టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కొడంగల్ ప్రజల పౌరుషాన్ని రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాక్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్‌లో విలేకరులతో మాట్లాడారు. మాతో పెట్టుకున్న వారెవరూ బతికి బట్టకట్టలేదని అన్నారు. రాజకీయంలో మాతో గోక్కున్న గుర్నాథ్ రెడ్డి కాలగర్భంలో కలిసి పోయారని తెలిపారు.