lagadapati rajagopal
-
పచ్చ మందలో 'కొత్త పిట్ట' పలుకులు.. పైసాకి పనికిరాని పృథ్వీరాజ్
ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీలో వైసీపీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చేశాయ్.. 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్వే సంస్థలు క్లియర్‌గా తేల్చే చెప్పేశాయ్. అందులో భాగంగానే ఓట్ల కోసం పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తన లైన్లో పెట్టుకున్నాడు. అయినా, జగన్‌ను ఢీ కొట్టేందుకు బలం సరిపోవడంలేదని తేలిపోయింది. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశాడు. అవసరమైతే రేపు కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా చంద్రబాబును ఎన్నికల సర్వేలన్నీ భయపెడుతున్నాయి. ఫలితాలపై జోస్యం చెబుతున్న 'కొత్త పిట్ట' తాజాగా ఇలాంటి సమయంలో కమెడియన్ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పాడు. లగడపాటి రాజగోపాల్ వారసుడు మాదిరి 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. సీఎం జగన్ బలం ముందు కూటమి బలం సరిపోవడం లేదని చంద్రబాబు నానాపాట్లు పడి ప్రశాంత్ కిషోర్ సలహాల కోసం వెంపార్లుడుతుంటే మధ్యలో ఈ జోక్‌లు ఏంటి..? అని పృథ్వీరాజ్‌పై పంచ్‌లు పడుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అంటూ కీర్తించాయి.. తీరా ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీ ముందు టీడీపీ నేతలు అందరూ కొట్టుకుపోయారు. ఆంధ్రా ఆక్టోపస్ సర్వేలను నమ్మి కోట్ల రూపాయల్లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన వారు ఎందరో... ఫలితాలు వెలువడ్డాక సీఎం జగన్ దెబ్బ ఎలా ఉంటుందో లగడపాటి రాజగోపాల్‌కు తెలిసొచ్చింది. ఇకపై సర్వేలు చేయనని మూటముళ్లే సర్దుకొని కనిపించకుండా పోయాడు. తాజాగా లగడపాటి లేని లోటును కమెడియన్ పృథ్వీరాజ్ 2024 ఎన్నికల్లో తీర్చేలా ఉన్నాడు. ప్రస్తుతం టీడీపీలో పవన్‌కే సరైనే స్థానం లేదు.. వాళ్లను నమ్ముకుని ఇలాంటి చిలుక జోస్యాలు చెబితే ఎవరికైనా కామెడీగానే ఉంటుంది మరి! నయా పైసా లాభం లేదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పృథ్వీరాజ్ వైసీపీ కోసం పనిచేశాడు. పృథ్వీ వల్ల పార్టీకి నయా పైసా లాభం లేకపోయినా పదవి దక్కిందని అప్పట్లో సోషల్‌మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ కోసం పనిచేశాడని గుర్తించి.. అందుకుగాను ఎస్వీ భక్తి ఛానల్ చైర్మన్ బాధ్యతల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అప్పగించారు. అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ కీలక పోస్టులో ఉంటూ.. ఓ మహిళతో సరస సంభాషణలు చేసి పదవిని ఊడగొట్టుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా వైసీపీకి దూరమవుతూ.. టీడీపీ, జనసేన మందలో చేరిపోయాడు. తాజాగా ఈ కొత్త పిట్ట కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం విశేషం! -
లగడపాటి ‘చిలకజోస్యానికి’ వ్యక్తి బలి
సాక్షి, నిడదవోలు: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ గెలవబోతోందంటూ చెప్పిన చిలకజోస్యం (సర్వే) ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లగడపాటి సర్వేను నమ్మి ఓ కౌలు రైతు అప్పు తెచ్చిమరీ బెట్టింగ్ కాయగా.. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు కంఠమని వీర్రాజు (45) ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ సుమారు రూ. 12 లక్షలు పందెం కాశాడు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీర్రాజు టీడీపీ వీరాభిమాని. ఓ పక్క కౌలు చేస్తూనే ధాన్యం వ్యాపారం చేస్తాడు. ఎన్నికల ఫలితాలకు మూడు రోజులకు ముందు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుంచి కొంత నగదు అప్పు తీసుకున్నాడు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని సుమారు రూ.12 లక్షల పందెం కాశాడు. టీడీపీ 110 నుండి 130 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని లగడపాటి రాజ్‌గోపాల్ సహా పలు సర్వేలు చెప్పడంతో ఈసారి కూడా టీడీపీ విజయం సాధిస్తుందని భావించిన వీర్రాజు రూ.12 లక్షలు బెట్టింగ్ కాసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైఎస్సార్ సీపీ ఏకంగా 151 స్థానాలు గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఓ వైపు పార్టీ ఓటమిపాలవ్వడం, ఓ వైపు రూ.12 లక్షలు పందెంలో పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందాడు. మిల్లర్ల నుంచి అధిక మొత్తంలో నగదు అప్పుగా తీసుకోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేలివెన్ను గ్రామంలో తన ఇంటి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎప్పటి మాదిరిగానే పొలం వెళుతున్నట్లు బయలుదేరాడు. అక్కడి నుంచి నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ శివారున ఉన్న ముక్కులమ్మ వారి గుడి వెనుక ఉన్న ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీర్రాజుకు భార్య కంఠమని సునీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో ఎంతో సామ్యుడిగా పేరున్న వీర్రాజు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు. నిడదవోలు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు వీర్రాజు భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఏస్సై ఎన్.హనుమంతరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫ్యాన్ ప్రభంజనంతో సైకిల్ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి అభాసుపాలయ్యారు. ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి...ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌కి మొహం చాటేసి...చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు. తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారు. చదవండి: బాబు కోసం బోగస్ సర్వేలు సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి విదూషకుల విన్యాసాలు -
ఏయ్ లగడపాటి నువ్వెక్కడా?
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్థాన సర్వే చిలక, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ బోగస్ అని తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జతకట్టిన మహాకూటమికి మేలు జరిగేలా బోగస్ సర్వేతో మాయ చేసిన లగడపాటి.. ఏపీ ఎన్నికల విషయంలోను అదే పంథాను కొనసాగించి పరువు తీసుకున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించిన లగడపాటి.. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీ చేబట్టబోతుందని జోస్యం చెప్పారు. అన్ని సర్వే సంస్థలు, జాతీయ చానెళ్లు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైస్సార్సీపీకి పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం భిన్నంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే లగడపాటి చెప్పినవన్నీ బోగస్ అని స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ వైఎస్సార్సీపీ ఏకంగా 152 సీట్ల ఆధిక్యంతో చరిత్ర సృష్టించే దిశగా కొనసాగుతుంది. ఈ ఫలితంతో లగడపాటి విశ్వసనీయత కోల్పోయారు. ఆయనపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ క్యాడరే లగడపాటి కనిపిస్తే చితక్కొట్టాలనే కసితో ఉంది. ఆయన చెప్పిన సర్వే వివరాలతో సోషల మీడియా వేదికగా అనవసర సవాళ్లకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఫలితాలతో ముఖం చాటేశారు. దీనికి కారణమైన లగడపాటిపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్స్ చేస్తున్నారు. ‘ఎయ్ లగడపాటి నువ్వెక్కడా? మళ్లీ సర్వే అంటూ మీడియా ముందుకు వచ్చావో?’ అంటూ అసభ్య పదజాలంతో మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనే లగడపాటి సర్వేతో బెట్టింగ్రాయిళ్లు కోట్ల రూపాయలు నష్టపోయారని, బెట్టింగ్‌ల కమిషన్ కోసమే మళ్లీ తప్పుడు సర్వే వివరాలను వెల్లడించారని ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి లగడపాటి మళ్లీ సర్వే అని నోరెత్తకుండా.. అతని అంచనాలకు భిన్నంగా రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం. pic.twitter.com/VkLtF7kR7Z — Ram Gopal Varma (@RGVzoomin) 23 May 2019 -
‘సర్వే అనకుండా.. లగడపాటిని లోపలేయాలి’
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు. వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో జోకర్ స్థాయికి తీసుకెళ్లిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు..
-
లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ‘ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయార’ని అయ్యన్నపాత్రుడు అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేస్తుంటే మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఓటమిని ఆయన చెప్పకనే చెప్పారని ప్రత్యర్థులు అంటున్నారు. (చదవండి: ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాబు కోసం బోగస్ సర్వేలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు, జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు బోగస్ సర్వే సంస్థలను రంగంలోకి దించింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని పేరెన్నికగన్న సంస్థలన్నీ చెబుతుండగా, బోగస్ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించింది. ఐఎన్ఎస్ఎస్, ఎలైట్ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పని చేసేవేనని చెబుతున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ సంస్థలు అసలు సర్వేలు చేయకుండానే చేసినట్లు బిల్డప్ ఇచ్చి, నోటికొచ్చిన సీట్ల లెక్కలు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. లగడపాటి సర్వే తీరిది.. రెండురోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్ అని సెఫాలజిస్టులు తేల్చిచెబుతున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా, ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో చేసిన సర్వే వివరాలతో లగడపాటి ఒక నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కేవలం 38 నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని, 50 వేల శాంపిల్స్ తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. కేవలం 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి, ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు. అందులోనూ లగడపాటి టీడీపీకి 90కి 20 స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 20 సీట్ల మార్జిన్‌తో ఫలితాలు అంచనా వేయడాన్ని బట్టి వారి సర్వేపై వారికే నమ్మకం లేదని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబుతో తెరచాటు సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన లగడపాటి సర్వేకు ఏమాత్రం ప్రామాణికత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ రెండు సంస్థలూ అంతే.. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఎస్ సంస్థ పేరుతో విడుదలైన సర్వే కూడా టీడీపీ నాయకుల మెదళ్ల నుంచి బయటకు వచ్చిందే. ఐఎన్ఎస్ఎస్ అనేది ప్రాభవం కోల్పోయిన ఒక తెలుగు దినపత్రికలో పనిచేసిన జర్నలిస్టు ఢిల్లీలో నిర్వహిస్తున్న న్యూస్ ఏజెన్సీ. ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను కవర్ చేయడానికి దానికి రిపోర్టర్లే లేరు. అలాంటి సంస్థ ఏపీలో భారీ ఎత్తున సర్వే చేశామని, టీడీపీకి 118, వైఎస్సార్సీపీకి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలినట్లు ప్రకటించింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్సార్సీపీ.. టీడీపీ కంటే 6 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని కచ్చితమైన లెక్కలతో వివరిస్తుండగా, ఈ సంస్థ మాత్రం వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి 9.5 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నట్లు చెప్పడాన్ని బట్టి ఇది పూర్తిగా టీడీపీ సర్వే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ‘ఎలైట్ ఎలక్టోరల్ క్యాలిక్యులస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీకి 106 సీట్లు, వైఎస్సార్సీపీకి 68 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇది కూడా టీడీపీ నేతలు విడుదల చేయించిన సర్వే అని సమాచారం. ఈ రెండు సర్వే సంస్థలు రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నది చెప్పకుండా కొన్ని కాకిలెక్కలతో ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. టుడేస్ చాణక్య పేరుతో విడుదలైన మరో సర్వే టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, వైఎస్సార్సీపీకి 8 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేట్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. మిషన్ చాణక్య సర్వే సంస్థ దాన్ని ఖండించింది. తమ పేరును పోలిన సంస్థ పేరుతో బోగస్ సర్వే విడుదల చేశారని పేర్కొంది. ఇప్పుడు మిషన్ చాణక్య సంస్థ వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయట పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు, ఆయన కోటరీ ఉద్దేశపూర్వకంగా కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేల వివరాలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
విదూషకుల విన్యాసాలు
ఏపీలో అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పనులకు, దుర్మార్గాలకు చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరం. ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడానికి ముందురోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేసిన ఘనుడు లగడపాటి. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? ఇది ప్రజాస్వామ్య మేనా? చంద్రగిరిలో రికార్డయిన పోలింగ్ వీడి యోలు పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’. – కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది (17.05.2019) ప్రకటన ‘‘దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండాలంటే.. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడి పాదాల కింద నలిగిపోయేలా ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అప్పగించి కూర్చోరాదు. అలాగే తాము త్యాగాలతో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని దారి తప్పించి కూల్చివేయగల అధికారాల్ని అతని చేతుల్లో పెట్టరాదు. రాజకీయాల్లో భక్తి భావన పతనానికి చివరికి వ్యక్తి నియంతృత్వానికి రాజమార్గం వేస్తుం దన్న సత్యాన్ని మరిచిపోరాదు’. – 1949 నవంబర్ 25న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరు ప్రసంగంలో హెచ్చరిక! మేడిపండుగా భావించిన ‘పండు’ను కాస్తా పొట్టవిప్పి చూడగానే పురుగులమయంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మారుతోందని ఎప్ప టికన్నా హెచ్చుస్థాయిలో గత 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రకు అపవాదుగా 2019 ఎన్నికల నిర్వహణ నిరూపించాయి. ఈ పతన దశకు ప్రస్తుత కేంద్ర, దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు కారకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పతనదశలో ప్రవేశించిన భ్రష్ట టీడీపీ నాయకుడు చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు చేయరాని పను లకు, దుర్మార్గాలకు నాయకత్వం వహించడం దురదృష్టకరం. కాంగ్రెస్ కేంద్ర అధిష్టానవర్గం నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేస్తున్న తరుణంలో ఆ పరిణామానికి అడ్డుకట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని అష్టావక్రమార్గాల్లో నడిపించి భ్రష్టతవైపు మళ్ళించినవాడు చంద్రగిరి ప్రాంత చంద్రబాబు. అల్లుడిగా ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ‘నల్లి’ పోట్లు ద్వారా ఎన్టీఆర్‌ని సాగనంపి ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన వాడు అనంతరం తన పార్టీకి ఏకు మేకవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకుడు కావడం జగమె రిగిన సత్యం. తాజాగా ఏ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీఆర్ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి ఈ కష్టకాలంలో అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఒకరు పార్లమెంటును స్తంభింపచేయడం కోసం మిరియాల కారం (పెప్పర్ స్ప్రే) సభ్యుల కళ్లలో కొట్టడంలో నేర్పరి. మరొకరు అవసాన పదవీదశలో ఉన్న ముఖ్యమంత్రి. నిజానికి చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి చంద్ర బాబు ఎందుకు వలసపోవలసి వచ్చింది? కాంగ్రెస్‌లో ఉండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన∙వ్యక్తి.. ఎన్టీఆర్‌ను అంటకాగిన తర్వాత ఆ నియోజక వర్గాన్ని విడిచి ‘కుప్పం’ ఒడిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది? పైగా, శిక్షా ప్రాంతంగా పేరు మోసిన కుప్పంకు బదిలీ కావడానికి అధికారులు ఎందుకు ఇష్టపడరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎడంగా, కడుకొసలో ఉన్న కుప్పం ఏనాడూ చంద్రగిరిలో అంతర్భాగమే కాదని చారిత్రికుల భావన. అందుకే, 1995 దాకా ఆంధ్ర ప్రదేశ్–కర్ణాటక–తమిళనాడు హద్దుల ముక్కోణం కూడలిలో ఉంది. ఏ అధికారినైనా శిక్షించాలంటే కుప్పానికి తోసి శిక్షిస్తారట. పైగా అమాయక తమిళనాడు పేదసాదలకు నిలయం కూడానట. ఈ ‘శిక్షాత్మక, సమ స్యాత్మక ప్రాంతాన్ని బాబు ఎంచుకుని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన కుప్పాన్ని నియోజకవర్గంగా ఏర్పరచి, దానికి వ్యవసాయ క్షేత్రం అని పేరు జోడించారు. గతంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్ర వేత్తలు వద్దు వద్దన్నా మన వాతావరణానికి సానుకూలపడని ఏటవాలు ‘పోడు’ వ్యవసాయ పద్ధతుల్లో ఇజ్రాయెలీ సాగు పద్ధతుల్ని ప్రవేశపెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇజ్రాయెలీ సాగుకు మన రైతుల్ని అలవాటు చేయడం కోసం సంప్రదాయ క్షేత్ర సరిహద్దుల్ని చెరిపేసి, రైతుల్ని ఇబ్బందుల పాల్జేసి, తమ భూముల్ని తామే గుర్తించలేని దుస్థి తిలోకి రైతుల్ని నెట్టి తీవ్ర విమర్శలకు గురైన బాబు కనీసం మర్యాద కోసమైనా, గౌరవ భావంతో రైతులకు పొరపాటు అయిందని కూడా క్షమాపణ చెప్పకుండా తప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామ్య పక్షంగా ఉండి, ఇటీవలే విడాకులిచ్చి తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌ను అంటకాగుతూ ఎన్టీఆర్ ‘తెలు గుదేశం’ పార్టీని భూస్థాపితం చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్య అయిన నోట్ల రద్దును మోదీ ప్రకటించకముందే మన రాష్ట్రంలో మొదట ప్రస్తావించి, ‘రద్దు’ పద్దుకు ప్రతిపాదించింది తానే నని గొప్ప కోసం ప్రకటించి, బీజేపీ సంకీర్ణానికి విడాకులిచ్చిన మరు క్షణం ఆ నెపాన్ని మోదీ మీదికి సునాయాసంగా నెట్టేశారు బాబు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలోనూ ఓట్ల రిగ్గింగ్‌కు భారీ స్థాయిలో పాల్పడిన ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తల రక్షణ కోసం బాబు పడరానిపాట్లు పడుతున్నారు. పైగా, డబ్బుతో ఓట్ల కొనుగోళ్లకు తన చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించిన బాబు ఢిల్లీలో ‘ఎన్నికల విధానం: జవాబు దారీతనం’ అన్న అంశంపై సదస్సులో (18.5.2019) మాట్లాడుతూ ‘పెద్ద నోట్లు రద్దుచేసి కొత్తగా రూ. 500, రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంవల్ల రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచటం సులువైపోయింది. ప్రజలు కూడా రెండువేలు, అంతకుపైనే ఎక్కువగా ఆశిస్తున్నార’నీ చెప్ప టం ప్రజల మధ్య నవ్వులాటగా మారిందని అతను గుర్తించటం లేదు. ‘జవాబుదారీతనం’ గురించి ఊకదంపుడు కొట్టే బాబు రాష్ట్ర ఉన్నతాధికారుల క్రియాశీల నిర్ణయాలను, ఎన్నికల (కేంద్ర–రాష్ట్ర) కమి షన్ ఉన్నతాధికారుల్ని లెక్క చేయకుండా పోవటం– అంబేడ్కర్ శఠిం చిన రాజకీయ అహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన వ్యక్తి అతను. ఈ అహంకారం తోనే చంద్రగిరి నియోజకవర్గంలోని కీలకమైన పోలింగ్ కేంద్రాల పరిధిలోని దళిత, మైనారిటీలను ఓటు హక్కును వినియోగించుకో కుండా సుమారు 30 ఏళ్లుగా నిర్బంధ విధానాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు వర్గం జాగ్ర త్తపడింది. ఈ పరిణామాలను బయటకు పొక్కనివ్వకుండా ‘వదరు బోతు’గా చంద్రబాబు– ‘చిలకజోస్యాల’ ‘రగడ’ (లగడ)పాటి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉండగానే తుది ఫలితాల ప్రకటన వెలువడక ముందే చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగడానికి ముందు రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేశారు. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్ప లేదు– అయిదు పోలింగ్ కేంద్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా బాహాటంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా, ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలిసి కూడా చంద్రబాబు ‘కాలుకాలిన పిల్లిలా’ దేశ ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో విఫలమవుతున్నారని, పరువుకోసంగానూ ‘దేశం’ ఓటమిని ఆంధ్రప్రదేశ్‌లో హుందాగా ఒప్పుకోవడానికి మనస్సు బిక్క చచ్చిపోయినందున ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా నాయకులను తనలాగే కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయ త్నాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇందుకు కారణం– సొంత రాష్ట్రంలోనే తన అధికార పునాదులు బీటలు వారుతూండటమేనని మరువరాదు. పళ్ల బిగువుతోనే ఢిల్లీ, పంజాబ్, కోల్‌కతాల పంచల్లో తల దాచుకోచూడటం. దళిత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా, బెదిరింపుల ద్వారా దౌర్జన్య హింసల ద్వారా అడ్డుకుని వారి ఓట్లను వారి పేరిట తామే గుద్దుకున్న ‘దేశం’ నాయకత్వ చర్యలు వేనోళ్ల ఖండించి ఏవగించుకోవలసినవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘రగడ పాటి’ జరిపిన సర్వే ఫలితాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఎంతగా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. 24 గంటలు గడవకముందే చంద్రబాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరిలో భారీ బందోబస్తు మధ్య జరపవలసి వచ్చిన రీ–పోలింగ్ సందర్భంగా కూడా పరమ ‘బోకు’ జోస్యంగా, కాదు కాదు, పరమ అపహాస్యంగా మిగిలిపోను న్నది. పైగా ఇప్పటికే అడుగూడిన ప్రతిపక్ష నాయకులతో రేపు ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. యావద్భారతంలో ఆసేతు హిమాచల పర్యంతం ‘ప్రజాస్వామ్యం’ విలువలు 2019 ఎన్నికలలో మరింతగా దిగజారిపోవటం విచారకరం! ఎన్టీఆర్, వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలు తెలుగు వారి కీర్తి పతాకలను నిలబెట్టగా, వాటిని దించేయడానికి సాహసించినవారుగా, రేపటి పదవీభ్రష్టులుగా చంద్రబాబు అతని పార్టీ మిగిలిపోతారు. కానీ, రేపటి ఉషోదయానికి, పరిణామశీలమైన మార్పుకు ఆహ్వానం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
లగడపాటి - కిరసనాయిలు ఆడుతున్న డ్రామా..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘40 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి దివాలా తీశాడు. దీన్ని ఆసరా చేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదిరించాడు. తెలంగాణా ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి వెయ్యి కోట్లు సంపాదించారు. మళ్లీ సేమ్ డ్రామా. బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్‌పై పెట్ట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 లోగా బుకీలు సేఫ్. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టులు, బుకీస్ ఇచ్చే కమిషన్లపై రోజులు వెళ్లదీస్తున్నాడు లగడపాటి. భీమవరం,విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90 శాతం ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు వేల కోట్లు నష్టపోయేట్టున్నారు. లగడపాటి - కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా. మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడు.ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయేదానికి ఎందుకులే అని తప్పుకున్నాడు. ఇప్పుడే పార్టీతో సంబంధం లేదని కోస్తున్నాడు. కన్నాలేసే దొంగకు ఏఇంట్లో దూరితే ఏం దొరుకుతుందో అంచనా వేసే సిక్త్స్ సెన్స్ ఒకటి ఉండి చస్తుంది. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే ... గెలుస్తామని లగడపాటి చెప్పాడు. అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు...ఇది ఎల్లో జలగ! లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి.’ అంటూ ఆయన ట్విట్ చేశారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెట్టింగ్‌లు కాసి, సొమ్ము చేసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూటి చిలుక లగడపాటి రాజగోపాల్ పెద్ద స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించబోతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆయన ఢంకా బజాయించారు. దాంతో బెట్టింగ్ రాయుళ్లంతా మహా కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. కానీ, లగడపాటి మాత్రం తన అనుచరులతో అధికార టీఆర్ఎస్ గెలుపు తథ్యమంటూ బెట్టింగ్‌లు కాసేలా జాగ్రత్త పడినట్లు విమర్శలు వినిపించాయి. చివరకు టీఆర్ఎస్ నెగ్గడంతో బెట్టింగ్‌ల్లో లగడపాటి మనుషులు భారీగా ఆర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని లగడపాటి అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలవడడానికి 24 గంటల ముందే నిన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని తమ సర్వేలో తేలినట్లు సంకేతాలిచ్చారు. -
బెట్టింగ్ కోసం ఆక్టోపస్ మోసం!
-
టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ
-
సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి
సాక్షి, అమరావతి : రేపు చంద్రగిరిలో రీపోలింగ్ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు. కాగా సర్వే వివరాలు వెల్లడించడానికి ముందు రాజగోపాల్ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో భేటీ అయ్యారు. మీడియా సమావేశం కంటే ముందే బుద్ధా వెంకన్నతో అరగంట పాటు ఆయన భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే విషయంపై విశ్లేషకులు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఊహించినట్టుగానే పచ్చ పార్టీ భజన చేయడానికి మాత్రమే ఆయన విలేకరుల ముందుకు వచ్చినట్టు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ ఇక అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి లగడపాటి ఈ విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రీపోలింగ్‌లో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కాగా గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో లగడపాటి రాజగోపాల్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతుందని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన ఆయన సర్వే పూర్తి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. దీంతో రాజగోపాల్ సర్వే విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. -
త్వరలో అన్ని విషయాలు చెబుతా: లడగపాటి
సాక్షి, తిరుమల: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కాలినడకన కొండెక్కి స్వామి ఆశీస్సులు పొందారు. దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలందరు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. ఎన్నికల గురించి విలేకరులు ప్రశ్నించగా.. పవిత్రమైన తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని, త్వరలో అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కాగా, గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో ఆయన తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
నిలకడ లేని ‘నారా’జకీయం
అయితే మేనియా, లేదంటే ఫోబియా. మధ్యేమార్గం లేదు. మేనియా అంటే పిచ్చి ప్రేమ. నిర్హేతుకమైన అభిమానం. ఫోబియా అంటే గుడ్డి వ్యతిరేకత. మితిమీరిన ద్వేషం. రెండూ తీవ్రమైన మానసిక ధోరణులే. సాధారణంగా కొందరు వ్యక్తులకు కొందరంటే మేనియా ఉంటుంది. కొందరిపట్ల ఫోబియా ఉంటుంది. ఒకే వ్యక్తికి రెండు లక్షణాలూ ఉండవలసిన పని లేదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి దాదాపు శాశ్వతంగా ఉంటాయి. అభ్యాసం వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలో ఈ రెండు లక్షణాలూ ఏకకాలం ప్రకోపించే నైజం ఉంది. ఒకరిని విపరీతంగా అభిమానిస్తారు. అదే సమయంలో మరొకరిని హద్దులు మీరి ద్వేషిస్తారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల కొంతకాలం మేనియా ప్రదర్శించి కొంతకాలం తర్వాత అదే వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల అంతే స్థాయిలో ఫోబియా చూపించడం ఆయన ప్రత్యేకత. ఉదాహరణకు 2014 జూన్ నుంచి 2018 మార్చి వరకూ నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రులుగా పని చేసిన వారందరిలోకీ ఉత్తముడు. ఘటనాఘటన సమర్థుడు. ప్రపంచంలో భారత దేశా నికి సమున్నత స్థానం సంపాదించిన రాజకీయవేత్త. తన సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనం అంతుచూసేందుకు సాహసోపేతమైన చర్య తీసు కున్న దురంధరుడు. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)ని అత్యంత లాఘవంగా అమలులోకి తెచ్చిన నేర్పరి. స్నేహం చెడి, బంధం వీడి, ప్రత్యర్థులుగా మారిన తర్వాత అదే మోదీ పనికిరాని ప్రధాని. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని నిరోధించలేకపోయిన అసమర్థుడు. ఉగ్రవాద దాడిపై అనుచిత వ్యాఖ్య ఎన్నికలు రెండు మాసాల దూరంలో ఉన్నాయనగా ప్రజలలో దేశభక్త్యావేశం నింపడానికి ఉగ్రవాదుల దాడిని పనికట్టుకుని జరిపించారా అని అనుమానం కలుగుతోందనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ కూడా అదే ఫక్కీలో కేంద్రం నిజాయతీని శంకించారు. వీరిద్దరి కంటే పంజాబ్ మంత్రి నవజోత్ సిద్ధూ నయం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సిద్ధూ అనడం సమయోచితం కాకపోయినా అర్థం లేని బాధ్యతారహితమైన వ్యాఖ్య కాదు. నిర్మాణాత్మకమైనదీ, ఆవేశాలు చల్లారిన అనంతరం ఆచరణయోగ్య మైనదీ. గోధ్రా అమానుషం, అనంతర మారణహోమం జరిగింది 2002లో. 2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నారావారికి మోదీ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరకరమైన అంశం కనిపించలేదు. గుజరాత్ నరమేధం గుర్తురాలేదు. ఎట్లాగైనా గెలవడం ప్రధానం. అందుకే సినీనటుడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ మద్దతు కోరారు. మొత్తంమీద స్వల్ప ఆధిక్యంతో ఎన్నికలలో గెలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో భాగస్వామ్యం నెరిపారు. నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)నుంచి వైదొలిగిన తర్వాత గుజరాత్ మారణకాండ, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రవచించిన రాజధర్మం నారావారికి జ్ఞాపకం వచ్చాయి. దీనినే మనోవైజ్ఞానిక శాస్త్రంలో సెలక్టివ్ ఆమ్నీసియా (ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరచిపోవడం) అంటారు. ఇది కూడా ఒకానొక మానసిక లక్షణమే. మేనియా ఉన్నంతకాలం ఆకాశానికి ఎత్తడం, మేనియా దిగిపోగానే నేలకేసి కొట్టడం. మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్న కాలంలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పట్ల ద్వేషభావం ఉండేది. నరేంద్రమోదీని అవధులు లేకుండా అభిమానిస్తున్న రోజుల్లో కాంగ్రెస్ చెత్తపార్టీ. సోనియాగాంధీ ఇటలీ రాక్షసి. మాఫియోజీ. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ అసమర్థుడు. పప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. రాహుల్‌గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే, ‘ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ఇక్కడ ప్రజలు బతికున్నారో, చచ్చారో చూడటానికి వచ్చారా?’ అంటూ ఉతికి ఆరేశారు. అదంతా కాంగ్రెస్ ఫోబియా ఉన్న రోజుల్లో వైఖరి. ఫోబియా మోదీపైకి మళ్ళి మేనియా సోనియా, రాహుల్ వైపు బదిలీ కావడంతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల తీరు కూడా అక స్మాత్తుగా మారింది. తన ప్రయోజనాలు నెరవేర్చనందుకు మోదీని ఓడించాలని చంద్రబాబు తీర్మానించుకున్నారు. ప్రతిష్ట క్రమంగా కోల్పోతున్న నరేంద్ర మోదీని మోయడం కంటే మోదీకి ఎదురు తిరిగి అతడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించిన ప్రతినాయకుడు (విలన్)గా అభివర్ణించాలి. మీడియా సహకారంతో ప్రజలను నమ్మించాలి. హస్తినపై పోరాటమా, ఆరాటమా? కేంద్రంపైన యుద్ధం ప్రకటించడం ద్వారా ప్రజల తరఫున అన్నిటికీ తెగించి పోరాడుతున్న యోధుడిలాగా కనిపించాలి. ఓటర్లను మెప్పించి మరోసారి అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పదవిలో కొన సాగాలి. వీలైతే తనయుడు లోకేష్‌ను గద్దెపైన కూర్చోబెట్టాలి. అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో రాహుల్‌గాంధీ నాయకత్వంలో యూపీఏ–3 ప్రభుత్వం ఏర్ప డితే హస్తినలో చక్రం తిప్పాలి. ఇదీ చంద్రబాబు వ్యూహం. మోదీని ఓడించడం కోసం రాహుల్‌ని భుజానికి ఎత్తుకుని మోయడానికి అభ్యంతరం లేదు. సొంత బలంతో ఏదీ సాధించే అవకాశం లేదు కనుక ఏదో ఒక జాతీయ పార్టీ సహకారం అనివార్యం. కేంద్రంలో గణనీయమైన పాత్ర పోషించాలంటే తక్కిన ప్రాంతీయపార్టీలను తానే ప్రభావితం చేసి నడిపిస్తున్నారనే అభిప్రాయం కలిగించాలి. అందుకే ప్రత్యేక విమానంలో బెంగళూరుకూ, భువనేశ్వర్కూ, కోల్‌కతాకూ చక్కర్లు కొట్టడం. మాయావతినీ, అఖిలేష్‌నీ యూపీఏ పరిష్వంగంలోకి తీసుకుని వస్తానంటూ రాహుల్‌కి వాగ్దానం చేశారు. అన్నీ కలసి వస్తే శరద్‌పవార్ మూడు దశాబ్దాల స్వప్నం సాకారమై ఆయనే ప్రధాని కావచ్చునంటూ మరాఠా యోధుడి చెవులో చెబుతారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతల ప్రభంజనం సృష్టించిన మమతాబెనర్జీ ప్రధాని పదవికి నూటికి నూరుపాళ్ళు అర్హురాలంటూ ఆమెలో ఆశలు రేకెత్తిస్తారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రతిపక్షాల కూటమి ఖాయ మంటూ ఆమెతో అంటారు. ఏ రోటి కాడ ఆ పాట. మమతను ప్రసన్నం చేసుకోవడానికి రెక్కలు కట్టుకుని కోల్‌కతాలో వాలడానికి సిద్ధం. మాయావతి ఆశీస్సుల కోసం ఢిల్లీ కానీ లక్నో కానీ వెళ్ళడానికి తయారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా వ్యవహరించినప్పుడు కూడా ఇదే తీరు. అందుకే మొన్న ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో పన్నెండు గంటల దీక్ష సమయంలో సమాజ్‌వాదీపార్టీ వ్యవ స్థాపకుడు ములాయంసింగ్ మాట్లాడుతూ, ‘ప్రధానమంత్రిగా మీరు ఉండాలంటూ నాయుడూజీ నాతో అన్నారు’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత అదే ములాయం లోక్‌సభ చివరి రోజు సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రమోదీ మళ్ళీ విజయం సాధించి ప్రధానిగా కొనసాగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అది వేరే విషయం. బీజేపీ అగ్రనాయకద్వయం మోదీ– అమిత్‌షా తక్కువేమీ తినలేదు. గుజరాత్ గాయం తర్వాత తనను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి మోదీ విస్మరించజాలరు. తాను హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేస్తానంటూ నాటి సిటీ పోలీసు కమిషనర్‌తో చంద్రబాబు చెప్పించిన విషయం మరచిపోలేదు. కానీ ఎట్లాగైనా విజయం సాధించి అధికారం కైవసం చేసుకోవాలన్న ఏకోన్ముఖదీక్షతో చంద్ర బాబుతో దోస్తీకి మోదీ అంగీకరించారు. ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత తనపైన వాగ్బాణాలు ఎక్కుపెడుతున్న చంద్రబాబు గతం మోదీకీ, అమిత్‌షాకీ అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వారికి ఇప్పుడు కనిపిస్తున్నారు. అవినీతికి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దర్శనమిస్తున్నారు. అవకాశవాదం మూర్తీభవించిన నేత కళ్ళకు కడుతున్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటికి వెళ్ళి శాలువా కప్పి స్నేహం ప్రకటించిన చంద్రబాబు టీడీపీతో మూడున్నర దశాబ్దాలు నిరంతర పోరాటం చేసిన కాంగ్రెస్ యోధులకు దేవుడిలాగా కనిపిస్తున్నారు. ‘గతం గతః’ అంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్, టీడీపీ మధ్య వైరాన్ని చాలా తేలికగా కొట్టిపారవేశారు. తలాతోకాలేని మాటలు ఈ మధ్య చంద్రబాబు తమాషా వ్యాఖ్యలు చేస్తున్నారు. తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. పద్నాలుగు మాసాలకు పైగా పాదయాత్ర చేసిన మిత్రుడు జగన్మోహన్రెడ్డిని పలకరించడానికి సినీహీరో అక్కినేని నాగార్జున లోటస్ పాండ్‌కు వెడితే, ‘నాగార్జునకు ఏమైనా అవసరాలు ఉంటే నా దగ్గరికి రావచ్చు. ముఖ్యమంత్రి హోదాలో సహాయం చేస్తా. నేరస్థులను కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెడతాయి’ అంటూ చిత్రంగా వ్యాఖ్యానించారు. సోనియా పనుపున తాను, చిదంబరం కలసి సీబీఐ చేత పెట్టించిన బూటకపు కేసులు ఏవీ కోర్టులో నిలవజాలవని చాలామంది న్యాయశాస్త్ర ప్రవీణులు అన్నారు. నిర్దోషిగా జగన్ మోహన్‌రెడ్డి కేసుల నుంచి విముక్తి పొందుతారని చంద్రబాబుకీ తెలుసు. నిందితుడికీ, దోషికీ తేడా పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఒక ముఖ్య మంత్రికి తగదని ఆయనకు వేరొకరు చెప్పనక్కరలేదు. కానీ ఆయన మానసిక స్థితి ఆయనను నిలువనీయదు. జగన్మోహన్రెడ్డి ఫోబియా చంద్రబాబుచేత ఏది పడితే అది మాట్లాడిస్తుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసివచ్చేందుకు జగన్మోహన్రెడ్డి దంపతులు లండన్ వెడితే హవాలా డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్ళారంటూ నోరుపారేసుకోవడం ఆయనలో నానాటికీ పెరుగుతున్న అభద్రతాభావం కారణంగానే. సింగపూరులో ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబుకి ఉన్నాయనీ, అందుకే ప్రతిపక్షంలో ఉన్న కాలంలో సైతం ఆ దేశం సందర్శించేవారనీ అందరూ అంటారు. చంద్రబాబు లాగా ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసేవారికి సింగపూర్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ హవాలా డబ్బు తీసుకురావడం తేలిక. ఒక వైపు మోదీ, మరోవైపు పవన్ కల్యాణ్ సహాయం చేస్తేనే 2014లో బొటాబొటి ఓట్లతో గెలుపొందిన టీడీపీకి ఈ సారి బీజేపీతో పొత్తు లేదు. పవన్‌కల్యాణ్ నాయకత్వం లోని జనసేనతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. పొత్తు ఉంటుందని అనుకున్నప్పటికీ అది పరాజయం నుంచి కాపాడలేదు. అయిదేళ్ళు అధికారంలో ఉండి సంపాదించుకున్న ప్రజావ్యతిరేకత టీడీపీ విజయావకాశాలను మరింత క్షీణింపజేసింది. అధికారంలో ఉండగా సాధించామని చెప్పుకోవ డానికి ఒక్కటీ లేదు. జాతీయ మీడియా సంస్థలూ, సర్వే సంస్థలూ ఇంతవరకూ జరిపిన అన్ని సర్వేలలోనూ వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించబోతోందని చాటుతున్నాయి. తాజాగా ‘ఇండియా టుడే’ సర్వేలో వైఎస్ఆర్సీపీకి టీడీపీ కంటే ప్రజాదరణలో తొమ్మిది శాతం ఆధిక్యం ఉన్నట్టు తేలింది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను బలవంతం చేసి తెలంగాణ ఎన్నికల ముందు ఫలితాలు చెప్పించిన సర్వే వంటి సర్వేలు కావు ఇవి. సాధారణంగా వార్తలూ, వ్యాఖ్యల విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే జాతీయ టీవీ చానళ్ళే ఈ సారి ఆయన పరాజయం ఖాయమని అంటున్నాయి. మీడియాను కానీ మరో వ్యవస్థను కానీ సుముఖం చేసుకొని ‘మేనేజ్’ చేసే విద్య చంద్రబాబుకి ఉన్నదనే విషయం లోకానికి తెలుసు. అటువంటి విద్య జగన్మోహన్రెడ్డికి బొత్తిగా లేదు. తాను చేసే అక్రమాలనూ, మోసాలనూ ప్రత్యర్థులకు ఆపాదించి నిందించడం జగన్ మోహన్‌రెడ్డికి అలవాటంటూ చంద్రబాబు మరో విమర్శ చేశారు. తెలంగాణలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లో చేరినప్పుడు సంతలో పశువులాగా అమ్ముడుపోయారంటూ నిందించిన చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను ఎడాపెడా కొనేశారు. బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారంటూ, పశువుల కంటే హీనంగా ఎంఎల్ఏలు అమ్ముడుపోతున్నారనీ, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారనీ చంద్రబాబు తీవ్రమైన ఆవేదన వెలి బుచ్చారు. ఆయనలోని అపరిచితుడు ఎప్పుడు బయటికి వచ్చి ఏమి అంటాడో ఆయనకే తెలియదు. తాను వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలచేత పార్టీ ఫిరాయింప జేసిందీ, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిందీ చంద్రబాబు మరచిపోయి ఉంటారా? అది సెలక్టివ్ ఆమ్నీసియా ఫలితమా? మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలే చెప్పాలి. -కె. రామచంద్రమూర్తి -
ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల తేడాలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల శాతాన్ని లెక్కిం చేందుకు ఎన్నికల సంఘానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? ఈవీఎంలలో, వీవీ ప్యాట్లలో ఓట్ల తేడాలెందుకొచ్చాయన్న అనుమా నాలు నివృత్తి చేయాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన ప్రతిపక్షాలు పుంజుకున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తే తన సర్వే ఫలితాలు తప్పని క్షమాపణలు కోరు తా నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని, దీనికి గల కారణాలు బేరీజు వేసు కొని పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఫలితాలతో పాటు వెల్లడిస్తానని చెప్పారు. ఇక నుంచి తాను ఎన్ని కలకు ముందే సర్వే ఫలితాలను వెల్లడించబోనని చెప్పారు. కొన్నేళ్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నానని, ఎన్నడూ తప్పు చెప్పలేదన్నారు. బెట్టింగులు చేసేవా డినైతే తనకు కావాల్సిన వారికి అనుకూలంగా చెప్పు కొనే వాడినన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్ర బాబును కలిసి చర్చించిన విషయాలు బయటకు చెప్పుకొనేవైతే లోపల కూర్చొని ఎందుకు మాట్లాడు కుంటామని ప్రశ్నించారు. బయటకు చెప్పుకొనే విషయాలు కాదు కాబట్టే లోపల కూర్చొని మాట్లా డుకున్నామని, లేదంటే మీడియా ముందుకొచ్చే మాట్లాడుకొనేవారమని చెప్పారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదని, ఎంతో మందిని కలుస్తుం టానని, అలాగే బాబును కలిశానని చెప్పారు. బాబు అండ్ కో మళ్లీ దొంగ ఎత్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లపై లగడపాటి అను మానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉంటే ఇటీ వల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయానికి చేరువగా ఉన్న చంద్రబాబు, ఆయన కోటరీ, ఎల్లో మీడియా దొంగ సర్వేలు, ఇతర ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఓటమి గండం నుంచి గట్టె క్కేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు. హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను ఏమార్చేం దుకు యత్నిçస్తున్నారు. లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలతో అర్ధరాత్రి వరకు తన నివాసంలో మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లగడపాటిని బాబు తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా తెలం గాణలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తా రని చెప్పిన లగడపాటి పోలింగ్‌కు ముందు రోజు కూటమిదే విజయమన్నారు. కానీ, కూటమికి పరాభవం తప్పలేదు. ఇప్పుడు కూడా అవే ఎత్తుగడలతో బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టేలా వ్యూహాలు పన్నుతున్నారు. -
హఠాత్తుగా మీడియా ముందుకు లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు. తెలంగాణలో పోటీ చేస్తా అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం) -
తెలంగాణ ఎన్నికలపై అనుమానాలున్నాయి
-
లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం
సాక్షి, అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో కలిసి సోమవారం రాత్రి రాజగోపాల్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. రాత్రి 10.30 నుంచి 12 వరకూ చంద్రబాబు వారిద్దరితో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు చంద్రబాబును కలిసేందుకు వేచి చూస్తున్నారు. చంద్రబాబు వారిని అలాగే కూర్చోబెట్టి రాజగోపాల్, రాధాకృష్ణతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి తాను చేసిన సర్వేలో చంద్రబాబుకు అనుకూలంగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనల ప్రకారం మహాకూటమికి అనుకూలంగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు లగడపాటి శతవిధాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, ఫలితాలు లగడపాటి సర్వేకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లగడపాటిని చంద్రబాబు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని.. వాటితో ప్రజల అభిప్రాయాన్ని మార్చడం, లేకపోతే గందరగోళపరచడం కోసం లగడపాటిని ఉపయోగించుకునేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తరచూ లగడపాటిని చంద్రబాబు కలుస్తున్నారు. -
చంద్రబాబును కలిసిన లగడపాటి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న శుభకార్యానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు వచ్చానని లగడపాటి తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని తెలిపారు. -
తప్పుడు సర్వేలను పాతరేశారు: ఈటల
హుజూరాబాద్: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో తగిన బుద్ధి చెప్పారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచిన ఆయన.. మొదటిసారిగా హుజూరాబాద్‌కు వచ్చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి రాజకీయం చేద్దామని చూశారని, కానీ ఇక్కడ బాబు కుట్రలు చెల్లలేదన్నారు. చంద్రబాబు తెలంగాణలో కాదు కదా ఆంధ్రాలో కూడా గెలువలేడని చెప్పారు. రేవంత్‌రెడ్డి వంటి కొందరు పిట్టల దొరలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసినా, ప్రజలు మాత్రం ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియా, ఆంధ్ర పత్రికల్లోనే కూటమి ఉందని, టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఆనాటి ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పారని, 90 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. -
జాడలేని చిలక జోస్యం
సాక్షి, అమరావతి: తెలంగాణలో కూటమి కుయుక్తల్లో లగడపాటి సర్వే ఓ భాగమా? తెలుగుదేశం పార్టీ సాగించిన మైండ్‌గేమ్‌కు అనుగుణంగానే సర్వే పేరుతో డ్రామా నడిపారా? రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ చెప్పిన చిలకజోస్యం తలకిందులైంది. కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ఒకవైపు చెబుతున్నా... లగడపాటి మాత్రం భిన్నమైన సర్వే రిపోర్టును తీసుకొచ్చి గందరగోళానికి తెర లేపారు. అయితే, మంగళవారం వెలువడిన ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లగడపాటి చెప్పిన మాటలకు, వెలువడిన ఫలితాలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. (వికటించిన రాజకీయ కుట్ర!) ఎవరి కోసమో రూపొందించినట్టు, ఒక పార్టీ ప్రయోజనం కోసమే అన్నట్టుగా ఏమాత్రం శాస్త్రీయత లేని సర్వే ఫలితాలను లగడపాటి వెల్లడించినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఫలితాలు అంచనాలకే అందడం లేదని తొలుత చెప్పిన లగడపాటి, ఆ తర్వాత ప్రజానాడి కూటమి వైపే ఉందన్నారు. ఆయన చెప్పిన సర్వే వివరాలన్నీ రాజకీయంగా ప్రజా కూటమిని గట్టెక్కిండానికి, టీఆర్ఎస్ను దెబ్బతీయడానికే అన్నట్టు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తున్నారనే భ్రమలు కల్పించడం, బీజేపీ బలం పెరుగుతోందని చెప్పడం... ఇలా ప్రతీ అంశంలోనూ లగడపాటి ఎవరి ప్రయోజనం కోసమే సర్వే చేసినట్టుగా సుస్పష్టమైంది. ఎక్కడైనా పోలికుందా? ఎన్నికల్లో ప్రజాకూటమి 65 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించి, అధికారం దిశగా పరుగులు పెడుతుందనేది లగడపాటి సర్వే సారాంశం. టీఆర్ఎస్ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పారు. కానీ, ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మీడియా ముందుకు మొదటిసారి వచ్చిన లగడపాటి స్వతంత్ర అభ్యర్థులు 8 నుంచి 10 మంది గెలుస్తారని అన్నారు. వీరిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడించాడు. అయితే, ఈ ఇద్దరూ గెలవకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడమే లగడపాటి మాటల ఉద్దేశమని తెలుస్తోంది. బెల్లంపల్లి, బోథ్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, నారాయణపేట, మక్తల్, వైరా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారనే భ్రమ కల్పించి, అంతిమంగా టీఆర్ఎస్ను దెబ్బకొట్టేలా సర్వే పేరిట పక్కా స్కెచ్ వేసినట్టు తేటతెల్లమవుతోంది. మొత్తం మీద 8 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పరోక్షంగా కూటమికి మేలు చేయడానికే లగడపాటి సర్వే నాటకాలు ఆడినట్లు స్పష్టమతోంది. బీజేపీ బలపడిందట! ఈ ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. ఈ పరిస్థితిని మార్చడానికి బీజేపీ బలపడిందని, కొన్నిచోట్ల టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఉందని లగడపాటి చెప్పుకొచ్చారు. బీజేపీ పోటీలో ఉన్న ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్‌పేటను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. ముస్లింల ఓట్లను వ్యూహాత్మకంగా టీఆర్ఎస్కు దూరం చేసే ఎత్తుగడ సర్వేలో కన్పించింది. ముస్లింల ఓట్లు తెరాస కంటే కాంగ్రెస్‌కు ఎక్కువగా పడతాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? కీలకమైన సమయాల్లో ప్రజలను గందరగోళంలోకి నెట్టడం లగడపాటి రాజగోపాల్‌కు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ వర్గాల్లో ఓ విమర్శ ఉంది. దీనికి పలు కారణాలు చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ లగడపాటి ఇదే తరహాలో వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని చెప్పారు. అది నిజమని నమ్మించడానికి తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రావతరణ తర్వాత లగడపాటి ముఖం చాటేశారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన సర్వే ఫలితాలు నిక్కచ్చిగా ఉంటాయని నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కాసేపు ప్రీపోల్... ఇంకాసేపు ఎగ్జిట్ పోల్ లగడపాటి సర్వే ఫలితాలను ప్రజా కూటమి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించింది. అయితే, ఎన్నికల ముందు, తర్వాత ఆయన వెల్లడించిన ఫలితాల సందర్భంగా ఆయనే కొంత గందరగోళానికి గురయ్యారు. అవన్నీ ప్రీపోల్ సర్వే అని కొన్నిసార్లు, ఎగ్జిట్‌పోల్ అని మరికొన్ని సార్లు చెప్పారు. ప్రీపోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్‌ను అంచనా వేసే అవకాశం లేదు. ఎగ్జిట్‌పోల్ నిజమైతే పెరిగిన ఓటింగ్ ఎటువైపు అని చెప్పడంలో లగడపాటి జోస్యంలో స్పష్టత కన్పించలేదు. మొత్తం మీద చంద్రబాబు గుప్పిట్లో చిక్కిన చిలుకలా లగడపాటి ఆయనకు అనుకూలంగా సర్వే జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన విశ్వసనీయతను పోగొట్టుకున్నారు. లగడపాటి అమ్ముడుపోయారనే ముద్ర వేసుకున్నారని ఓ రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. భ్రమ కల్పించే ఎత్తుగడ తెలంగాణ ఓటర్ స్పీడుగా మారుతున్నాడని భ్రమ కల్పించేందుకు లగడపాటి చాకచక్యంగా వ్యవహరించారు. నిన్న ఆలోచన ఈ రోజు లేదు, ఈ రోజుది రేపు ఉండదంటూ చెప్పారు. ఓటరును మార్చే మైండ్‌గేమ్ అందులో కన్పిస్తోంది. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది కూటమికి అనుకూలమని చెప్పడం వెనుక కుట్ర తెలుస్తోంది. మొత్తం మీద ఓటర్లను ప్రభావితం చేసేలా చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి వ్యవహరించినట్టు వెల్లడవుతోంది. లగడపాటి సర్వేతో బెట్టింగ్ రాయుళ్ల కుదేలు ఆంధ్ర ఆక్టోపస్‌గా చెప్పుకునే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మీద ఉన్న నమ్మకం వందలాది మంది నిండా మునిగారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన జోస్యం కారణంగా మహాకూటమిపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టిన వేలాది మంది చేతులు కాల్చుకుని లబోదిబోమంటున్నారు. మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల ముందు ఆయనతో సర్వే వివరాలు పలికిస్తే తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతారన్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టడంతో ఆయన సామాజికవర్గమంతా గగ్గోలు పెడుతోంది. నమ్ముకుంటే నట్టేట ముంచాడంటూ వారంతా లోలోన రగిలిపోతున్నారు. ఇలా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారు రూ.1,200 కోట్లకు పైగా వారు నష్టపోయినట్లు అంచనా. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుండడంతో టీడీపీ నేతలు వెనకుండి లగడపాటితో సర్వే పేరుతో పాచికలు వేశారని వారంతా అనుమానిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని పందాలు కట్టిన వారంతా చివరి నిమిషంలో టీఆర్ఎస్వైపు మారేందుకు ప్రయత్నాలు చేసినా, అప్పటికే సమయం మించిపోవడంతో వారికి పందాలు దొరకని పరిస్థితి నెలకొంది. సర్వే తుస్‌మందని ఓ వైపు అందరు అంటుంటే ఆయన మాత్రం మరోవిధంగా లబ్ధిపొందారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. -
‘పోతారు సార్’... లగడపాటి ఎక్కడికి పోయారు?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌తో ఆట అంటే ఆషామాషి కాదు. అలాంటి కేసీఆరే ఓటమి పాలవ్వబోతున్నారని ఆంధ్ర అక్టోపస్‌గా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ హింట్ ఇచ్చారు. సర్వేల పేరిట పోలింగ్‌కు ముందు రోజు ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించిన రాజగోపాల్.. తన సర్వేలో భాగంగా గజ్వేల్‌ను సందర్శించానని.. అక్కడ టీ కోసం ఆగితే కొందరు కానిస్టేబుళ్లు వచ్చి.. తనను పలకరించారని, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘పోతారు సార్’ అని ఆ కానిస్టేబుళ్లు బదులిచ్చారని కొంచెం నిగూఢంగా, కొంచెం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘పోతారు సర్’ అన్న ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశమేమిటో అందరికీ తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్ కూడా ఓడిపోబోతున్నారని పరోక్షంగా రాజగోపాల్ చెప్పినట్టు అప్పుడు భావించారు. అంతేకాదు.. పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. ప్రజానాడి మహాకూటమికి అందిందని, పోలింగ్‌శాతం పెరిగితే.. కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేల పేరిట తనదైన చిలుక జోస్యాలు చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత యథాలాపంగా మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.. కూటమి 55 నుంచి 75 స్థానాలు, టీఆర్ఎస్ 25 నుంచి 45 స్థానాలు గెలుపొందుతారని జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని టీఆర్ఎస్కు అనుకూలంగా.. కొంచెం హోరాహోరీగా ఉంటాయని అంచనాలు వేస్తే.. లగడపాటి మాత్రం కూటమికే మొగ్గు చూపారు. ఆయన వెలువరించిన సర్వే అంచనాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ ఓటర్లను గందరగోళ పరచడానికి లగడపాటి ఈ విధంగా సర్వేల పేరిట గోల్మాల్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకాలంలో దీక్షల పేరిట లగడపాటి డ్రామాలు ఆడిన విషయాన్ని వారు గుర్తుచేశారు. దీక్ష పేరిట లగడపాటి మారువేషంలో హైదరాబాద్‌కు రావడం.. పరిగెత్తుకుంటూ వచ్చి నిమ్స్ ఆస్పత్రిలోని చేరడం వంటి నాటకాలను వారు ఉదహరించారు. అప్పుడు లగడపాటి ఆడిన ఆసుపత్రి డ్రామాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏదిఏమైనా.. లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అని మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఫలితాలు చాటుతున్నాయి. కూటమికి అనుకూలంగా ఆయన చెప్పిన జోస్యంలో ఇసుమంతైనా నిజం కాకపోవడాన్ని ఇప్పుడు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రాదని, తెలంగాణ వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడంతో గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఆయన మనస్సులో ఏముందో కానీ.. తెలంగాణ ఎన్నికల సర్వే పేరిట తెరపైకి వచ్చి హంగామా చేశారు. ఇప్పటివరకు లగడపాటి సర్వే చేస్తే.. అది చాలావరకు నిజమవుతుందనే అంచనా ప్రజలకు ఉండేది. తాజాగా వెలువరించిన సర్వేతో ఆయన తనకున్న విశ్వసనీయతను కోల్పోయారు. తెలంగాణ రావడంతో రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. తాజాగా వెలువరించిన తప్పుడు సర్వేతో.. సర్వే సన్యాసం కూడా తీసుకుంటారా? అని నెటిజన్లు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు. -
‘ఎంపీ టికెట్ కోసమే లగడపాటి సర్వే’
సాక్షి, తిరుపతి : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్ ఆరోపించారు. సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజానికం మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వివేక్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసమే కూటమికి అనుకూలంగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. కాగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఇదివరకే ఆయన సర్వే ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
లగడపాటి సర్వేపై కడియం రియాక్షన్
సాక్షి, వరంగల్ : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడందరూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి స్పందించారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రానుందనే లగడపాటి అంచనాల్ని కొట్టిపడేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ పాలనపట్ల పూర్తి విశ్వాసం వ్యక్తమయిందని తెలిపారు. 75 నుంచి 80 సీట్లు సాధించి టీఆర్ఎస్ మరోమారు అధికారాన్ని చేపట్టనుందని కడియం అభిప్రాయపడ్డారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నాడీని ఏ సర్వేలు పసిగట్టలేవని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11న ప్రజా మద్దతు ఎవరికుందో స్పష్టమవుతుందని అన్నారు. తెలంగాణకు బద్ధవ్యతిరేకి అయిన లగడపాటి తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి తప్పుడు సర్వేలు చెప్తున్నారని మండిపడ్డారు. ముందస్తుకు అందుకే వచ్చాం.. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర అంత ప్రభావవంతంగా ఉండదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు అంత సులువు కాదు. కేంద్రంలో తగిన పాత్ర ఉండాలనే ముందుస్తుకు వచ్చాం’ అని కడియం పేర్కొన్నారు. అయితే, ముందస్తుకు పోయేటప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు ఒకేలా లేవని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టి పెట్టడం కొంత దెబ్బతీసిందని అన్నారు. ఏదేమైనా రెండొంతుల స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా ముందస్తు ఎన్నికలు జరుపుకొని జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారా అనే ప్రశ్నకు అవేవీ ఇప్పుడు చెప్పలేమన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కై పనిచేస్తూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతారని కడియం వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే టీఆర్ఎస్ కర్తవ్యమని అన్నారు. ‘మా బలం, నినాదం కేసీఆరే. ఎట్టి పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రి. గజ్వెల్లో కేసీఆర్ మంచి మెజారిటీతో గెలబోతున్నారని జోస్యం చెప్పారు. -
‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ
సాక్షి, హైదరాబాద్(ఖైరతాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరారు. -
నాపై ఎవరి ఒత్తిడీ లేదు: లగడపాటి
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని మంత్రి కె.తారక రామారావు చేసి న ఆరోపణలను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోసిపుచ్చారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేశానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆరోపణలపై బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి బదులిచ్చారు. తాను ఎప్పుడూ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, తన టీం చేస్తున్న సర్వే గురించి తెలుసుకుని కలుద్దామని గత నవంబర్ 11న స్వయంగా కేటీఆర్ తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ తర్వాత తన సమీప బంధువు ఇంట్లో ఇద్దరం కలుసుకున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్ చేయించడం వల్ల టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో జరిగిన వాట్సాప్ సం భాషణలను మీడియాకు విడుదల చేశారు. -
‘ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నాడని, ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మరని అన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రధారి లగడపాటేనన్నారు. ఆయన గెలిస్తే సమైకాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముని దోచి ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు సంబంధించిన కోట్ల రూపాయలు పట్టు పడుతున్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాలను కూటమి నేతలు ఒకటి ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పేరుతో దొంగలు అందరూ కలిశారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించబోతోందని, తెలంగాణలో బీజేపీ కీలక భూమిక పోషించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్’
సాక్షి, వరంగల్ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. మీడియా లగడపాటికి అనవసర ప్రచారం కల్పిస్తోందని మండిపడ్డారు. బుధవారం హన్మకొండ టీఆర్ఎస్ అర్భన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మహాకూటమి తెలంగాణ వ్యతిరేకుల కూటమని అన్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కునే నాయకుడు కూటమిలో లేరని చెప్పారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చారిత్రక తప్పిదంగా పేర్కొన్నారు. కోదండరాం ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ గాలి వీస్తోందని, అది డిసెంబర్ 7న తుఫానుగా మారుతుందన్నారు. వరంగల్ జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు నీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పనకు దోహదపడతామని, చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయటానికి కృషి చేస్తామని తెలిపారు. -
బాబు ఒత్తిడితోనే ‘సర్వే’ మార్చారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్ ఆరోపించారు. లగడపాటి సర్వేను ఆయన తప్పుపట్టారు. టీఆర్ఎస్ పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్లో బయటపెట్టారు. సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్‌ను షేర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే నవంబర్ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్ఎస్ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ విషయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్‌కు పంపిన మెసేజ్‌లో తెలిపారు. (కూటమికి అనుకూలంగా లగడపాటి జోస్యం) లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని ఆయన ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్ మినట్ ప్రయత్నమన్నారు. లగడపాటి, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులని చెప్పారు. డిసెంబర్ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. The reason I dismiss Rajgopal’s survey as concocted; 👇his message to me on 20th Nov that TRS is winning 65-70 seats It’s the same survey he shared today under pressure from CBN with cooked up numbers P.s: I had no choice but to share this conversation to break the conspiracy pic.twitter.com/vUJ77KpmFc — KTR (@KTRTRS) December 4, 2018 -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్‌కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఎవరి కోసం ఈ ‘చిలుక’ జోస్యం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారంటూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనపై రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే.. రెండు నియోజకవర్గాల్లో ఫలానా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ ఆయన ప్రకటిం చారని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయని, కానీ ఆ అంచనాలే నిజం కావాలని లేదని వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా రోజుకు రెండు నియోజకవర్గాల ఫలితాలను వెల్లడిస్తానంటూ లగడపాటి చెప్పడం బాధ్యత లేకుండా వ్యవహరించడమేనని మండిపడుతున్నాయి. సర్వే అంచనాలు ప్రకటించడం తప్పు కాదని, వాటిని ప్రకటించడానికి అవసరమైన అన్ని పద్ధతులు, ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన అవసరాన్ని లగడపాటి విస్మరించారని సర్వే పండితులు అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకున్న తరుణంలో అకస్మాత్తుగా లగడపాటి తిరుపతిలో ప్రత్యక్షం కావడం.. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువమంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం వెనుక ఏం జరిగిందనే అంశంపై ‘సాక్షి’ కొంత సమాచారం సేకరించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి వెళ్లడానికి ముందే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలతో పాటు ఎల్లో మీడియా తోక పత్రిక అధినేత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమికి, టీఆర్ఎస్కు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్లాన్ వేసినట్టు స్పష్టమవుతోంది. అధికార టీఆర్ఎస్ దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. సర్వే అంచనా వేస్తుందే కానీ ఫలితాలు ప్రకటించదు... ఎన్నికల సమయంలో ప్రచార సాధనాలు సర్వే చేయడం సాధారణమైన విషయం. అది తప్పు కూడా కాదు. కానీ, సర్వే అంచనాలను ప్రజల ముందుంచాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. ఏయే తేదీల్లో సర్వే చేశారు, ఎంత మంది సర్వేలో పాల్గొన్నారు. శాంపిల్ సైజు ఎంత, ఎన్ని నియోజకవర్గాల్లో సర్వే చేశారు, అన్నింటికీ మించి ఏ సంస్థ సర్వే చేసిందన్న వివరాలు తప్పనిసరిగా ప్రజలకు వివరించాలి. అలా కాకుండా ఏ రాజకీయ పార్టీ కోసమో కొన్ని వివరాలు మాత్రమే వెల్లడించడం కచ్చితంగా తప్పే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సర్వేలు అంచనా మాత్రమే వేస్తాయని, వాటిని తుది ఫలితాలుగా ప్రకటించడమంటేనే ఏదో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమేనని ఓ రాజకీయ విశ్లేషకుడు స్పష్టంచేశారు. ‘సర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయి. పోలింగ్ ముగిసే వరకు ఆ ఓటర్ల అభిప్రాయాలు అలాగే ఉంటాయనుకోవడానికి లేదు. ఓటేసేవారు ఇండిపెండెంట్‌కు వేస్తామంటే ఇక వారిలో మార్పు ఉండదని లగడపాటి చెప్పడం కూడా పొరపాటు. పైగా అంచనాలు ఇలా ఉన్నాయని చెప్పడం వేరు.. ఫలానా అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించడం వేరు. కచ్చితంగా దీని వెనుక రాజకీయ ప్రయోజనం దాగుంది’ అని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. లగడపాటి సర్వే చేసి ఉంటే వాటి పూర్తి అంచనాలను వెల్లడించకుండా రోజుకు రెండు నియోజకవర్గాలు ప్రకటిస్తాననడం అనుమానించదగ్గ విషయమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు వ్యాఖ్యానించారు. ‘సర్వే చేసినప్పుడు ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు వెలువరించవచ్చు. దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే దానికి విశ్వసనీయత ఉంటుంది. లగడపాటికి ఈ విషయాలు తెలియదని నేను అనుకోవడం లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆలా చెప్పారో తెలియదు’ అని కృష్ణారావు పేర్కొన్నారు. కాలజ్ఞానం చెప్పే బ్రహ్మంగారిలా ఇవేమీ ప్రకటనలు? సర్వే చేసే ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా సరే దాని పూర్తి వివరాలు తెలియజేయాలి. కానీ, లగడపాటి మాత్రంబ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టుగా రోజుకు రెండు స్థానాల్లో ఎవరు గెలుస్తారో చెబుతానంటూ సంచలన ప్రకటనే చేశారు. సర్వే వివరాలు వెల్లడించకుండా ఎవరు గెలుస్తారో చెప్పడం చిలుక జోస్యమే అవుతుందని సర్వే నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లగడపాటి సర్వే చేసి ఉంటే మొత్తం అంచనాలు ప్రకటించాలని.. ఆ సర్వే ఎప్పుడు చేశారో, శాంపిల్ సైజు ఎంత వంటి వివరాలు ఉన్నప్పుడే దానికి పారదర్శకత ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ రీసెర్స్ అసోసియేట్ ఎస్.బాల నరసింహారెడ్డి అన్నారు. ‘నాకు తెలిసి ఈ దశలో ఓపీనియన్ పోల్ ఫలితాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా.. అన్ని వివరాలు ప్రజల ముందుంచాలి. అలా చేయకుంటే సర్వే చేశారో లేదో ఎలా తెలుస్తుంది’ అని ఆయన ప్రశ్నించారు. అంచనాలు, ఫలితాలకు తేడా లేకుండా మాట్లాడటం కూడా తప్పేనని, అది తప్పుడు సంకేతాలకు కారణమవుతుందని మరో సర్వే సంస్థ నిపుణుడు పేర్కొన్నారు. ‘గతంతో లగడపాటి సర్వే చేయించిన టీమ్‌లో నేను పని చేశాను. కానీ, మాదంతా ఎగ్జిట్ పోల్ లేదా ఎన్నికల తర్వాత తీసుకునే పోస్ట్ పోల్ సర్వేపై ఆధారపడి అంచనాలు ఉండేవి. ఇప్పుడు సర్వే చేశారో లేదో నాకైతే తెలియదు’ అని ఆ నిపుణుడు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే ఫలితాల ప్రకటన? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 శాతం ఎక్కువగా ప్రజల మద్దతు పొందుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వైఫల్యాలు బీజేపీపై నెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలిసి కాంగ్రెస్‌తో పొత్తు కోసం వెంపర్లాడారు. ఇప్పటికే పలుమార్లు అమరావతిలో చంద్రబాబుతో సమావేశమైన లగడపాటి కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే కొంచెమైనా కలిసి వస్తుందని చెప్పడంతో పాటు రెండు పార్టీల మధ్య రాయబారం నెరిపారు. ఈ సంగతి ఏపీ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నానని లగడపాటి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి విజయవంతమైతే అదే పార్టీలో చేరి టీడీపీ మద్దతుతో మల్కాజ్గిరి లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి వెల్లడిస్తున్న ఎన్నికల ఫలితాల ప్రకటన వెనుక కచ్చితంగా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నది రాజకీయవర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 1994, 2004 ఎన్నికల్లో స్వతంత్రుల గెలుపుపై కథనం... శాసనసభ ఎన్నికల్లో అత్యధికులు ఇండిపెండెంట్లు గెలిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుందని, దానికి గతంలో రెండు ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే నిదర్శనమంటూ ఓ ఎల్లో పత్రిక లడగపాటి ప్రకటనకు తోడుగా పెద్ద కథనాన్నే ప్రచురించింది. అంటే లగడపాటి ఈ ప్రకటన చేయడానికి ముందే దీనిపై కసరత్తు జరిగినట్లు అర్థమవుతోంది. దానికి అనుగుణంగానే ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలువబోతున్నారంటూ లగడపాటి తిరుపతిలో ప్రకటన చేశారు. పైగా గెలుస్తారని ప్రకటించిన ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు కావడం గమనార్హం. గతంలో మాదిరి ఈ సారి కూడా ప్రభుత్వం మారబోతోందంటూ చెప్పడం ద్వారా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడమే చిలుక జోస్యం పరమార్థమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. ‘ఎన్నికల్లో అపవిత్ర పొత్తులకు, అనైతిక ఎత్తులకు చంద్రబాబు పెట్టింది పేరు. ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలని తహతహలాడుతున్న చంద్రబాబు, ఆయన వందిమాగదులు ఎన్ని మాయపాచికలు వేసినా ఫలితం ఉండదు’ అని రాజేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. -
తెలంగాణ ఎన్నికలపై లగడపాటి జోస్యం
తిరుమల: తెలంగాణలో మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటనున్నారని ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలను డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వెల్లడిస్తానని తెలిపిన ఆయన కొన్ని విషయాలను మాత్రం మీడియాతో పంచుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న పోరును ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగడం లేదు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. పలు చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఇండిపెండెట్ల వైపు చూస్తున్నట్టు మా సర్వేలో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లానారాయణపేట్లో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో స్వతంత్ర అభ్యర్థి అనిల్ జాదవ్ గెలవబోతున్నారు. సర్వే పూర్తి వివరాలు తెలియజేస్తే.. ప్రధాన రాజకీయ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గెలిచే స్వతంత్ర అభ్యర్థులను ప్రకటించడం ఏ పార్టీపై ప్రభావం చూపదు. ఈ ఎన్నికల్లో గెలువబోయే ఇండిపెండెంట్ అభ్యర్థులందరి పేర్లను.. రోజుకు రెండు చొప్పున 7వ తేదీలోపు ప్రకటిస్తాను. మొత్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నార’ని లగడపాటి తెలిపారు. -
లగడపాటి హైడ్రామా
-
లగడపాటి హైడ్రామా
హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాన్ లోపల షేక్‌పేట మండలం పరిధిలోని సర్వే నం. 120/30లో ఉన్న స్థలానికి సంబంధించి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలం ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించగా, ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. కాగా జూబ్లీíహిల్స్ రోడ్ నం.65లో ఉండే గోడి పిచ్చిరెడ్డి అలియాస్ జీపీ రెడ్డి ఈ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఎం.కృష్ణారెడ్డి 2016లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన కల్పన నుంచి ఈయన ఈ స్థలానికి జీపీఏ పొందారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని గత యేడాది డిసెంబర్లో అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పిచ్చిరెడ్డి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఏసీబీ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు... ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ రద్దు చేయడంతోపాటు ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిచ్చిరెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి నిందితుడు వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్టేషన్‌కు రావాలని కోరారు. బట్టలు మార్చుకుని వస్తానంటూ లోనికి వెళ్లిన పిచ్చిరెడ్డి తన స్నేహితుడైన లగడపాటికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో లగడపాటి అక్కడకు చేరుకున్నారు. స్థల (సివిల్) వివాదంలో పోలీసులు ఎందుకు కలుగజేసుకుంటున్నారంటూ హుంకరించారు. 5 నెలల క్రితం నుంచి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని ఎస్ఐలు శ్రీనివాస్, పీడీ నాయుడు లగడపాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మీడియాను పిలిపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఉదయాన్నే తాను పిచ్చిరెడ్డిని తీసుకువచ్చి అప్పగిస్తానంటూ చెప్పారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసిస్తే తాము వెళ్లిపోతామని పోలీసులు అన్నారు. అయితే పేపర్‌పై రాసివ్వను.. అరెస్ట్ చేయనివ్వను.. అని రాజగోపాల్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధుల ముందు లగడపాటి మరోసారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం వేశారు. తనను దాటి వచ్చి అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరి బెడ్రూమ్లోకి వెళ్లి పిచ్చిరెడ్డి నిద్రిస్తుండగా పక్కనే కూర్చున్నారు. తాము వెళ్లిపోతే పిచ్చిరెడ్డి పారిపోతారని పోలీసులు కూడా అతని ఇంటి వద్దే కూర్చున్నారు. తెల్లవారుజాము 6గంటల దాకా ఇదే హైడ్రామా సాగింది. ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే... ఉదయం 7గంటల తర్వాత లగడపాటి మళ్లీ పోలీసులపై ఆరోపణలు కొనసాగించారు. ఈ కేసు సివిల్ వ్యవహారం అని ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే అర్ధరాత్రి పోలీసులు ఇంటిపైకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా ఎవరూ బదిలీ చేయరన్న ధీమాతో ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారా అని నిలదీశారు. పోలీసులకు ఎవరిపైనైనా కేసులు పెట్టే అధికారం ఉందని కానీ విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకుంటే కుదరదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.12లో ఐపీఎస్ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసు కేసు ఉందని, ఈ విషయమై జీపీ రెడ్డి 20 సార్లు స్టేషన్లో హాజరయ్యారన్నారు. ఈ వ్యవహారాన్ని నాగిరెడ్డితో సెటిల్ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారన్నారు. ఈ సోదాల వెనుక నాగిరెడ్డితో పాటు ఓ డీసీపీ ఉన్నారని దీనిపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. జీపీ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసు.. సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ జీపీ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరు కేంద్రంగా పలు వివాదాల్లో పిచ్చిరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఆయనపై విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. లగడపాటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు తాము కూడా బాధితులమేనన్న ఐజీ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ వివాదం నేపథ్యంలో తనను ఉద్దేశించిన లగడపాటి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐజీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉన్న తన సమీప బంధువు పల్లంరెడ్డి హంసమ్మ స్థలం ఖరీదు చేసి మోసపోయారని, ఈ నేపథ్యంతో తమ కుటుంబమూ బాధితులుగా మారిందని ఆయన వివరించారు. ఈ కేసు దర్యాప్తు తదనంతర చర్యల్లో రెండేళ్లు జాప్యం జరిగి, నిందితుడు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ ఏ దశలోనూ తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. జీపీ రెడ్డిని కానీ, ఆయన అల్లుడిని కానీ కలవడం, మాట్లాడటం జరగలేదని పేర్కొన్నారు. వారిని బెదిరించానంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. చట్ట ప్రకారం స్థానిక పోలీసులు తీసుకున్న చర్యల్ని తనకు ఆపాదించడం సబబుకాదన్నారు. పోలీసులు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో సొసైటీ సభ్యులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. -
పోలీసుల తీరుపై గవర్నర్,ఈసీకి ఫిర్యాదు చేస్తాం
-
ల్యాంకో ఆస్తుల అమ్మకం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధమైంది. నిండా అప్పుల్లో కూరుకుపోయి... పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్‌గా కూడా నియమిస్తున్నట్లు మురళీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపకపోవటంతో ల్యాంకో లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ‘‘ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం కొన్నసాగుతున్న ల్యాంకో ఇన్ఫ్రా బోర్డు, ఇతర మేనేజ్మెంట్, భాగస్వాముల అధికారాలన్నీ రద్దవుతాయి. అవన్నీ లిక్విడేటర్‌కు బదిలీ అవుతాయి. లిక్విడేటర్ ఈ ఆస్తుల విక్రయానికి సంబంధించి బహిరంగ ప్రకటన చేస్తారు. లిక్విడేషన్ మొదలైన నాటి నుంచి 75 రోజుల్లోగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది’’ అని మురళి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐడీబీఐ పిటిషన్‌తో దివాలా ప్రక్రియ మొదలు తమ నుంచి రుణంగా తీసుకున్న రూ.3608 కోట్లను ల్యాంకో ఇన్ఫ్రా తిరిగి చెల్లించడం లేదని, అందుకని ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐబీడీఐ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. తమకు మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు చెప్పగా... అప్పులు రూ.47,721 కోట్లని ల్యాంకో ఇన్ఫ్రా చెబుతోంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్... దివాలా పరిష్కార నిపుణుడిగా సావల్ గొడియావాలాను నియమించింది. అనంతరం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బహిరంగ ప్రకటన జారీ చేయగా, ఏడు కంపెనీలు తమ ఆసక్తిని తెలియచేస్తూ రుణ పరిష్కార ప్రణాళికలు సమర్పించాయి. ఇందులో త్రివేణి ఎర్త్‌మూవర్స్, ఇంజన్ క్యాపిల్ గ్రూపులు సమర్పించిన ప్రణాళికలు మినహా మిగిలిన కంపెనీల ప్రణాళికలు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. త్రివేణి ఎర్త్‌మూవర్స్ రుణ ప్రణాళికలో ఎలాంటి లోపాలూ లేకపోవటంతో దాన్ని రుణదాతల కమిటీ ముందు ఉంచారు. ఓటింగ్‌లో త్రివేణి ప్రణాళికకు 15.53 శాతం రుణదాతలే ఆమోద ముద్ర వేశారు. దీంతో ల్యాంకో లిక్విడేషన్‌కు అనుమతించాలంటూ సావల్ గొడియావాలా ఎన్సీఎల్టీ ముందు ఓ దరఖాస్తు దాఖలు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘చట్ట నిబంధనల ప్రకారం రుణ పరిష్కార ప్రణాళికకు 66 శాతం మంది రుణదాతల ఆమోదం కావాలి. కానీ త్రివేణి ప్రతిపాదనకు 15.53 శాతం మాత్రమే ఆమోదం లభించింది. అందుకని ల్యాంకో లిక్విడేషన్‌కు అనుమతినిస్తున్నాం’’ అని ఉత్తర్వుల్లో వివరించారు. మరోవంక ల్యాంకో కోసం పవర్ మెక్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును ట్రిబ్యునల్ తిరస్కరించింది. పలు అభ్యర్థనలతో ల్యాంకో ఇన్ఫ్రా దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులపై విచారణ సెప్టెంబర్ 12కి వాయిదా పడింది. -
అప్పుడే సర్వే వివరాలు విడుదల: లగడపాటి
సాక్షి, పెనుకొండ రూరల్: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు. -
‘లగడపాటి’ కంపెనీకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.313.1 కోట్ల అప్పును చెల్లించే పరిస్థితిలో సంస్థ లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ–హైదరాబాద్) తేల్చింది. దాంతో దివాలా ప్రక్రియను (ఐసీపీఆర్) ప్రారంభిస్తున్నట్లు పేర్కొం ది. హుజేఫా సితాబ్ఖాన్ను దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించింది. ‘‘ల్యాంకో తీస్థా తన ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు వం టివి చేయరాదు. దివాలా ప్రక్రియ మొదలైనట్టు ఐఆర్పీ ప్రకటన ఇవ్వాలి. ఇన్సాల్వెన్సీ, బ్యాం క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్సైట్లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా ప్రకటనలివ్వాలి. రుణదాతలతో కమిటీ వేసి సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి’’ అని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యుడు విత్తనాల రాజేశ్వరరావు ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సిక్కింలో తీస్థా నదిపై 500 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలో పలు బ్యాంకుల నుంచి 2007లో ల్యాంకో రూ.400 కోట్ల రుణం తీసుకుంది. రుణం చెల్లించకపోవడంతో ల్యాంకో రుణ ఖాతాను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తూ ఐసీఐసీఐ నేతృత్వంలోని బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) నోటీసు జారీ చేసింది. 2017 నవంబర్ 30 నాటికి రుణ బకాయి రూ.313.1 కోట్లకు చేరింది. హైడ్రో ఎలక్ట్రికల్, గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాల పరిస్థితి తిరోగమనంలోకి వెళ్లడంతో తమకు తీరని నష్టం కలిగిందన్న ల్యాంకో తీస్థా న్యాయవాది రవికుమార్ వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. -
పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం
తిరుపతి: తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీపద్మావతీ అమ్మవారికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లక్ష్మీహారాన్ని కానుకగా అందజేశారు. నిన్న (ఆదివారం) ఉదయం 9 గంటలకు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న లగడ పాటి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన రూ.7.74 లక్షల విలువ గల లక్ష్మీహారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. మంచి ముత్యాలు, కెంపులు, పచ్చలు, పగడాలను బంగారంలో పొదిగి 235 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన హారాన్ని రాజగోపాల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బాబూస్వామి వారికి పూలు, కుంకుమ అందజేశారు. -
రసకందాయంలో బెజవాడ రాజకీయం
-
రసకందాయంలో బెజవాడ రాజకీయం
విజయవాడ: బెజవాడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే...ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రహ్మాణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం ....బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేయడం చంద్రబాబు నాయుడు అలవాటు అయిన విషయం తెలిసిందే. దీంతో తనకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా లగడపాటి రాజగోపాల్ కూడా భారీ ఆఫర్... ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కేశినేని నానికి చంద్రబాబు చెక్ చెడుతున్నారా?
-
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు. లగడపాటి ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చాలా బాగుందంటూ పొగిడారు. కాగా చంద్రబాబును లగడపాటిని కలవడం విజయవాడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు గతంలో ప్రతినబూనిన లగడపాటి... ఏకంగా చంద్రబాబుతో సచివాలయంలోనే సమావేశం కావడం టీడీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ...గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో కేశినేని ట్రావెల్స్ నడపనుంటూ ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్న తానే వ్యవస్థనే మార్చలేకపోతున్నానని, ఆ మార్పులు చూసి తట్టుకేలేక తన ట్రావెల్స్ మూసివేస్తున్నానంటూ కేశినేని నాని బాహాటంగానే నిరసన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేశినేని నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ సీటు లగడపాటికి కేటాయించబోతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ భేటీపై ఇప్పటికే టీడీపీ వర్గాలు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే చంద్రబాబుతో తన భేటీ మర్యాదపూర్వకమే అని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. -
కేసీఆర్‌పై లగడపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. -
ఈ నాయకులంతా ఏమయ్యారు
హైదరాబాద్: రెండేళ్ల కిందట ఈ నాయకులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో నానా హడావిడి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ అప్పట్లో హడావిడి చేసిన నేతలెవరూ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఒకవైపు విభజన ఉద్యమం మరోవైపు సమైక్య ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ తెగ హడావిడి చేసిన నేతలు చేసేదేమీ లేక గడిచిన రెండేళ్లుగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా ఎంతో మంది నేతలు రాష్ట్ర విభజనకు ముందు ఎంతో హడావిడి చేశారు. విభజన జరగదని ఆనాడు గంటాపథంగా చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఈ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎన్నికల రంగంలో నిలిపారు. జర్మనీ నుంచి ఆయన మిత్రుడొకరు తెచ్చిన రాయిని చూపించి విడిపోయినా మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంతే... ఆయనెక్కడా కనిపించలేదు. తన సన్నిహితులకు చెందిన ఒకరిద్దరు నిర్వహించిన శుభకార్యాలకు హాజరు కావడం మినహాయిస్తే రాజకీయంగా ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు. ఆయన బీజేపీలో చేరనున్నారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అదీ జరగలేదు. ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. తానూ హైదరబాదీనే అని చెప్పుకున్న కిరణ్ ఈ రెండేళ్లు దాదాపుగా హైదరబాద్ ఇంటికే పరిమితమయ్యారు. పాత మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు రాజకీయాలపై ఆయన మక్కువ చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే, లగడపాటి రాజగోపాల్... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నాటకీయ ఫక్కీలో నిమ్స్ ఆస్పత్రిలో చేరి హడావుడి చేసిన ఆయన రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అన్నట్టుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకపోగా, గడిచిన రెండేళ్లుగా ఏ వేదికపైనా కూడా ఆయన కనిపించలేదు. ఆయనతో పాటు విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి, మరో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు కూడా ఏ వేదికలపైనా కనిపించడం లేదు. విభజన జరిగితే తమకు రాయల తెలంగాణ కావాలని నినదించిన మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరుల హడావిడి కూడా లేదు. పేరుకు టీడీపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో వారికి పెద్దగా పనిలేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన శైలజానాథ్ ఆ తర్వాత కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా సాగినప్పటికీ ఫలించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అప్పడుప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ ఆ తర్వాత తెరపైన పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, సమైక్య ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీవో నేత అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత కాలంలో క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం. -
పార్లమెంట్ వద్ద నేడు వీహెచ్ మౌనదీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు సోమవారం మౌనదీక్ష చేపట్టనున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓబీసీల రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బ్యాంక్‌ల రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యాతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
లగడపాటీ.. ఇదేంటి!
విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం విరమిస్తున్నారా.. ఎన్నికల ముందు చేసిన ప్రతిజ్ఞను పక్కనపెట్టి వేరే పార్టీలో చేరనున్నారా! ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడ వీధుల్లో వెలిసిన పోస్టర్లను చూస్తే ఎవరికైనా సందేహం రాక మానదు. ఈ పోస్టర్లపై నటుడు పవన్‌కల్యాణ్, బీజేపీ నాయకుల ఫొటోలు ఉండడం విశేషం. పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బర్త్‌డే జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది నగరవాసుల్లో చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా రాజగోపాల్ మాత్రం పెదవి విప్పలేదు. ఆయన బెంగళూరులో ఉండగా అభిమానులు ఇక్కడి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. తమ నాయకుడు రానున్న ఎన్నికలనాటికి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్లెక్సీలపై పవన్ ఫొటోలు వేయడంతో రాజగోపాల్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కొంతమంది, వైఎస్సార్ సీపీలో చేరతారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ లగడపాటి ఇంతవరకు ఆయా పార్టీల ముఖ్య నేతలెవరినీ కలవలేదు. -
పెప్పర్ స్ప్రే ఉచ్చులో సీమాంధ్ర ఎంపీలు
పార్లమెంటులో ఏం జరిగింది -45 యథావిధిగా.. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడిపోయింది. మళ్లీ సభ ప్రారంభమైంది. ఆ రోజు ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు’ ప్రవేశపెడ్తారని అందరూ అనుకుంటున్నారు గానీ ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’, ఆ రోజు లోక్‌సభలో జరగవలసిన వ్యవహారాల జాబితాలో ఎ.పి. బిల్లు ప్రస్తావన లేదు! 11 నుంచి 12 గంటల మధ్య, సభ వాయిదా పడినప్పుడు, అందరమూ సెంట్రల్ హాల్ లోనే ఉన్నాం. కొంత మంది ఒడిశా సభ్యులు ‘బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీలు కొందరు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారట గదా..’ అని ప్రశ్నించారు. ఈ విషయం, కొన్ని పత్రికల్లో బాగా ప్రచారం చేయబడింది. బిల్లుకు నిరసనగా స్పీకర్ సమక్షంలోనే విషం తాగి చచ్చిపోయే ప్రయత్నం కొందరు ఎంపీలు చేస్తారని గట్టిగా పుకారు నడిచింది గానీ, ఆ ఎంపీలు ఎవ్వరో మాత్రం ఎవ్వరికీ తెలియదు! 12 గంటలకు సభ మొదలవుతోందంటూ లోక్ సభ బెల్ మోగుతోంది. స్పీకర్ ముందు భాగం, రోజూ మేము నిలబడి నినాదాలు ఇచ్చే ‘వెల్’ ప్రాంతమంతా కాంగ్రెస్ ఎంపీలతో నిండిపోయి ఉంది. మొత్తం కాంగ్రెస్ ఎంపీలెవ్వరూ వారి సీట్లలో కూర్చునిలేరు. అవిశ్వాస తీర్మానం చదివేటప్పుడు ఎవరి సీట్లలో వారుండాలని మేమంతా ముందే అనుకున్నాం. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడినప్పుడు, ఆ ప్రతిపాదన చదవకుండా స్పీకర్ మరే అంశమూ మొదలు పెట్టకూడదనేది.. రూల్! అవిశ్వాసాన్ని సమర్థిస్తున్న సీమాంధ్ర ఎంపీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎంపీలూ, ఎన్డీయే భాగస్వామి శివసేన ఎంపీలూ లేచి నిలబడి మద్దతు చెప్తారని, దాంతో విభజన బిల్లు ఆగిపోతుందని, అందరూ అనుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ ఎంపీలు వచ్చి ‘వెల్’లో నిలబడ్డారో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా పెద్ద కేకలు వినబడ్డాయి. ‘వెల్’ అంతా యుద్ధభూమిలా మారిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే, వాళ్ల చేతుల్లోని విషం బాటిల్ లాక్కోవడానికి వ్యూహం పన్నారనుకున్నా గానీ, అవిశ్వాసం చదవకుండానే షిండేగారి చేత బిల్లు ప్రవేశ పెట్టించాలనే కపట వ్యూహం ఏర్పాటయిందని నేనూహించలేదు. క్షణకాలంలో స్పీకర్ హడావుడిగా లోపలికి వెళ్లిపోయారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు సభ్యులందరూ దగ్గుతూ, ఆయాస పడుతూ సభలోంచి బైటకొచ్చేస్తున్నారు. ఇందాక ఆత్మహత్యా ప్రయత్నం జరుగుతుందా అని ప్రశ్నించిన ఒడిశా ఎంపీ, ‘పాయిజన్ గ్యాస్ వాడతారని నువ్వు చెప్పనే లేదు’ అంటూ ముక్కు కళ్లు ఖర్చీఫ్‌తో మూసుకుంటూ వెళ్లిపోయాడు. లగడపాటి రాజగోపాల్ ‘పెప్పర్ స్ప్రే’ ఎవ్వరూ ఊహించని సంఘటన. ఈ సంఘటనతో లగడపాటి సీమాంధ్ర ప్రాంతంలో హీరో అయిపోయాడు. అని ‘హిందుస్తాన్ టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ బిల్లు ఆగిపోతే, మైకు విరిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్, సీమాంధ్ర ప్రాంతంలో హీరోలుగా నిలిచిపోతారని కూడా, ఉత్తరభారతంలో అత్యధిక సర్క్యు లేషన్ కల్గిన ‘హిందుస్తాన్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. ఇక్కడ నాకర్థం కాని కొన్ని విషయాలూ, ప్రశ్నలూ మిగిలిపోయాయి. లగడపాటి రాజగోపాల్ మాలాంటి మామూలు ఎంపీ కారు! వేల కోట్ల రూపాయల లాంకో సామ్రాజ్యాధిపతి. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనేంత బలమైన కోరిక ఉన్న వారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి పాదయాత్రలో, ఆయన తోపాటు, చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకూ నడిచిన వారు.. చిన్న వయస్సులోనే, విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి పది మంది పారిశ్రామికవేత్తల్లో ఒకడిగా నిలబడే స్థాయికి చేరిన వారు. అలాంటివాడు, ఎంతో ఆలోచించకుండా, ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడతాడా! ‘‘పెప్పర్‌స్ప్రే’’తో దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కినవాడు, పర్యవసానంగా బిల్లు ఆగిపోతుందనే నమ్మకం లేకపోతే, ఇలా చెయ్యగలడా!? నువ్వు ‘పెప్పర్‌స్ప్రే’’ కొట్టు.. బిల్లు ఆగిపోతుందని లగడపాటికి ఎవరు చెప్పివుంటారు? ఒక వేళ ‘కాంగ్రెస్’ చెప్పినా లగడపాటి వింటారా!? అప్పటికే ‘కాంగ్రెస్’ సీమాంధ్రలో ‘జీరో’ అయిపోయిందనీ, యావద్భారతంలో ‘మోదీ’ గాలి వీస్తోందని పసిపిల్లవాడిక్కూడా తెలిసిందే! అలాంటిది, సర్వేల ఎక్స్పర్ట్ లగడపాటి, ఆమాత్రం ఊహించలేరా! నిజానికి, ఆ సమయానికి, లగడపాటి వ్యాపార సంస్థలూ సంక్షోభంలో కూరుకునిపోయి ఉన్నాయి. కొన్నివేల కోట్ల రూపాయల బ్యాంక్ బకాయిలు చెల్లించవల్సి ఉందని అందరికీ తెలుసు. ఆ స్థాయి వ్యాపారవేత్తలు, ప్రభుత్వంతోనూ ప్రతిపక్షంతోనూ మంచి సంబంధాలు కలిగివుండాలి. అటువంటిది, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎలాగోలాగున బిల్లు పాస్ చేయించుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ‘లగడపాటి’ ఇంత తీవ్రవాద చర్యకు పాల్పడి కాంగ్రెస్, బీజేపీలను దూరం చేసుకుంటారా! కాంగ్రెస్, బీజేపీలిద్దరూ లగడపాటి ‘పెప్పర్‌స్ప్రే’కి ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చివుంటారా? కాంగ్రెస్ ఎంపీలందరినీ రంగంలోకి దించకపోతే, పెప్పర్‌స్ప్రే అవకాశమే రాదు. ఎంపీల బదులుగా ‘మార్షల్స్’ని ‘వెల్’లోకి దింపినట్లైతే, కథ మరోలా నడిచి ఉండేది! ఆ ఎవ్వరినీ ‘వెల్’లోకి రాకుండా ‘మార్షల్స్’ వలయం చుట్టి ఉన్నట్లైతే, అవిశ్వాస తీర్మానం చదవక తప్పని పరిస్థితి. తీర్మానం బలపరుస్తూ యాభై మంది సభ్యులు నిలబడే పరిస్థితి, అన్ని బిల్లులూ పక్కనబెట్టి అవిశ్వాసం మీద చర్చ చేపట్టక తప్పని పరిస్థితి.. వచ్చి తీరుతాయి! లోక్‌సభ గడువు వారం రోజుల్లో ముగుస్తుంది.. అవిశ్వాసం దెబ్బతో అందరి వ్యూహాలూ దెబ్బతింటాయి! లగడపాటిని కాంగ్రెస్+బీజేపీ, ఏదో తీవ్ర చర్య జరిగితే తప్ప ‘ఈ బిల్లు ఆగదు’ అని ప్రోత్సహించి ఉంటాయా!? ఏం జరుగుతుందో, నిజానిజాలైతే నాకు తెలియదు గానీ, ‘పెప్పర్‌స్ప్రే’ బూచిని చూపించి సీమాంధ్ర ఎంపీలలో 15 మందిని సస్పెండ్ చేసేశారు. రాజ్‌బబ్బర్, అజారుద్దీన్ లాంటి అందరికీ మొహం తెలిసిన ప్రముఖులు కూడా ‘వెల్’లో దెబ్బలాడినా, వారినెవ్వర్నీ సస్పెండ్ చేయలేదు. ‘ఎందుకు చెయ్యలేదు’ అని విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల వారు కూడా స్పీకర్‌ని ప్రశ్నించలేదు! ‘పెప్పర్‌స్ప్రే’ ఘటన సీమాంధ్ర ఎంపీలను ‘ఉగ్రవాదులు’గా చిత్రీకరించటానికి ఉపయోగపడిందే తప్ప ‘బిల్లు’ ఆపటానికి ఏ మాత్రం ఉపయోగపడలేదనేదే నా ఊహ! (నేనూ లగడపాటి, పలు సందర్భాల్లో చర్చించుకున్న రాజకీయ అంశాలు, ఆ రోజు సభలో ప్రవేశించబోయే ముందు, మేం మాట్లాడుకున్న విషయాలని బట్టి... లగడపాటి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారని నేను నమ్మాను. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనే అంశంలో లగడపాటిది దృఢనిశ్చయం.. అందుకే, ‘లగడపాటి’ని వాడుకుని, సీమాంధ్ర ఎంపీలని ఏకాకులు చేశారేమోనని అనుకుంటున్నాను) ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
-
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ బాకాలు ఊదిన విజయవాడ లోక్‌సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఆయన ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు పావులు కదుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన గురువారం కలిశారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మా సీఎంకు లగడపాటి సర్టిఫికెట్ అవసరం లేదు'
రాయికల్ (నిజామాబాద్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గోదావరి మహా పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు అభినందనలు అంటూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాళేశ్వరంలో పుష్కరస్నానం చేసిన సందర్భంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పుష్కరాలను అన్ని విధాలుగా ఘనంగా నిర్వహించడం ప్రభుత్వం బాధ్యతని, ఇందుకు సీఎం కేసీఆర్‌కు లగడపాటి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. మంగళవారం ఆమె కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి పుష్కర స్నానాల కోసం తెలంగాణకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, ఇది గమనించే లగడపాటి కాళేశ్వరానికి వచ్చారన్నారు. -
కాళేశ్వరంలో ప్రముఖుల స్నానాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం పలువువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితోపాటూ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పుణ్యస్నానాలు చేశారు. మరో వైపు కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కరాల్లో రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయానికి 3.5 లక్షల మంది స్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కాళేశ్వరం- మహదేవపూర్ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
హైదరాబాద్‌లో లగడపాటి విగ్రహం పెట్టాలి
కేసీఆర్‌కు జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వినతి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చరిత్రను భావితరాలకు తెలిపేందుకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తాను గాంధేయవాదినని చెప్పుకుంటూ తిరిగే లగడపాటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరిచిపోలేని విధంగా పార్లమెంటులో తెలంగాణవాదులపై దాడి చేసి బిల్లును అడ్డుకున్నాడని వివరించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న లగడపాటిని తెలంగాణ ప్రజలు మరువకుండా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అతని ఘన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. -
రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... యాత్రల పేరిట కాంగ్రెస్, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీ.టీడీపీ నేతలు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. -
నేడు చారిత్రాత్మక తీర్పు
జగన్ సీఎం కావడం ఖాయం లగడపాటివి సన్నాసి మాటలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఉదయభాను జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలు నేడు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, పేట అసెంబ్లీ అభ్యర్థిసామినేని ఉదయభాను స్పష్టం చేవారు. చిల్లకల్లు రోడ్డులోని స్థానిక పట్టణపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమనిఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వెలువడిన మున్సిపల్, మండల, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ సీపీకి తక్కువ సీట్లు వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 110సీట్లకు పైగా తమ పార్టీ కైవసం చేసుకుని విజయదుందుభి మోగిస్తుందన్నారు. మున్సిపల్,మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే ఉండ దన్నారు. ఆ ఎన్నికలు కేవలం ఒక ప్రాంతానికి చెంది, స్థానిక రాజకీయాలు, స్థానిక గ్రూపు రాజకీయాల ప్రభావంతో నిండి ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నాటికి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించనున్నారన్నారు. గతంలోనూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం తెలుగుదేశానికి ఎక్కువ స్థానాలు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా నీరాజనాలు పలికే విధంగా ఫలితాలు రానున్నాయన్నారు. జిల్లాలోనూ అత్యధిక స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నిలిపే సమర్థవంతమైన వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం ఖాయమన్నారు. లగడపాటివి సన్నాసి మాటలు... రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగాల్భాలు పలికిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సన్యాసం మాటున సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఉదయభాను అన్నారు. కుళ్లు, కుతంత్రాలతో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు వెల్లడించడం ఆయనకు పరిపాటేనని దుయ్యబట్టారు. బెట్టింగులకు పాల్పడుతూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. 2009లో కూడా ఈ విధంగానే బెట్లు కాస్తూ కోట్లాదిరూపాయలు గడించారని, ప్రస్తుతం 48గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయని తెలిసి కూడా బెట్టింగ్ రాజకీయాలు చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తున్నారన్నారు. ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, షేక్ మదార్‌సాహెబ్, తుమ్మేపల్లి నరేంద్ర, తుమ్మల ప్రభాకర్, చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, సిహెచ్.జగదీష్, నంబూరి రవి, ఇంటూరి రాజగోపాల్, కాకాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు'
గుంటూరు : లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి అన్నారు. లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు. -
'ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీదే విజయం'
-
'ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీదే విజయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి ఓవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే విజయమని సర్వేలు చెబుతున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని జాతీయ ఛానెళ్లు, జాతీయ దినపత్రికలు వెల్లడిస్తున్నాయన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఓవీ రమణ మండిపడ్డారు. చిల్లర దందాలు, బెట్టింగ్‌ల కోసమే లగడపాటి సర్వే అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. -
'బెట్టింగ్‌ల కోసమే లగడపాటి సర్వేలు'
-
లగడపాటి సర్వే సన్నాసి సర్వే....
హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ లగడపాటి సర్వే సన్నాసి సర్వే అని వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే బెట్టింగ్‌ల కోసమేనని అన్నారు. ఆయన రాజకీయాలు మానేసి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని గట్టు రామచంద్రారావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని లగడపాటికి తెలుసునని, అయితే బెట్టింగ్‌ల ద్వారా సంపాదనే లక్ష్యంగా లగడపాటి సర్వే ఉందన్నారు. 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత లగడపాటి కమండలం పట్టుకుని హిమాలయాలకు వెళతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని గట్టు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఇటువంటి సర్వేలన్ని రివర్స్ అవ్వడం ఖాయమన్నారు. -
‘తెలుగునాడు’గా మార్చాలి : లగడపాటి
విజయవాడ, న్యూస్‌లైన్ : కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఎంత త్వరగా కొత్త రాజధాని ఏర్పాటు జరిగితే అంతే వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాష్ట్రానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. జేఎస్పీతో సంబంధం లేదు.. జైసమైక్యాంధ్ర పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రజల్లోని ఐక్యత అని, పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తనకు పునర్జన్మ మీద నమ్మకం లేదని, మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తాను భావించటం లేదన్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గానీ, ఒక పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో గానీ తాను సర్వే ఫలితాలు ప్రకటించటం లేదన్నారు. కొందరు తన పేరు ఉపయోగించుకుని దొంగ సర్వేలు చేస్తున్నారని, దీంతో తాను సర్వేలు చేయటం ప్రస్తుతానికి నిలిపివేశానని చెప్పారు. గెలుపోటములపై పోలింగ్ శాతం ప్రభావం న్నికల్లో ట్రెండ్ అనేది పోలింగ్ సరళిని ఆధారంగా మారుతుందన్నారు. పోలింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ట్రెండ్‌ను సృష్టిస్తుందన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై తాను ఒక అభిప్రాయానికి వస్తానన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే ఇంచుమించు అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. -
రాజకీయ సన్యాసి సర్వేలు చేయించటమా?
నిజామాబాద్ : రాజకీయంగా ఎదుర్కోలేకనే చతికిలపడి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు సర్వేలేందుకని వైఎస్సార్ సీపీ ఎల్లారెడ్డి ఇన్చార్జి పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి విమర్శించారు. లగడపాటి తన ఆస్తులను కాపాడుకునేందుకు తప్పుడు సర్వేలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, లగడపాటి టీడీపీ అధికారంలోకి వస్తుందని తప్పుడు సర్వేలతో దుష్ర్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. లగడపాటి తిక్క ఉన్న లెక్కలేని మనిషి అని విమర్శించారు. జగన్‌ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. సినిమాల్లో బొమ్మలాట ఆడే వ్యక్తి ప్రజల కోసం శ్రమించే వ్యక్తిని విమర్శించడమేంటని సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. ప్రజారాజ్యం పేరిట పార్టీ స్థాపించిన చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంగ్రెస్ కు అమ్ముడు పోయారని ఆరోపించారు. యువరాజ్యం స్థాపించిన పవన్ యువకులను చైతన్యం చేస్తానని టీడీపీ, బీజేపీలను చైతన్యం చేస్తున్నారన్నారు. ఆయనకు తిక్క, లెక్కలు లేవుగాని అధికార దాహం ఉందన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టిన పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతామన్న భయంతో పార్టీ పెట్టకుండా ఇతరులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. -
లగడపాటి ‘పచ్చ’వాదన
లీకుల వెనకున్న ప్యాకేజీ ఏంటి? విశ్వసనీయత కోల్పోయా రంటున్న ఆయన వర్గం నేతలు సాక్షి, విజయవాడ : సర్వేలు చేస్తూ ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్న లగడపాటి తన విశ్వసనీయతను కోల్పోయారని ఆయన వర్గం నేతలే ఆరోపిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నడూ పోలింగ్ ముందు తన సర్వేలను వెల్లడించలేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా చంద్రబాబు ఏజెంటులా...ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం పలు విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోదంటూ చెబుతూ వచ్చిన ఆయన రాజీనామా చేయడం కోసం ఆడిన డ్రామాలతో విజయవాడ ప్రజల్లో చులకనయ్యారు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నా...కిరణ్‌కుమార్‌రెడ్డితో జై సమైక్యాంద్ర పార్టీ పెట్టించడం వెనుక కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. సీమాంధ్రలో ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా ఆయన మీడియా ముందుకు వచ్చి తెలంగాణాలో టీఆర్ఎస్, ఆంధ్రాలో తెలుగుదేశం - బీజెపీ కూటమి గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం ఉన్నా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మోడీ, పవన్ కళ్యాణ్‌లతో ప్రచారం చేయించినా తన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ విధమైన మైండ్‌గేమ్‌కు తెరలేపినట్లుగా సమాచారం. అయితే కొంతకాలంగా ఆయన చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగిన ఆయన ఒకదశలో ఏలూరు తెలుగుదేశం సీటుకు పోటీపడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్లినా... తెలుగుదేశంకు అనుకూల వైఖరినే అవలంభిస్తూ వస్తున్నారు. బీజెపీ - తెలుగుదేశం పార్టీ కూటమిని చూసి మైనారిటీలు, క్రైస్తవులు భయబ్రాంతులకు లోనౌతూ ఆ కూటమిని ఓడించాలని కంకణం కట్టుకుంటే ఈ కూటమి గెలుస్తుందని చెప్పడానికి రాజగోపాల్ ప్రాతిపదిక ఏంటని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. 290 సీట్లు సమైక్యవాదులే గెలుస్తారంటూ ఢంకా భజాయించి చెబుతూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ రోజున రాష్ట్ర విభజనకు సహకరించిన తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో అతి తక్కువ సీట్లు గెలుచుకునే ఈ కూటమి ఏ ప్రాతిపదికతో ఇక్కడ గెలుస్తుందో చెప్పాలని వారు నిలదీస్తున్నారు. -
బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతోనే టీడీపీ గెలుస్తుందనే ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆదివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే లగడపాటికి తొలి నుంచే ద్వేషమేనని, అందుకే ఆయనపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. జగన్‌పై మూడేళ్ల క్రితం నుంచే లగడపాటి విషం కక్కుతూ మాట్లాడుతున్నారన్నారు. చివరి ప్రయత్నంగా బాబుకు ఉడతా భక్తిగా సాయం చేద్దామని ప్రజాభిప్రాయం పేరిట సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందని లగడపాటి ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని ప్రకటించిన లగడపాటి అంతటితో ఊరుకోక అభిప్రాయాల పేరుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని పద్మ ఎద్దేవా చేశారు. సన్యాసం తీసుకోవడం మాటేమిటోగానీ ఆయన మాత్రం ఒక సన్నాసి అని మండిపడ్డారు. -
'చంద్రబాబుతో చేరడానికి లగడపాటి తాపత్రయం'
హైదరాబాద్: లగడపాటి రాజగోపాల్, పవన్ కళ్యాణ్‌లు పొలిటికల్ జోకర్లు అని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు పంచన చేరడానికే లగడపాటి తాపత్రయపడుతున్నారని అన్నారు. లగడపాటి, పవన్ ప్రచారంతో తమ పార్టీకే లాభమని చెప్పారు. చంద్రబాబును ఓటమి భయం చుట్టుముట్టిందని, అందుకే పోలింగ్‌కు 2 రోజుల ముందు కాపులను బీసీల్లో చేరుస్తానని అబద్ధపుహామీ ఇస్తున్నారని అన్నారు. బీసీ, కాపులకు మెజార్టీ సీట్లు ఇవ్వలేని చంద్రబాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులను ఎర వేస్తున్నారని దుయ్యబట్టారు. కాపు, బీసీలతో పాటు పేద, మధ్యతరగతి, మహిళ, యువత అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ సీపీ వెంటే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు రావణాసురుడు లాంటి వారని ఆక్షేపించారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక మోడీ, పవన్, లగడపాటి, రామోజీలను అరువు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ-టీడీపీ కూటమి, పవన్ ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని వాసిరెడ్డి పద్మ అన్నారు. -
లగడపాటి రాజకీయ సన్యాసి కాదు.. సన్నాసి!!
-
లగడపాటి సర్వేకు ఎల్లో కలరింగ్!
సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని, ప్రజల ఆదరణను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వేస్తున్న చవకబారు ఎత్తుగడలు ప్రజల్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఉన్న బంధాన్ని తెంచేందుకు చేస్తున్న పలు ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్ల సిద్దాంతంతో సీమాంధ్రలో దాదాపు తుడుచుకుపెట్టుకుపోయిన తెలుగుదేశం అభ్యర్ధులను అరువు తెచ్చుకుని పోటీలో దిగింది. అయినా తెలుగుదేశం పార్టీపై నమ్మకం, విశ్వసనీయత కలుగకపోవడంతో అనేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల సినీనటుడు పవన్ కళ్యాణ్ తో చేసిన ప్రయోగం దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాంతో ఏం చేయాలో తెలియక 'సర్వే'పాటి రాజగోపాల్ హడావిడిగా రంగంలోకి దించారు. ప్రెస్ మీట్ పేరుతో లగడపాటి సర్వేలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పేలా నాటకమాడించారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీల కూటమి విజయం సాధిస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. ఎన్నికల నిబంధనలు కారణాల వల్ల పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నానని చివరగా ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తెలుగుదేశం పార్టీకి వంత పాడుతున్నారు. రెండు కళ్ల సిద్దాంతంతో అడ్డగోలు విభజనకు కారణమైన టీడీపీని నిలదీయాల్సి పోయి... కీలక ఎన్నికల తరుణంలో అదేపార్టీకి అనుకూల ప్రచారానికి తెరలేపారు. ఎన్ని ఎత్తుగడలు, అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజాతీర్పును ఇలాంటి చవకబారు చేష్టలతో అడ్డుకోలేమన్నది వారికి కూడా తెలియందే కాదు. అయినా ఏదో విధంగా లబ్ది పొందాలనే ఆశతో 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటిని కూడా చంద్రబాబు వాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్వేలు, పొత్తులు, సినీ గ్లామర్ లాంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయలేదని సగటు ఓటరు అభిప్రాయం. నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. తీర్పు ఇవ్వడానికి ఓటర్లు మే 7 తేది కోసం వేచి చూస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, లగడపాటి సర్వే ప్రభావం సగటు ఓటరు తీర్పుపై ఉండదనేది త్వరలోనే అర్దమవ్వడం ఖాయం. -
లగడపాటి మారీచ రాజకీయం
* రాజకీయ ఒత్తిళ్లతో సర్వే అంటూ కాకిలెక్కలు: మైసూరా * పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టే కుయుక్తులని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో లేనంటూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లకు లొంగో, వారితో కుమ్మక్కయ్యో ఆ పార్టీకి ప్రయోజనం కలిగించేలా సర్వే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. తన సర్వే ఫలితమంటూ కాకి లెక్కలు చెబుతూ, పోలింగ్ ముంగిట్లో పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కుయుక్తులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనైతికమే కాకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా మైసూరా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నీ సర్వే ఏంటి? శాంపిల్ ఎంత? మెథడాలజీ ఏమిటి? ఇవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలించే ప్రకటనలు చేయడం ఏ రకంగా సమంజసం?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటువంటి ప్రకటనలు చేయడాన్ని తాము సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణలో తెరాస ఆధిక్యత ఉందనేదే నీ సర్వే ఫలితమైతే, 30 తేదీన అక్కడ పోలింగ్ అయిన వెంటనే ఎందుకు చెప్పలేదు?’ అని నిలదీశారు. సర్వేల పేరుతో రాజకీయ దురుద్దేశాల్ని వెల్లడించడం ఆయనకు కొత్తేమీ కాదని, లోగడ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారని, ఆయన సర్వేలోని విశ్వసనీయత ఎంతో ఆనాటి ఫలితాలతోనే సుస్పష్టంగా తేలిపోరుుందని గుర్తు చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయని తన సర్వేలో తేలిందని లగడపాటి శనివారం మీడియూ సమావేశంలో చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 270కి పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. -
వెయ్యికోట్లిస్తే లగడపాటినీ చేర్చుకుంటారా?
టీఆర్ఎస్కు ఎంపీ రాజయ్య ప్రశ్న రాయపర్తి, వెయ్యి కోట్లు ఇస్తే సమైక్యవాది అయిన లగడపాటిని కూడా టీఆర్ఎస్లో చేర్చుకుంటారా అని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకోవడం వల్ల అమరుల ఆత్మలు ఘోషిస్తాయని పేర్కొన్నారు. -
కిరణ్ ది షోలే జైలర్ లాంటి పరిస్థితేనా?
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢీలా పడిపోయారా? సమైక్యవాదిగా ముద్ర పడితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తారని అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. మొన్నటి శ్రీకాకుళం రోడ్ షో అయినా, శుక్రవారం నాటి జగ్గయ్యపేట రోడ్ షో అయినా జనాన్ని ఆకర్షించలేకపోయింది. జగ్గయ్యపేటలో లగడపాటి రాజగోపాల్ కి చాలా ప్రభావం ఉంది. ఇది ఆయన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం. పైగా ఆయన మాజీ సీఎం స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ప్రధాన సలహాదారు కూడా. లగడపాటి ఎంత ప్రయత్నించినా జనం రోడ్ షో పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. జనాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని హడావిడిగా ముగించేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయిల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎంపీ సాయిప్రతాప్ లు కూడా తెలుగుదేశం వైపు పక్కచూపులు చూస్తున్నారు. వీరిద్దరూ కిరణ్ పార్టీకి ఉపాధ్యక్షులు. షోలేలో జైలర్ అన్నట్టు 'సగం మంది కుడివైపు, సగం మంది ఎడమ వైపు, మిగిలినవారు నా వెంట రండి' అన్నట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి! -
హవ్వా.. ఇదేం సన్యాసం
తప్పుకున్నానంటూనే రాజకీయం సర్వేల పేరుతో గిమ్మిక్కుల వైనం విషయం ఏదైనా వ్యక్తిగత ప్రచారం ఇవీ లగడపాటి చీప్ పాలి‘ట్రిక్స్’ కాశీకి పోయాను రామాహరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి కాశీకి పోలేదు రామాహరి మురుగు కాల్వలో నీళ్లండీ రామాహరి శ్రీశైలమెళ్లాను రామాహరి శివుని విభూది తెచ్చాను రామాహరి శ్రీశైలం పోలేదు రామాహరి ఇది కాష్టంలో బూడిద రామాహరి ఈ తరం వారికి ఈ పాట పరిచయం లేకపోయినా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరం వారికి హాస్యభరితమైన ఈ సినీ గీతం సుపరిచితమే. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో రేలంగి, గిరిజలు తమ నటనతో ఈ సన్నివేశంలో నవ్వులు పండించారు. సన్యాసం వేషం వేసి జనాన్ని మాయచేసే ప్రయత్నాన్ని తిప్పికొడుతూ అవన్నీ ఉత్తుత్తివేనని... నమ్మవొద్దని తనూ పాట రూపంలోనే కౌంటరిస్తుంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రం విడిపోదని గట్టిగా చెప్పారు.. తీరా విభజన అయ్యాక తనదైనశైలిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. రాజకీయ సన్యాసం చేశానంటారు.. మళ్లీ కొత్త రాజకీయ పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆయన చేసే చీప్ పాలి‘ట్రిక్స్’ను చూసి ‘హవ్వా ఇదేం సన్యాసం’ అంటూ జిల్లా ప్రజలు చీదరించుకుంటున్నారు. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదనడానికి ఇదో ఉదాహరణ. ఇదేమి కిరికిరి... రాజకీయ సన్యాసం అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం అని అందరికీ తెలుసు. అయితే ఆయన ఇప్పుడు రాజకీయ సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని రచిస్తున్నారు. రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతూనే ... రాజకీయ సన్యాసం చేస్తారట..! ఇదేమి సన్యాసం అని ఆయనను ఎన్నుకున్న ఓటర్లే కాదు ఆయన అనుచరులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి కుండీలో పడ్డట్టు... మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 2009లో గెలుపొందారు. రెండు పర్యాయాలు ఎంపీ అయిన ఆయన పలు సందర్భాల్లో చేయించిన సర్వేలు ఫలితాలకు కాస్త దగ్గరగా ఉండటంతో తాను చెప్పేదంతా జరుగుతుందన్న విశ్వాసాన్ని చాటుకునే ప్రయత్నం చేసేవారు. అందుకే సర్వేలను సాకుగా చూపించి ఆయన చాలా విషయాలు చెబుతూ ఉంటారు. రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆయన పలుసార్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ర్టం సమైక్యంగా ఉంటుందని గట్టిగా నమ్మించే ప్రయత్నం చేశారు. సర్వేలను నమ్ముకున్న లగడపాటి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేయించి నివేదికలు పంపించామని, అవి నిజమని తేలిన తర్వాత కేంద్రం విభజన విషయంలో వెనక్కి తగ్గుతుందని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ విభజన విషయంలో వేగం పెంచింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టలంటేనే భయపడేలా చేస్తామన్నారు. ఇంత హడావుడి చేసిన లగడపాటి విభజన విషయంలో అధికార పార్టీ ఎంపీగా చేతులెత్తేసి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. అయితే అందరూ ఆయన ఇంకా రాజకీయాల్లో ఉండరని, వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోతారని భావించారు. అలా జరిగితే రాజగోపాల్ ఎందుకు అవుతారు. అందుకే ఆయన మరుసటి రోజు నుంచి నిత్యం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అంతేకాదు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభినందన సభలు పెట్టి లగడపాటిని కీర్తించుకునేలా అనువైన క్యాడర్‌ను బతిమాలుకోవాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. దీంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన లగడపాటికి వ్యూహకర్త బాధ్యతలు అప్పగిస్తున్నట్టు కిరణ్ ప్రకటించారు. ప్రచారమే పరమావధి... లగడపాటి ఏది చేసినా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కోరుకుంటారు. అదే క్రమంలో రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించి విజయవాడ వచ్చిన సందర్భంగాను పెద్ద్ద హైడ్రామాకు తెరతీశారు. తనకు అనుకూలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను భారీగా సమీకరించి లగడపాటి రాజకీయాల్లో కొనసాగాల్సిందేనంటూ వారితో హడావుడి చేయించారు. దీని కోసం చాట్రాయిలో ఒక కార్యకర్త ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అక్కడికి వెళ్లిన లగడపాటి రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినా, కిరణ్ పార్టీ పెట్టినా రాజకీయాల్లో కొనసాగుతానంటూ రాజకీయాలపై తనకున్న మక్కువను బయటపెట్టారు. ఏదో ఒకరకంగా రాజకీయాల్లో నెట్టుకొచ్చేందుకు ఆయన తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున సొంత ప్యానల్‌ను పెట్టి రాజకీయంగా ఉనికిని కోల్పోకుండా ప్రయత్నాలకు తెరతీశారు. రాజకీయం అనే నీటిలో చేపలా మారిన లగడపాటి పదవే పరమావధిగా ఏదో ఒక సాకుతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతారని ప్రజలు చర్చించుకోవడం కొసమెరుపు. -
రండి బాబూ రండి.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..
-
కిరణ్ కొత్త పార్టీ
* ఎట్టకేలకు ప్రకటించిన మాజీ సీఎం * 12న రాజమండ్రి సభలో పార్టీ పేరు, విధానాల ప్రకటన * తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం * కిరణ్ వెంట నలుగురు కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ఓ మాజీ మంత్రి సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న రాజమండ్రి బహిరంగ సభలో కొత్తపార్టీ పేరు, విధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నామని, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తన ప్రైవేటు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కొత్త పార్టీ గురించి ప్రకటన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో కేవలం నలుగురు (లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్), మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి మాత్రమే ఉన్నారు. కిరణ్ చెప్పిన మాటలు నమ్మి సొంతపార్టీని వీడి ఆయన వెంట నడిచిన నాయకులు తమ పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని ఒత్తిడిచేయడంతో ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనేమన్నారంటే... * రాష్ట్ర విభజన ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతీశాయి. బిల్లు రూపొందించిన తీరు, పార్లమెంటులో అప్రజాస్వామికంగా ఆమోదించిన విధానం సిగ్గుచేటు. * అధికార దాహంతోనే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయి. ఇద్దరూ విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. బాబు, జగన్‌లకు సీఎం పదవిలోకి ఏదోవిధంగా రావాలన్నదొక్కటే లక్ష్యం. * పురుడుపోసి తల్లిని చంపేశారని మోడీ చెబుతున్నారు. నలుగురు ఎంపీలు పోడియంలోకి వెళ్తే హృద యం గాయపడింద ని ప్రధాని అంటున్నారు. కానీ వీరెవ్వరూ తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం గురించి ఆలోచించలేదు. * ప్రస్తుతం ఎన్నికల సంఘం కొత్తగా ‘నోటా’ (పైవారెవ్వరూ కాదు అన్న ఆప్షన్) పెడుతున్నందున రాష్ట్ర ప్రజలంతా ఆయా పార్టీలకు కాకుండా నోటాపై ఓటువేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి వారందరికీ విన్నవిస్తున్నాను. మీ ఆలోచనల మేరకు నడిచే, మీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెడుతున్నాం. ‘నోటా’కు బదులుగా మాకు ఓటేయండి. * రాజమండ్రి బహిరంగసభలో పార్టీపేరు, విధానాలు, అధ్యక్షుడితోపాటు అన్ని విషయాలూ చెబుతాం. సీమాంధ్రతోపాటు, తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం. * నా జీవితం తెరచిన పుస్తకం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నాను. నేను చేసిన ప్రతి నిర్ణయం చట్టం, నిబంధనల ప్రకారమే జరిగింది. గవర్నర్‌కే కాదు ఎక్కడైనా ఫిర్యాదులు ఇచ్చుకోనివ్వండి. నన్నెవరూ ఏమీ చేయలేరు. * సీఎం నిర్ణయాలు తిరగదోడేందుకు గవర్నర్ ఎవరు? వచ్చే ప్రభుత్వాలు తిరగదోడొచ్చేమో కానీ గవర్నర్ ఎవరు? తిరగదోడితే మాత్రం ఏమవుతుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది. * రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఏమవుతుందో చూడాలి. మాకు అన్ని పార్టీలూ ప్రధాన పోటీదారులే. * ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ఉభయ జర్మనీ దేశాలు గోడలు పగులకొట్టి మరీ ఏకంకాలేదా? ఇక్కడ అలా గోడలు కూడా లేవు కదా? -
సుప్రీం స్టే విధిస్తే.. రాజకీయాల్లో కొనసాగుతా: లగడపాటి
కృష్ణా: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టే వస్తే రాజకీయాల్లో కొనసాగుతానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉభయ సభలు ఆమోదం తెలుపడంతో లగడపాటి రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లగడపాటి తీసుకున్న నిర్ణయానికి మార్చుకుని..రాజకీయాల్లో కొనసాగాలని ఆయన అనుచరుడు ఆంద్రీయ దీక్షను చేపట్టారు. ఆంద్రీయ దీక్షను లగడపాటి విరమింప చేశారు. ఆ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉంటే తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని లగడపాటి వెల్లడించిన విషయం తెలిసిందే. -
త్యాగశీలి లగడపాటి రీఎంట్రీ!?
విజయవాడ లోక్‌సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం స్వీకరించి నాలుగు రోజులైనా గడవక ముందే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు లోక్‌సభలో ఆమోదం లభించగానే ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరువాత రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించగానే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అవి ఆమోదం పొందాయి. సమైక్యవాదినని చెప్పుకుంటూ లగడపాటి చాలా కాలం పోరాడారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీమాంధ్ర కేంద్ర మంత్రులను, ఎంపిలను తమ చెప్పుచేతలలో పెట్టుకుంది. తను చేయాలనుకున్నది చేసేసింది. అయితే మొదటి నుంచి చెప్పినట్టే రాష్ట్రవిభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రాజగోపాల్ అన్నమాట ప్రకారమే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మళ్లీ ఆ తరువాత జరిగే సంఘటనలే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. లగడపాటి ఓ త్యాగమూర్తి అంటూ కీర్తిస్తూ కృష్ణా జిల్లాలో భారీ ప్లెక్సీలు, పోస్లర్లు వెలిశాయి. ఆ ప్లెకీలు, పోస్లర్లపైన లగడపాటిని ఉద్దేశించి “పోరాటమే ఊపిరిగా పోరుబాట పట్టావు. నీ సత్తా చూపావు. రాజకీయ త్యాగివై నిలిచావు. ఆరు కోట్ల ఆంధ్రులకు ఆరాధ్యనీయుడైనావు...ఇట్లు మిత్రుడు, వసంత కృష్ణప్రసాద్” అని ఉంది. విజయవాడ ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వీటిని ఏర్పాటు చేశారు. కృష్ణప్రసాద్‌కు లగడపాటికి మంచి సాన్నిహిత్యం ఉంది. ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మంచి దిట్టగా లగడపాటికి పేరుంది. దాంతో ఈ ప్లెక్సీలు చర్చకు దారి తీశాయి. ఒక్క లగడపాటివే కాకుండా సీమాంధ్ర ఎంపీలతో కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్ర విభజన జరుగుతుంటే ఏం చేయలేక చివరిక్షణం వరకు పదవుల్లో వేలాడిన వీరు త్యాగమూర్తులు ఎలా అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి పోరాటంలో విజయం సాధించి, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే త్యాగశీలురని గానీ, పోరాటయోధులని గానీ అనవచ్చు. ప్రజలు కూడా వారిని నెత్తిన పెట్టుకునే వారు. ఏమీ సాధించలేనివారిని త్యాగమూర్తుగా ఏలా గుర్తించగలం అని అడుగుతున్నారు. అసలే విభజనతో రగిలిపోతున్న జనానికి ఈ ప్లెక్సీలు ఎక్కడలేని కోపాన్ని తెప్పిస్తున్నాయి. కాంగ్రెస్ అన్నా, కాంగ్రెస్ నేతలన్నా జనం మండిపడుతున్నారు. ఈ ప్లెక్సీల వ్యవహారం అంతా లగడపాటి మళ్లీ రాజకీయ పునరాగమనం కోసమేనని పలువురు అంటున్నారు. -
బిల్లు తెచ్చిన తంటాభవితపై బెంగ
ఎన్నికలపై అయోమయం తెలంగాణ బిల్లు ఆమోద ఫలితం కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం టీడీపీ శ్రేణుల్లో అయోమయం వైఎస్సార్సీపీకి ‘సమైక్య’ బలం కేంద్రంలోని యూపీఏ సర్కార్ అనుకున్నంత పనిచేసింది.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నిలువునా చీల్చింది.. ఈ చర్యపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు వెళ్లడం ఎలా? రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా? అనే సంశయం కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసే మిషతో మరో ఆరు నెలలపాటు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ తెరపైకి తెచ్చింది. అదే జరిగితే షెడ్యుల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలను నిర్వహించి, అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత గడువు ఇచ్చే అవకాశం ఉందని జిల్లాలోని అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజాభిమానం తమకు అండగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారులు సిద్ధం! ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అనే ప్రశ్న ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ప్రజలను వెంటాడుతోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోపక్క ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు ఇతర ముఖ్య అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పలు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సూచనలు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తుది జాబితా ఖరారు, ఎన్నికల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ‘రిక్త హస్త’మేనా..! తొలి నుంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అత్యుత్సాహం చూపడంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని నేతలు కలవరపడుతున్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాదిగా వేసిన ఎత్తులు అనుకూలించలేదు. లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు పరిస్థితి అనుకూలించకపోవడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి ఎంతవరకు మాటపై నిలబడతారో వేచి చూడాల్సిందే. జిల్లాలో ఏకైక మంత్రి కొలుసు పార్థసారధి తాను సమైక్యవాదినేని చెబుతూనే పదవిని పట్టుకుని వేలాడుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన సీఎం కిరణ్‌తో కలిసి తన పదవికి రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వారి రాజీనామాలు ఆమోదించాల్సి ఉంది. జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, డీవై దాసు తమ రాజకీయ భవితపై మేధోమథనం చేస్తున్నారు. పలువురు కీలక నేతలు సైతం ఇదే పార్టీలో ఉంటే తమ రాజకీయ భవితవ్యం ఇక ముగిసిపోయినట్టేననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న అపవాదును మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో దాదాపు నూకలు చెల్లిపోయినట్టేనని, ఇటువంటి తరుణంలో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందేనని ఆ పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. పారని ఎత్తులు.. పొడవని పొత్తులు రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల్లోను వేగం పుంజుకుంటుందనుకున్న సైకిల్ రెండు చక్రాలకు గాలిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి కూడా ఇప్పుడు ఎన్నికల భయం వెంటాడుతోంది. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో మరోమాట చెబుతూ వచ్చిన చంద్రబాబు ఎత్తులు ఈసారి ఎన్నికల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మోడీ ఇమేజ్ను చూసి బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందుదామనుకున్న టీడీపీకి పొత్తుల పొద్దు బెడిసికొట్టేలా ఉంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్న తరుణంలో విభజనకు కాంగ్రెస్‌తో కుమ్మక్కైన బీజేపీతో చెలిమి మరింత ముంచుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు లోక్‌సభలో గుండెపోటుకు గురికావడం, ముంబైలోని ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన వాణి జిల్లాలో వినిపించడానికి మరికొద్ది రోజులు పడుతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును ఇప్పటికే వర్గవిభేదాలు చుట్టుముట్టాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు తన పదవికి రాజీనామా ప్రకటించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) తమ రాజకీయ భవిష్యత్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టు పెంచిన వైఎస్సార్సీపీ తొలి నుంచి తమ నినాదం సమైక్యమేనని తేటతెల్లం చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లాలో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్లు, సీట్లు గురించి ఆలోచించకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య చాంపియన్‌గా నిలిచారు. జగన్మోహన్రెడ్డి పిలుపుతో ఎప్పటికప్పుడు సమైక్య ఉద్యమాన్ని నడపడంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండేందుకు గతంలోనే టీడీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి పేర్ని నాని, జోగి రమేష్‌లు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని నియోజకవర్గాల్లోను సత్తా చాటుతామని వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయి. -
లగడపాటి రాజీనామాను ఆమోదించిన స్పీకర్
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. లగడపాటి రాజీనామా లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందటంతో లగడపాటి తీవ్ర మనస్థాపం చెందారు. ఈ నేపథ్యంలో తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. తన రాజీనామా లేఖను మంగళవారం ఆయన స్పీకర్ కు పంపారు. దాంతో బుధవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ లోక్ సభలో లగడపాటి రాజీనామా లేఖను చదవి సభ్యులకు వినిపించారు. -
చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇకనుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు చివరికంటా పోరాటం చేశామని ఆయన బుధవారిమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది కాబట్టి..ఇకపై తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తానని లగడపాటి తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి భావోద్వేగాలు, సెంటిమెంట్లను మరచి తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరారు.