tirupati reddy
-
కొడుకును బావిలో పడేసి.. ఆపై పురుగు మందు తాగి..
ఎలిగేడు: కుటుంబంలో ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కొడుకు(17 నెలలు)ను బావిలో పడేసి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాలుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి, మానస దంపతులు. వీరికి దేవాన్ష్ (17 నెలలు) సంతానం. తిరుపతిరెడ్డి, అతడి సోదరుడు రత్నాకర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో ఆస్తి పంచుకున్నారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి భార్య, కుమారుడితో కలిసి సుల్తానాబాద్‌లోని ఓ అద్దింట్లో నివాసం ఉంటున్నాడు. ఆస్తి పంపకాల విషయమై చంపుతామని తరచూ కొందరు బెదిరిస్తున్నారని భార్యతో చెప్పుకుని తిరుపతిరెడ్డి బాధపడేవాడు. ఈ క్రమంలో రాములపల్లిలో ఉంటున్న తల్లిదండ్రులకు తన కుమారుడిని చూపించి తీసుకొస్తానని భార్యతో చెప్పి బయల్దేరాడు. అయితే ఎంతకూ తిరిగి రాకపోవడంతో భర్తకు మానస ఫోన్ చేయగా సమాధానం రాలేదు. వెంటనే అత్తామామలకు ఫోన్ చేయగా రాములపల్లికి రాలేదని వారు చెప్పారు. అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి అపస్మారకస్థితిలో కనిపించాడు. బావిలో బాలుడి చెప్పులు కన్పించాయి. తిరుపతిరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్త తేరుకున్నాక దేవాన్ష్ గురించి అడుగగా తానే బావిలో పడేసి గడ్డిమందు తాగానని చెప్పాడు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ జగదీశ్, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ బావి వద్దకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో దేవాన్ష్ మృతదేహాన్ని బయటకు తీయించారు. మానస ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది
పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్ హిల్స్, హైటెన్షన్ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వినర్ ఆర్.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి
కుత్బుల్లాపూర్/బచ్చన్నపేట/అల్వాల్: బెదిరింపు కాల్స్ వచ్చింనందునే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి తెలిపారు. భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనను కిడ్నాప్ చేసి చంపాలని యత్నించారని, ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఆరురోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నాటకీయ పరిణామాల మధ్య పేట్‌బ షీరాబాద్ సమీపంలోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. తనకు ఎదురైన సమస్యలను మేడ్చల్ డీసీపీ సందీప్ గోనె, పేట్బషీ రాబాద్ ఏసీపీ రామలింగరాజులకు వివరించారు. అనంతరం డీసీపీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే ఒత్తిడితో తనకు సాయంచేయడానికి ముందుకురాలేదని చెప్పారు. కేసు రిజిస్టర్ చేయకుండా అల్వాల్ ఎస్హెచ్ఓ గంగాధర్ సమయం వృథా చేశారని ఆరోపించారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లానని, అయినా మైనంపల్లి అనుచరులు తనను చంపాలని నార్కట్‌పల్లి వరకు వెంబడించారని, వారి కంటపడకుండా ఆటోలో తప్పించుకున్నానని చెప్పారు. ఆపై విజయవాడ వెళ్లి స్నేహితుల సహాయంతో కొద్దిరోజులు అక్కడున్నానని, ఆపై వైజాగ్ వెళ్లి తలదాచుకున్నానని వివరించారు. హైకోర్టు అడ్వొకేట్ సలహామేరకు డీసీపీ కార్యాలయానికి వచ్చానన్నారు. మైనంపల్లి హను మంతరావుతో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందన్నారు. తన భూమిని లాక్కునేందుకు మైనంపల్లి ప్రయత్నిస్తున్నారని, సదరు భూమి తనది కాదని నిరూపిస్తే ఆయనకే గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పారు. అంతా ఫేక్.. తిరుపతిరెడ్డి చెప్పిందంతా ఫేక్ అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ‘ఎమ్మెల్యే మైనంపల్లి కాల్ చేశారు, కిడ్నాప్‌నకు యత్నించారు’ అంటూ తిరుపతిరెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరెడ్డి సీడీఆర్లో ఎటువంటి కాల్స్ లేవని గుర్తించారు. ల్యాండ్ కేసులో తిరుపతిరెడ్డిపైనే ఓ మహిళ ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే... కిడ్నాప్ పేరుతో స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై కేసుల నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అల్వాల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు. -
బీజేపీ నేత కిడ్నాప్?
అల్వాల్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్, బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు చర్చనీయాంశమయ్యింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కుషాయిగూడ చర్లపల్లిలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. తిరుపతిరెడ్డికి అల్వాల్ పరిధిలోని పాకాలకుంటలో ఓ వివాదాస్పద స్థలం ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతుండటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం తిరుపతిరెడ్డి తన స్థలానికి సంబంధించి అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి కారులో వెళ్లారు. డ్రైవర్ వేరే పనిమీద వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరుపతిరెడ్డి కన్పించకుండా పోయారని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని భార్యతో పాటు అతని సోదరుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్థల వివాదం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మామిడి జనార్ధన్‌రెడ్డి తన భర్తను కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటోలో వెళ్లి..అదృశ్యమై.. మండల కార్యాలయం నుంచి తిరుపతిరెడ్డి ఒక్కడే ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన అనంతరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటకేసర్ వద్ద ఆటో దిగి సమీపంలోని దుకాణ సముదాయంలోకి వెళ్లాడని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇన్స్పెక్టర్ ఉపేందర్‌రావు వెల్లడించారు. తిరుపతిరెడ్డి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఆందోళన.. కిడ్నాప్‌కు గురైన తిరుపతిరెడ్డి ఆచూకీని తెలుసుకోవడంంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య, సోదరుడు ఆరోపించారు. ఆయన అదృశ్యమై దాదాపు రెండురోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత పోలీస్‌స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన పోలీసులు, ఇప్పుడు మాటమార్చి ఫుటేజీలు ఉన్నాయంటున్నారని చెప్పారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని సుజాత పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయింపు తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, బీజేపీ నాయకులు, పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. జనగామ, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతిరెడ్డి శ్రేయోభిలాషులు కూడా పెద్దసంఖ్యలో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అధికార పార్టీ నాయకులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. అదుపులో తిరుపతిరెడ్డి స్నేహితుడు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఘట్కేసర్ ప్రాంతంలో తిరుపతిరెడ్డిని వదిలిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడని తెలిసింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుపతిరెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆయన గత కొన్ని రోజులుగా తరచూ స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. శుక్రవారం కూడా వేరే ఫోన్ ద్వారా మాట్లాడని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
అల్వాల్‌లో రియల్టర్ తిరుపతిరెడ్డి కిడ్నాప్.. రూ.700కు ఆటో మాట్లాడుకుని..
హైదరాబాద్: అల్వాల్ రియల్టర్ తిరుపతిరెడ్డి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట భూ వివాదాలే కిడ్నాప్‌కు కారణమని భావించిన పోలీసులు.. తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ వద్ద దిగిన తిరుపతి రెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగా ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. రూ.700కు ఆటో మాట్లాడుకుని ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నాలుగు టీంలుగా ఏర్పడి ఎస్వోటి, అల్వాల్ పోలీసులు తిరుపతిరెడ్డి కోసం వెతుకుతున్నారు. తిరుపతి రెడ్డికి చెందిన 3 ఎకరాల భూమిని మామిడి జనార్దన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ పై ఇంకా ఆచూకి లభించలేదని తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతోనే మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి బాధ్యులు అంటూ బాధితుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని నివసించే తిరుపతిరెడ్డికి పాకాల కుంటలోని స్థలంపై కొన్ని నెలల క్రితం వివాదం జరిగింది. ఈ వ్యవహారంలోనే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదీ చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
తిరుపతిరెడ్డికి కేటీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తిరుపతిరెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా నవాబు పేట ఎల్లకొండకు చెందిన తిరుపతిరెడ్డి ఇటీవలే ఎవరెస్టును అధిరోహించారు. టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.నందు సహకారంతో ఆయన మంగళవారమిక్కడ కేటీఆర్‌ను కలిశారు. స్థానికులు కొందరు రూ.3లక్షలిచ్చి ప్రోత్సహించారని, శంకర్పల్లి మాజీ సర్పంచ్ ఆత్మలింగం రూ.11.5 లక్షలు, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ కొంత ఆర్థిక సహాయం చేయడంతో తాను ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు తిరుపతి తెలిపారు. వికలాంగుడికి వాహనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వికలాంగు డు సంబరబోయిన శివ(20) ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణంలో ఇబ్బంది పడేవారు. దీంతో తనకు ఒక వాహనాన్ని ఇప్పించాలని కోరుతూ ఆయ న కేటీఆర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. శివకు వాహనం ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు సూచించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఒక హోండా యాక్టివాను కొనుగోలు చేశారు. మంగళవారం కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సమక్షంలో శివకు యాక్టివాను అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఆదిలాబాద్, నిర్మల్ జెడ్పీ చైర్పర్సన్లు రాథోడ్ జనార్దన్, కె.విజయలక్ష్మిలు కేటీఆర్‌ను కలిశా రు. ఈ సందర్భంగా సమన్వయంతో జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, పలువురు జెడ్పీటీసీలు కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
కొండంత ఆత్మస్థైర్యం!
అతనో ఆటో డ్రైవర్ కుమారుడు. కానీ మంచి పర్వతారోహకుడు. పేదరికం వెంటాడుతున్నా తన అభిరుచిని, ఆసక్తిని మానుకోలేదు. ఇప్పటికే ఎన్నో పర్వతాలను అధిరోహించాడు. కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్ వంటివి ఆయనకు పాదాక్రాంతం అయ్యాయి. కానీ తన అసలు లక్ష్యం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. అందుకు ఆర్థికంగా వెసులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు తిరుపతిరెడ్డి. ఇందుకు దాదాపు రూ.30 లక్షలు అవసరమవుతాయని ఆయన చెబుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండకు చెందిన గుంతల తిరుపతిరెడ్డి ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తూ ఆటో నడుపుతున్నారు. తండ్రి కూడా ఆటో డ్రైవరే. చిన్నప్పటినుంచీ తిరుపతిరెడ్డికి పర్వతారోహణమంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే 2015 మార్చి 24న ప్రఖ్యాత పర్వతారోహకుడు మస్తాన్ బాబు పర్వతారోహణ చేస్తూ మృతి చెందారు. దీంతో తిరుపతిరెడ్డి ఆలోచనలు మస్తాన్‌బాబు చుట్టే తిరిగాయి. ఐదంకెల జీతం, హాయిగా సాగిపోయే జీవితం.. అవన్నీ వదిలిపెట్టి ఓ వ్యక్తి పర్వతారోహణ చేయడమేంటి? అని ఆలోచించారు. ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. భవనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో చేరారు. ప్రొఫెషనల్ మౌంటనీర్ శేఖర్‌బాబు వద్ద శిక్షణ పొందారు. ఎత్తయిన గుట్టలు ఎలా ఎక్కాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలన్నీ తెలుసుకున్నారు. భువనగిరిగుట్టను తిరుపతిరెడ్డి తొలి ప్రయత్నంలోనే అధిరోహించి.. పర్వతారోహణకు బాటలు వేసుకున్నారు. లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌అవార్డు అందుకుంటూ.. విన్నర్స్ ఫౌండేషన్ వెన్నుదన్ను.. విన్నర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రఘు, జాయింట్ సెక్రటరీ రమేష్ కాంబ్లీలు తిరుపతిరెడ్డి ప్రతిభను గుర్తించి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నిధుల సేకరణకు తోడ్పడుతున్నారు. భారత డైనమిక్స్ లిమిటెడ్ ఉద్యోగులైన రఘు, రమేష్ కాంబ్లీఉ విన్నర్స్ ఫౌండేషన్ ద్వారా ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. తిరుపతిరెడ్డికి సైతం ఆపన్నహస్తం అందించేందుకు సాయపడుతున్నారు. రూ.30 లక్షలు అవసరం.. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే అనేక వ్యయ ప్రయాసలతో మూడు శిఖరాలను అధిరోహించిన తిరుపతిరెడ్డి ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహించాలంటే దాదాపు రూ.30 లక్షలు అవసరమయ్యాయి. ట్రాన్సన్డ్ అడ్వంచర్స్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని రెండు విడతల్లో అందించాలి. మొదటి విడత డబ్బును ఇప్పటికే ఇవ్వాలి కానీ తన వద్ద డబ్బు లేకపోవడంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారు. నాన్న ఆటోడ్రైవర్. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబం గడవడటమే గగనంగా మారింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే నా జీవిత లక్ష్యం. దాతలు ఆదుకుంటే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసా.– గుంతల తిరుపతిరెడ్డి, పర్వతారోహకుడు తిరుపతిరెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు ఎస్బీఐ అకౌంట్ నంబర్ 37778643692, ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్0020966, శంకరపల్లి బ్రాంచ్. ఫోన్: 90008 24190, 96761 47611. -
కరెంటు షాక్ తగిలి కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు
ఎల్బీనగర్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తిరుపతి రెడ్డికి సోమవారం మధ్యాహ్న సమయంలో కరెంటు షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. వివరాలు..దొంగతనాలు అరికట్టేందుకు ఎల్బీనగర్ సీసీఎస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నపుడు సౌత్ఎండ్ పార్కు సమీపంలో ఒక ఇనుప ఎలక్ట్రికల్ పోలు దగ్గరలో నిలబడి ఉన్నప్పుడు అకస్మాత్తుగా కరెంటు వైరు తగిలింది. తీవ్రంగా గాయపడిన తిరుపతి రెడ్డిని పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ లక్ష్మీకాంత రెడ్డి స్థానికుల సహాయంతో కామినేని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు. -
వినియోగదారులకు ‘విజయ’ కానుక
అడ్వాన్స్ కార్డు ఉన్నవారికి నెలలో ఒక రోజు ఉచితంగా పాలు హైదరాబాద్: జూన్ 1న ఇంటర్నేషనల్ మిల్క్ డే, జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని విజయ పాల వినియోగదారులకు, విక్రయదారులకు జూన్ నుంచి ప్రతి నెలలో ఒక రోజు ఉచితంగా పాలు సరఫరా చేసే పథకానికి విజయ డెయిరీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటీవ్ ఫెడరేషన్ లిమిటెడ్ మిల్క్ ప్రొడక్టు ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ తిరుపతి రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ పాల అడ్వాన్స్ కార్డు కొనుగోలు దారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. నెలలో 31 రోజులు ఉన్నా అడ్వాన్స్ కార్డు మీద కేవలం 30 రోజులకే, 30 రోజులు ఉన్నా కేవలం 29 రోజులకే బిల్లు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్డులను మొదటి విడతగా ప్రతి నెల 1 నుంచి 9 వ తేదీ వరకు.. రెండవ విడత 11 నుంచి 12 వ తేదీ వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. -
కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ
బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : కేసీఆర్ సారథ్యంలోనే బంగా రు తెలంగాణ సాధ్యమని సామాజిక సేవా కార్యకర్త, టీఆర్ఎస్ నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని సకల జనులను ఒక్క తాటి పైకి తీసుకువచ్చి, 14 ఏళ్ల పాటు ఉద్యమించిన స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ అని కొనియూడారు. కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమరణ దీక్షకు పూనుకోవడంతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఇంటింటా పండుగలా చేసుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు గిరిజన మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం సరికాదని అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్ లు, పీఏసీఎస్ చెర్మైన్, డెరైక్టర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
మున్సిపల్ ప్రచార హోరు
మార్కాపురం, న్యూస్‌లైన్: మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థినిగా వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ బుధవారం ఉదయం స్థానిక రాఘవేంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డిల నేతృత్వంలో గడపగడపకూ తిరిగారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సాగర్ నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. కేపీ, జంకె, వెన్నా హనుమారెడ్డిల సహకారంతో పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేసి జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీని గెలిపించి ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుస్తానని తెలిపారు. పాత బస్టాండ్, మార్కెట్ సెంటర్ , నెహ్రూబజార్, కంభం రోడ్డు మీదుగా ర్యాలీ సాగగా.. ప్రజలు హారతులిచ్చి పూలతో స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సీపీ రూరల్ కన్వీనర్ గాయం కొండారెడ్డి, మండల యూత్ కన్వీనర్ మందటి మహేశ్వరరెడ్డి, నాయకులు పి.సుబ్బారెడ్డి, ఆర్ . తిరునారాయణ, చిర్లంచర్ల కృష్ణ, గుంటక వెంకటరెడ్డి, నికరంపల్లి సర్పంచ్ జంకె కృష్ణారెడ్డి, కురాటి చెన్నకేశవులు, పంబి వెంకటరెడ్డి, ఆదామ్, కరీముల్లా, బొగ్గరపు శేషయ్య, బి.రాంప్రకాశ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ ప్రచారం టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిని వక్కలగడ్డ రాధికతో కలిసి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బుధవారం తేరు బజార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని తెలిపారు. తాను ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పుకున్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ఇమ్మడి కాశీనాథ్ , వక్కలగడ్డ మల్లికార్జున్, ఉప్పు రమణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అద్దంకిలో.. అద్దంకి, న్యూస్‌లైన్: నగర పంచాయతీ నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియడంతో బుధవారం నుంచి ప్రచార పర్వానికి తెర లేచింది. పట్టణంలోని 14వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న జాగర్లమూడి శ్రీలక్ష్మి కొత్తపేట నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటి కీ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థించారు. వార్డు సమస్యలను పరిష్కరిస్తానన్నారు. సుమారు 150 మంది మహిళలు ప్రచారంలో పాల్గొనటం విశేషం. కార్యక్రమంలో చుండూరి మురళీసుధాకర్, వైఎస్ఆర్ సీపీ పట్టణ సేవాదళ్ కన్వీనర్ ఏలూరి రామ్మోహనరావు, గుంజి హనుమంతరావు, గుంజి ఏడుకొండలు, గుంజి కొండలు, గోపి, షేక్ మాబు, మస్తాన్‌వలి, ఇస్మాయిల్, జోసఫ్, అబ్దుల్ రహమాన్, కె. పేరయ్య, అద్దంకి ఏడుకొండలు, ఆదినారాయణ, ముంతాజ్, సుబ్బారావమ్మ, మీరాబి, అమీదా, ఖాదర్‌బీ, మద్దు అరుణ, హేమలత, నాగేంద్రం,లక్ష్మి పాల్గొన్నారు. పనిచేస్తాం..ఆదరించండి చీరాల రూరల్, న్యూస్‌లైన్: వార్డుల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చీరాల మున్సిపాలిటీలోని 8,12,19,30 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు విస్తర్ల జయరాణి, కర్నేటి వెంకటరత్నం, మించల శివ, కొప్పుల నాగేశ్వరరావులు హామీ ఇచ్చారు. బుధవారం వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. తమ పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రం అధ్వానంగా తయారైందని, సంక్షేమ ఫలాలు సక్రమంగా అందక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. ఆయన తనయుడు నిర్మించిన వైఎస్ఆర్సీపీని ఆదరిస్తే సమస్యలు కొలిక్కి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధికార ప్రతినిధి శీలం వెంకటేశ్వరమ్మ, కర్నేటి రవికుమార్, నరాల తిరుపతి రాయుడు, మేడిద రత్నకుమార్, గందం చంద్ర, షేక్ రజియ, కార్యకర్తలు పాల్గొన్నారు.