సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నం పెట్టే రైతన్న నోటికాడి బువ్వను గుంజేసుకుని వారు ప్రతిఘటిస్తే అర్ధరాత్రి అరెస్టు చేసి వారిని చిత్రహింసలు పెట్టడం అమానుషం అంటూ మండిపడ్డారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
ఏమిటీ అరాచకం?
తమ భూములు గుంజుకోవద్దన్నందుకు
16 మంది రైతులను అర్ధరాత్రి నిర్బంధించి
చిత్రహింసలు పెట్టిన రేవంత్ పోలీసులు.
అన్నం పెట్టే రైతన్న
నోటికాడి బువ్వను గుంజేసుకుని
వారు ప్రతిఘటిస్తే
అర్ధరాత్రి అరెస్టు చేసి
వారిని చిత్రహింసలు పెట్టడం అమానుషం.
కొడంగల్ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి
వారిని వెంటనే విడుదల చేయాలి.
కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం
భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాను! అంటూ వీడియోను షేర్ చేశారు.
ఏమిటీ అరాచకం?
తమ భూములు గుంజుకోవద్దన్నందుకు
16 మంది రైతులను అర్ధరాత్రి నిర్బంధించి
చిత్రహింసలు పెట్టిన రేవంత్ పోలీసులు.
అన్నం పెట్టే రైతన్న
నోటికాడి బువ్వను గుంజేసుకుని
వారు ప్రతిఘటిస్తే
అర్ధరాత్రి అరెస్టు చేసి
వారిని చిత్రహింసలు పెట్టడం అమానుషం.
కొడంగల్ రైతుల మీద పెట్టిన… https://t.co/0PblYOTpIX— KTR (@KTRBRS) November 12, 2024
Comments
Please login to add a commentAdd a comment