ఏవీ కళాశాలలో జరుగుతున్న ఆప్ సభలో శనివారం గందరగోళం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే నేపథ్యంలో ఏవీ కాలేజీలో ఆమ్‌ఆద్మీపార్టీ కార్యకర్తలు ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ఆప్ ముఖ్యనేత ప్రశాంత్ భూషణ్ హాజరు అయ్యారు. ఆయన ఎదుట తెలంగాణ, సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోటా పోటీ నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.