
సాక్షి, కొడంగల్: తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత డిమాండ్ చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని వాపోయారు. తీవ్రవాదని ఈడ్చుకెళ్లినట్టు బలవంతంగా లాక్కెల్లి వాహనంలో తీసుకుపోయారని, ఎక్కడి తరలిస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తామేమన్నా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడిగా ఆమె వర్ణించారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. (రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్)
వికారాబాద్ జిల్లాలోని కోస్గిలో కేసీఆర్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ జడ్చర్ల పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (కొడంగల్‌లో ఉద్రిక్తత...!)
Comments
Please login to add a commentAdd a comment