సాక్షి, సంగారెడ్డి: గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో ఓబీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు.. నువ్వెందుకు వేస్తావు.. బంగళాఖాతంలో నిన్నే జనం వేస్తారు’’ అంటూ మండిపడ్డారు.
‘‘దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు...మీ బాబై కూర్చున్నాడు. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు.. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆదాని, మోదీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు’’ అంటూ వీహెచ్ దుయ్యబట్టారు.
‘‘మా దగ్గర ఉంటే అవినీతి పరులు.. బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులు. త్వరలోనే బీసీ గర్జన పెడుతున్నాం. అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారు. అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుంది. అగ్రకులాల వాళ్లు ఓబీసీలను అణగదొక్కుతున్నారు. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారు. ఫస్ట్ 20 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. నేనెవ్వరికి వ్యతిరేకం కాదు.. మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్‌గా సోనియా, రాహుల్ గాంధీ మాటా వింటాను’’ అని వీహెచ్ చెప్పారు.
చదవండి: టీ కాంగ్రెస్ ఎన్నికల యాక్షన్ ప్లానేంటి? కోమటిరెడ్డి నివాసంలో ఏం జరిగింది?
‘‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి సహాయం చేస్తావ్. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయి. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా..?. మా పార్టీలో లొల్లి కూడా అంతే’’ అంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment