
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.
బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment