kodangal
-
KTR: దుర్యోధనుడు పాలించినట్లు కాంగ్రెస్ పాలన!
-
లగచర్లలో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా కోసం లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణను రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో అభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటన చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసంఅయితే.. తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా లగచర్లలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి అవసరం. ఆ భూమిని సేకరించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. దీనిపై రేపో మాపో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పొల్యూషన్ లేకుండా.. ఉపాధి కల్పించడమే ప్రధాన అజెండాగా ఈ ప్రతిపాదన ఉండనున్నట్లు సమాచారం. -
లగచర్ల ఘటన : కోర్టు ఎదుట లొంగిపోయిన బోగమోని సురేష్
సాక్షి,కొడంగల్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్,ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఏ2 నిందితుడు బోగమోని సురేష్ కొడంగల్ కోర్టు ముందు సురేష్ లొంగిపోయాడు. దీంతో లగచర్ల దాడి ఘటన కేసులో ఏ2గా ఉన్న సురేష్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు మాత్రం సురేష్‌కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.లగచర్లలో ఏం జరిగిందంటే?వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి కారణమైన వారిని అదుపులోకి తీసుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్.. ఏడీజీ మహేశ్ భగవత్‌కు ఆదేశాలు జారీ చేశారు.విచారణ చేపట్టిన ఏడీజీ మహేశ్ భగవత్.. దాడి ఘటనలో రాజకీయ కోణం ఉందని తెలిపారు. అంతేకాదు ఏ2 ముద్దాయిగా బోగమోని సురేష్‌ను చేర్చారు. కేసు విచారణ కొనసాగుతుండగా.. కొద్ది సేపటి క్రితం కోడంగల్ కోర్టు ఎదుట బోగమోని సురేష్ లొంగిపోయాడు. -
కొడంగల్‌లో మణిపూర్ తరహా ఘోరాలు: కేటీఆర్
సాక్షి,న్యూఢిల్లీ: వికారాబాద్ జిల్లా లగచర్లలో అర్థరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో సోమవారం(నవంబర్18) లగచర్ల ఫార్మాసిటీ బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. మణిపూర్ తరహాలో కొడంగల్‌లో అత్యాచారాలు: కేటీఆర్సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్‌లో గిరిజనులను బెదిరిస్తున్నాడులగచర్లలో గిరిజనులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారుఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా ?పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదుమణిపూర్ తరహాలోనే కొడంగల్ లో అత్యాచారాలు జరుగుతున్నాయిరాజ్యాంగ రక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ ఈ అంశంపై నోరు విప్పాలిగిరిజనుల గోడు వినాలని సీఎం రేవంత్ ను రాహుల్ ఆదేశించాలిగిరిజనుల భూమి లాక్కుంటున్నా రాహుల్, మల్లికార్జున ఖర్గే నోరు మెదపడంలేదుఉపన్యాసాలతో కాకుండా చేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలిప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది:లగచర్ల ఫార్మా బాధితులురేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే, మమ్మల్ని రోడ్డు మీదకు తెచ్చారుతొమ్మిది నెలలు నుంచి ధర్నాలు చేస్తున్నాంకలెక్టరు కాళ్ళు మొక్కినం అయినా మా గోడు వినడం లేదుమా భూముల జోలికి రావొద్దుమా వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలిరాత్రి పూట పోలీసులు వచ్చి పిల్లల్ని పట్టుకుపోయారుమా ప్రాణం పోయినా ఫర్వాలేదు, భూమి ఇచ్చే ప్రసక్తి లేదుమా గ్రామాల్లోనే ఎందుకు ఫార్మ కంపెనీ పెడుతున్నారుభూమి పై ఆధారపడి బతుకుతున్నాంమమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారుఫార్మా కంపెనీలు వల్ల కాలుష్యం పెరిగి మా బతుకులు మసి చేస్తున్నారురైతులను రోడ్డుపైకి ఈడుస్తున్నారునాపై దాడి జరగలేదని కలెక్టరే అన్నారుమహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారుపోలీసులను శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి -
న్యాయం కోసం ఢిల్లీ బాట పట్టిన లగచర్ల ఫార్మా బాధితులు
-
లగచర్ల ఘటన: NHRCలో బాధితుల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఘటన వ్యవహారం ఢిల్లీని తాకింది. లగచర్ల ఘటనకు బాధ్యులను చేస్తూ పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడంతో బాధితులు.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. లగచర్ల బాధితులు సోమవారం ఉదయం ఢిల్లీలో మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా లగచర్లలో అక్రమ అరెస్ట్‌లు, అక్కడ హింసపై బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. లగచర్లలో నేడు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్బంగా అక్కడున్న సమస్యలపై వివరాలు సేకరించనున్నారు ఎస్టీ కమిషన్ సభ్యులు. -
మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే మీ పదవి పోతుంది రేవంత్ : కేటీఆర్
సాక్షి,సంగారెడ్డి: లగచర్లలో జరిగిన దానికి మసిపూసి మారేడు కాయ చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా తన చేతకాని తనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్నారు. కేసులు పెడతామని ఎవరు బెదిరించినా భయపడొద్దు. కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేరు. లగచర్లలో దాడి అనంతరం పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల్ని వదిలేశారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు. థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు ఔట్టారు. మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంట్లో వాళ్ళని కొడుతామని బెదిరించారు. కొడంగల్ ఎస్సై, సీఐ వందల మంది పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దాడి చేశారు. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే. మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది. మేం అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తగులుతుంది. బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది.తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడరు.అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతాం. పిల్లలు కలెక్టర్‌ని కొట్టారు అని కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మా పార్టీ అండగా ఉంటుంది’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. -
కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
Updates..👉కొడంగల్ దాడుల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్‌లోని డీటీసీ సెంటర్లో ఉంచారు. అక్కడి నుంచే ఆయనను నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీటీసీ సెంటర్‌కే వైద్యులను పిలిపించి అక్కడే నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.👉మరోవైపు.. నరేందర్ రెడ్డి ఇంటికి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి భార్య, కుటుంబ సభ్యులను సబిత పరామర్శించారు. 👉తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం గమనార్హం.👉తెలంగాణలోని వికారాబాద్ ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అధికారులపై దాడికి సూత్రధారిగా అనుమానిస్తున్న బీఆర్ఎస్ నేత సురేష్‌తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. కాల్ డేటా ఆధారంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే, నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా, సంభాషణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటికే 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి బీఆర్ఎస్కు చెందిన నేతలు కూడా ఉన్నారు. దీంతో, కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 👉వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు.. కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు.👉ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పట్టుకుని కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్‌రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా రైతులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.Government Takes Serious Note of Attack on Vikarabad Collector; Investigation Orderedవికారాబాద్ అడిషనల్ కలెక్టర్, KADA ఛైర్మన్ మరియు ఇతర అధికారులపైన దాడిలో ప్రత్యేక్షంగా గాని పరోక్ష్యంగా గాని పాల్గొన్న వారిని ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.-- శ్రీ వి.సత్యనారాయణ,IPS. pic.twitter.com/XfjZqUonAa— Congress for Telangana (@Congress4TS) November 12, 2024 -
ఏమిటీ అరాచకం?.. రైతుల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నం పెట్టే రైతన్న నోటికాడి బువ్వను గుంజేసుకుని వారు ప్రతిఘటిస్తే అర్ధరాత్రి అరెస్టు చేసి వారిని చిత్రహింసలు పెట్టడం అమానుషం అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..ఏమిటీ అరాచకం?తమ భూములు గుంజుకోవద్దన్నందుకు16 మంది రైతులను అర్ధరాత్రి నిర్బంధించిచిత్రహింసలు పెట్టిన రేవంత్ పోలీసులు.అన్నం పెట్టే రైతన్ననోటికాడి బువ్వను గుంజేసుకునివారు ప్రతిఘటిస్తేఅర్ధరాత్రి అరెస్టు చేసివారిని చిత్రహింసలు పెట్టడం అమానుషం.కొడంగల్ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలివారిని వెంటనే విడుదల చేయాలి. కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాను! అంటూ వీడియోను షేర్ చేశారు. ఏమిటీ అరాచకం?తమ భూములు గుంజుకోవద్దన్నందుకు16 మంది రైతులను అర్ధరాత్రి నిర్బంధించిచిత్రహింసలు పెట్టిన రేవంత్ పోలీసులు.అన్నం పెట్టే రైతన్ననోటికాడి బువ్వను గుంజేసుకునివారు ప్రతిఘటిస్తేఅర్ధరాత్రి అరెస్టు చేసివారిని చిత్రహింసలు పెట్టడం అమానుషం.కొడంగల్ రైతుల మీద పెట్టిన… https://t.co/0PblYOTpIX— KTR (@KTRBRS) November 12, 2024 -
ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి
కొడంగల్/ దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు కన్నెర్ర జేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా అదనపు బలగాలను మోహరించారు. అసలేం జరిగింది? ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియలో భాగంగా సోమవారం గ్రామసభ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. భూములు తీసుకునే లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో దుద్యాల– హకీంపేట మార్గంలో సభ ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకించిన నిర్వాసిత రైతులు.. తమ గ్రామంలోనే సభ నిర్వహించాలని అధికారులను కోరారు. రైతుల పక్షాన ఓ వ్యక్తి గ్రామసభ వేదిక వద్దకు వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఈ విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామంలోనే సభ నిర్వహిద్దామంటూ లగచర్లకు బయలుదేరారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి కలెక్టర్ వాహనాన్ని అనుసరించారు. అధికారులు లగచర్లకు చేరుకోగానే గ్రామస్తులు భూసేకరణకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రయత్నించారు. కానీ కొందరు గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. పోలీసుల వైఫల్యం! గ్రామసభ కోసమని ఏర్పాటు చేసిన వేదిక వద్ద సుమారు 200 మంది వరకు పోలీసులు విధుల్లో ఉన్నారు. కలెక్టర్, ఇతర అధికారులు లగచర్ల గ్రామానికి వెళ్తున్నప్పుడు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మినహా పోలీసులెవరూ వెంట వెళ్లలేదు. ఆగ్రహంతో దాడికి దిగిన గ్రామస్తులు, నిర్వాసిత రైతులను అదుపు చేయడం వీలుకాలేదు. నిఘా వ్యవస్థ, పోలీసుల వైఫల్యం కారణంగానే.. ఈ ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న రైతులు దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్లతండా, రోటిబండ తండాల్లో మొత్తం 1,358 ఎకరాల భూసేకరణ కోసం ఐదు నెలల క్రితం చర్యలు ప్రారంభించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. 721 ఎకరాల పట్టా భూమి ఉంది. సుమారు 800 రైతులు భూములు కోల్పోనున్నారు. వారంతా పేద రైతులే. చాలా వరకు గిరిజనులే. ఈ భూముల్లో వ్యవసాయం తప్ప వేరే జీవనోపాధి లేదని వారు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు చెప్తున్నా... చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో విషం చిమ్మే ఫార్మా కంపెనీలను అనుమతించేది లేదంటూ ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భూసేకరణపై ముందుకు వెళ్తుండటం, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో.. జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. రైతుల ఆగ్రహాన్ని గమనిస్తూనే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకరం సగటు ధర రూ.30 లక్షలకుపైగా ఉందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం రూ.10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, కోల్పోయే ఒక్కో ఎకరానికి 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా.. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులపై దాడి వరకు వెళ్లింది. అనుకోకుండా జరిగింది.. అందరూ మనవాళ్లే.. లగచర్ల ఘటనను కలెక్టర్ ప్రతీక్ జైన్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఘటనా స్థలం నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వారందరూ మన ప్రజలే, మన రైతులే.. మాట్లాడుదామని మమ్మల్ని పిలిస్తేనే వెళ్లాం.. కొందరు వ్యక్తులు అనుకోకుండా తోసుకుని ముందుకు వచ్చి అలా చేశారు. దయచేసి ఈ ఘటనకు దాడి అనే పదం వాడకండి..’’ అని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రతోనే దాడి: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య అని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఫార్మా కోసం భూసేకరణపై అభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కొందరు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు తీసుకువస్తున్నారన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. -
స్ఫూర్తిమంతమైన విజయపథంలో... సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి. రుణమాఫీని బీఆర్ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోంది.చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!- వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao)కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం) -
‘కొడంగల్’ సామర్థ్యం పెంపు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్మించతలపెట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ద్వారా మొత్తం 10 చెరువులకు నీటిని మళ్లించాల్సి ఉండగా, వాటి సామర్థ్యాన్ని 0.9 టీఎంసీల నుంచి 2.1 టీఎంసీలకు పెంచాలని మొదట్లో నిర్ణయించింది. తాజాగా 4.022 టీఎంసీలను నిల్వ చేసే జలాశయాలుగా ఈ చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం సైతం రూ.2,945.50 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు చేరింది. తొలుత ప్రతిపాదించిన నాలుగు దశలకు బదులుగా రెండు దశల్లో ఈ పథకాన్ని నిర్మించనుండగా, త్వరలోనే టెండర్లు పిలిచేందుకు నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గత ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. భూత్పూర్ నుంచి నీటి తరలింపు నీటిని తీసుకునే ప్రాంతం నుంచి సరఫరా చేసే చివరి పాయింట్ వరకు ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం ముగిసింది. సంగంబండకు బదులు భీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయం నుంచి నీటిని తీసుకుంటారు. తాజా ప్రతిపాదనల ప్రకారం భూత్పూర్ జలాశయం నుంచి కనుకుర్తి వరకు మూడు చోట్ల నీటిని ఎత్తి పోయాలని, మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో భూత్పూర్ జలాశయం నుంచి ఊట్కూరు చెరువులోకి నీళ్లను ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి జయమ్మ చెరువు, అక్కడి నుంచి కనుకుర్తి చెరువుకు నీళ్లను ఎత్తిపోస్తారు. ఇందుకోసం ఉట్కూరు, జయమ్మ, కనుకుర్తి చెరువుల ఆధునీకరణ, నిల్వ సామర్థ్యం పెంపు పనులను నిర్వహిస్తారు. తొలి దశ పనులకు రూ.2,945 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. రెండో దశ పనుల్లో భాగంగా జాజాపూర్, దౌలతాబాద్, బొమ్రాస్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ అనే మొత్తం ఏడు చెరువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మిస్తారు. రెండో దశ పనులకు రూ.1,404.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. భూత్పూర్తో తక్కువ వ్యయం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఉద్ధండాపూర్ రిజర్వాయర్ (+269 అడుగుల సముద్రం మట్టం) నుంచి నీటిని లిఫ్ట్ చేయటం కంటే సముద్రానికి 350 అడుగుల మట్టంలో ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోయడానికి తక్కువ నిర్వహణ వ్యయం అవుతుందని, సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.లక్ష ఎకరాలకు ఏడు టీఎంసీలుమక్తల్ నియోజకవర్గంలో ఊట్కూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌలతాబాద్, బొమ్రాస్పేట మండలాల్లో 53,745 ఎకరాలు కలిపి మొత్తం లక్ష ఎకరాలను ఈ ప్రాజెక్టు కింద ప్రతిపాదించారు. 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందిస్తారు. ఇందుకోసం అప్రోచ్ ఛానెళ్లు, పంప్ హౌస్‌లు, డెలివరీ మెయిన్స్, సిస్టర్న్స్ నిర్మించనున్నారు. భూగర్భ సొరంగాలకు బదులు ప్రెషర్ మెయిన్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే నిర్వహించి రూ.3,117 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు పలు మార్పులు చేర్పులు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు రూ.2,945.5 కోట్ల పనులకు గత ఫిబ్రవరి 8న పాలనా పరమైన అనుమతులు జారీ చేసింది. -
సీఎం రేవంత్ కాన్వాయ్‌లో ప్రమాదం..పేలిన కారు టైరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారునం టైర్ పంక్చర్ అయి ఒక్కసారిగా పేలింది. దీంతో కారు సడెన్‌గా ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. టైర్ పేలడంతో అందరూ భయంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే వాహనాల నుంచి బయటకు వచ్చారు. కాన్వాయ్‌లో వెళ్తున్న నాయకులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పేలిన టైర్లు రిపేర్ చేయడంతో మళ్లీ కొడంగల్‌కు బయలు దేరారు. గతేడాది మార్చిలోనూ రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేటలో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి కాన్వాయ్‌లో ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తం ఏడు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా సీఎం రేవంత్ సోమవారం కొండగల్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో లోక్ సభ ఎన్నికలపై సన్నాహక సమానేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యుహాలపై దిశానిర్ధేశం చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‌నగర్ పరిధిలోనే ఉండటంతో.. ప్రత్యేక దృష్టి చెప్పారు సీఎం. చదవండి: కవితకు దక్కని ఊరట.. బెయిల్ తీర్పులో కీలక అంశాలు -
ఆ రెండు పార్టీల ప్రయత్నాలు ఫలించవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని, తాము చేసింది చెప్పి ఓట్లడిగేందుకు బీజేపీ దగ్గర ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలు ఫలించ బోవని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సాను కూల రాజకీయ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సికింద్రా బాద్, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు. పార్టీ అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్యలతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, కె.ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, విజయారెడ్డి, ఫిరోజ్‌ఖాన్, రోహిణ్‌రెడ్డి, ఆదం సంతోష్ తదితరులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలి సికింద్రాబాద్ సమీక్షలో భాగంగా రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ గెలిచిందని, ఇప్పుడు కూడా గెలవడం ద్వారా హైదరాబాద్ నగరంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కో రారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చిందని, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగినందున ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలందరితో కలిసి సమన్వ యంతో ముందుకెళితే గెలుపు కష్టమేమీ కాదని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని చెప్పేందుకు సికింద్రాబాద్ గెలుపు అవసరమని స్పష్టం చేశారు. వరంగల్ సమీక్ష సందర్భంగా.. సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఇక్కడి నుంచి బరి లో దింపుతున్నందున అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు కష్టపడి పనిచేయాలని, కావ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పారు. నేడు కొడంగల్‌కు సీఎం సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన సొంత నియో జకవర్గమైన కొడంగల్‌కు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత సా యంత్రానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. -
నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవా రం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ
-
సీఎం రేవంత్ నజర్.. కొడంగల్‌కు మంచి రోజులు
కొడంగల్: కొడంగల్‌కు మంచి రోజులు వచ్చాయి. నియోజకవర్గంలోని 8 మండలాల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత కొడంగల్‌కు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైంది. తెలంగాణ ఏర్పడక ముందు సీమాంధ్ర పాలకులు, తెలంగాణ వచ్చినా సొంత పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, రవాణా, ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారు. గత పాలకుల వివక్ష వల్ల కొడంగల్‌ను రెండు ముక్కలు చేసి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. కొడంగల్ అభివృద్ధి కోసం కడా (కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేశారు. ఈ అథారిటీ పరిధిలో నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కడా చైర్మన్‌గా కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రత్యేకాధికారిగా వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనులకు శాఖల వారీగా సిద్ధం చేసిన ప్రతిపాదనలను మంగళవారం కడా ఆధ్వర్యంలో కలెక్టర్‌కు సమర్పించే అవకాశం ఉంది. కొడంగల్, కోస్గి ఆస్పత్రులను 100 పడకలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. గురుకులాలు, పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు. జీఓ 69తో కొడంగల్, నారాయణపేట, మక్తల నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా, మద్దూరును మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ కానుంది. ఇప్పటికే సీఎం రేవంత్ ఆ శాఖ అధికారులతో చర్చించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ప్రభు త్వం అధికారులను ఆదేశించింది. నియోజకవర్గానికి వ్యవసాయ డిప్లమో కళాశాల, 50 ఎకరాల్లో ఉద్యానవన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కొడంగల్ బస్టాండ్ విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోస్గి ఆర్టీసీ బస్సు డిపోకు జవసత్వాలు పోయనున్నారు. ప్రస్తుతం 10 ఆర్డినరీ, ఒక ఎక్స్‌ప్రెస్ బస్సుతో డిపోను నడిపిస్తున్నారు. త్వరలో కోస్గి డిపో స్థాయిని పెంచే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కోస్గిలో ఇంజనీరింగ్ కళాశాల, కొడంగల్‌లో పీజీ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉంది. నియోజకవర్గంలో మూసి వేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి కృషి జరుగుతోంది. ప్రతి గ్రామం, తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. -
కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ..
-
ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అభ్యర్థుల ఓట్లు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం.. కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఆయన తన ఓటును అక్కడే వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్ నగరంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్మోహన్రావు ఓటు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. -
ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి
-
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్‌ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్‌ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్‌ను ఏనాడూ పట్టించుకోని రేవంత్‌రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్‌రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
కొడంగల్ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి రేవంత్
-
కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా నరేందర్‌కు మంత్రి పదవి ఇప్పిస్తా: కేటీఆర్
సాక్షి, వికారాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెట్టారు. కొడంగల్ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.. జైలుకు పోయే దొంగ కావాలా అని ప్రజలను అడిగారు. గత 55 ఏళ్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినా కొడంగల్‌లో ఎన్నడూ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొడంగల్‌లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, లీడర్లను కొంటున్న రేవంత్.. ప్రజలను కొనలేడని పేర్కొన్నారు. రేవంత్ చేయలేని అభివృద్ధిని అయిదేళ్లలో పట్నం నరేందర్ రెడ్డి చేసి చూపెట్టారని తెలిపారు. నరేందర్ వల్లే కొడంగల్‌కు డిగ్రీ కాలేజీ, దౌల్తాబాద్‌కు జూనియర్ కాలేజీ వచ్చిందన్నారు కేటీఆర్. కొడంగల్, కోస్గి, మద్దూర్‌లో 50 పడకల ఆస్పత్రి, ఇంకొక 50 పడకల ఆస్పత్రి, 30 పడకల ఆస్పత్రి తెచ్చింది నరేందర్ రెడ్డేనని చెప్పారు. కొండగల్‌లో మరోసారి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ కళ్లు పట్టుకొని అయినా సరే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పిస్తానని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తరువాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని అందిస్తామన్నారు. ‘కేసీఆర్‌కు సవాల్ విసురుతున్న రేవంత్‌ను చూస్తుంటే.. తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొడుతున్నట్లు ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో కొడంగల్ పేరును నాశనం చేశాడు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంటు పోయింది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ అక్కర్లేదు. మా నరేందర్ రెడ్డి చాలు. ఇక్కడి ప్రజలను చూసి రేవంత్ 15వ తేదీన నామినేషన్ వెనక్కి తీసుకుంటాడు. రేవంత్ ఓ బ్రోకర్. 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకునే పెయింటర్. ఆయనకిప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. బ్లాక్మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి. వాళ్లను బెదిరించాలి. సెటిల్మెంట్లు చేయాలి. నాలుగు పైసలు సంపాదించాలనేది రేవంత్ నైజం. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గ్రామలకు వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు. నమ్మి మోస పోకండి. కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే బాధ్యత నాది. నరేందర్ రెడ్డి చెప్పిన ప్రతి పనిని నేను చేస్తా.. మీరు మాత్రం బ్యాలెట్ బాక్స్‌లో బీఆర్ఎస్కు గుద్దుడు గుద్దితే.. రేవంత్ రెడ్డి పారిపోవాలి. తెలంగాణకు ఒకే ఒక్క గొంతు నొక్కేందుకు డీల్లి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ, అమిత్ షా గుంపులు, గుంపులుగా వస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా నరేందర్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండని రేవంత్ రెడ్డి’ అని కేటీఆర్ మండిపడ్డారు. -
కొడంగల్ ను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాయమాటలు చెప్పారు
-
కాసేపట్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి నామినేషన్
