బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : కేసీఆర్ సారథ్యంలోనే బంగా రు తెలంగాణ సాధ్యమని సామాజిక సేవా కార్యకర్త, టీఆర్‌ఎస్ నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని సకల జనులను ఒక్క తాటి పైకి తీసుకువచ్చి, 14 ఏళ్ల పాటు ఉద్యమించిన స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ అని కొనియూడారు.
కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమరణ దీక్షకు పూనుకోవడంతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఇంటింటా పండుగలా చేసుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు గిరిజన మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం సరికాదని అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్ లు, పీఏసీఎస్ చెర్మైన్, డెరైక్టర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ
Published Mon, Jun 2 2014 3:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement