వికారాబాద్ ‘సీఎం’ అనుముల తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు!: కేటీఆర్‌ | BRS KTR Satirical Comments On Revanth Reddy Brother Tirupati Reddy | Sakshi
Sakshi News home page

వికారాబాద్ ‘సీఎం’ అనుముల తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు!: కేటీఆర్‌

Published Fri, Jan 10 2025 12:22 PM | Last Updated on Fri, Jan 10 2025 12:22 PM

BRS KTR Satirical Comments On Revanth Reddy Brother Tirupati Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(revanth reddy)పై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన సాగుతోందన్నారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి(రేవంత్‌ రెడ్డి సోదరుడు) గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు! అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, కేటీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupati Reddy) పోలీసులు సేవలు చేయడంపై బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌ స్పందించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి రాచమర్యాదలు చేయడంపై ట్విట్టర్‌ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందిస్తూ..‘రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన. అనుముల రాజ్యాంగం నడుస్తోంది అనడానికి ఇదే నిదర్శనం. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్. బూట్లు తీయించి, స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి చేసినట్టు పరేడ్ చేయించారు. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ! అంటూ మండిపడ్డింది.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ ట్విట్టర్‌లో..‘తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఒక్క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారు!. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో!. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు!. సీఎం రేవంత్ రెడ్డి గారు నాది ఒక చిన్న విన్నపం! ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను!. IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఇక, తిరుపతి రెడ్డికి మర్యాదలు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement