పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం | Lagadapati Raja Gopal offers Lakshmi Haram to Padmavathi Devi in tiruchanoor | Sakshi
Sakshi News home page

పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం

Published Mon, Jul 24 2017 8:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం

పద్మావతీదేవికి లగడపాటి లక్ష్మీహారం

తిరుపతి: తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీపద్మావతీ అమ్మవారికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ లక్ష్మీహారాన్ని కానుకగా అందజేశారు. నిన్న (ఆదివారం) ఉదయం 9 గంటలకు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న లగడ పాటి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన రూ.7.74 లక్షల విలువ గల లక్ష్మీహారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు.

మంచి ముత్యాలు, కెంపులు, పచ్చలు, పగడాలను బంగారంలో పొదిగి 235 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన హారాన్ని రాజగోపాల్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బాబూస్వామి వారికి పూలు, కుంకుమ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement