
కొడంగల్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు జారీ చేసింది. సోదాల్లో దొరికిన రూ.50 లక్షల నగదుకు వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. నరేందర్ రెడ్డి బంధువుకు చెందిన ఫాంహౌస్‌లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.50 లక్షల నగదు దొరికిన సంగతి తెల్సిందే. కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇంట్లో సోదాలు జరిగాయని, రూ.17.51 కోట్ల ధనం దొరికిందని కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించిన సంగతి తెల్సిందే. కేసు రూపుమాపే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment