సాక్షి,సంగారెడ్డి: లగచర్లలో జరిగిన దానికి మసిపూసి మారేడు కాయ చేశారని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తన చేతకాని తనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్నారు. కేసులు పెడతామని ఎవరు బెదిరించినా భయపడొద్దు. కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేరు.
లగచర్లలో దాడి అనంతరం పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల్ని వదిలేశారు. బీఆర్‌ఎస్ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు. థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు ఔట్టారు. మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంట్లో వాళ్ళని కొడుతామని బెదిరించారు. కొడంగల్ ఎస్సై, సీఐ వందల మంది పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దాడి చేశారు. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే. మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది. మేం అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తగులుతుంది.
బాధితులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుంది.తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడరు.అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతాం. పిల్లలు కలెక్టర్‌ని కొట్టారు అని కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మా పార్టీ అండగా ఉంటుంది’అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment