
పార్లమెంట్ వద్ద నేడు వీహెచ్ మౌనదీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు సోమవారం మౌనదీక్ష చేపట్టనున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓబీసీల రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బ్యాంక్‌ల రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యాతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.