-
కొడంగల్ నుంచే రేవంత్ పోటీ
కొడంగల్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచే పోటీ చేస్తారని ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించారు. వారి అభిప్రాయాలను విన్నారు. పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా రాజకీయంగా అదే తనకు చివరి రోజన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ మాట్లాడుతూ.. తన తాత, చిన్నాయన ఎమ్మెల్యేలుగా పని చే శారని గుర్తు చేశారు. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డిని పోటీ చేయించి, ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గురునాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. గాంధీభవన్‌కు వచ్చి కండూవా కప్పుకోవడమే మిగిలిందని తెలిపారు. 2009లో రేవంత్ గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. గ్రామాల్లో కొంత మేర సమస్యలు ఎదురైనా సర్దుకు పోవాలని శ్రేణులకు సూచించారు. రేవంత్‌రెడ్డి గెలిచిన తర్వా త కార్యకర్తలను ఆదుకుంటామని ప్రకటించారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసి కట్టుగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని కార్యకర్తలు, నాయకులు తీర్మానం చేశారు. తమకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇస్తే చాలన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్, ఇందనూర్ సర్పంచ్ బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ఆనంద్‌రెడ్డి, సోమ శేఖర్, దత్తు, ధాము, బాల్‌రాజ్, మైనార్టీ నాయకులు నయీం, ఆసిఫ్‌ఖాన్, ముస్తాక్ పాల్గొన్నారు. -
నా హయాంలోనే కొడంగల్ అభివృద్ధి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా చెబుతారన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మద్దూరు, గోకుల్‌నగర్, సీతానాయక్ తండాల నుంచి టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన యువకులు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో వారికి రేవంత్ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అన్నను తమ్ముడు మట్టుబెట్టినట్లు నిర్ధారణ అయ్యిందని, నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ రషీద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. శనివారం కొడంగల్‌లోని హైవే పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న సీఐ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సొంత అన్నను తమ్ముడు హత్య చేశాడని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించారు. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏర్పుమల్ల గ్రామానికి చెందిన పూజారి గోపాల్, పూజారి శ్రీను అన్నదమ్ములు. పూజారి శ్రీను భార్యతో తన అన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో గత ఏడాది నవంబర్ 15న గోపాల్ గొంతును టవాల్‌తో బిగించి చంపాడు. ఇతరులకు అనుమానం రాకుండా మృతదేహాన్ని ఊరు చివర ఉన్న దోసలకుంట (నీటి కుంట)లో పడేశాడు. రెండు రోజుల తర్వాత శవం పైకి తేలడంతో మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు పూజారి శ్రీను నిందితుడిగా గుర్తించారు. శనివారం రోజు రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏఎస్పీ రషీద్ మాట్లాడుతూ సమాజంలో వివాహేతర సంబంధాలే హత్యలకు దారి తీస్తున్నాయని అన్నారు. అవి మంచివి కావన్నారు. ఏదో ఒకరోజు విషయం తెలిసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ప్రాణాలు తీసిన వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదన్నారు. దీని వల్ల రెండు కుటుంబాల వారు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కొడంగల్ సీఐ ఇప్తికార్ అహ్మద్, కొడంగల్ ఎస్ఐ రవి పాల్గొన్నారు. చదవండి: Tequila Pub: పబ్‌పై రైడ్స్.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్ గర్ల్స్, కస్టమర్లు -
గొర్లు, బర్రెలకే బీసీలను పరిమితం చేసిన టీఆర్ఎస్: వైఎస్సార్టీపీ
మహబూబ్ నగర్: తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో బీసీ గౌరవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు రామకోటి, శ్రీరాములు, శ్రీనివాస్, అమృతసాగర్, బాలరాజ్ మాట్లాడుతూ.. బీసీల ఐక్యతను చాటేందుకు అక్టోబర్ 3వ తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గి పట్టణంలో బీసీ గౌరవ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడేళ్ల తెలంగాణలో బీసీల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ బీసీలకు పదవులు దక్కకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వసతిగృహాల్లో వసతులు లేవని, అదనపు గదుల నిర్మాణాల ఊసేలేదని విమర్శించారు. బీసీలను గొర్లు, బర్రెలు, చెప్పులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద బీసీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజురు చేయడానికి ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కోస్గిలో నిర్వహించే బీసీ గౌరవ సభకు బీసీలతో పాటు అందరూ భారీగా తరలిరావాలని వైఎస్సార్టీపీ నాయకులు పిలుపునిచ్చారు. చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. నలుగురు మృతి
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని కొడంగల్ పట్టణ శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై బండల ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోగా మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన నలుగురిని హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు. చదవండి: ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి -
ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
కొడంగల్ రూరల్: వారసత్వంగా తన తండ్రికి చెందాల్సిన ఆస్తిని..ఇవ్వడం లేదన్న మనస్తాపంతో టెన్త్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హస్నాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కొడంగల్ పట్టణానికి చెందిన కాంసన్‌పల్లి వెంకటయ్య కుమారుడు నిఖిల్ (16) చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ ఊరైన హస్నాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడే పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాంసన్‌పల్లి వెంకటయ్య, అంజమ్మ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సమయంలో నిఖిల్ తన పెదనాన్నలతో మాట్లాడి వారసత్వంగా తమకు చెందాల్సిన భూమిని తమ తండ్రి పేరున పట్టా చేయాలని అడగ్గా.. సరేనని చెప్పిన వారు కాలయాపన చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి హస్నాబాద్‌లోని ఆరుబయటే నిద్రించిన నిఖిల్ రాత్రికి రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా..నిఖిల్ చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో స్థానికుల సాయంతో కిందకు దించారు. అయితే అప్పటికే నిఖిల్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి అమ్మమ్మ బెస్త చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం! -
ఘనంగా పెళ్లి: మూడో రోజే మృత్యు ఒడిలోకి..
సాక్షి, దౌల్తాబాద్: (సిద్దిపేట)పెళ్లైన మూడురోజులకే కొత్త పెళ్లికొడుకు మృత్యుఒడికి చేరుకున్నాడు. చెరువులో పడిన తన అన్న కుమారుడిని రక్షించే యత్నంలో బురదలో ఇరుక్కొని కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్‌లో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మౌలాన్‌సాబ్, జహీరాబీ దంపతులు తమ ఐదుగురు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. చిన్న కుమారుడు యాసిన్ (23) వివాహం గురువారం నగరంలో ఘనంగా జరిపించారు. ఈ క్రమంలో స్వగ్రామంలో గ్రామస్తులకు, బంధువులకు ఆదివారం విందు ఏర్పాటు చేయాలని భావించి అందుకు సంబంధించిన ఏర్పా ట్లు చేశారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కలిసి శనివారం మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లి సరదాగా గడపసాగారు. అంతలోనే యాసిన్ అన్న కుమారుడు సమీర్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. దీంతో వెంటనే యాసిన్ అతడిని కాపాడే యత్నం చేశాడు. ఈక్రమంలో చెరువులోని గుంతలో ఇరుక్కుపోయాడు. గట్టున ఉన్న కొందరు సమీర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి గ్రామస్తులు అక్కడికి చేరుకొని యాసిన్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న కొత్తపెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం బాలంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడు సమీర్ క్షేమంగా ఉన్నాడు. మృతుడి తండ్రి మొగులాన్‌సాబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి -
ఆర్టీసీ బస్సు నుంచి దూకిన వ్యక్తి మృతి
సాక్షి, కొడంగల్ రూరల్ : బస్సు నుంచి కిందకు దూకి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రావులపల్లిలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపల్లి గ్రామ స్టేజీలో దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన పొలంసాయన్నోళ్ల రాములు (50)ను ఆయన భార్య మదారమ్మ ఆర్టీసీ బస్సులో ఎక్కించింది. అయితే బస్సు ప్రయాణిస్తున్న సమయంలో రాములు బస్సు నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థంలోనే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష్య సాక్షుల కథనం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
కొడంగల్: ఓ తల్లి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హృదయ విదారకంగా మారిన ఈ ఘటన కొమ్మూరు, ఏపూర్, హస్నాబాద్ గ్రామాల్లో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం .. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (28)ను నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్పతో పదేళ్ల కిందట వివాహం చేశారు. పెళ్లి నాటి నుంచి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వారు పలుమార్లు కోస్గి, హస్నాబాద్ తదితర గ్రామాలకు పని నిమిత్తం వచ్చేవారు. వారికి రజిత (8), అనిత (6), రాజు (4) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తాయి. అత్తింట వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందింది. గురువారం రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఇంటి సమస్యలతో సతమతమైన ఆమెకు బతుకు భారంగా అనిపించింది. బతకడం ఇష్టం లేక కొమ్మూరు గ్రామం నుంచి కోస్గికి వచ్చి అక్కడి నుంచి హస్నాబాద్‌కు చేరుకుంది. హస్నాబాద్ గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. రజిత, రాజు చేతులను చున్నితో కట్టి చెరువులో తోసింది. (చదవండి: ఆన్లైన్ గేమ్.. అప్పులు తీర్చలేక యువకుడు బలి) ఈ విషయం గమనించిన మరో కూతురు అనిత అక్కడి నుంచి పారిపోయింది. హస్నాబాద్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే లోపు ఎల్లమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి రాజు మృత దేహం ఒడ్డుకు వచి్చంది. తల్లి కూతుళ్ల శవాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగి్నమాపక సిబ్బంది సహకారంతో వెతికారు. చెరువులో చెట్టుకు తగిలి ఉన్న రెండు మృతదేహలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. కొడంగల్ ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, బొంరాస్‌పేట ఎస్ఐ శ్రీశైలం, రెవెన్యూ, అగి్నమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెన
సాక్షి, హైదరాబాద్ : గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్-తాండూర్ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుని పోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాల్లో భారీగా వర్షం కురవడం వరద ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో 17.2 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడలో 17 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్‌లో 13.9 సెం.మీ వర్షపాతం మహబూబాబాద్‌లో 13.6 సెం.మీ వర్షపాతం సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లెలో 11 సెం.మీ వర్షపాతం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 10.2 సెం.మీ వర్షపాతం వికారాబాద్ జిల్లా ధారూర్‌లో 9.2 సెం.మీ వర్షపాతం -
కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంచలన రీతిలో విజయం సాధిస్తోంది. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయ్యాయి. దీంతో మెజార్టీ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షం అయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 80కుపైగా టీఆర్ఎస్ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది. (కాంగ్రెస్ కంచు కోటకు బీటలు) -
కలెక్టర్.. లెక్కల టీచర్
కొడంగల్ రూరల్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ శుక్రవారం కొడంగల్ మండల పరిధిలోని రావులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం క్లాస్‌లోకి వెళ్లి గణితం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీవాణితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ బోర్డుపై మ్యాథ్స్ ఈక్వేషన్ వేసి వివరించారు. -
నిర్లక్ష్యానికి మూడేళ్లు!
సాక్షి, యాలాల: తాండూరు – కొడంగల్ మార్గంలోని కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయి మూడేళ్లు కావస్తున్నా.. నూతన వంతెన అందుబాటులోకి రాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసినా.. పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికి తోడు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న పాత వంతెన ప్రమాదకరంగా మారుతోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2016, సెప్టెంబరు 15న తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కాగ్నా ఉధృతికి తాండూరు– కొడంగల్ మార్గంలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. అంతర్ జిల్లా రహదారిలోని వంతెన కోతకు గురికావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ కొడంగల్, పరిగి, బషీరాబాద్ వెళ్లే వాహనదారులు.. ముద్దాయిపేట, విశ్వనాథ్‌పూర్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
పోలింగ్ సవాలే!
జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఓవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా చూస్తేనే మరోవైపు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది. అయితే జిల్లాలోని పలు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ అధికార్ల ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందులో భాగంగా మండలాల వారీగా సున్నితమైన సెంటర్లను గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అత్యంత సమస్యాత్మక గ్రామాలు, 128 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆయా సెంటర్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, వికారాబాద్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 11వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. జిల్లాలోని 8 లక్షల మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 165, గ్రామాల్లో 961 సెంటర్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు గ్రామాలు, పోలింగ్ స్టేషన్ల వద్ద గొడవలు చేసుకుని భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలు రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త సర్వేలో జిల్లాలోని ఎనిమిది గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ పట్టణం, రావులపల్లి, హుస్నాబాద్, కుదురుమల్ల, చెల్లాపూర్ అత్యంత సమస్యాత్మకమైనవిగా నిర్ధారించారు. ఐదు పంచాయతీల పరిధిలో 32 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని నస్కల్, సుల్తాన్పూర్, దోమ గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటి పరిధిలో తొమ్మిది అత్యంత సున్నితమైన సెంటర్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీటితోపాటు జిల్లాలో 128 సమస్యాత్మక సెంటర్లు ఉన్నట్లు తేల్చారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 32, వికారాబాద్‌లో 26, తాండూరులో 32, కొడంగల్‌లో 38 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు సైతం సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘలను లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలింగ్ రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మొహరిస్తాం. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. – నారాయణ, ఎస్పీ -
అక్రమ వెంచర్‌పై కొరడా
సాక్షి, కొడంగల్: పట్టణంలోని లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో అనుమతి లేకుండా వెలిసిన వెంచర్‌పై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. కొడంగల్ మున్సిపాలిటీగా మారిన తర్వా త పట్టణంలోని పలు చోట్ల అక్రమ వెంచర్లు వెలిశాయి.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇర్షాద్, కార్య నిర్వాహక అధికారి పద్మ, మున్సిపల్ సిబ్బంది మంగళవారం వీటిని పరిశీలించారు. లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శిఖం భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖం భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాడు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని కొనుగోలు చేశారు. కొండారెడ్డిపల్లికి వెళ్లే దారి కావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఉండటంతో కొడంగల్ వ్యాపారులు ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఈ ప్లాట్లకు మున్సిపల్ అనుమతి లేదు. టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్ లేదు. లే అవుట్ లేదు. శిఖం భూమిని కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల నుంచి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) పర్మిషన్ తీసుకున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది వెంచర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని హద్దు రాళ్లను తొలగించారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. అన్ని అనుమతులు తీసు కొని లే అవుట్ చేసిన తర్వాతనే అనుమతులు ఇ స్తామని టీపీఓ ఇర్షాద్, ఈఓ పద్మ తెలిపారు. పట్టణంలో అక్రమంగా వెలిసిన వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి
కోస్గి (కొడంగల్): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఓ వీఆర్ఓ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంఘటన మండలంలోని ముశ్రీఫాలో బుధవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్న నర్సప్ప(48) ఎన్నికల విధుల్లో భాగంగా ఇదే పంచాయతీ ఇన్చార్జ్గా ఉన్నారు. ఎన్నికలు ప్రారంభమై ప్రశాంతంగానే కొనసాగుతున్న తరుణంలో నర్సప్పకు ఒక్కసారిగా కళ్లు తిరుగుతూ చెమటలు పట్టడంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లారు. బీపీ ఎక్కువగా ఉందని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా ఆటోలో కోస్గికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే కుప్పకూలిపోయారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పతికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ బుచ్చయ్య, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని నర్సప్ప కుటంబ సభ్యులను పరామర్శించారు. కాగా నర్సప్ప స్వగ్రామం దౌల్తాబాద్ మండలం చంద్రకల్ కాగా, ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో విషాదం
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. బుధవారం వికారాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఉన్న వీఆర్వో, ఓటేసి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన నర్సప్ప (50) కోస్గి మండలం ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్నారు. బుధవారం తుదివిడత పంచాయతీ ఎన్నికల కోసం.. కోస్గి మండలం ముశ్రీఫా గ్రామానికి వెళ్లాడు. విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నర్సప్ప కిందపడిపోయాడు. స్థానికులు గమనించి కోస్గి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య అరుణమ్మ ఇటీవల చంద్రకల్ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఘటనలో ఓటరు పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన కోరె వెంకటమ్మ (65) బుధవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటేసేందుకు వరుసలో నిల్చుని ఉంది. ఓటేసిన వెంటనే వెంకటమ్మకు గుండెపోటు రావడంతో ఆమె పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు స్పందించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. పరిశీలించిన స్థానిక వైద్యులు ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. -
కొడంగల్ ఫలితంపై జోరుగా బెట్టింగ్
సాక్షి, కొడంగల్: కొడంగల్ అసెంబ్లీ స్థానంపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి అభిమానులతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వేలు, లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. రేవంత్‌రెడ్డి గెలుస్తారని కొందరు.. లేదు నరేందర్‌రెడ్డి విజయం సాధిస్తారని మరికొందరు పందేలు కాస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు ఎవరూ గెలువలేదు. గతంలో గురునాథ్‌రెడ్డి రెండు పర్యాయాలు గెలిచినా హాట్రిక్ సాధించలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. మూడోసారి గెలిచి హాట్రిక్ సాధిస్తాననే ధీమాతో రేవంత్ ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షra, పరోక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు ఓడిపోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆయన ఓటమి చూడలేదు. కాగా, ప్రస్తుతం కొడంగల్ ఎన్నికలు ఫలితం ఎవరికీ అంతుపట్టడం లేదు. నెలరోజుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతోపాటు రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం బరిలోకి దిగి ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశారు. నరేందర్‌రెడ్డి మంత్రి మహేందర్‌రెడ్డికి స్వయాన సోదరుడు కావడంతో ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొడంగల్‌లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని గులాబీ అధిష్టానం కంకణం కట్టుకుంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సహకారం తీసుకున్నారు. గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి సైతం విజయంపై భరోసాతో ఉన్నారు. ఈనెల 11న ఫలితం వెలువడనుంది. ఈనేపథ్యంలో కొడంగల్ ఫలితంపై నేతలు బెట్టింగ్ కాస్తున్నారు. -
కొడంగల్‌ను అభివృద్ధి చేశా
బొంరాస్‌పేట: ‘రేవంత్‌రెడ్డి అనే నేను.. ప్రజలకు అండదండగా నిలబడి అభివృద్ధి చేసి చూపుతానని, ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర కమీషన్లు అడగలేదని, అక్రమాలకు పాల్పడలేదని మీ అందరి ముందు సగర్వంగా చెబుతున్నా. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపాను. ఇక నన్నెందుకు ఓడించాలి. పనిగట్టుకొని టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అసెంబ్లీ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపానని, నన్నెందుకు ఓడించాలని టీఆర్ఎస్ పార్టీని ప్రశించారు. కోస్గిలో జరిగిన కేసీఆర్ సభలో కొడంగల్ అభివృద్ధి పనులకు అర్ధ రూపాయి విలువ చేసే హామీలు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ నల్లత్రాచు లాంటివారని, తోకపై కాకుండా పడగమీద పాదం మోపి టీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ‘కొండలనైనా పిండిగొట్టే నేను.. కర్రపుల్ల లాంటి కేసీఆర్ నాకెంత’అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. -
కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభ
-
అర్ధరాత్రి రేవంత్‌రెడ్డి అరెస్టు..కాంగ్రెస్ నాయకుల నిరసన
సాక్షి, దౌల్తాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ మహాకూటమి అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్టుపై మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం, అధికారులు కలిసి అరెస్టు చేయడం తగదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పోలీసులు రేవంత్‌రెడ్డి అరెస్టుకు ముందుగానే తెల్లవారుజామున వివిధ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని దేవర్‌ఫసల్‌వాద్‌లో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలో నిరసన చేపట్టి ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకుల ముందస్తు అరెస్టు... కోస్గిలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాద సభను అడ్డుకుని నిరసన తెలుపుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునివ్వడంతో, ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు మహాకూటమి నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆయా గ్రామాల్లో ఉన్న మహాకూటమి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఎంపీపీ నర్సింగ్‌భాన్‌సింగ్, వైస్‌ఎంపీపీ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకట్రాములు, నాయకులు నర్సప్ప, సత్యపాల్, మూతులరాజు తదితరులున్నారు. బొంరాస్‌పేట మండలంలో... బొంరాస్‌పేట: మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు ముందస్తు ప్రణాళికలతో గ్రామాల వారీగా కాంగ్రెస్ నాయకులను ఇళ్ల వద్ద నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చారు. అరెస్టు చేసిన నాయకులను బృందాలుగా విడదీసి దూరపు పోలీసుస్టేషన్లకు తరలించారు. మండల కాంగ్రెస్ నాయకులు వెంకట్రాములుగౌడ్, బుక్క కలీమ్, రాంచంద్రారెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, భీమయ్యగౌడ్, నర్సిములుగౌడ్, మేర్గు వెంకటయ్య తదితరులను జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసుస్టేషన్‌కు తరలించగా మరికొందరిని ఇతర ఠాణాలకు తరలించి సాయంత్రం వరకు ఉంచారు. యువజన నాయకులు అర్షద్ తదితరులు అరెస్టులను ఖండించారు. బేషరతుగా కాంగ్రెస్నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో విజయాన్ని ఆపలేరు... టీఆర్ఎస్ నాయకులు అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులపై అరెస్టులు చేసి నియంతృత్వ ధోరణిని చూపుతున్నారని మండల కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై అప్రజాస్వామికంగా చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. -
‘సీఎం సీటులో రేవంత్ కూడా ఉండొచ్చు’
సాక్షి, వికారాబాద్ : సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఈరోజు సీఎం సీటులో కేసీఆర్ ఉండొచ్చని, రేపు అదే సీటులో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చని అన్నారు. అర్థరాత్రి రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఆయన కుటుంబానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల ప్రచారానికి నేడు (బుధవారం) చివరి రోజు కావడంతో ఉదయమే ప్రచారానికి వెళ్లిన రేవంత్ కోసం ఆజాద్ గంటపాటు ఎదురుచూశారు. మంగళవారం కేసీఆర్ కోస్గి సభ ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ రేవంత్‌ను మంగళవారం అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
రేవంత్ రెడ్డి ఎక్కడ..?
సాక్షి, కొడంగల్: తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత డిమాండ్ చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని వాపోయారు. తీవ్రవాదని ఈడ్చుకెళ్లినట్టు బలవంతంగా లాక్కెల్లి వాహనంలో తీసుకుపోయారని, ఎక్కడి తరలిస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తామేమన్నా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడిగా ఆమె వర్ణించారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. (రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్) వికారాబాద్ జిల్లాలోని కోస్గిలో కేసీఆర్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ జడ్చర్ల పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (కొడంగల్‌లో ఉద్రిక్తత...!) -
రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్
సాక్షి, కొడంగల్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈసీ ఆదేశాలతో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నేడు కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ దృష్య్టా రేవంత్ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రేవంత్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది. అర్ధరాత్రి తొలుత రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత తెల్లవారుజామున ఇంటి తలపులు పగులగొట్టి అరెస్ట్ చేశారు. రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని, ప్రధాన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం రేవంత్‌ను జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది. కోస్గి, కొడంగల్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించడంతో పాటు భారీగా బలగాలను మోహరించారు. రేవంత్ అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాగా, పోలీసుల తీరుపై రేవంత్ భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్యాయానికి పరాకాష్ట అని అన్నారు. పోలీసులు తలుపు విరగగొట్టి ఇంటి లోపలకి వచ్చినట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోమని ఆమె పేర్కొన్నారు. -
మాతో పెట్టుకున్న వారెవ్వరూ బతికి బట్టకట్టలేదు
కొడంగల్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొడంగల్ ప్రజల పౌరుషాన్ని రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాక్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్‌లో విలేకరులతో మాట్లాడారు. మాతో పెట్టుకున్న వారెవరూ బతికి బట్టకట్టలేదని అన్నారు. రాజకీయంలో మాతో గోక్కున్న గుర్నాథ్ రెడ్డి కాలగర్భంలో కలిసి పోయారని తెలిపారు. గుర్నాథ్ రెడ్డి కాలం బాగా లేక అట్లున్నాడు కానీ కేసీఆర్ కంటే గుర్నాథ్ రెడ్డి ఎన్నో రెట్లు మేలు, నిజాయతీపరుడు కూడా అని అన్నారు. కేసీఆర్‌ని సింహం..సింహం సింగిల్‌గా వస్తుందని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ సింహం కాదు గుంట నక్క..గుంట నక్క కూడా సింగిల్‌గా వస్తుందని ఎద్దేవా చేశారు. కొడంగల్ ప్రజల వల్లే తానింత పెద్ద నాయకుడిగా ఎదిగానని, తాను కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను అని అన్నారు. ఆ మొక్క ఈ రోజు పెద్దదై చెట్టుగా కాయలు కాయడానికి వస్తోందని, కాయలు ఇచ్చే సమయానికి చెట్టునే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని కొడంగల్ ప్రజలు ఆ చెట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. తన అనుచరులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్గిగా బుద్ధి చెప్పాలని కొడంగల్ ప్రజలను రేవంత్ కోరారు. -
మాతో పెట్టుకున్న వారెవ్వరూ బతికి బట్టకట్టలేదు
-
4+4 సెక్యూరిటీని స్వీకరించిన రేవంత్‌రెడ్డి
సాక్షి, కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి 4పస్ల్4 గన్‌మెన్ సెక్యూరిటీని పోలీసుశాఖ కల్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెండు ఎస్కార్ట్ వాహనాలతో భద్రతా సిబ్బందిని పోలీసుశాఖ సమకూర్చింది. 4ప్లస్4 సెక్యూరిటీని రేవంత్‌రెడ్డి స్వీకరించారు. ఎన్నికల ఫలితాల వరకు ఆయనకు ఈ సెక్యూరిటీ ఉంటుంది. రేవంత్‌రెడ్డి భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనకు 4+4 భద్రత కల్పించాలని, 24 గంటల ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రత వల్ల తన కదలికలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పెద్దలకు ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై ఆయన ఏదైనా ఫిర్యాదు ఇస్తే దానిపై విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో 4+4 భద్రతను కల్పించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక భౌతికంగా తనను అడ్డుతొలగించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పరిపాలనా వైఫల్యాలు, నిర్ణయాల్లో లోపాలు, టెండర్లలో అవినీతి, అక్రమాలు, అక్రమ భూ కేటాయింపులు, కుటుంబ పాలన, రాచరిక పోకడలు, పాలనలో నిర్ణయాలను ప్రశ్నిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకే తనను అడ్డుతొలగించుకోవాలని సీఎం కుటిల పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. -
జీపీలకు పక్కా భవనాలు కరువు
సాక్షి, కొడంగల్: భారత జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితమైంది. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. మంజూరైన భవన నిర్మాణాలు నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. గ్రామ సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులను, ఉద్యోగులను నియమించకపోవడం వల్ల పరిపాలన సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చిన్న జిల్లాలు, మండలాల వల్ల అధికారులు ప్రజలకు దగ్గరైనా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదారు గ్రామాలకు ఒక్క పంపచాయతీ కార్యదర్శిని నియమించడంతో ఏ గ్రామానికి న్యాయం చేయని పరిస్థితి నెలకొంది. గ్రామ పాలన.. కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్‌లో జిల్లాలో కలిశాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. కొత్త పంచాయతీల సంగతి దేవుడెరుగు. పాత పంచాయతీలకే ఉద్యోగులు, సిబ్బంది నియామకం జరగలేదు. గత పంచాయతీల ప్రకారం కొడంగల్ మండలంలో 20, దౌల్తాబాద్‌లో 20, బొంరాస్‌పేటలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పలు పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. పక్కా భవనాలు లేకపోవడం వల్ల గ్రామానికి సంబంధించిన రికార్డులకు భద్రత కరువైంది.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. గ్రామాభివృద్ధిఅస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్యం లోపించింది. నియోజకవర్గంలో .. కొడంగల్‌ల మండలంలో 20 గ్రామపంచాయతీలకు గానూ 8 గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవు. మండలంలో రుద్రారం, ఇందనూర్, అప్పాయిపల్లి, నాగారం గ్రామాలలో పంచాయతీ భవనాలు లేవు. రావులపల్లిలో జీపీ భవనం శిథిలావస్థకు చేరింది. లక్షీపల్లిలో భవనం ఉన్నా వినియోగంలో లేదు. అంగడిరాయచూర్ గ్రామంలో జీపీ భవనం నిర్మాణం పూర్తి కాలేదు. బొంరాస్‌పేట మండలంలో ఎనికెపల్లి, మహంతీపూర్, హంసాన్పల్లి, కొత్తూరు గ్రామాలకు భవనాలు లేవు. దౌల్తాబాద్ మండలంలో 20 గ్రామాలకు గానూ 9 గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేవు. -
నన్ను చంపేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినా భద్రత కల్పించకుండా కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తీరా కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్, నర్సంపేట ఎన్నికల సభల్లో పాల్గొని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రేవంత్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి నివసిస్తున్న ఇంట్లో ఐటీ అధికారులు రూ.17.51 కోట్లు స్వాధీనం చేసుకుంటే ఎన్నికల కమిషన్ కేవలం రూ.51 లక్షలు మాత్రమే పట్టుబడినట్టు చెప్పడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఆ లెక్కలన్నీ ఉన్నా..: కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చయినా గెలవాలని భావించిన పట్నం బ్రదర్స్ నిజ స్వరూపం బయటపడిందని రేవంత్ అన్నారు. ఐటీ అధికారుల సోదాలో పోలీసులకు, పార్టీలు మారిన నేతలకు ఎంతెంత వెచ్చించారో రాసుకున్న లెక్కలన్నీ ఉన్నాయని, అది బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ఎన్నికల కమిషన్, ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు టీఆర్ఎస్ మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. తమిళనాడులోని ఆర్కేనగర్ తరహాలో కొడంగల్‌లో కూడా ఎన్నిక వాయిదా వేయించడానికి టీఆర్ఎస్ నేతలు కుట్రలకు తెరలేపారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావుతో పాటు మరికొంత మంది పోలీస్ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సంబంధిత అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. -
నరేందర్ రెడ్డికి ఎన్నికల కమీషన్ నోటీసులు
కొడంగల్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు జారీ చేసింది. సోదాల్లో దొరికిన రూ.50 లక్షల నగదుకు వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. నరేందర్ రెడ్డి బంధువుకు చెందిన ఫాంహౌస్‌లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.50 లక్షల నగదు దొరికిన సంగతి తెల్సిందే. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో సోదాలు జరిగాయని, రూ.17.51 కోట్ల ధనం దొరికిందని కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించిన సంగతి తెల్సిందే. కేసు రూపుమాపే విధంగా టీఆర్ఎస్ నాయకులు ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. -
నారాయణపేట – కొడంగల్‌కు నీళ్లు వచ్చేనా?
సాక్షి, కొడంగల్: పక్కనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. నారాయణపేట – కొడంగల్ ప్రాంతానికి మాత్రం సాగునీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణ వస్తే చాలునని ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్నా. కృష్ణా జలాలు పొలాలను తడుపుతాయని పూణె, బొంబాయి పోయే బాధ తప్పదని ఆశపడ్డా. నిజానికి కృష్ణానది కొడంగల్ ప్రాంతానికి పెద్ద దూరమేమీ లేదు. ఇక్కడ పడే ప్రతీ బొట్టు అక్కడే కలుస్తది. అదే కృష్ణమ్మ కర్ణాటక నుంచి నీళ్లు మోసుకొస్తది. కింద పడ్డ నీళ్లూ తక్కువే. ఆ వచ్చేటటువంటి వరదను జూరాల వద్ద నుంచే మళ్లించి కింద నారాయణపేట నుంచి ఒక్కో చెరువును నింపుకుంటూ వచ్చి మన దగ్గర ఉన్న చెరువులను నింపుకుంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటది. కొడంగల్ ప్రాంతమంతా దారి పొడవునా అన్ని పొలాలు బీడువారి పోయి కనిపించాయి. అందుకే ప్రజలు వలసపోయి బతుకుతున్నరు. కొడంగల్‌లో ఇళ్లన్నీ తాళాలే పడి ఉంటాయి. కొడంగల్ – నారాయణపేటలో ఏ ఊరికి వెళ్లినా అదే పరిస్థితి. కానీ ఈ నాలుగేళ్లలో నీళ్లు మాత్రం రాలేదు. వస్తయనుకున్న నీళ్లు ఆశ చూపుతున్నాయే కానీ వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ మాత్రం నీళ్లు కింద జారిపోయిన తర్వాత అక్కడ కింద శ్రీశైలం నుంచి చుట్టూ తిప్పి, తిప్పి అప్పుడు కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తనంటడు. సక్కగ వచ్చే వరదను వదిలిపెట్టి చుట్టూ తిప్పి తీసుకొస్తడంటే మనమేమైన నమ్ముతమా? చెవుల్లో పూలు పెట్టుకున్నమా? కింద నీళ్లు ఎక్కువ ఉంటయంట కదా అని స్థానికులను అడిగితే వరద ఎక్కడి నుంచి పోతుందో తెలియనంత అమాయకులము కాదు కదా అని అంటున్నరు. పక్కనున్న నీళ్లు రావు కానీ.. ఎక్కడెక్కడి నుంచో తిప్పి తీసుకొచ్చే నీళ్లు వస్తయా? అని అడుగుతున్నరు. చైతన్యం కలిగిన కొడంగల్ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతో మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలమూరు – రంగారెడ్డిని యథాతధంగా అమలు చేయాలని ఎన్నో ఆందోళనలు చేశాం. ఏ ఒక్క ఆందోళనకు ప్రభుత్వం స్పందించలేదు. దీనికంతటికీ కారణమేమిటంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాజెక్టుల డిజైన్లు మార్చిండ్రు కానీ మన బతుకులు మార్చడానికి ప్రాజెక్టులు కడతలేరని అర్థమైంది. ఇలాంటి ప్రభుత్వం ఉండడానికి వీలులేదని ఒక నిర్ణయానికి వచ్చాం. పరిపాలన చేసే నైతిక అధికారం లేనే లేదు. ఆయన ఎలాగూ నడమంత్రానే దిగిపోయిండు. మళ్లీ పిలిచి పట్టం కట్టాల్సిన అవసరం లేనే లేదు. – ప్రోఫెసర్ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు -
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై రూ.60 వేల అప్పు
సాక్షి, కొడంగల్ : తెలంగాణలో ప్రతి వ్యక్తిపై రూ.60 వేల అప్పు ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ఎస్ పాలనపై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసి భారీ బహిరంగసభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తు బంగారం అవుతుందని కలలు కన్నారని, కానీ కేసీఆర్ పాలనలో అవి నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని దుయ్యబట్టారు. రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, కానీ కేసీఆర్ పాలన వల్ల నేడు రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. కాంగ్రెస్ హయాంలోని ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేసిందని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిటనే రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లలో యువతకు కేసీఆర్ ఎన్ని ఉద్యోగాల ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. లోక్ సభ, రాజ్యసభల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అవసరం వచ్చినప్పుడల్లా కేసీఆర్ పూర్తిగా మద్దతిచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని... దాని పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ప్రతి బిల్లుకు మోదీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారని తాను టీఆర్ఎస్ ఎంపీలను అడిగానని... కేసీఆర్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని, అందుకే మద్దతు పలుకుతున్నామని తనతో వారు చెప్పారని రాహుల్ అన్నారు. మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతోందని... మీ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చబోతోందని రాహుల్ చెప్పారు. మీరు కలలుగన్న నీళ్లు, నిధులు, నియామకాలను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందన్నారు. -
కేసీఆర్ ప్రజల కలలను వమ్ము చేశారు
-
నాడు ఇందిరా.. నేడు రాహుల్: రేవంత్
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొడంగల్ గడ్డపై కాలుమోపడంతో ఈ గడ్డ పుణితమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నలభైఏళ్ల క్రితం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇక్కడ ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చాయని, ఇప్పుడు రాహుల్ పర్యటనతో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కొడంగల్ అంటే ఎవరికీ తెలియదని.. ఇప్పుడు కొడంగల్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా చేశానని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం పోరాడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 40 కేసులు పెట్టిందని ఆరోపించారు. తనకు ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌పై పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని.. దానికి మీరంతా సహకరించాలని రేవంత్ కోరారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ.. కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు భృతి, లక్ష ఉద్యోగాల హామీలను నెరవేరుస్తామని ఉత్తమ్ ప్రకటించారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, నిరుద్యోగులను మోసం చేశారని ఉత్తమ్ విమర్శించారు. గొంగళి పురుగునైనా హత్తుకుంటానన్నాడు.. కృష్ణ నది నీటికోసం కలలు కన్నామని.. జూరాల నుంచి నారాయణ పేట, కొడంగల్‌కు సాగునీరు వస్తుందని ఆశపడ్డామని కానీ అవేవీ జరగలేదని టీజేఎసీ ఛైర్మన్ కొదండరాం అన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నిండడం తప్ప రైతుల భూములకు నీళ్లు రాలేదని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు కమీషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహాకూటమిపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ గతంలో తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా హత్తుకుంటానన్న కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము కలిసినట్లు ఆయన వెల్లడించారు. -
అడ్డుకున్న వారే ఒక్కటయ్యారు..
సాక్షి, మద్దూరు (కొడంగల్):‘పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 1.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ భావించారు.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పథకాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు. ఇక కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా అడ్డుతగుతున్నారు.. ఇప్పుడు వీరిద్దరూ ఏకమై ఓట్ల అడగడానికి వస్తున్నారు.. జాగ్రత్తా! మన బతుకలను ఆగం చేసే కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమి కొట్టండి..’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 14 ఏళ్ల సుదీర్ఘపోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వకపోయినా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ తదితర పథకాలను పెట్టారని వివరించారు. గతంలో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గతంలో పాలమూరును దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలుసునని కేటీఆర్ అన్నారు. అయినా మళ్లీ మాయమాటలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని జిల్లాలోని రెండు స్థానాల్లో బరిలోకి దిగారని విమర్శించారు. ఇక్కడి ప్రజల బతుకులను ఆగం చేసిన చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను ఓడించడానికి మహాకుటమిని ఏర్పాటుచేసుకున్న వారి సీట్ల కుంపటే ఇంకా ముగియలేదని ఎద్దేవా చేశారు. నామినేషన్ల పూర్తయినా వారి పంచాయతీ మాత్రం తెగడం లేదని.. ఆ పంచాయతీ తెగేలోగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, తాము అధికారంలోకి ఉన్న నాలుగేళ్లలో 87వేల ప్రభుత్వా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 38 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది వాస్తవం కాదా, రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 700 గురుకులాలు ఏర్పాటుచేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక తొమ్మిదేళ్ల పాటు రేవంత్‌రెడ్డికి అధికారం ఇచ్చిన కొడంగల్ ప్రజలు.. ఒక్కసారి పట్నం నరేందర్‌రెడ్డి గెలిపించి కారులో అసెంబ్లీకి పంపించాలని కోరారు. అలా చేస్తే కొడంగల్‌ను దత్తత తీసుకుని ఐదేళ్లలో సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో పాటు నరేందర్‌రెడ్డి అండగా ఉండి ఇన్నేళ్లు వివక్షకు గురైన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు మేలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి సంక్షేమానికి రూ.42 వేల కోట్లు ఖర్చు చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటేనని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ఉద్యమించితెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశవపెట్టిన రైతుబంధు, రైతు భీమా పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయం తెలిసిందే అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కేసీఆర్ పథకాలపై చర్చ జరుగుతుందన్నారు. డిసెంబర్ 7న కారు గుర్తుకు ఓట్లు వేసి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఈ ప్రాంతానికి జూరాల ద్వారా నీళ్లు ఇవ్వాలని కోయిలకొండ రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తే ఇదే మండలంలోని బావాజీ ఆలయం దగ్గర సమావేశం నిర్వహించి రిజర్వాయర్‌ను రాకుండా చేసింది రేవంత్‌రెడి అని ఆరోపించారు. కోయిలకొండలో రిజర్వాయర్ నిర్మాణం జరిగితే మద్దూరు మండలంలోని అన్ని బోర్లు రీచార్జ్ అయ్యేవన్నారు. ఇక్కడి ప్రజల కడుపు కొట్టి రూ.కోట్లు సంపాదించే రేవంత్‌రెడ్డిని ఓటు ద్వారా తరిమికొట్టాలని కోరారు. కొడంగల్ ఓటర్లు అమాయకులు కాదని.. తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి కేసీఆర్ ఆశీర్వాదంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాష్, ఎంపీపీ సంగీతశివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు సలీం, బాల్‌సింగ్‌నాయక్, జగదీశ్వర్‌రెడ్డి, వీరేష్‌గౌడ్, సతీష్‌ముదిరాజ్, పున్నంచంద్ లాహోటి, శివకుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతా
సాక్షి, వికారాబాద్: కొడంగల్‌లో టీఆర్ఎస్ను గెలి పిస్తే ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి రైతు ల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబందుల ప్రభుత్వం కావాలో.. ‘రైతు బంధు’ప్రభుత్వం కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. నాణ్యమైన కరెంటు పగటి పూట ఇవ్వాలని అడిగిన రైతులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోవద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమమని, మహాకూటమి గెలిస్తే సంక్షోభమని అన్నారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని, వారంతా కలిసి 60 నెలలు పాలిస్తారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అని, కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగల రా అంటూ ప్రశ్నించారు. జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వీరిలో రేవంత్‌రెడ్డి, డీకే.అరుణ, చిన్నారెడ్డిలున్నారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే టికెట్ల కోసం, బీ ఫాంలకోసం, చివరకు బాత్రూంకు వెళ్లాలన్నా అనుమతికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుం దని తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, పింఛన్‌కు అర్హత వయసు 57 ఏళ్లు, నిరుద్యోగ భృతి, రూ.లక్షలోపు రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన వేగవంతం, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలోని సీఎంలు నేర్చుకునేలా కేసీఆర్ పాలన ఉందని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి ‘మహా కూటమి’ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి రేవంత్ సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేతలమనిషైతే సవాల్‌ను స్వీకరించాలన్నారు. టీవీల ముందు కూర్చుని మాటలు చెప్పి, పోజులు కొడితే పనులు కావని, అభివృద్ధి కావాలంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. మహాకూటమి గెలిస్తే మన జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి పాలమూరు నీరు రాకుండా 30 ఉత్తరాలు రాసిన బాబును మనం గెలిపిద్దామా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిడితే పెద్దవాళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే నరేందర్రెడ్డిపై గెలిచి చూపించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, హైదరాబాద్ మేయర్ దొంతు రామ్మోహన్, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ పాల్గొన్నారు. బుధవారం కొడంగల్ రోడ్‌షోకు భారీగా హాజరైన జనం -
సనత్‌నగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా..
సాక్షి, హైదరాబాద్ : నామినేషన్లకు సోమవారం చివరిరోజు కావడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జోరుగా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ సహా పలు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21, 22 తేదిలలో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 7 ఎన్నికలు నిర్వహించి.. 11వ తేదిన ఫలితాలను ప్రకటిస్తారు. సనత్‌నగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా.. సనత్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిమంది టీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చిన తలసాని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనత్‌నగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా: షాదనగర్లో మహాకూటమి ( కాంగ్రెస్ ) అభ్యర్థిగా చౌలపల్లి ప్రతాపరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా అనుషారెడ్డి, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా: తాండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ తిరుగుబాటు నేత నారాయణరావు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసి వస్తూ పరస్పరం ఎదురుపడటంతో ఆల్ ది బెస్ట్ చెప్పుకున్న మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి.. నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందురు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నామినేషన్.. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని ఆర్వో కార్యాలయంలో కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. పెద్దగా హడావిడి లేకుండా ఆయన ఒక్కరే వెళ్లి రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు నామపత్రాలు సమర్పించారు. భట్టి నామినేషన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్స్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో మధిర తహసీల్దార్ కార్యాలయంలో భట్టి విక్రమార్క తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. భట్టి మొత్తం మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కోడంగల్‌లో ఉద్రిక్తత.. నామినేషన్ల చివరి రోజైన సోమవారం కోడంగల్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కోడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. ఎలాగైనా ర్యాలీని నిర్వహించి తీరుతామని రేవంత్ వర్గం స్పష్టం చేసింది. ఇప్పటికే కోడంగల్‌లో భారీగా పోలీసులు మెహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను విధించారు. తలసాని సెంటిమెంట్.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ రోజు తన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసే మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి తల్లి లలితాబాయి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి నామినేషన్ సమయంలో తల్లి ఆశీర్వచనాలు తీసుకోవడం తలసాని సెంటిమెంట్. ఆ తర్వాత మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు 11.30 గంటలకు మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. భట్టి నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తదితరులు ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పోదెం. వీరయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. మహా కూటమి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ) సత్తుపల్లిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు మహేంద్రహిల్స్ నివాసం నుంచి భారీ ర్యాలీగా తరలి వచ్చి, మధ్యాహ్నం12 నుంచి 1 గంట మధ్యన సికింద్రాబాద్ లో బోర్డ్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న సర్వే సత్యనారాయణ. ధర్మపురిలో మహాకూటమి అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా కన్నం ఆంజయ్య, బిఎల్ఎఫ్ అభ్యర్థిగా మద్దెల రవీందర్, న్యూ ఇండియా తరుపున నరేష్ నామినేషన్ దాఖలు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి వారి వారి నియోజకర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. -
కొడంగల్ నుంచి రాష్ట్రాన్ని పాలించకూడదా?
మద్దూరు (కొడంగల్): సిద్దిపేట నుంచి రాష్ట్రాన్ని పాలించొచ్చు కానీ కొడంగల్ నుంచి పాలించకూడదా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చింతమడక చిట్టాకు, కొడంగల్ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయే తప్ప.. తాండూరు సంతలో పట్టుకొచ్చిన పట్నం సోదరులకు కాదని స్పష్టం చేశారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గ పరిధి లోని మద్దూరుతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు కేసీఆర్ తన ప్రసంగాలతో 1200 మందిని బలి తీసుకున్నారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం నుంచి కాని, అయన సామాజిక వర్గం నుంచి కానీ ఒక్కరైనా అత్మబలిదానం చేశారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు ఐదు సార్లు గుర్నాథ్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన కొడంగల్ పౌరుషాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టార న్నారు. తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని,ఆ డబ్బంతా వృథా అయినట్లేనని.. కొడంగల్ ప్రజలు తన వెంటే ఉన్నారన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌లోకి డిసెంబర్ 7 లోపు టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో బుధవారం ఆయన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. -
‘కాంగ్రెస్‌లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు’
సాక్షి, వికారాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది కాబట్టి కేసీఆర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారని, చేతనైతే వారిని ఆపాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాల్ చేశారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారన్న రేవంత్.. పట్నం సోదరులు తనను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. తాను ఏనాడు కొడంగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని, అందుకే ఈసారి కూడా కచ్చితంగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొడంగల్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులైన 15మంది ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉండగా.. కుటుంబ సభ్యులు తిరుపతిలో ఉండటంతో ఆయా చోట్ల అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి దాడులు చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన పలు కంపెనీ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. లెక్కా పత్రం లేని అక్రమ ఆర్థిక లావాదేవీలపై వారు ఫోకస్ చేసినట్టు సమాచారం. గతవారం ఈడీ, ఇన్‌కంట్యాక్స్, సీబీఐలతో తనపై కక్ష సాధింపునకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు చేయిస్తున్నారని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్‌తోపాటు డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావులే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈడీ దాడులు జరగటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవలే ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయి.. గతంలో రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ముద్దాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఆడియో టేపు(బ్రీఫ్డ్ మీ) బహర్గతం అయింది. అయితే గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: నన్ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ కుట్ర రేవంత్‌రెడ్డికి నోటీసులు -
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది చంద్రబాబు
-
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 29న మహాధర్నా
కొడంగల్ రూరల్ : డిగ్రీ కళాశాలకు గదులు కేటాయించాలంటూ ఈ నెల 29వ తేదీన మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మలి బాల్‌రాజ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఆగస్టు 11వ తేదీన డిగ్రీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ కొరకు గదులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నిరసన తెలపడానికి సన్నద్ధం కావడంతో సీఐ హామీ మేరకు నిరసనను విరమించామని ఆయన అన్నారు. సమయం గడిచిపోతున్నా డిగ్రీ విద్యార్థుల చదువులు సాగకపోవడంతో ఇబ్బందిగా మారిందని అన్నారు. ఈ విషయంపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల పార్టీల అధ్యక్షులు మరియమ్మ, కోళ్ల యాదయ్యల ఆధ్వర్యంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఈ నెల 29వ తేదీన మండల కేంద్రంలో మహాధర్నాను నిర్వహించడానికి వారు అంగీకారం తెలిపారని తమ్మలి బాల్‌రాజ్ తెలిపారు. గత పదేళ్లుగా డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు జూనియర్ కళాశాల భవనంలో వంతుల మాదిరి ఉదయం, మధ్యాహ్నం తరగతులను నిర్వహిస్తుండగా, ఈ ఏడాది మాత్రమే డిగ్రీ విద్యార్థులకు గదులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవనం త్వరితగతిన పూర్తి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత కాంట్రాక్టర్ జాప్యం చేస్తుండడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. గతంలో మాదిరిగానే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో 29వ తేదీన మహాధర్నాను కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. మహాధర్నాకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కారమయ్యేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
బలరాముడికి మరో ఆహ్వానం
కొడంగల్ రూరల్ వికారాబాద్ : ఇటీవల మార్చి 18వ తేదీన ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సాధించిన బలరాం రాథోడ్‌కు ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీన రష్యా దేశంలోని అతి ఎత్తైన ఎల్బ్రుస్ పర్వతం అధిరోహించడానికి ఆహ్వానం అందిందని బలరాం రాథోడ్ తెలిపారు. బొంరాస్‌పేట మండలం చిల్ముల్ మైలారం అనుబంధ గ్రామం సత్తార్కుంట తాండాకు చెందిన బలరాం రాథోడ్ 2017 నవంబర్ 16 నుండి డిశంబర్ 5వ తేదీ వరకు హిమాలయ మౌంటెన్ డార్జిలింగ్‌లో సముద్ర మట్టం నుండి 16,600 అడుగుల ఎత్తులోని రేణాక్ పర్వతం అధిరోహించి ‘ఏ’ గ్రేడ్ సర్టిఫెట్ అందుకున్నాడు. డిగ్రీ బీఎస్సీ (బీజెడ్సీ) పూర్తి చేసుకున్న బలరాం రాథోడ్ గతంలో రన్నింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ‘ఏ’ (ఆల్ఫా) గ్రేడ్ సర్టిఫికెట్ పొందిన బలరాం రాథోడ్ ప్రపంచంలోని ఏ పర్వతమైనా అధిరోహించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్చి 18వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆగస్టు 8వ తేదీ నుండి రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన భువనగిరిలో రాక్ క్లైంబింగ్ సెలక్షన్స్ నిర్వహించారని అందులో తనతోపాటు మరో 5 మందిని సెలక్ట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం భవనగిరిలో కోచ్ మాస్టర్ శేఖర్, మాస్టర్ పరమేష్కుమార్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటూ కొత్త వారికి శిక్షణ అందిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు రూ.4 లక్షలకుపైగా ఖర్చు చేసుకుంటూ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించానని, ప్రస్తుతం దాతలు సహాయం చేసి రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాన్ని అధిరోహించేందుకు తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు రూప్లానాయక్ మేస్త్రీ పనులు చేసుకుంటూ అన్న రమేష్ రాథోడ్ ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ తనను ప్రోత్సహిస్తున్నారని, ఎల్బ్రుస్ పర్వతాన్ని ఎక్కడానికి దాతలు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని బలరాం రాథోడ్ కోరుతున్నారు. -
తప్పిన ముప్పు
కొడంగల్ ( వికారాబాద్) : పట్టణంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవనం కూలిపోయింది. 150 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గదుల కొరత ఉంది. భవనం కూలిపోయిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
యువకుడి దారుణ హత్య
కోస్గి (కొడంగల్) : జీవనోపాధి కోసం ఓ ఎన్జీఓలో పని చేస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువకుడు బుధవార ం పట్టణ శివారులో దారుణ హత్యకు గురయ్యా డు. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన రాము(35) వాసన్ స్వచ్ఛంద సంస్థలో గత నాలుగేళ్లుగా కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించిన రైతు సంఘాలకు కోఆర్గినేటర్గా పనిచేస్తున్నాడు. కోస్గిలో భార్యాపిల్లలతో అద్దెకు నివాసం ఉంటూ విధులు నిర్వహించేవాడు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం పాతర్లగడ్డ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కృష్ణయ్య ప్రాథమిక పంచనామా నిర్వహించారు. అక్కడ లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా రాముగా గుర్తించారు. అనంతరం పేట సీఐ రామకృష్ణ క్లూస్‌టీంతో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రస్తుతానికి రాముతోపాటు సంస్థలో పనిచేస్తున్న రాఘవేందర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా పట్టపగలు ఓ యువకుడు దారుణ హత్యకు గురి కావడంతో పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. -
పిలిస్తే పలికే దైవం 108
గతేడాది డిసెంబర్ 1వ తేదీన రుద్రారం పంచాయతీ బోయపల్లితండాకు చెందిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతోంది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడుకు చేరుకుని వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో నొప్పులు తీవ్రం కావడంతో వాహనంలోనే ఆమెకు పురుడు పోశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బాబుకు ఊపిరి ఆడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. క్షణాల్లో స్పందించిన సిబ్బంది చిన్నారికి చికిత్సలు చేసి ఆక్సిజన్ అందించారు. దీంతో బాబు కెవ్వుమని ఏడ్చాడు.. అందరి కళ్లూ ఆనందంతో చెమర్చాయి. కొడంగల్ రూరల్ : ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో క్షతగాత్రుల వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించి, సకాలంలో హాస్పిటల్‌కు తరలిస్తున్న 108 వాహనాలు ప్రజల గుండెల్లో.. పిలిస్తే పలికే దైవంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆపదలో వారికి మేమున్నామంటూ తరలివస్తున్న 108 సిబ్బంది ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు. ఇందులో పని చేస్తున్న సిబ్బంది అంకితభావంతోనే ఇది సాధ్యమవుతోంది. అత్యవసర చికిత్స విభాగంలో పనిచేయడం తమకు భగవంతుడు అందించిన వరంగా భావిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా.. మెరుపు వేగంతో స్పందిస్తున్న వీరి సేవలు అనిర్వచనీయం. గతంలో అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. దీనికి తోడు వాహనాలు కూడా అతి తక్కువే. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే వాహనాలు ఉన్నవారిని బతిమాలి, ఒక్కో దశలో వారు అడిగినన్ని డబ్బులు ఇచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకంతో పేద ప్రజలకు ఈ బాధలు తప్పాయి. ఒక్క ఫోన్ కాల్‌తో వచ్చి వాలుతున్న 108 సిబ్బంది వాయువేగంతో అత్యవసర సేవలు అందిస్తున్నారు. సంఘటన స్థలంలో ప్రథమ చికిత్స చేసి బాధితులు, క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. కొడంగల్ అంబులెన్స్‌లో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఎమర్జెన్సీ టెక్నీషియన్లు(ఈఎంటీ)లు విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 జనవరి నుంచి 2018 ఏప్రిల్ వరకు 1,414 మంది బాధితులకు రక్షణ కవచంలా నిలిచారు. వీరిలో 606 గర్భిణులు, 158 మంది రోడ్డు ప్రమాద బాధితులు, 102 మంది ఆత్మహత్యా యత్నం చేసిన వారు, 32 పాము కాటుకు గురైనవారు, వివిధ ప్రమాదాలకు గురైన 516 మందిని ఆస్పత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు, రోడ్డు ప్రమాదాలు, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన వారు. అనారోగ్యానికి గురైన వృద్ధులు, గాయాలకు గురైన వారు గుండె నొప్పితో బాధపడే వారెందరికో పునర్జన్మను పొందారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యం, డెలివరి కిట్‌తో పాటు పురుగుల మందు తాగిన వారిని కాపాడేందుకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి సపోర్టుగా పెట్టేందుకు అధునాతన సామగ్రి ఉంటుంది. ప్రసవ వేదనతో బాధపడే ఎంతో మందికి వాహనంలోనే పురుడు పోసిన సందర్భాలున్నాయి. -
మనకూ ఉంది..ఓ మహానంది
సాక్షి, కొడంగల్ : ఆలయం చిన్నదైనా కర్నూలు జిల్లా మహానందిలో మాదిరి మన జిల్లాలో ఒకటి అలాంటి ఆలయం ఉంది. నిరంతరం జలధార నంది నోటి నుంచి వస్తూ పరమేశ్వరుడికి జలాభిషేకం చేస్తున్న దృశ్యం కొడంగల్ మండలం కస్తూరుపల్లి గ్రామ సమీపంలో కనిపిస్తోంది. కస్తూరుపల్లి అటవీప్రాంతంలో కొలువైన లొంక బసవేశ్వర ఆలయంలో ఆ దృశ్యం కనిపిస్తుంది. కొడంగల్ మండలంలోని కస్తూరుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో లొంక బసవేశ్వర ఆలయం ఉంది. నంది నోటిలోంచి గలగలా పారుతూ గంగమ్మ సందడి చేస్తుంటుంది. మహానందిలో నంది నోటినుంచి నీరు ఎలా వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తోంది. లొంక బసవేశ్వర ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో హాజరై పూజలు చేస్తుంటారు. బసవేశ్వర ఆలయ సమీపంలోకి ఎవరైనా భక్తి, నిష్టతో వెళ్లకపోతే ఆ నీరు ఆగిపోతుందని అక్కడి వారి నమ్మకం. మహిమాన్విత ఆలయంగా లొంక బసవేశ్వర ఆలయం గుర్తింపు పొందుతోంది. అయితే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. -
కొడంగల్‌లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
వికారాబాద్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 1000 కి.మీ పూర్తి చేసుకుంటున్న సందర్భం రేపు(సోమవారం) కొడంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బoడెమ్మా దేవాలయo నుంచి శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వేర దేవాలయం వరకూ వైసీపీ నాయకులు ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు గట్టు శ్రీకాoత్ రెడ్డితో పాటు కొడంగల్ ఇంచార్జ్ తమ్మలి బాల్ రాజ్, ఇతర రాష్ట్రనాయకులు, కార్యకర్తలు పాల్గోనున్నారు. -
కోస్గిలో బస్ డిపో
సాక్షి, ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న కోస్గి బస్‌డిపో విషయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దాదాపు ఆరేళ్లుగా ఊరిస్తున్న బస్‌డిపో అంశంపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ బస్ డిపోకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. మంగళవారం సీఎం కేసీఆర్‌ను కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే సీఎం కోస్గి పోలీస్ సర్కిల్, ఫైర్‌స్టేషన్, దౌల్తాబాద్, బొంరాస్‌పేటలకు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అంగీకారం తెలిపారని తెలిసింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడనున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఎదురుచూపు కోస్గి బస్‌డిపో కోసం నియోజకవర్గ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఆరేళ్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా ప్రస్తుతం కూడా బస్‌డిపో చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి కొడంగల్ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన కోస్గిలో బస్‌డిపో ఏర్పాటు చేయాలనేది ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నిధుల నుంచి రూ.కోటి నిధులు కూడా మంజూరు చేయించారు. అలాగే ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక 2013లో 5ఎకరాల స్థలాన్ని కొని ప్రభుత్వానికి అందజేశారు. అందుకు అనుగుణంగా అప్పట్లో ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న ఎం.సత్యనారాయణ శిలాఫలకం కూడా వేశారు. తదనంతర పరిణామాలలో బస్‌డిపో విషయం మరుగున పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పలుమార్లు అసెంబ్లీతో పాటు పలు బహిరంగ వేధికల మీద ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. కొడంగల్ నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వీడి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా జరుగుతున్నాయి. అంతేకాదు తరచూ మంత్రులు పర్యటిస్తూ ప్రజల నుంచి వచ్చే డిమాండ్లకు ఎప్పటికప్పుడు పచ్చజెండా ఊపుతున్నారు. కేవలం 3నెలల వ్యవధిలో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులను చేపట్టారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచని వాటికి కూడా మోక్షం లభిస్తోంది. దీంతో తాజాగా రెండు వర్గాలు కూడా ఆ క్రెడిట్ తమ వల్లే అంటూ ఒకరికొకరు ఆదిపత్యం ప్రదర్శిస్తున్నారు. -
కొడంగల్‌లో రేవంత్ రాజకీయం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొడంగల్ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారి రసవత్తరంగా మారాయి. ఇప్పటికే సవాళ్లు, ప్రతిసవాళ్లు, మాటల తూటాలతో రక్తి కడుతున్న రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శల తూటాలు పేలుస్తున్న రేవంత్ లక్ష్యంగా గులాబీ పార్టీ అనేక వ్యూహాలను అమలు చేసింది. రేవంత్‌కు మద్దతుగా నిలిచిన నేతలందరినీ గులాబీ కండువా కప్పుకునేలా చేయడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అప్పటినుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రేవంత్.. కొడంగల్ రాజకీయ చిత్రంలో భీష్ముడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కుటుంబంపై దృష్టి సారించారు. గురునాథ్‌రెడ్డి అన్న కూతురు అనురెడ్డి అలియాస్ అనిత స్వయంగా రేవంత్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. దీంతో కథ అడ్డం తిరుగుతోందని భావించిన టీఆర్ఎస్ నష్టనివారణ చర్యలు చేపట్టగా.. స్వయం గా గురునాథ్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ను వీడేది లేదని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఉమ్మడి పాలమూరుపై దృష్టి సారించింది. జిల్లాలో సంస్థాగతం గా బలంగా ఉన్న కాంగ్రెస్‌లో రేవంత్ చేరడం ద్వారా ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించి రేవంత్ ను స్వంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పార్టీ బలహీ నం చేసేలా ఆయన అనుచరులు, పార్టీ ముఖ్యులందరినీ టీఆర్ఎస్లో చేర్చుకుంది. అలాగే, నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్లాది నిధులు వెచ్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. అలాగే వారం లో మూడు రోజుల పాటు వివిధ శాఖలకు చెందిన మం త్రులు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దీంతో నియోజకవర్గంలో రేవంత్ పట్టును తగ్గించి, తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది. సహనం కోల్పోయిన రేవంత్.. నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేపట్టిన ‘ఆపరేషన్’తో రేవంత్ సహనం కోల్పోయినట్లు రాజకీయవర్గాలు పే ర్కొంటున్నాయి. తన నుంచి వెళ్లిపోయిన నేతలు, మం త్రి లక్ష్మారెడ్డిపై దూషణల పర్వం కొనసాగించారు. అంతేకాదు మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గమైన జడ్చర్లలో విస్తృతంగా పర్యటించారు. అయితే, లక్ష్మారెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఏకంగా కొడంగల్ నియోజకవర్గంలో కురువృద్ధుడిగా పేరొందిన గురునాథ్‌రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి చీలిక తీసుకొచ్చారు. గురునాథ్‌రెడ్డి అన్న కూ తురు స్వయంగా రేవంత్‌ను కలిసి మద్దతు ప్రకటించ డం ఇందులో భాగమేనని చెబుతున్నారు. అంతేకాదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్‌రెడ్డి.. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వెనక చేతులు కట్టుకుని తిరుగుతున్నారంటూ ప్రచారానికి తెరలేపారు. తద్వారా గురున్నాథరెడ్డి అభిమానులను తనవైపుకు తిప్పుకునే చర్యలు చేపట్టారు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన టీఆర్ఎస్.. కథ అడ్డం తిరుగుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు గురునాథ్‌రెడ్డి నేరుగా టీఆర్ఎస్ను వీడేది లేదని బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గడిచిన ఎన్నికల్లో నామినేషన్ వేసే చివరి రెండు రోజుల వరకు టికెట్ కోసం వేచిచూసిన తనను మోసం చేసిన కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదన్నారు. అలాగే, మీడియా ముందుకు వచ్చిన అనిత తనకు కూతురు వరుస అవుతుందని తెలిపారు. 50ఏళ్ల క్రితం కుటుంబాలు విడిపోగా ఇప్పుడు తన కూతురునని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం తగదన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ పార్టీలో చేర్చుకోవడం.. ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. త న కుమారుడు ముద్దప్ప దేశ్‌ముఖ్ సర్పంచ్‌గా, ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారని, రాజకీయ భవిష్యత్ ఉన్న ఆయనకు టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాన ని తెలిపారు. అయితే నరేందర్‌రెడ్డికి టికెట్ ఇస్తారని ప్ర చారం జరుగుతుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, నాయకులు జయతీర్థాచారి, మొగులప్ప, రుద్రారం రాఘవేందర్, పార్వత్రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బలవంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజీనామా.. రచ్చరచ్చ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కొడంగల్ రాజకీయాలు మరింత రక్తి కడుతున్నాయి. టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో మొదలైన రాజకీయ వేడి రోజురోజుకు రగులుతోంది. ఇందులో ప్రధానంగా రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి చేసినట్లుగా చెబుతున్న రాజీనామా అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ ఇచ్చానని చెబుతుండగా.. అది ఇప్పటి వరకు స్పీకర్‌కు చేరకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. రేవంత్ ఇప్పటి వరకు రాజీనామా చేయలేదంటూ బాంబు పేల్చారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ నేతలు రాజీనామా విషయమై రేవంత్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. దమ్ముంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు నేరుగా అందజేయాలంటూ ప్రతీ వేదికపై సూచిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడలను రేవంత్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రేవంత్ కుటుంబీకుల సంబంధించి శుభకార్యాలు ఉన్నందున.. అవి పూర్తికాగానే జనం మధ్యకు వచ్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. స్పెషల్ ఫోకస్ కొరకరాని కొయ్యలా మారిన రేవంత్‌ను కట్టడి చేయడం కోసం టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారిచింది. ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి నిరంతరం నియోజకవర్గ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే, అధికార పార్టీ ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా రేవంత్ తగ్గడం లేదు. రెండు రోజుల క్రితం కోస్గిలో నిర్వహించిన సభలో దమ్ముంటే తనపై పోటీకి రావాలంటూ నేరుగా సీఎం కేసీఆర్‌కు సవాల్ విసరడమే కాకుండా కేటీఆర్, హరీశ్‌రావుపై కూడా మాటల తూటాలు పేల్చారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ మరో వ్యూహానికి పదును పెడుతోంది. రేవంత్‌ను ఎలాగైనా ఉపపోరులో దించాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రతీ మండలంలోని పార్టీ నేతలతో సమావేశాలు పెట్టిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయిస్తోంది. కదం తొక్కుతున్న రేవంత్ అధికార పార్టీ చేసే చర్యలకు అనుగుణంగా రేవంత్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జనం మధ్య సెంటిమెంట్ రగిల్చేందుకు కసరత్తు చేస్తున్నారు. తాను ఎక్కడ మాట్లాడినా పదే పదే కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ‘ఒకప్పుడు ఎవరికీ తెలియని కొడంగల్ పేరును ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశమంతా గుర్తుపడుతోంది. నేనెప్పుడు ఇక్కడి ప్రజలకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నించా.. శ్వాస ఉన్నంత వరకు ఇక్కడి నుంచే పోటీ చేస్తా. వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల, చంద్రబాబుకు కుప్పం మాదిరిగా ఎప్పడికి నాకు ఇదే నియోజకవర్గం శాశ్వతం’ అంటూ సెంటిమెంట్‌ను రగులుస్తున్నారు. అయితే, తన వెంట ఇన్నాళ్లు నిలిచిన వారందరినీ టీఆర్ఎస్ లాగేసుకుపోయిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో బీటలు వారిన పార్టీకి జవసత్వాలను నింపేందుకు కార్యాచరణ చేపట్టారు. ప్రతీ గ్రామంలో స్వయంగా తానే పర్యటించాలని నిర్ణయించారు. స్థానిక కార్యకర్తలతో మాటమంతి జరపడంతో పాటు పార్టీ మారిన వారిని సైతం తిరిగి చేర్చుకోవాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత అవసరమైతే ఉపపోరులో దిగి తన సత్తా నిరూపించుకోవాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా వ్యూహ ప్రతివ్యూహాలతో కొడంగల్ రాజకీయాలు రక్తి కడుతున్నాయి. -
కొడంగల్‌లో ‘పరకాల’ ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్ : కొడంగల్ అసెంబ్లీ నియో జకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైతే.. దీటుగా ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవలే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారే ముందే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ పేరున రాసి టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబుకు అందజేశారు. ఆ లేఖ ఇంకా శాసనసభ స్పీకర్‌కు అందలేదు. ఒకవేళ రాజీనామా లేఖ అంది, ఆమోదం పొందితే.. ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం పోరుకు ముందస్తుగానే సన్నద్ధమ వుతోంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీశ్‌రావుకే కొడంగల్ బాధ్యతలు కూడా అప్పగించింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. కొడంగల్‌కు ఉపఎన్నిక తప్పనిసరైతే హరీశ్‌రావు ఇన్చార్జిగా వ్యవహరి స్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొడంగల్ ఉప ఎన్నిక నుంచే శంఖారావం పూరిస్తామని టీఆర్ఎస్ నేతలు ఇటీవల చేసిన ప్రకటన ఉప ఎన్నికకు వారి సన్నద్ధతను స్పష్టం చేస్తోంది. పరకాల ప్రయోగం ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా పరకాల నియోజ కవర్గానికి జరిగిన ఉపఎన్నిక అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరఫున పోటీ పడ్డారు. ఆ ఎన్నికను సవాలుగా తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం.. హరీశ్‌కు బాధ్యతలు అప్పజెప్పి, తమ అభ్యర్థి మొలుగూరి భిక్షపతిని గెలిపించుకుంది. గ్రామస్థాయి మొదలు నియోజక వర్గం దాకా బాధ్యతల పంపకం, శ్రేణుల మోహరిం పు, ప్రచారంలో వినూత్న పోకడలతో టీఆర్ఎస్ పరకాల ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అదే తరహా ప్రణాళిక, వ్యూహాలనే ఇప్పుడు కొడంగల్ ఉప ఎన్నికలో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. గ్రామగ్రామాన సమస్యలను గుర్తిం చడం, ప్రజల తక్షణావసరాలు తీర్చడం ద్వారా వారిలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రామానికి ఒక ఎమ్మెల్యేను రంగంలోకి దింపాలని.. ఒక్కో మండలం బాధ్యతను ఒక మంత్రికి, పదిహేను గ్రామాలకో ఎంపీ స్థాయి నేత సేవలు ఉపయోగించుకోవాలని ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక గ్రామాల్లో కులాల వారీగా ఓటర్ల లెక్కలు తీసి.. ఆ కులానికే చెందిన మంత్రి లేదా, ఎమ్మెల్యేతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు కూడా.. నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు వినియోగించుకోవాలని అధికారపార్టీ నిర్ణయించింది. ఇప్పటికే మండలాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యుల ఫోన్ నంబర్లు, వివరాలను సేకరించారు. వారితో నేరుగా హరీశ్‌రావు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితిని అంచనా వేసేలా, తక్షణ నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధికి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డితో ఇప్పటికే పలుమార్లు హరీశ్ భేటీ అయ్యారని.. అందులో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ నుంచి వలసలు పెరిగాయని చెబుతున్నారు. -
‘దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి మీటింగ్ పెట్టు’
సాక్షి, మహబూబ్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే, నీవు తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్‌కు వచ్చి మీటింగ్ పెట్టు మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని.. కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కోస్గిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు. ఇప్పుడు తన మీద తాండూరులో చెల్లని రూపాయిని దింపి చెల్లిపిస్తాడని మాట్లాడుతున్నాడని కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు. నాడు డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.250 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం తీసుకొచ్చానని ఆయన చెప్పారు. 2007లో భీమా ప్రాజెక్టును తాము సాధించుకున్నామని, నేడు తమ మీద కక్షతో భీమా ప్రాజెక్టులు పూర్తి కాకుండా పక్కకు పెట్టారని రేవంత్ ఆరోపించారు. కొడంగల్ అభివృద్దిని అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీనేనని ఆయన అన్నారు. నందారం వెంకటయ్య చివరి కోరిక కోస్గిలో బస్ డిపో నిర్మాణమని.. ఇందుకోసం తాను.. తన సోదరుడి పేరుమీద 4 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించామని..40 నెలలైనా ఎందుకు బస్ డిపో నిర్మాణానికి టెండర్లు పిలవడం లేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ, కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పెంచేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. -
అసలు ఆట ఇప్పుడే మొదలైంది: రేవంత్
సాక్షి, కొడంగల్ : తాను రాజకీయాల్లో ఉన్నంతవరకూ కొడంగల్ నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందని ఆయన ఆదివారమిక్కడ వ్యాఖ్యానించారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా రేవంత్ రెడ్డి... నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునర్ ఏకీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. కొడంగల్ దొరల కోటలను కూల్చినట్లే రాష్ట్రంలో కేసీఆర్ కోటను కూల్చేస్తాం. కేసీఆర్‌ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యం. మద్దతు ధర అడిగితే ప్రభుత్వం.. రైతులకు బేడీలు వేస్తోంది. తెలంగాణలో దొరల పాలన అంతం కావాలి. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు...రేపు తాను చనిపోయినా తన సమాధి కూడా కొడంగల్‌లోనే ఉంటుంది. కొడంగల్ కార్యకర్తలే నా అధిష్టానం.. కొడంగల్ కార్యకర్తలే నా అధిష్టానం. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తా. నన్ను అభిమానిస్తున్న నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. కొడంగల్ సేవకుడిగా తనకు అవకాశం కల్పించారు. వ్యక్తిగత స్వార్థంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. టీడీపీని వీడటం బాధ అయినా, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కొడంగల్ ప్రజల ఆదేశాల మేరకే నడుచుకుంటా. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తా.’ అని తెలిపారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి భార్యతో కలిసి స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఒకే ఒక్కడు! ఒకప్పుడు కాంగ్రెస్సే ఆయన ప్రధాన ప్రత్యర్థి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రేవంత్ ప్రస్తుతం అదే పార్టీ గూటికి చేరే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశంలో కొనసాగుతూ...టీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కోలేనని భావించిన రేవంత్ ఊహించని మలుపుల మధ్య కాంగ్రెస్‌కు చేరువయ్యారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకెళ్లిన అనంతరం కేసీఆర్‌పై ఒంటికాలుపై లేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొనాలంటే కాంగ్రెస్సే సరైన వేదిక అని భావించారు. ఆ దిశగా గత రెండు నెలలుగా మేథోమధనం జరిపి చివరకు తొమ్మిదేళ్ల టీడీపీకి రాంరా చెప్పారు. కాగా కొడంగల్ టీడీపీకి కంచుకోట. పార్టీకి బలమైన నాయకత్వం లేనప్పటికీ సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. కష్టకాలంలోనూ శ్రేణులు వెన్నంటి నిలవడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురులేకుండా పోయింది. 2009లో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో అడుగు పెట్టడంతో పార్టీ మరింత బలపడింది. తాజాగా ఆయన రాజీనామాతో తెలుగు తమ్ముళ్లు డైలమాలో పడ్డారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వ్యూహాత్మక మౌనం పాటించిన ద్వితీయ శ్రేణి నాయకత్వం..తమ నేత నిర్ణయంతో ఆత్మరక్షణలో పడ్డారు. మరోవైపు రేవంత్‌రెడ్డి బాటలో పయనించే దిశగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలువురు నేతలు మంతనాలు జరుపుతున్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది