విభజన బిల్లుపై ఓటింగ్ కోసం వైఎస్ విజయమ్మ పట్టుపట్టినా ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం ముందుకు రాలేదని పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీ లాబీల్లో వారు విలేకరులతో మాట్లాడారు. కనీసం తన అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా సీఎం ముందుకు రాలేదని, దాంతో ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయని వారు అన్నారు.
విభజనను మరోసారి వ్యతిరేకించే అవకాశం వచ్చినా ఏఐసీసీ భేటీకి సీఎం డుమ్మాకొట్టారని, అసెంబ్లీ లేకపోయినా కూడా ఆయన వెళ్లలేదని విమర్శించారు. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాసుల నిరాకరణ అంతా డ్రామాయేనని, రెన్యువల్ చేసుకోని సభ్యులకు పాస్‌లు రాలేదని వారు చెప్పారు. సాంకేతికమైన అంశాన్ని దాచి విభజన వ్యతిరేకించినందుకు పాసులు రాలేదని వారు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీఎం కిరణ్‌పై ఉన్న భ్రమలన్నీ తొలగిపోతున్నాయని, ఇన్నాళ్లుగా ఆయనను నమ్ముకుని మోసపోయామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హైకమాండ్ మనిషని, ఆయన విభజనవాదేనన్న విషయం అర్థమవుతోందని సీమాంధ్ర ఎమ్మెల్యేలు అన్నారు.
కిరణ్ విభజనవాదే: సీమాంధ్ర ఎమ్మెల్యేలు
Published Fri, Jan 17 2014 4:23 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement