Farm House
-
మొయినాబాద్ పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..
సాక్షి, రంగారెడ్డి: ఫామ్‌హౌస్‌లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
ఎర్రవల్లి: బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్
సాక్షి, ఎర్రవెల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.ఈ సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్బంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశముంది.ఇదే సమయంలో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక, ఈ నెల 12వతేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. -
ఫామ్‌హౌజ్‌కి పోయి 8 ఏళ్లు అవుతోంది: పోచంపల్లి
సాక్షి, హైదరాబాద్: ఫామ్‌హౌస్ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫామ్‌కు యజమానికిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా కూడా చేర్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
కోడి పందేల నిర్వహణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండమొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. -
రియల్టీపైనే కుబేరుల కన్ను..
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు) రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వచ్చే రెండేళ్లలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62 శాతం మంది పైగా కుబేరులు భావిస్తున్నారు. సంపన్నుల పెట్టుబడుల ధోరణులపై లగ్జరీ ప్రాపర్టీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెద్ద నగరాలకు చెందిన 623 మంది హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు ఇందులో పాల్గొన్నారు.ఈ సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కాస్త నెమ్మదించినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే ఉండగలదనే అంచనాలు ఉన్నాయి. 2024లో ఆశాభావం 79 శాతంగా ఉండగా 2025 సర్వేలో ఇది 71 శాతానికి నెమ్మదించింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగానే కొనసాగుతుందని చాలా మటుకు హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు విశ్వసిస్తున్నారు.‘ఏడాది, రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్న సంపన్నుల సంఖ్య 2024లో 71 శాతంగా ఉండగా 2025లో 62 శాతానికి పరిమితమైంది. అయినప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సాధనంగా రియల్టీపై ఇంకా గట్టి నమ్మకం ఉండటాన్ని ఇది సూచిస్తుంది‘ అని నివేదిక వివరించింది. రాబడులపై ఆశాభావం.. పెట్టుబడి గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణమని సంపన్నులు వెల్లడించారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44 %గా ఉండగా ప్రస్తుతం ఇది 55 శాతానికి పెరిగింది. ఇక రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12–18% స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఆశాభావంతో ఉన్నారు. 38% మంది మాత్రం ఇది 12% కన్నా తక్కువే ఉంటుందని భావించగా .. 18 శాతానికి మించి ఉంటుందని 15%మంది అభిప్రాయపడ్డారు.‘కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణి నెలకొన్నా, దేశీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విశాలమైన ఫార్మ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మొదలైన వాటికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం‘ అని ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ఎండీ అమిత్ గోయల్ తెలిపారు. ఒకప్పుడు హోదాకు చిహ్నంగా నిల్చిన లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మెరుగైన పెట్టుబడి సాధనంగా మారిందని సంస్థ సీఈవో అశ్విన్ చడ్ఢా పేర్కొన్నారు.బిలియనీర్ల బూస్ట్..దేశీయంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం సైతం రియల్టీకి కలిసొస్తోందని నివేదిక పేర్కొంది. యూబీఎస్ నివేదికను ఉటంకిస్తూ, కుబేరుల సమష్టి సంపద 42 శాతం వృద్ధి చెంది ఏకంగా దాదాపు 905 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది. గత దశాబ్దకాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది -
కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఎర్రవల్లికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రవల్లి చేరుకున్నారు. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌కు మంత్రి పొన్నం.. కేసీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. గంటా 15 నిమిషాల పాటు ఇరువురి సమావేశం సాగింది. కేసీఆర్‌ని కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరుఫున కేసీఆర్‌ని కలిసి ఆహ్వానించామని తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. భోజన సమయంలో వచ్చారు లంచ్ చేయమంటూ కేసీఆర్ కోరారు. దీంతో ఆయనతో కలిసి భోజనం చేసాము.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల వారీగా ఆహ్వానిస్తున్నాము. అందులో భాగంగా కేసీఆర్‌ని కూడా ఆహ్వానించాము.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేది ఆయన.. పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని కోరుకుంటున్నా. తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయాలు వుండొన్చు.. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలి’’ అని పొన్నం విజ్ఞప్తి చేశారు. -
‘జన్వాడ ఫామ్‌హౌజ్’ అంటేనే వివాదం: ఎంపీ అనిల్ యాదవ్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అనిల్ యాదవ్ మంగళవారం(అక్టోబర్ 29) మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి బీఆర్ఎస్ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి.రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి.కేటీఆర్‌కు అసలు బినామీ విజయ్ మద్దూరి.గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు.జన్వాడ ఫామ్‌హౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒక సారి దీపావళి విందని,మరోసారి గృహ ప్రవేశం అని అంటున్నారు.తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటోంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు.రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు విజయ్మద్దూరి మాట మారుస్తున్నాడు.పామ్ హౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు.ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది.కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని అని ప్రజలు అడుగుతున్నారు’అని అనిల్ యాదవ్ గుర్తుచేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో: కేటీఆర్ -
ఫాంహౌజ్ పార్టీ: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్: పార్టీలు,పండగల దావత్‌లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్‌పాకాల జన్వాడ ఫాంహౌజ్ ఘటన మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.‘ఎవరైనా ఫంక్షన్లకు దావత్‌లు చేసుకోవచ్చు.కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. ఎక్కువమందితో మందు పార్టీలు చేస్తే ఎక్సైజ్ ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎవరైనా దావత్ చేసుకోవచ్చు.ప్రజల్లో అపోహలు కలిగించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు.కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో సోదాలకు సీఎం మంత్రులకు ఏం సంబంధం.ఫిర్యాదులు వస్తే అధికారులు వారి పని వారు చేస్తారు.దీన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోడం సిగ్గుచేటు’అని పొన్నం మండిపడ్డారు. ఇదీ చదవండి: రేవ్‌పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్ -
రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహం
Janwada Farm House Party Updates :తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిగ్గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని మద్యాన్ని గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ పోలీసుల దాడులతో రాజ్ పాకాల పరారీలో ఉన్నారని తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి తెలిపారు. 6.00pmతలసాని శ్రీనివాస్ యాదవ్కక్ష సాధింపు చర్యలు సరికాదుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంఅనేక సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు... వాటిపై దృష్టి సారించాలిప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రలుగంట గంటకు మారుతున్న ఎఫ్ఐఆర్లు.. కారణం ఏమిటిఎలాంటి సర్చ్ వారెంట్ లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారుప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదువేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారుకేటీఆర్ బావమరిది సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారుజన్వాడలో ఏం దొరకలేదుగచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారుకేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలిపోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారుప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందికేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉందిసబితా ఇంద్రారెడ్డితెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దాపోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదురాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారుసెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎట్లా చేస్తారుప్రభుత్వం కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తోందితెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్ లు చేసుకోవడం కామన్ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదుశ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారుతెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవుతెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురాకండిలేనిపోని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారు5:30pmరేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహంరేవ్ పార్టీ చెడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుసీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు5:10pmశైలేంద్ర పాకాల ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ పోలీసులుఓరియన్విల్లాకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు4:40pmహైదరాబాద్ ఓరియన్ విల్లా వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒరియన్ విల్లాలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై బీఆర్ఆర్ఎస్ నేతలు తిరగబడ్డారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను,మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.3:40pmఒరియన్ విల్లాస్‌లో ఉద్రిక్తతరాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎక్సైజ్ అధికారూలుకేటీఆర్ విల్లా పక్కనే ఉన్న రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల విల్లాఎక్సైజ్ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతల వాగ్వాదంసెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకి పంపిస్తాం అంటున్న బీఆర్ఎస్ నేతలుతమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ వాదన 3:21pmరాయదుర్గం ఓరియన్ విల్లాస్‌కు చేరుకున్న పోలీసులురాజ్ పాకాల ఉంటున్న విల్లా నెంబర్ 40కి తాళం వేసి ఉన్నట్లు పోలీసుల గుర్తింపుఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులుపోలీసుల దాడులతో ఓరియన్ విల్లా దగ్గర ఉద్రిక్తతనోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహిస్తున్నారని బీఆర్ ఎస్ నేతల ఆందోళనఎక్సైజ్ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదంఎలాంటి నోటీసులు లేకుండా ఇంటిని తడిఖీలు ఎలా చేస్తారంటు ప్రశ్ననోటీసులు చూపించాలని డిమాండ్కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం 2:55pmరాజేంద్ర నగర్ డీసీపీ రాజ్ పాకాల ఫామ్ హౌస్‌పై నిన్న రాత్రి దాడి చేశాంలోకల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు చేశాంపార్టీలో మొత్తం 35 మంది ఉన్నారువీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారుఏడు విదేశీ మద్యం బాటిల్స్‌తో పాటు 10 దేశీయ మధ్య బాటిళ్లు స్వాధీనంబాటిల్స్తో పాటు నిషేధిత గేమింగ్ వస్తువులు స్వాధీనంఅందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించంవిజయ్ మద్దూరి కొకైనే పాజిటివ్ వచ్చిందివిజయ్ మద్దూరికి రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాంపార్టీ నిర్వహించిన రాజ్ పాకాల పైన గేమింగ్ యాక్ట్ కింద మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశాంపార్టీకి ఎక్సైజ్ నుండి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి ఎక్సైజ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారుమోకిలా పీఎస్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశాం2:53 pmకేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందహామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుకేటీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారుకేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారుస్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారుఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారుఅధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారురిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలంరేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారుసొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దాకేటీఆర్పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారురాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరుకేటీఆర్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారురేవంత్ రెడ్డి డైవర్షన్‌లో ఇది జరుగుతోందిరేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే రియాక్ట్ అవుతున్నారుబండి సంజయ్,రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారురేవంత్ రెడ్డి,బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారురేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు2:30pmరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషిరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి స్పందించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్, రాజ్ పాకాలపై కేసు నమోదు చేశాం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ రాజ్ పాకాల నిర్వహించారు. విదేశీ మద్యం లభించడంతో అయన ఇంట్లో సోదాలు చేయాలి. ఫామ్‌హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన విల్లాకు తాళం వేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలిఫామ్ హౌస్ ఓనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. జన్వాడ్ ఫామ్‌హౌస్‌లోనే ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు. రేవ్ పార్టీలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలొస్తున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కాకపోతే డీజీపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ సీసీటీవీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయాలని అన్నారు. -
హతమార్చి.. పోలీసులను ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడటం, ప్రతిఘటించిన వారిని హత్య చేసి పరారయ్యే హంతకుడిని పట్టుకోవడంలో రాచకొండ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య చేసి ఏడాదిన్నర కాలం పాటు పోలీసుల కళ్లగప్పి వారి ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. మరో ఇద్దరిని హత్య చేసి, తనంతట తాను దొరికితే తప్ప విచారణాధికారులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించి తొలి కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే.. ఇద్దరు ప్రాణాలతో మిగిలేవారు. కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగితే అఘాయిత్యమే.. దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ మద్యం మత్తులో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తాగిన మైకంలో ఫామ్ హౌస్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై కన్నేసేవాడు. అదను చూసి మద్యం తాగి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే అక్కడే ఉన్న పదునైన ఆయుధంతో వారిని హత్య చేసి పరారయ్యేవాడు. ఈ ఘటనను ఎవరైనా చూస్తే.. సాక్ష్యం మిగలకుండా వారిని కూడా అంతం చేసేందుకు వెనుకాడేవాడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆధారాల సేకరణలో విఫలం.. దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్‌లో పనిచేసే శైలజ అనే మహిళపై కన్నేసిన అతను గతేడాది మార్చి 3న ఆమెను హత్య చేశాడు. అనంతరం హతురాలి ఇంట్లో ఉన్న రెండు విదేశీ మద్యం బాటిళ్లు నిందితుడికంట పడ్డాయి. దీంతో ఒక బాటిల్‌ను తీసుకుని, మరొకటి తీస్తుండగా చేయి జారి కింద పడిపోయింది. పగిలిన బాటిల్‌పై ఉన్న నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే హతురాలు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారే అయినా పోలీసులు ఊరిలో ఉన్న అనుమానితులను విచారించలేదు. దీంతో నిందితుడు శివ కళ్ల ముందు ఉన్నా గుర్తించలేకపోయారు. అంతే కాకుండా హత్య అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వచి్చన సమయంలోనూ నిందితుడు కూడా అక్కడే ఉండి ఆధారాల సేకరణలో వారికి సహాయపడినట్లు తెలిసింది. వాసన పసిగట్టి డాగ్ స్క్వాడ్ వెంబడిస్తాయని ముందుగానే తెలుసుకున్న నిందితుడు... అవి రాకముందే అక్కడ్నుంచి పరారయ్యేవాడు. శైలజా రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు అదే ఊర్లో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు. మరోసారి మద్యం మత్తులో మ్యాంగో ఆర్చిడ్స్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్న శాంతమ్మపై అత్యాచారానికి యతి్నంచాడు. ఆమె ప్రతిఘటించడంతో వేట కొడవలితో హత్య చేశాడు. ఇది చూశాడన్న అనుమానంతో ఆమె భర్త మూగ హోసయ్యనూ అంతం చేశాడు. తొలి కేసులోనే పోలీసులు హంతుకుడు శివను పట్టుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలకు దక్కేవని స్థానికులు పేర్కొంటున్నారు.పాత కేసులపై ఆరా.. హత్యలు జరిగిన రెండు ఫామ్ హౌస్‌లలోనూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకునే యజమానులు, సిబ్బంది భద్రత, రక్షణ కోసం కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సిందని పోలీసులు సూచిస్తున్నారు. ఫామ్ హౌస్‌లకు వచ్చివెళ్లే దారిలో కూడా ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం నిందితులు ఎలాంటి బెరుకు లేకుండా నేరాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా నిందితుడు సాయంత్రం వేళల్లో మద్యం తాగి, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అడ్డుపడిన వారిపై పదునైన ఆయుధంతో హత్య చేస్తుంటాడు. దీంతో మహేశ్వరం జోన్ పరిధిలో ఇదే తరహాలో ఏమైనా హత్య కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు పునఃసమీక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లు, గృహాలలో సాయంత్రం వేళల్లో జరిగిన మహిళల హత్య కేసులను ఆరా తీస్తున్నారు. -
ఫార్మ్ హౌస్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ చండీ యాగం
సాక్షి,సిద్దిపేటజిల్లా: గజ్వేల్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి శుక్రవారం(సెప్టెంబర్6)10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభించారు. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనున్నారని సమాచారం.రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల కవిత ఐదు నెలలు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉండి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. -
కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. పార్టీ శ్రేణులు, అనుచరులతో కలిసి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారామె. కవితను చూడగానే కేసీఆర్ ఒక్కసారిగా భాద్వేగానికి గురయ్యారు.పది రోజుల పాటు ఫాంహౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. ఈ సమయంలో తనను కలవడానికి ఎవరూ రావొద్దని.. అంతా సహకరించాలని అభిమానులు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. పది రోజుల తర్వాత తానే అందరికీ అందుబాటులోకి వస్తానని అన్నారామె. అక్కడే విశ్రాంతి తీసుకుంటూనే ఆమె రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు ఐదున్నర నెలల పాటు జైలు జీవితం గడిపిన కవిత మంగళవారం సాయంత్రం బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. Kavitha meets her father KCR at Erravelli residence pic.twitter.com/FhTnEbRSBi— Naveena (@TheNaveena) August 29, 2024 -
టార్గెట్ కేటీఆర్ ఫార్మ్ హౌస్
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
జన్వాడ ఫాంహౌస్‌పై హైడ్రా నజర్
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్‌ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఫాంహౌస్‌లో కొలతలు వేసిన అధికారులు.. సర్వేను పూర్తి చేశారు.ఇప్పటికే బద్వేల్ ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను గత బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది.ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది.జన్వాడ ఫామ్‌హౌజ్ వ్యవహారం కోర్టుకి ఎక్కిన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తాను కూల్చివేయిస్తానని అన్నారాయన. ‘‘నా పేరుతో ఏ ఫాంహౌజ్ లేదు. నా ఫ్రెండ్ ఫాంహౌజ్ లీజ్‌కు మాత్రమే తీసుకున్నా. ఫాంహౌజ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే నేనే కూలగొట్టిస్తా’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
ఫ్రెండ్ వద్ద ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నా: కేటీఆర్
-
హైడ్రా కు హైకోర్టు కీలక ఆదేశాలు
-
జన్వాడ ఫామ్‌హౌజ్ కేసు.. ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది. ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైడ్రా అధికారాలు ఏంటని పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది. హైడ్రా జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అవుటర్ రింగురోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో చెరువులు, కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రా న్యాయవాది విచారణకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులపై హైకోర్టు ప్రశ్నలు..గ్రామపంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని జన్వాడ ఫామ్‌హౌజ్ తరపున పిటిషన్ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సర్పంచ్‌కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామపంచాయతీ సెక్రటరీకి మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం ఉందని, సర్పంచ్‌కు లేదని పేర్కొంది. -
హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించిన హైకోర్టు
-
Farm House: అంతా అక్రమమే..
శంషాబాద్: ఇటీవల సంచలనం రేపిన ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్‌లను కిడ్నాప్ చేసి బంధించిన ఫాంహౌస్‌ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని 103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్‌ను నిరి్మంచినట్లు గుర్తించారు. రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా రెండు రేకుల షెడ్లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ బి. సుమన్‌రావు ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇటీవల ఫాంహౌస్‌కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు. -
నేతల జంప్ జిలానీ.. బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మొన్నటికి మొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్.. మంగళవారం భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు.ఫాంహౌజ్‌కు వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. అనంతరం ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలెవరూ తొందరపడవద్దని తెలిపారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టి మారటం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు గతంలనూ జరిగాయని, అయినా మనం భయపడలేదని చెప్పారు.ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. భవిష్యత్తులో బీఅర్ఎస్ మంచి రోజులు వస్తాయని, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఅర్ఎస్కు వచ్చే నష్టం లేదని తెలిపారు. రేపటి నుంచి(బుధవారం) వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి వారిని పార్టీలోకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రచారంలో నీతులు చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ రేవంత్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.‘ముఖ్యమంత్రి గారు.. ప్రచారంలో నీతులు..? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?నాడు..ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు. భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.చివరికి...ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు.రాజీనామా చేయకుండా చేరితో ఊళ్లనుంచే తరిమికొట్టమన్నారుమరి ఇవాళ మీరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ.. కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా ?జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి..ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు ! ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారు !!ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని ?రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి ??ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరేఅందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే..!!!జై తెలంగాణ’ -
రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు
బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ అని ఈ రేవ్‌పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్‌పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్‌లోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్ సిటీ పీఎస్ నుంచి హెబ్బగోడి పీఎస్‌కు బదిలీ చేశాం. డ్రగ్స్ విసిరేశారు: రేవ్‌పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్‌పూల్, టాయ్‌లెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్‌సిద్దికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్‌బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్ తెలిపారు.నిందితుల అరెస్ట్రేవ్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్ బెట్టింగ్‌లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. -
ఫాంహౌస్‌లో శవమై తేలిన వ్యాపారవేత్త భార్య
కర్ణాటక: వ్యాపారవేత్త భార్య ఫాంహౌస్‌లో శవమై కనిపించింది. ఈ ఘటన రామనగర జిల్లా కగ్గలీపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శాంతి స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని ఉగ్రప్ప తన భార్య శాంతమ్మ(50)పేరుతో పలు వ్యాపారాలు చేస్తుండేవారు. ఉగ్రప్ప కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో శాంతమ్మ గిరిగౌడనదొడ్డిలోని ఫాంహౌస్‌లో నివసిస్తుండేది. శాంతమ్మ అక్క కుమారుడు డాక్టర్ నంజేశ్ ఆమెకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఏం జరిగిందో ఏమో శాంతమ్మ ఫాంహౌస్‌లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కగ్గలీపుర పోలీసులు వచ్చి పరిశీలించారు. తలపై బలంగా రాతితో బాదిన ఆనవాళ్లు కనిపించాయి. హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
వ్యభిచార గృహాలుగా ఫాంహౌస్‌లు!
మొయినాబాద్: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్‌లను లీజ్‌కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది. హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ మండలాల్లో ఫాంహౌస్‌లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్లున్నాయి. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఫాంహౌస్‌లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. నిర్వాహకుల అడ్డగోలు దందా.. ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్ టూ గెదర్ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్‌లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిఘా వైఫల్యం! ఫాంహౌస్‌ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్‌ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం. అప్పడప్పుడు ఫాంహౌస్లపై జరుగుతున్న దాడులు ఎస్ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం. వరుస ఘటనలు... మొయినాబాద్ మండలంలోని ఫాంహౌస్‌ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్లో ఉన్న రాజు ఫాంహౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. -
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాíష్కీగౌడ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ వి«ధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూవున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్‌లో పెట్టారని ఆరోపించారు. కల్ల»ొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. -
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపడతాం: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. కాగా, మధు యాష్కీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారు. కానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు. అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను’ అని స్పష్టం చేశారు. -
బెంగుళూరులో మెగాస్టార్ చిరంజీవి ఫామ్‌హౌస్ చూశారా? (ఫొటోలు)
-
కర్ర సాయంతో కేసీఆర్ నడక
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు చేతి కర్ర సాయంతో నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారు తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఇటీవలే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ చేరుకున్నారు. చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన -
స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్
స్టార్ హీరో ఇంటి దగ్గర అలజడి. అభిమానులు అని చెప్పిన ఇద్దరు అనుమానితులు.. బలవంతంగా సదరు హీరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో అంతా టెన్షన్ టెన్షన్‌గా మారిపోయింది. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అసలు వాళ్లెవరు? ఇక్కడికొచ్చి ఎందుకు చొరబడే ప్రయత్నం చేశారని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ముంబయికి సమీపంలోని పాన్వెల్ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉంది. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటాడు. తాజాగా ఈ ఫామ్ హౌస్‌లోకి ఇద్దరు అనుమానితులు చొరబడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డ్స్‌తోనూ వాదించారు. పోలీసులకు సమాచారం అందించగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తుల దగ్గర నకిలీ ఐడీ కార్డ్స్ ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్.. కృష్ణజింకలని వేటాడాడు. ఇందులో భాగంగానే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఈ హీరోకి బెదిరింపు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి. గతేడాది ఇతడితో పాటు మరో ఇద్దరిపైనా కేసు పెట్టారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బిష్ణోయ్.. సల్మాన్‌ని చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు అనుమానితులు.. సల్మాన్ ఇంటి దగ్గర కనిపించడం ఆందోళన కలిగించింది. అయితే వీళ్లు సల్మాన్‌ని చంపడానికి వచ్చారా? మరోదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ కొత్త మూవీ) -
కేసీఆర్ కోసం చింతమడక ప్రజల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్‌హౌజ్ చెక్‌పోస్ట్ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్ఎస్ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది. -
కేసీఆర్ కోసం ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్యేలు
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన అనంతరం.. అటు నుంచే అటే ఎర్రవెల్లికి బయల్దేరారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసి ఎన్నికల ఫలితాలపై వాళ్లు చర్చించనున్నారు. అలాగే.. పార్టీ కార్యాచరణ గురించి వాళ్లు చర్చించనున్నట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లు కూడా వాళ్ల వెంట ఫామ్‌హౌజ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు. -
సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద మూడు రోజులపాటు ఈ యాగం చేయనున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం ఈ రాజశ్యామల యాగానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. ఈ యాగం మహా శక్తివంతమైనదని తెలిపారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అని పేర్కొన్నారు. మహాభారతం చదివిన జ్ఞాని, హైందవతత్వం పరిపూర్ణంగా తెలిసిన నేత సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు కరిపించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఈ యాగం చేపట్టారని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలని ఆశీస్సులు అందించారు. చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని చెప్పారు. యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్‌వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్‌వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్లో కేసీఆర్ ఉండేది కేవ లం 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫాంహౌస్‌లోనే ఆయన ఉండబోతున్నారు’అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రగతి భవన్.. కేసీఆర్ కుటుంబ భవన్ తప్ప తెలంగాణ ప్రజలది కాదు. కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్ల దోపిడీ చేసింది. అందుకే అడుగడుగునా బీఆర్ఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో... ఇది తెలంగాణ ప్రజల నినాదం’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తుంటే వాటిలో పాల్గొనే తీరికలేని, కుట్రలు చేసే సీఎం తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేత టి. ఆచారిల సమక్షంలో మాజీ మంత్రులు సి. కృష్ణయాదవ్, జె.చిత్తరంజన్‌దాస్, సిర్పూర్ జెడ్పీటీసీ రేఖా సత్యనారాయణ, మరో నేత బండల రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి, ఈటల, అరుణ కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సర్వేల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి ఖాయమని తెలియడంతో కేసీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఅర్ఎస్కు ఓటేసినట్టేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు కాదు... 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. పార్టీ గెలుపునకు కృషి: కృష్ణయాదవ్, చిత్తరంజన్‌దాస్ ‘రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ చెప్పారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో నా పాత్ర కూడా ఉంటుందని అనుకుంటున్నా’అని పేర్కొన్నారు. తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగనుంది: ఈటల ‘బీఅర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారని... రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోందని చెప్పారు. డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. -
బీజేపీ అసంతృప్తుల వరుస భేటీలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ముఖ్యనేతలు కొందరు తరచూ సమావేశం కావడం పార్టీ లో కలకలం సృష్టిస్తోంది. అసంతృప్త నేతలుగా భావిస్తున్న వీరంతా ఇటీవలి కాలంలో రెండు, మూడుసార్లు భేటీ అవడంతో.. వీరెందుకు సమావేశమవుతున్నారు? ముఖ్యోద్దేశమేమిటి? అనే చర్చ సాగుతోంది. పార్టీని వీడెందుకేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్టు జరుగుతున్న ప్రచారం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే బీఆర్ఎస్తో బీజేపీకి దోస్తీ లేదని అధినాయకత్వం సుస్పష్టం చేయడంతో పాటు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ కమిటీ వేయడం, తదితర చర్యలు తీసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు, పార్టీ కేడర్‌కు స్పష్టత ఇవ్వాలనేది కొందరు నేతల డిమాండ్‌గా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కొందరు నేతలు ఏకంగా మోదీ, అమిత్‌షా, ఇతర జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పు బట్టడమే కాకుండా, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యతనివ్వకపోవడం లాంటి అంశాలను లేవనెత్తుతుండడంతో..అసలు ఏం జరుగుతోంది? అనే సందేహాలు రాష్ట్ర నేతలను, పార్టీ కేడర్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఫామ్‌హౌస్‌లో పలు అంశాలపై చర్చ తాజాగా ఆదివారం నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు తదితరులు హాజరైనట్లు సమాచారం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసి తమ అభిప్రాయాలను స్పష్టం చేయాలని, తాము చేసిన సూచనలకు అనుగుణంగా జాతీయ నాయకత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వీరు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ లో జరుగుతున్న పరిణామాలు, తమ ప్రమేయం, సంబంధం లేకుండానే కొందరిని బీజేపీలో చేర్చుకోవడం, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు జాతీయ నాయకత్వం అత్యధిక ప్రాధాన్యతనివ్వడం.. ముఖ్యనేతలుగా, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా అవమానించే పద్ధతుల్లో వ్యవహరించడం తదితర అంశాలు ఫామ్‌హౌస్ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సోమవారం పలువురు నేతలు, తన శ్రేయోభిలాషులు, అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనే కొనసాగాలా? కాంగ్రెస్‌లో చేరాలా.. వద్దా? వంటి అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని అంటున్నారు. -
ఫామ్‌హౌస్‌లో మృతదేహం పూడ్చివేత
రంగారెడ్డి: ఓ ఫామ్‌హౌస్‌లో గుర్తు తెలియని మహిళ శవాన్ని పాతిపెట్టిన విషయం ఆదివారం చేవెళ్లలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలకేంద్రంలోని కనకమామిడి మల్లారెడ్డి అనే రైతు ఫామ్‌హౌస్‌లో సత్తయ్య, కల్పన అనే ఇద్దరు భార్యాభర్తలు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈనెల 7న సత్తయ్య, కల్పనలు ఓ మహిళ, మరో వ్యక్తిని ఫామ్‌హౌస్‌కు తీసుకువచ్చారు. వారు తమ అన్నావదినలుగా యాజమానికి పరిచయం చేశారు. శుక్రవారం సత్తయ్య, కల్పనలు తమ ఇంటి వద్ద గొడవలు జరుగుతున్నాయని ఇంటికి వెళ్తున్నామని మల్లారెడ్డికి చెప్పి వెళ్లారు. దీంతో ఆయన నిన్న వచ్చిన మీ అన్నావదినలు ఎక్కడని అడగ్గా వాళ్లు నిన్ననే వెళ్లిపోయారని చెప్పారు. ఆదివారం పొలం వద్ద పైపులైన్ పగిలిపోవటంతో సరిచేసేందుకు మల్లారెడ్డితో పాటు మరో వ్యక్తి వెంకట్‌రెడ్డి, డ్రైవర్ శేఖర్లు వెళ్లారు. దీంతో సామగిన్రి తీసుకువచ్చి గది పక్కనే ఉన్న గేట్ వాల్‌ను బంద్ చేసేందుకు వెళ్లా రు. అక్కడే మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు శవాన్ని బయటకు తీసి తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐలతో శవ పంచనామా చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ నేత ఫామ్‌హౌస్‌లో పోలీసుల తనిఖీ
రాయచోటి : ముంబై డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యుడు విడిది చేసిన టీడీపీ నేత ఫామ్‌హౌస్‌ను రాయచోటి డీఎస్పీ మహబూబ్‌బాషా, అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాయచోటి–రాజంపేట మార్గంలోని ఓదివీడు సమీపంలో ఉన్న టీడీపీనేత ఫామ్‌హౌస్‌ను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్ మాఫియాతో టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఆ పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డ్రగ్స్ మాఫియా కలకలం వారిలో మరింత వేదనకు గురిచేస్తోంది. మరోవైపు కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడిలు తెస్తున్నట్లు సమాచారం. వారం రోజుల కిందట డ్రగ్స్ మాఫియా సభ్యుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అతని అరెస్టుతో పాటు అక్కడే ఉన్న కొంత మాదక ద్రవ్యాన్ని కూడా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టుకెళ్లారు. డ్రగ్స్ ముఠా మాఫియాతో టీడీపీ నేతకున్న సంబంధాలపైన కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆశ్రయం కల్పించిన ఆ టీడీపీ నేతకు చెందిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలన చేస్తున్నట్లు రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. వారి కుటుంబసభ్యుల సెల్‌ఫోన్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విడిది చేసిన ఫామ్‌హౌస్‌ను, పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి పలు అనుమానాలను నివృత్తి చేసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మాఫియా ముఠా పరిస్థితులపై ముంబై పోలీసులు అందించే సమాచారం కోసం వేచిచూస్తున్నామని సీఐ తెలిపారు. డ్రగ్స్ మాఫియా సభ్యుడితో టీడీపీ నేతకున్న సంబంధాలు, ఈ ప్రాంతంలో మరేతర వారితో ఉన్న వ్యాపార సంబంధాల పైన కూడా మా కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా డ్రగ్స్ ముఠా సభ్యుడికి ఆశ్రయంకల్పించిన టీడీపీ నేతపై ఆ పార్టీ నేతలు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. -
రూ.19 కోట్లతో కోహ్లీ లగ్జరీ ఫోమ్ హౌస్
-
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్‌స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్‌ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్‌స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్‌తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్‌లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
రూ.19 కోట్ల లగ్జరీ ఫామ్‌హౌస్,క్రికెట్ పిచ్ కూడా: విరాట్ కోహ్లీ క్లారిటీ
అటు క్రికెట్ వరల్డ్ ఇటు గ్లామర్ ప్రపంచంలోని పవర్ అండ్ స్వీట్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ కోట్లాది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. వీరు ఏం చేసినా ఫ్యాన్స్‌కు అదో సంచలనమే. తాజాగా వీరి ఫామ్ హౌస్‌లో క్రికెట్ పిచ్‌ను నిర్మించనున్నారనే వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 11, 2017న వివాహం చేసుకుని అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ విరుష్కగా ఫ్యామస్ అయ్యారు. వీరికి 2021లో ఆడబిడ్డ (వామిక) జన్మించింది. 2022లో విరుష్క జంట గణేష్ చతుర్థి శుభ సందర్భంగా విలాస వంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. అలీబాగ్‌లోని జిరాద్ సమీపంలో 8 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. దీని విలువు దాదాపు రూ. 19 కోట్ల 24 లక్షల 50 వేలు అని అంచనా. దీంతోపాటు ఈ జంటకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి ముంబై, గుర్గావ్లో రెండు లగ్జరీ భవనాలతో పాటు, కొన్ని ఇతర విలువైన ఆస్తులతో ఈ జంటది కింగ్-సైజ్ జీవితమని ఫ్యాన్స్ నమ్ముతారు. అయితే తాజా సమాచారం ప్రకారం లగ్జరీ ఫామ్‌హౌస్ నిర్మాణానికి సంబందించిన అన్ని అనుమతులు పొందిన కోహ్లీ నిర్మాణ పనులను షురూ చేశాడు. ఇటీవల (ఆదివారం) ఈ ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించాడట. ప్రకృతి ప్రేమికులైన విరుష్క జంట విలువైన ఇన్పుట్లు ఇస్తున్నారట. చక్కటి నిర్మాణ శైలి, పచ్చదనంతో నిండి వుండేలా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌కి సూచించారట. రియల్ ఎస్టేట్ కంపెనీ సమీరా హాబిటాట్స్ ద్వారా సేకరించిన భూమిలో ఉదయన్ మజుందార్ అండ్ బ్లాంకా బ్రేవో రేయిస్ ఆధ్వర్యంలో ఈ విలాసవంతమైన ఫామ్‌హౌస్ సిద్ధమవుతోంది. మాండ్వా జెట్టీకి కేవలం 10 నిమిషాల దూరంలో అలీబాగ్‌లోని ఆవాస్ గ్రామంలోని 4BHK విల్లా, ఇది విల్లాలో నాలుగు బెడ్రూమ్లు, రెండు కవర్ కార్ గ్యారేజీలు, పౌడర్ రూమ్‌లతో నాలుగు బాత్రూమ్లు, టెర్రస్, అవుట్డోర్ డైనింగ్, ఒక ప్రైవేట్ పూల్, చాలా అవుట్డోర్ ఓపెన్ స్పేస్, స్టాఫ్ క్వార్టర్స్ తోపాటు ముఖ్యంగా కోహ్లీ మేరకు ఈ ప్రాంగణంలోనే క్రికెట్ పిచ్ కూడా ఏర్పాటు చేయనున్నారట. సో.. అతను కావాలనుకున్నపుడు క్రికెట్ ప్రాక్టీస్ చేయవచ్చు లేదా ఫ్రెండ్స్ వచ్చినపుడు సరదాగా ఆడుకోవచ్చునేది ప్లాన్.అయితే ఇటీవల సోషల్ మీడియా ఎండార్స్మెంట్ల వార్తలపై స్పందించిన ఈ స్టార్ క్రికెటర్ తాజా ఊహాగానాలపై కూడా స్పందించారు. అయితే ఈ వార్తలను విరాట్ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీలో కొట్టి పారేశారు. -
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలలో, కేటీఆర్‌కు వంద ఎకరాలలో ఫామ్ హౌస్‌లు, రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీలు, పేపర్లు వచ్చాయి కానీ దత్తత తీసుకున్న పాలమూరు మాత్రం పడావు పడిందన్నారు. ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిపించిన మహబూబ్‌నగర్ జిల్లాకు, జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఆదివారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాధ అమర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమరెందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లును అమ్మి పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ సీఎం అయి తొమ్మిదేళ్లయినా అతీగతీ లేకుండా పోయిందన్నారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీ ఏమైందన్నారు. వక్ఫ్ భూములనూ వదలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వక్ఫ్ భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఏ దందాలో చూసినా బీఆరెస్ నేతలే ఉన్నారని, వాళ్ల అరాచకాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌లో చేరడం అభినందనీయమన్నారు. పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని, అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్ హెచ్చరించారు. -
Anasuya Bharadwaj : అనసూయని ఎత్తుకున్న భర్త.. మామిడితోటలో అలా! (ఫోటోలు)
-
ప్రకృతి ఒడి.. ప్రశాంత లోగిలి!
కరోనా మహమ్మారి జీవనాన్ని కొత్త దారిలో తీసుకెళ్తోంది. పట్టణాల్లో చిన్న పని దొరికితే చాలు.. అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తు అయినా పరవాలేదు.. సర్దుకుపోదాం అనే ధోరణి ఇప్పుడు తగ్గుతోంది. కాస్తంత రెంటు ఎక్కువైనా.. వ్యక్తిగత ఇల్లు మేలు అనే భావన ఇప్పుడు అధికమవుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పట్టణానికి కాస్త దూరమైనా ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు ప్రకృతితో మమేకమై జీవించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. – సాక్షి, కర్నూలు డెస్క్ నంద్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ వెంచర్ రూపుదిద్దుకుంటోంది. మహానంది మండలం బుక్కాపురం వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్లో 12 విల్లాలను ఒక్కొక్కటి 25 సెంట్ల స్థలంలో నిర్మించనున్నారు. మిగిలిన స్థలం అంతా పచ్చదనానికి కేటాయిస్తున్నారు. అంటే.. ప్రశాంత జీవనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ వెంచర్‌ను చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించని పరిస్థితి. అంతో ఇంతో స్థలం ఉందంటే అపార్ట్మెంట్, లేక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఆలోచన వస్తోంది. ఈ కారణంగా కనుచూపు మేరలో కాంక్రీటు వనాలే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి . అపార్ట్మెంట్ సంస్కృతి ఇటీవల కాలంలో అధికమైంది. ఉపాధి, ఉద్యోగంలో భాగంగా పట్టణాల్లో ఉండాల్సి రావడంతో ఎక్కడికక్కడ అపార్ల్మెంట్లు పుట్టుకొచ్చాయి. ఐదు అంతస్తులతో, వందలాది నివాసాలతో కూడిన ఈ కాంక్రీటు వనాలు మనుషులను దగ్గర చేస్తున్నా, మనసులను దూరంగా ఉంచుతున్నాయి. పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారుగా బతికేస్తున్నారు. ఇక ఇటీవల కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో ఇలా ఇరుకిరుకు ప్లాట్లలో కాకుండా ఊరికి దూరంగా విశాలమైన వ్యక్తిగత ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పచ్చని చెట్లు కనుమరుగు పట్టణాల పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్క గ్రామాలు అందులో విలీనం అవుతున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి విస్తరిస్తుండటంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. శివారు కాలనీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పుట్టుకొస్తుండగా.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించక తప్పని పరిస్థితి. కొంత స్థలం ఉందంటే చాలు.. రెండు ఇల్లు కట్టుకొని, ఒకటి బాడుగకు ఇచ్చుకోవడమో.. లేదంటే అపార్ట్మెంట్ కడితే జీవనానికి కాస్త ఊరట కలిగిస్తుందనే ఆశ పచ్చని చెట్లకు శాపమవుతోంది. పల్లెకు పోదాం.. పట్టణాల్లో వాతావరణం రోజురోజుకూ కాలుష్యంతో నిండుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా సేదతీరుదామంటే చెట్టు నీడను వెతుక్కోవాల్సిందే. సెంటు స్థలం ఉందంటే చాలు రోడ్డు పక్కనైతే దుకాణం కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంటి ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి దూరంగా, పల్లెలకు సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు కొంటున్నారు. పదవీ విరమణ వయస్సు తర్వాత పల్లె వాతావరణంలో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. అభిరుచికి అనుగుణంగా వెంచర్లు కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 3 నుంచి 5 సెంట్ల స్థలాలతో వెంచర్లు ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 25 సెంట్ల స్థలాలతో వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, అధికారులు, వైద్యులు ఈవిధమైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రియల్టర్లు ఇలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని అందుకు అనుగుణంగా వెంచర్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కూడా పరిమితంగా ఉంటుండటం విశేషం. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడుపుతాం పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎమ్మిగనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సొంత పొలంలోనే ఫాంహౌస్ కట్టుకున్నాం. ఉన్న ఇద్దరు కుమారులు మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రశాంతత లేదని చెబుతుంటారు. చిన్నబ్బాయి హర్ష ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు, ఇంటిల్లి పాది సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతం మాకు ఎంతో అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎంతో ఆరోగ్యం. – మాచాని నాగరాజు ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఇల్లు కరోనా నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేం. నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా అధికం కావడంతో ఇరుకు ప్రాంతాల్లో సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఇటీవల వ్యక్తిగత ఇల్లు నిర్మించుకున్నాం. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రాంతంలో నివాసం ఉంటే వ్యాధుల బారి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. – హరగోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కర్నూలు -
111 జీఓ రద్దు ఎఫెక్ట్.. ఇక నో ఫాం హౌస్..! వారికి ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు
సాక్షి, సిటీబ్యూరో: నిన్న వరకు పచ్చని పంట పొలాలు.. మామిడి, సపోటా.. జామ, గులాబీ, బంతి, చేమంతి ఇతర పూలు, పండ్ల తోటలతో కనువిందు చేసిన ఆ ప్రాంతంలో.. 111 జీఓ ఎత్తివేసి ఆంక్షలు తొలగించడం ద్వారా రాబోయే రోజుల్లో గెటెడ్ కమ్యూనిటీలు.. విల్లాలు.. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలతో రద్దీగా మారనుంది. ఇప్పటి వరకు పక్షుల కిలకిలారావాలకు.. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ఆ పరిసరాలు ఇకపై వాహనాలు, పారిశ్రామిక రణఘొణ ధ్వనులతో మార్మోగనుంది. స్వచ్ఛమైన గాలిని పంచిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ అలలు ఇకపై మురుగునీటి దుర్వాసనను వెదజల్లుతూ ముక్కుపుటాలను అదరగొట్టనున్నాయి. వాయు కాలుష్యంతో పగటి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకపోయినా.. ఈ ప్రాంతాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, నీటి కోసమే.. జంటనగరాలకు తాగునీరు అందించేందుకు అప్పటి నిజాం ప్రభుత్వం నగరానికి పశ్చిమాన ఆరు టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించారు. నగరవాసులకు ఏళ్ల తరబడి ఈ నీళ్లే జీవనాధారంగా మారాయి. జనాభాతో పాటు నగర విసీ్త్రర్ణం, తాగునీటి అవసరాలు కూడా అనూహ్యంగా పెరగడంతో ప్రభుత్వం సింగూరు, ప్రాణహిత నదుల నుంచి తాగునీటిని తరలించారు. ఆ తర్వాత ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల నుంచి నీటిని తరలిస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో 111 జీఓను తీసుకొచ్చింది. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్లు.. 7 మండలాలు.. 84 గ్రామాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాల భూమిని ఈ జీఓ పరిధిలోకి తీసుకొచ్చింది. పంటల సాగు మినహా ఇక్కడ ఎలాంటి వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించింది. ఫలితంగా నీరు కలుషితం కాకుండా సమస్త ప్రాణి కోటికి జీవనాధారంగా మారింది. అంతేకాదు నగరానికి పై భాగంలో నిర్మించిన ఈ నదుల్లోని నీటి అలలపై వీచే స్వచ్ఛమైన, చల్లని గాలి ఆ పరిసర ప్రాంతాలను అహ్లాదంగా మార్చింది. పండ్లు, పూల తోటలకు నెలవు.. జంట జలాశయాల చుట్టూ సారవంతమైన భూములు ఉండటంతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేశారు. వీటి చుట్టూ ఫెన్సినింగ్లు, ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఫాంహౌస్‌లు నిర్మించి వీకెండ్లో కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి సేదతీరే వారు. మిగిలిన ఖాళీ భూముల్లో పండ్లు, పూల తోటలు సాగు చేయించారు. ఎటూ చూసినా ఎత్తైన చెట్లు కన్పించేవి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ. వర్షాలు సమృద్ధిగా కురిసేవి. వాతావరణ కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం 111 జీఓ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో పండ్లు, పూలు, కాయకూరల సాగుతో ఇప్పటి వరకు సిటిజన్ల అవసరాలు తీర్చిన ఈ ప్రాంతం.. భవిష్యత్తులో ఆ అవసరాలు తీర్చలేకపోచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాన మరో కొత్త నగరం.. నగరానికి పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ఇటు బెంగళూరు హైవేకు.. అటు ముంబై హైవేలకు మధ్యలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఓఆర్ఆర్ ఉండటం పెట్టుబడిదారులకు కలిసి వచ్చే వచ్చే అంశం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, స్టార్ హోటళ్లు వెలవనున్నాయి. మొత్తంగా ఇక్కడ మరో కొత్త నగరం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. జీఓ కారణంగా ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయిన ఆయా గ్రామాలు ఇకపై మరో కొత్త నగరంలో అంతర్భాగమై అభివృద్ధిలో దూసుకుపోనున్నాయి. వీరికి ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు ప్రభుత్వం ఎత్తివేసిన జీఓ 111 ప్రాంతవాసులకు ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు లభించనున్నాయి. ఔటర్ అంచున ఉన్న మంచిరేవుల, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పురా, బుద్వేల్, రాజేంద్రనగర్, కొత్వాల్‌గూడ, రాళ్లగూడ, తొండుపల్లి, శంషాబాద్, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ, తదితర ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో సదుపాయంతో జీఓ 111 ప్రాంతానికి చెందిన ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి రాయదుర్గం, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు.. ఇలా ఎక్కడికై నా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్నట్లుగానే శంషాబాద్ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
HYD: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లు, శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు శనివారం రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్‌లోని పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్ బక్స్, హాట్కప్ పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. మొయినాబాద్ పరిధిలోని ఫామ్హౌజ్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్, ముషీరుద్దిన్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్ హౌజ్‌లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్ చేశారు పోలీసులు. -
సైబరాబాద్ శివారు ఫాంహౌస్లపై ఎస్వోటీ పోలీసుల దాడులు
-
హైదరాబాద్ శివార్లలోని 32 ఫామ్‌హౌస్‌లపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్‌హౌస్‌లపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం దాడులు చేపట్టారు. మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలి, శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్‌హౌస్, మేడ్చల్‌లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్‌హౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ల నుంచి మద్యం సీసాలు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 32 ఫామౌస్‌లలో తనిఖీలు చేపట్టగా.. 26 మంది అరెస్ట్ చేశారు. చదవండి: కేసీఆర్ నోట పదేపదే ఈటల మాట.. దీని వెనక మతలబు ఏంటీ? -
లారీలో ‘హోమ్’ డెలివరీ.. ఏమిటీ కంటైనర్ హోమ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాత ఆరోగ్యకరమైన జీవితంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎక్కడా రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రియ ఆహార ఉత్పత్తులు తింటూ పచ్చని ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. కనీసం ఇంటి చుట్టూ నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. ఫలితంగా ఫామ్‌హౌస్‌లకు, ఫామ్ ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఫామ్‌హౌస్‌లు కొనుగోలు చేయలేనివారు ఫామ్ ప్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఫామ్ ప్లాట్లలో నివాస భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కంటైనర్ హోమ్స్ (మాడ్యులర్ హోమ్స్)కు గిరాకీ పెరిగింది. ఇల్లులా ఏర్పాటు చేయడానికి అవసరమైనవన్నీ ఫ్యాక్టరీలో తయారు చేసి, లారీలో తీసికొచ్చి బిగించేస్తున్నారు. శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో ఈ తరహావి ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది ఫామ్ ప్లాట్లలో కంటైనర్ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి పచ్చని వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు. ఏమిటీ కంటైనర్ హోమ్? ►కంటైనర్ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్ స్టీల్ షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్ (పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు. ►ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూత ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్ (పీపీవీసీ)లతో రూపొందిస్తారు. ►తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్సులేషన్‌తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వేడి ఇంటి లోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల తక్కువ ఉష్ణోగత ఉంటుంది. ►నిర్మాణ సామగ్రి తయారీలో బహుళ జాతి కంపెనీలైన సెయింట్ గోబైన్, గైప్రోక్ల నైపుణ్య కార్మికులు ఈ కంటైనర్ హోమ్స్‌ను తయారు చేయడంలో సిద్ధహస్తులు. స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. మన అభిరుచుల మేరకు హాల్, కిచెన్, బెడ్రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు.. ఈ కంటైనర్ హోమ్స్‌కు స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. ఈ కంటైనర్ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. వీటిని మెటల్‌తోనే తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం ఉండదు. కరోనా టైంలో కట్టించా.. నా పేరు కిశోర్, డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కరోనా రెండో దశలో మా కుటుంబ సభ్యులకు వైరస్ వచ్చింది. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జనావాసాలకు దూరంగా ఇల్లు ఉంటే బెటర్ అనిపించింది. దీంతో విశాఖపట్నంలోని కోడూరులో ఉన్న ఫామ్ప్లాట్లో రెడీమేడ్ ఇల్లు కట్టించుకోవాలనుకున్నా. తక్కువ ఖర్చుతో, త్వరగా పూర్తయ్యే ఇల్లయితే బాగుంటుందని పరిశోధన చేసిన తర్వాత 1,200 చ.అ. 2 బీహెచ్‌కే మాడ్యులర్ హోమ్ కట్టించుకున్నా. 4 నెలల్లో నిర్మాణం పూర్తయింది. రూ.20 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కరోనా బెడద తొలగడంతో సొంతింటికి వచ్చేశాం. కానీ ప్రతి వీకెండ్‌కు అందరం అక్కడికి వెళ్లి పచ్చని వాతావరణంలో గడిపి వస్తున్నాం. హోటల్ రూమ్‌కు బదులు చిన్న ఇంట్లో.. నా పేరు చైతన్య. విజయవాడలో వ్యాపారిని. నాకు పటాన్‌చెరులోని ముత్తంగిలో 1,600 గజాల స్థలం ఉంది. పని మీద హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒకట్రెండు రోజులో సిటీలో ఉండాల్సి వస్తుంది. లాడ్జిలో లేదా తెలిసిన వాళ్ల ఇళ్లల్లో ఉండే బదులు నా సొంత స్థలంలో చిన్నపాటి ఇల్లు కట్టించుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. అలా 1,100 చ.అ మాడ్యులర్ హోమ్ కట్టించుకున్నా. చ.అ.కు రూ. 1,300 చొప్పున రూ.14.30 లక్షలు అయింది. ఇంటీరియర్, ఇతరత్రా వ్యయాలు కలిపి మొత్తం రూ.16 లక్షలు ఖర్చయింది. సిటీకి వచ్చినప్పుడల్లా ఇందులోనే ఉంటున్నా. స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారేమోనన్న భయం కూడా పోయింది. ఫామ్‌హౌస్‌లలో డిమాండ్ ఉంది కరోనా తర్వాతి నుంచి కంటైనర్ హోమ్స్‌కు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ఫామ్ ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటిల్లో ఈ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్యామిలీకి అవసరమైన వసతులన్నీ ఈ కంటైనర్ హోమ్స్‌లో ఉంటుండటంతో వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. – భరత్ తేజ్, ఎండీ, అర్బన్ శాస్త్ర స్మార్ట్ బిల్డ్ -
ఫామ్ హౌస్ కేసుపై BL సంతోష్ సంచలన వ్యాఖ్యలు
-
ఫామ్‌హౌజ్ కేసు.. బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై కర్ణాటక నేత, బీజేపీ సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నగరంలో జరిగిన బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆరోపణలు చేసిన వాళ్లు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదు. నేనంటే ఎవరికీ తెలియదు. కానీ, తెలంగాణలో ప్రతీ ఇంటికి నా పేరు తీసుకెళ్లారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా డబ్బులు పంపుతున్నారంటూ విమర్శించారాయన. -
కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్‌ఫ్లాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీపై బురద జల్లేందుకు కల్వకుంట్ల కుటుంబం కుటిల యత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు కథ, స్క్రీన్–ప్లే, దర్శకత్వం, నిర్మాతగా అన్నీ తానై సీఎం కేసీఆర్ తీసిన ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ పసలేని విమర్శలు చేస్తోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ డబ్బు ఎర వేస్తూ పోలీసులకు పట్టుబడిందంటూ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వీడియోలు ప్రదర్శించారని... కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉండగానే ఆ వివరాలు సీఎంకు ఎలా చేరాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫోన్లు రికవరీ చేయలేదేం? రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఏర్పడేలా కేసీఆర్ ‘సిట్’ ఏర్పాటు చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను, వాటిలోని డేటాను కేసీఆర్ ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. ‘ఈ కేసు విచారణ సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ఆయా ఎమ్మెల్యేలకు, కేసీఆర్ కొత్త సినిమా దర్శకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. తాను భద్రాచలం, రామప్ప అభివృద్ధికి నిధులు తెచ్చానని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘తెలంగాణకు త్వరలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వస్తుంది. ప్రస్తుతం ట్రాక్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నడపాలని నిర్ణయించాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
ఫౌంహౌస్ కేసులో రామచంద్రభారతి, నందు విడుదలకు లైన్ క్లియర్
-
ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం జనాలకు ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారట. అందుకే తమ పీఏలు, అనుచరులతో పనులు చక్కబెడుతున్నారని టాక్. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫాంహౌజ్‌కే పరిమితం.? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీకే 13 దక్కాయి. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన భీరం హర్షవర్థన్‌రెడ్డి కూడా తర్వాతి కాలంలో కారెక్కి హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హర్షవర్థన్‌రెడ్డితో పాటు.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు ఆ ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాతి నుంచి తమ నియోజకవర్గాలకు రావటం లేదు. దీంతో వారు ప్రజలకు ముఖం చాటేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు ఆ వ్యవహారంలో తలదూర్చారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే వారిద్దరు మాత్రమే ప్రగతిభవన్‌ను వదలటం లేదు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఇంటెలిజెన్స్ సూచన మేరకే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతుండటం విశేషం. ప్రభుత్వం కూడా వీరికి భద్రత పెంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు సమకూర్చింది. ఆయినా వారు నియోజకవర్గాల్లోకి రావడానికి భయపడుతున్నారు. గోడకెక్కిన గువ్వల అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు అతికించటం కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లలో ఫోటోలు కూడా పెట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డిపై దాడి.. వికలాంగుడిపై దాడి.. గిరిజన సర్పంచ్‌పై దాడి.. ఫారెస్టు ఆఫీసర్‌పై దాడి.. సీఎం పర్యటనలో నన్నే ఆపుతావారా అంటు సీఐపై చిందులు వేశారంటూ పోస్టర్లలో ప్రచురించారు. వీటిని స్దానికులు ఆశ్చర్యంగా చూస్తుండటం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోస్టర్ల వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: (హీటెక్కిన తెలంగాణ పొలిటికల్ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?) తమ నేతను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. గతంలో కూడ పలు సందర్భాల్లో గువ్వల బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత ఎమ్మెల్యేపై తిట్లపురాణంతో సాగుతున్న ఫోన్ సంభాషణలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వందకోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యేను తరమికొట్టాలని.. అందుకు అన్నివర్గాల వారు సహకరించాలని..ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయి కష్టాలు కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ మారి ఆనేక విమర్శలు ఎదుర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారిన నాయకుడు డబ్బు కోసం ఇప్పుడు కూడా మారడని గ్యారెంటీ ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సఖ్యత లేని కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. దిద్దుబాటు చర్యలకు అధిష్టానం పెద్దగా చొరవ చూపకపోవటంతోపాటు.. ఫామ్ హౌజ్ వ్యవహారంతో పార్టీకి నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొల్లాపూర్‌కు రావాలని ప్రయత్నించినా స్దానికంగా ఉండే తన అనుచరుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడ ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యే వైరివర్గం నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపధ్యంలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల బాటపడతారో లేక ఫాంహౌస్ కేసు తెగేంతవరకు దూరంగా ఉంటారో చూడాలి. -
Telangana: ఫాంహౌజ్ కేసు.. హైకోర్టుకు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాంహౌజ్ కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అయితే.. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును నిందితులు ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు(శనివారం) విచారణ సాగనుంది. -
ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ప్రాపర్టీ కూల్చివేత
-
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ). పిటిషనర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు ఏఏజీ. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు ఏఏజీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదనలను తోసిపుచ్చారు. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదన్నారు. మరోవైపు.. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో చేసిందని ఆరోపించారు బీజేపీ న్యాయవాది. పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని కోరారు. ఇదీ చదవండి: సెంటిమెంట్లకు చోటు లేదు.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిర్దోషులుగా ఉరిశిక్ష ఖైదీలు -
జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణకు వీలుగా పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మార్చుకున్న టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం అందుకు ఆమోద ముద్ర వేయడమే తరువాయి బరిలో దిగాలని భావిస్తోంది. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి విదితమే. అయితే పేరు మార్పునకు సంబంధించి ఈసీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై దాదాపు నెలరోజుల క్రితమే సమాచారం ఇచ్చినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘భారత్ రాష్ట్ర సమితి’పేరుతో సారూప్యత కలిగిన మరికొన్ని పార్టీలు కూడా ఉండటంతో టీఆర్ఎస్ పేరు మార్పు ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమోదం తర్వాతే ఆవిర్భావ సభపై స్పష్టత ఈసీ ఆమోదం లభించిన వెంటనే పార్టీ దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఆవిర్భావ సభను భారీగా నిర్వహించాలని దసరా రోజు తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 9న ఈ సభ నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినా..పార్టీ పేరు మార్పుకు ఈసీ ఆమోదం లభించిన తర్వాతే సభ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశ ముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే డిసెంబర్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరి చలితీవ్రత పెరిగే అవకాశాలుండటం.. ఆవిర్భావ సభ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభావం చూపే ప్రాంతాలపై ఫోకస్ ‘భారత్ రాష్ట్ర సమితి’కి గుర్తింపు లభించినా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగానే పార్టీ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభావం చూపేందుకు అవకాశమున్న పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, నాందేడ్, చంద్రాపూర్, నాగపూర్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలతో పాటు తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు అధికంగా ఉండే షోలాపూర్, భివండితో పాటు గుజరాత్‌లోని సూరత్ తదితర ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడంలోని సాధ్యాసాధ్యాలను కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. అన్ని భాషల్లోకి ఫామ్‌హౌస్ ఫైల్స్ ‘ఎమ్మెల్యేలకు ఎర’కు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్‌ను అన్ని భాషల్లోకి తర్జుమా చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆడియో, వీడియో టేపుల్లోని సంభాషణలను అన్ని భాషల్లో సబ్ టైటిల్స్ తయారు చేసి వివిధ ప్రసార, ప్రచార, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: ఫీ'జులుం'పై ఫైన్.. ఒక్కో సీటుపై రూ.2 లక్షల జరిమానా -
ఫామ్ హౌస్ లీక్స్..
-
‘వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ సీఎం కేసీఆర్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు బయటపెట్టారు. ఈ వీడియోలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై సెటైరికల్ కామెంట్స్‌తో కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేసీఆర్ చూపించిన వీడియోల్లో ఏమీలేదు. ఫస్ట్ షో.. సెకండ్ షో అన్నాడు. చివరికి కామెడీ షో అయింది. కేసీఆర్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారు. లిక్కర్ కేసులో ఎప్పుడైనా అరెస్ట్‌లు జరగొచ్చు. ఈ ఎపిసోడ్ అంతా పెద్ద డ్రామా. ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైంది. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే సీఎస్, డీజీపీని పిలిపించాడు. వాళ్లకు ఫామ్‌హౌస్ ఎపిసోడ్ మొత్తం వివరించారు. ఫామ్‌హౌస్‌లో నేనింతే.. నా బతుకు ఇంతే అనే సినిమా తీశారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆ నలుగురు ఆణిముత్యాలను మాత్రం ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్లో డబ్బులు ఎక్కడా చూపించలేదు. 26న ఘటన జరిగితే.. సాక్షుల సంతకాలు 27న ఎలా తీసుకుంటారు?. ఇదంతా ప్లాన్ ప్రకారం కేసీఆర్ డైరెక్షన్లోనే నడిచింది. అమిత్‌షా పేరు చెప్పినంత మాత్రాన ఆయనతో సంబంధాలు ఉన్నట్లేనా?. తుషార్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. -
కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు: తరుణ్ చుగ్
-
సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సవాల్
సాక్షి, ఢిల్లీ: ఫామ్ హౌస్ వీడియోలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే వీడియోలపై ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఆలయంలో ప్రమాణం చేశారన్నారు. ఈ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘మునుగోడులో అధికారం దుర్వినియోగం చేసింది. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వరుకు మంత్రులు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. నిజ నిజాలేంటో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు’’ అని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్‌కు తన ఎమ్మెల్యేలపై ఎందుకు విశ్వాసం లేదు అంటూ ఆయన ప్రశ్నించారు. మీ దగ్గర అమ్ముడుపోయే ఎమ్మెల్యేలే ఉన్నారా?. సీఎం కేసీఆర్ సినిమా కట్టుకథలు వినిపిస్తున్నారు. సెవెన్ స్టార్ ఫాంహౌస్‌లో కూర్చుని కథలు రచిస్తున్నారు. ముగ్గురు బ్రోకర్లలో ఎవరితోనూ తమకు సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ప్రజలు చరమగీతం పాడతారని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? -
ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాల కూల్చివేత చిన్న విషయం కాదు : కేసీఆర్
-
క్యాసినో కింగ్ చికోటితో ఆర్జీవీ భేటీ.. త్వరలో సినిమా?
రామ్‌గోపాల్ వర్మ.. నిత్యం ఏదో ఒక వివాదానికి పురుడు పోస్తూ జనం నోళ్లలో నానే వ్యక్తి. చికోటి ప్రవీణ్.. నిన్న మొన్నటి దాకా కేసులంటూ స్టేషన్ల చుట్టూ తిరిగిన వ్యక్తి. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? అది కూడా నగరానికి దూరంగా ఫాం హౌజ్ లో సిట్టింగ్ వేస్తే జరిగే చర్చ ఏంటీ? క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యాడు. చికోటీ ప్రవీణ్ కుమార్ ఫాంహౌజ్‌కి వెళ్లి మరీ ఆయనను కలిశాడు. ఈ సందర్భంగా చికోటీ ఫాంహౌజ్‌లో ఉన్న జంతువును సందర్శించాడు ఆర్జీవీ. ఈ విషయాన్ని ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. ‘వైల్డ్ మ్యాన్ చికోటి ప్రవీణ్‌తో కలిసి అతని వైల్డ్ పాంహౌజ్ని సందర్శించాను. అతని అన్యదేశ అడవి జంతువుల సేకరణ చాలా ఆకట్టుకుంది’అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. An IGUANA in Chikoti Praveen’s hands ..He treats it like his own baby 🙏 pic.twitter.com/KjGhqixTDv — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022 కాగా ఇటీవల క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీపై చీకొటి ప్రవీన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆర్జీవీ అతన్ని కలవడంతో సర్వాత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే చికోటిపై ఆర్జీవీ సినిమా చేయనున్నాడా? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి వారిద్దరు ఏం చర్చించారు? సినిమా గురించా?, క్రైం గురించా? లేక జరిగిన క్రైంపై సినిమా తీయడం గురించా? అనేది తెలియాలంటే ఆర్జీవీ నుంచి మరో ట్విట్ వచ్చే వరకు ఆగాల్సిందే. Chikoti Praveen showing off his beautiful OSTRICH ..THEY LOVE EACH OTHER 💪💪💪 Never seen a man who’s more passionate about wild animals than CHIKOTI PRAVEEN 👌 pic.twitter.com/pZjgojtHI1 — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022 -
ఎడిటర్ కామెంట్ : ఫామ్ హౌస్ వ్యవహారం పై ఆశ్చర్యపోని ప్రజలు ..!
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో ట్విస్ట్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భిన్నమైన తీర్పులు
-
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే.. ఆ వెంటనే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన మరో బెంచ్.. దర్యాప్తుపై స్టే విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. చదవండి: (దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీకి రఘునందన్‌రావు ఫిర్యాదు
-
ఈడీ ఆఫీస్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: అధికార పక్ష టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. కౌంటర్ యాక్షన్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా.. మరోవైపు యాదాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడిపై ప్రమాణంతో ఈ వ్యవహారంతో తమకేం(బీజేపీ) సంబంధం లేదని చాటిచెప్పే యత్నం చేశారు. ఇక ఇప్పుడు.. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన ‘ఎమ్మెల్యే కొనుగోలు అంశం’పై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ.100 కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఆయన ఈడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: దేవుడి మీద ఒట్టు.. నాకేం తెలియదు! -
మా పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేశాం
-
తెలంగాణాలో ఫామ్ హౌస్ ట్రేడ్ ప్రకంపనలు
-
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టు తిరస్కరణ
-
మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైకోర్టులో బీజేపీ పిటిషన్
-
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ గురువారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని కోరింది. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్లో బీజేపీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురిచేసే క్రమంలో భారీ ఆపరేషన్‌ను చేపట్టినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పిటిషనర్ పేర్కొనగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దర్యాప్తు ముమ్మరం మరోవైపు ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ కేసులో.. దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఫాంహౌజ్ లో క్లూస్ టీం తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ సీఐల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరన్న కోణంలో దర్యాప్తును సాగిస్తున్నారు. ఇప్పటికే ఆడియో, వీడియో సహా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
ఫామ్ హౌస్ డీల్ పై కేసు నమోదు
-
ఫామ్‌హౌజ్‌లో జరిగిందంతా పెద్ద చిల్లర డ్రామా: డీకే అరుణ
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. తమ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుండగా.. తమకు అలాంటి అవసరమే లేదని బీజేపీ చెబుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 84 సీసీ కెమెరాల్లో ఈ ఆపరేషన్ దృశ్యాలు రికార్డయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నుంచి సంప్రదింపులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఫామ్‌హౌజ్‌లో గంట 20 నిమిషాల వీడియో ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాడీవోర్న్ కెమెరాలో సంభాషణ దృశ్యాలు రికార్డ్ అయిన దృశ్యాలను సేకరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి చివరకు రంగంలోకి దిగారు. చదవండి: బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 8. సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులను లోపలికి రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లోనే ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగధీశ్వర్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. పట్టుబడ్డ కారు, నగదు సైతం అక్కడే ఉంది. చదవండి: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనపై గురువారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రలోభ పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వినిపిస్తున్న ఈ కేసులో కీలకంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రగతిభవన్లోనే ఉన్నారు. బేరసారాల ఆడియో టేపులు ఉన్నాయని ఎమ్మెల్యేలు అంటున్న నేపథ్యంలో.. వాటిని కూడా మీడియా ముందు బయటపెట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
మూడు వారాలైంది.. ఫామ్‌హౌజ్ నుంచి బయటకు రాడా?
అగ్రరాజ్యంపై విసుర్లు, పొరుగు దేశంపై కవ్వింపు చర్యలు, గ్యాప్ లేకుండా క్షిపణుల పరీక్షలు, ప్రజల సంక్షేమం సంగతి పక్కనపెట్టి మరీ వాళ్లను కష్టపెట్టేలా కఠిన చట్టాలు.. ఆ చట్టాల అమలును దగ్గరుండి మరీ చూస్కునే స్వభావం.. ఉత్తరకొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మాత్రమే సొంతం. అలాంటి కిమ్ 20 రోజులకు పైగా బయట కనిపించడం లేదు. కిమ్ జోంగ్ ఉన్ మీడియా కెమెరాల కంటికి చిక్కి 23 రోజులు అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇన్నేసి రోజులు ఆయన కనిపించకుండా ఉండడం ఇదే. దీంతో కిమ్‌కు ఏమై ఉంటుందన్న చర్చ తెర మీదకు వచ్చింది. అయితే.. నిత్యం ఏదో ఒక చర్యతో, చేష్టలతో వార్తల్లో నిలిచే కిమ్ జోంగ్ ఉన్.. మూడు వారాలుగా ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. కిందటివారం సైన్యం నిర్వహించిన క్షిపణి పరీక్షలోనూ, దేశంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరతపై సమీక్షలోనూ కనిపించకపోవడంతో.. కిమ్ గైర్హాజరు వెలుగు చూసింది. అయితే కిమ్ ఎక్కడ? అనే చర్చ జోరుగా నడిచింది అక్కడ. ఈ క్రమంలో.. ఉత్తర కొరియాకు ఈశాన్య దిశగా ఉన్న భారీ ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రాణతీపితో.. అక్టోబర్, నవంబర్ ఉత్తర కొరియాలో ఫ్లూ సీజన్. కరోనా విజృంభించే అవకాశాలు ఎక్కువ. దీంతో మాస్క్ ధరించడం మళ్లీ తప్పనిసరి చేస్తూ.. కరోనా ఆంక్షలను కూడా అమలులోకి తెచ్చారు అధికారులు. ఈ తరుణంలో రిస్క్ ఉంటుందనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించడం లేదనే సమాచారం అందుతోంది. ఫామ్‌హౌజ్‌లో ప్రస్తుతం ఆయన సేదతీరుతున్నట్లు సమాచారం. అయితే.. అక్టోబర్ 10వ తేదీన అధికార పార్టీ 77వ ఆవిర్బావ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సి ఉంది. కాబట్టి, కిమ్ జోంగ్ ఉన్ ఆ రోజు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇన్నేళ్లలో ఆయన వార్షికోత్సవాన్ని తప్పింది లేదు. ఒకవేళ.. ఆరోజు కూడా కిమ్ హాజరుకాకపోతే గనుక.. అది అనుమానించాల్సిన విషయమే!. గత ఏడేళ్లలో కిమ్ బయట కనిపించకుండా ఎక్కువ రోజులు ఉంది.. కిందటి ఏడాది అక్టోబర్-నవంబర్ రెండు నెలల్లో 35రోజుల పాటు!. అంతకంటే ముందు 2021 మే నెలలో ఆరోగ్య సంబంధిత కారణాలతో నెలపాటు అజ్ఞాతంలో గడిపారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (NIS) మాత్రం కిమ్‌కు ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలేవీ తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని దక్షిణ కొరియా ప్రభుత్వానికి నివేదించింది. -
సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ భూములు పోతాయనే అలైన్మెంట్ మార్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వాస్తానికి రింగ్‌రోడ్డు.. సంగారెడ్డి చౌరస్తా నుంచి సదాశివపేట, సీఎం ఫాంహౌస్æ మీదుగా వెళ్లాల్సి ఉండగా దాని అలైన్మెంట్ మార్చిన కారణంగా భువనగిరి పట్టణం, కలెక్టరేట్‌ను అనుకొని ఉన్న రాయగిరి భూములు పోతున్నాయన్నారు. యాదాద్రి జిల్లా రాయగిరి రైతులు సోమవారం ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన రైతులతో మాట్లాడుతూ.. రైతుల కోసం తాను ఎంతటి త్యాగానికి, పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇంకా ఫైనల్ కాలేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని.. దసరా తర్వాత మరోసారి ఢిల్లీకి వెళ్లి గడ్కరినీ కలుద్దామని రైతులకు చెప్పారు. అంతకుముందు రాయగిరి, చౌటుప్పల్ మండలం భూనిర్వాసితులు యాదాద్రి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి వారి నుంచి వినతిపత్రం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది. అయితే ఆయన నివాసం నుంచి ఫామ్‌హౌజ్‌కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు. అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి -
కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా.. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే గాడిదలు పెంచుకోవడం నయం!
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఒకరికి కింద భయపడుతూ పని చేయడం కంటే సొంత వ్యాపారం మేలనుకున్నాడో గ్రాడ్యుయేట్. చీటికి మాటికి బాసులు పెట్టే టార్చర్లు భరించడం కంటే జంతువులతో మసలుకోవడం మేలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఫార్మ్‌హౌస్ బాట పట్టాడు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరుకు పేరు. ఒక్క కర్నాటక యువతనే కాదు దేశం నలుమూలల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం యువతరం బెంగళూరు వైపు చూస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆధారంగా అనేక స్టార్టప్‌లు పుట్టుకు వచ్చి యూనికార్న్ కంపెనీలుగా ఎదిగిన ఘనత కూడా ఈ నగరానికే సొంతం. అలాంటి బెంగళూరు నగరం వీడిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు పల్లెబాట పట్టాడు. గాడిదలు పెంచుకుంటూ లక్షలు కూడబెడుతున్నాడు. సాఫ్ట్వేర్ వదిలి శ్రీనివాస గౌడ్ అందరిలాగే గ్రాడ్యుయేష్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ కలలతో బెంగళూరులో వాలిపోయాడు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గ కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ ముందు వాలిపోయాడు. కానీ ఒకరి కింద పని చేయడంలో ఉండే అసంతృప్తి అతన్ని వేధించాయి. తన మనసుకు నచ్చిన పని చేయాలని డిసైడ్ అయ్యాడు. కడక్తో మొదలు కోవిడ్ కల్లోలం 2020లో ప్రపంచాన్ని పలకరించింది. బెంగళూరు వీడి దక్షిణ కన్నడ జిల్లాలోని సొంతూరైన ఐరాకు చేరుకున్నాడు. అప్పుడే తెలిసింది తన మనసు ఏం కోరుతుందో. వెంటనే జాబ్‌కు రిజైన్ చేశాడు. ఇంటి దగ్గరున్న రెండున్నర ఎకరాల స్థలంలో కడక్‌నాథ్ కోళ్లు, కుందేళ్ల పెంపకం ప్రారంభించాడు. కంప్యూటర్ ముందు కాలు కదపకుండా పని చేయాలనే భావనలో యువత ఉంటే, చిత్రంగా కోళ్లు, కుందేళ్లు అంటూ పరితపించే శ్రీనివాస్‌ను అంతా వింతగా చూశారు. గాడిదల కోసం రెండేళ్లు గడిచిన తర్వాత మార్కెట్ మరింతగా అర్థమైంది శ్రీనివాస్‌కి. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అతని పేరు వెలుగులోకి రావడానికి కారణమైంది. ఎవ్వరి ఊహకు అందని విధంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మేలురకం గాడిదల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఓ రేంజ్ వరకు కోళ్లు, కుందేళ్లు ఒకే కానీ ఈ గాడిదల పెంపకం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా అన్నట్టుగా చూశారు అంతా. మార్కెటింగ్ కర్నాటక అంతా గాలించి చివరకు 20 గాడిదలు సాధించి వాటితో ఫామ్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి గాడిద పాలు మార్కెటింగ్ చేయడం కోసం బెంగళూరుతో పాటు కర్నాటకలో ఉన్న ఇతర నగరాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి అతనికి నిరాశ ఎదురు కాలేదు. ఊహించినదాని కంటే అనేక రెట్లు అధికంగా రెస్పాన్స్ వచ్చింది. మాకు కావాలంటే మాకు కావాలంటూ బయ్యర్లు ఎగబడ్డారు. నా అంచనా నిజమైంది - శ్రీనివాసగౌడ గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ చిన్న పిల్లల్లో ఉబ్బసం వ్యాధికి ఔషధంగా గాడిద పాలు పట్టిస్తారు. అయితే ఆ రోజుల్లో ఊళ్లలో రజకల దగ్గర గాడిదలు ఉండేవి. బరువులు మోసే పనులకు వీటిని ఉపయోగించేవారు. కానీ మెషినరీ పెరిగిపోయిన తర్వాత అన్ని చోట్ల గాడిదల సంతతి తగ్గిపోతుంది. గాడిద పాలు దొరకం లేదనే విషయం గమనించాను. అందుకే గాడిదలో ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడందరూ నన్నో పిచ్చోడిలా చూశారు. కానీ ఫామ్ ఏర్పాటు చేసిన ఆరు నెలలకే నాకు రూ. 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఇవి సప్లై చేయడమే కష్టంగా ఉంది. ఇంకా డిమాండ్ కూడా పెరుగుతోంది. చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో -
హైదరాబాద్: ఫాంహౌస్‌పై పోలీసుల దాడి.. 10 మంది విదేశీయులు అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఓ ఫాంహౌస్‌పై శుక్రవారం అర్ధరాత్రి ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. పది మంది విదేశీయులు, నలుగురు నగరవాసులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన కీషబ్ డేవిడ్ హైదరాబాద్‌కు వచ్చి టోలిచౌకిలో నివాసం ఉంటోంది. ‘కూల్ బైదీ కూల్’ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆన్లైన్లో ఓ యాడ్ అప్లోడ్ చేసింది. రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లిస్తే బీరు ఫ్రీ అంటూ యాడ్‌లో పేర్కొంది. ఇందుకుగాను మొయినాబాద్ మండలం, శ్రీరాంనగర్ రెవెన్యూలో ఉన్న న్యూ గ్రీన్ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకుంది. పారీ్టకి వెళ్లేందుకు సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ మూసా ఉమర్, అబ్దుల్ బాసిత్ హమీద్ అలీ, అబ్దుల్ కరీంవాడి ఇస్మాయిల్, కెన్యాకు చెందిన ఖతీబ్, కాంగో దేశానికి చెందిన కింపలో మయిండో, చాంద్ దేశానికి చెందిన అబకాకా, కేమరూన్ దేశానికి చెందిన గంజి, టాంజానియా దేశానికి చెందిన సౌము మహ్మది, బత్రోమేవ్ విట్నెస్ విల్లి, హైదరాబాద్‌కు చెందిన వాసింఖాన్, సయ్యద్ ఇర్ఫాన్, సయ్యద్ అమీద్, అనుగుల వంశీ బుక్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. పార్టీ జరుగుతుండగా శనివారం తెల్లవారు జామున శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఫాంహౌస్‌పై మెరుపుదాడి చేశా రు. నిర్వాహకురాలితో పాటు పది మంది విదేశీయు లు, నలుగురు నగర యువకులను, ఫాంహౌస్ నిర్వాహకుడు నిహల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 120 బీరు బాటిళ్లు, నాలుగు ఓడ్కా బాటిళ్లు, ఐదు రకాల హుక్కా ఫ్లేవర్స్, సెల్ ఫోన్లు, స్విఫ్ట్ కారును స్వాదీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు -
కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించిన ధాన్యాన్ని కొనకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తామనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిని సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు ఇది జీవన్మరణ సమస్య అని.. రాష్ట్రాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తున్నవాళ్లం ఈ అంశంపై మౌనంగా చూస్తూ ఉండబోమని చెప్పారు. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ శనివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గతంలోనూ వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధంకావాలి. ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆ సమావేశం ముగిశాక సోమవారం సాయంత్రమే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను నిలదీద్దాం. అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేద్దాం. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు..’’అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానితులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఉద్యమాన్ని తలపించేలా.. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగి కరెంటు కష్టాలు తీరడంతో ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు పెరిగిందని.. ధాన్యం కొనుగోళ్ల విషయంగా గత యాసంగి, వానాకాలాల్లో కేంద్రం మెలిక పెట్టడంతో ఇబ్బంది ఎదురైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. తనతోపాటు రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం వైఖరి నిరసిస్తూ ధర్నా చేసినా స్పందన కనిపించలేదని చెప్పారు. రాష్ట్రంలో సాగునీరు ఉన్నా కేంద్ర వైఖరిని దృష్టిలో పెట్టుకుని వరి సాగు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర రైతులు సుమారు 36 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని.. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతులు ఇబ్బందిపడటం ఖాయమని తెలిపారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీ నాయకులు.. ఈ అంశంపై మాత్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో కార్యాచరణ రూపొందించుకుని కేంద్రం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణలో కేవలం పార్టీ యంత్రాంగమే కాకుండా.. రైతులను, వివిధ వర్గాలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. బీజేపీ రాజకీయాన్ని నిలదీయాలి మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం సుదీర్ఘంగా సుమారు నాలుగు గంటలకుపైగా సాగింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తలెత్తే పరిణామాలు, కేంద్రం వైఖరి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏ తరహా కార్యాచరణ చేపట్టాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘‘రాష్ట్రంలో బీజేపీ అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషాన్ని కక్కుతున్న తీరును ప్రజలకు వివరించాలి..’’అని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. జాతీయ రాజకీయాలు, ముందస్తు ప్రస్తావన లేదు! రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్, వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అంశాలను మంత్రులతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే జాతీయ రాజకీయాలు, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రస్తావనేదీ రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలు, సభలతో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అవేవీ పెద్దగా ఫలితం ఇవ్వబోవని అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పరుగుపరుగున ఫామ్‌హౌజ్‌కు.. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, అధికారులు సమావేశానికి రావాలంటూ శనివారం ఉదయమే పిలుపు అందింది. అప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో ఉన్న వీరంతా హుటాహుటిన ఫామ్‌హౌజ్‌కు వరుస కట్టారు. మంత్రులు టి.హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు సీఎం భేటీకి వచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల కార్యక్రమంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు అందరికంటే చివరిగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం ఫామ్‌హౌజ్‌కు రావాలని మంత్రులందరికీ అకస్మాత్తుగా పిలుపు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివిధ రకాల ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ►ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5.30 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. వ్యవసాయ క్షేత్రంలోనే మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేశారు. స్వల్ప విరామం తర్వాత తిరిగి సమావేశాన్ని కొనసాగించారు. ►టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం పొద్దునే అమెరికా పర్యటనకు బయలుదేరడంతో ఈ భేటీకి హాజరుకాలేదు. ►మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి పలు అధికారిక కార్యక్రమాల కారణంగా సమయానికి ఫామ్‌హౌజ్‌కు చేరుకోలేకపోయినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఫాం హౌస్‌లో మంత్రులతో ముగిసిన భేటీ.. తగ్గేదేలే అంటున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం అత్యవసరంగా మంత్రులు, అధికారులతో ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు. -
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్.. జరిగింది ఇదే!
సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్ గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్‌హౌజ్‌లో 17 ఏళ్ల యువకుడు గన్‌తో ఆడుతూ ఫైర్ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు ‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్ హౌస్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్‌హౌజ్‌లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్‌కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్‌తో అడుతూ ఫైర్ చేశాడు. దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. -
సంగారెడ్డిలో ఎయిర్ గన్ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలింది. పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంలో శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప గాయపడింది. దీంతో బాలికను హుటాహుటినా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్! అయితే చికిత్స పొందుతూ తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందింది. పాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ ఘటన మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగినట్లు పఠాన్ చెరువు డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. ప్రసాద్ అనే వ్యక్తి ఫామ్ హౌజ్‌లో సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
ఆ ఫాంహౌస్ కేటీఆర్‌ది కాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్ మంత్రి కె.తారకరామారావుది కాదని, అయినా ఆయనే యజ మాని అంటూ తప్పుడు సమాచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారని కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టులో నివేదించారు. జీవో 111 పరిధిలోని జన్వాడ ఫాంహౌస్‌లో అక్రమనిర్మాణాలు చేపట్టారంటూ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలంటూ కేటీఆర్, ఫాంహౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఏవైనా నిర్మాణాలు చేపట్టినా 8 నెలల్లోగా ఎన్జీటీకి ఫిర్యాదు చేయాల్సి ఉందని, దాదాపు ఆరేళ్ల తర్వాత రేవంత్‌రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారని, కాలాతీతమైన తర్వాత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే పరిధి ఎన్జీటీకి లేదన్నారు. ఫాంహౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చకుండా ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. జలాశయాలను కాపాడేందుకే... హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టకుండా జీవో 111 తీసుకొచ్చారని రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 2020 ఫిబ్రవరిలో జన్వాడ ఫాంహౌస్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా తెలిసిందని, పరిశీలించేందుకు అక్కడికి వెళ్తే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. జీవో 111 పరిధిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా జలాశయాలను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అయితే, ఎన్జీటీ ఉత్తర్వులపై రివ్యూ చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు నివేదించారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ జన్వాడ ఫాంహౌస్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో లేదో పరిశీలించి నివేదిక సమర్పించేందుకు నిపుణులతో కమిటీ వేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
కేసీఆర్ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి: బండి సంజయ్
-
సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు.. కలకలం రేపుతున్న వ్యక్తి ఆరోపణలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల కేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ.. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని , అంతేకాకుండా సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీనిపై ముంబయి కోర్టులో సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపిస్తూ.. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను పాతిపెడుతున్నారంటూ కేతన్ కక్కడ్ అసత్య ఆరోపణలు చేశాడని, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు.. కేవలం కల్పితాలని సల్మాన్ న్యాయవాది కోర్టుకు వివరించాడు. అయితే ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారమని, అందుకోసమే సల్మాన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సదరు వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెలియజేశాడు. కాగా, సల్మాన్ ఖాన్ తన పరువునష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ల పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆయా సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు. -
సల్మాన్ ఖాన్ని కాటేసిన పాము.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలింపు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం వీకెండ్ విడిది కోసం శనివారం ఫామ్ హౌస్‌కి వెళ్లాడు. అర్థరాత్రి దాటక అతని కాలుపై పాము కాటేసింది. దీంతో అతని వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే సల్లూ భాయ్‌ని విషం లేని పాము కాటేసిందని, దాని వల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్ తిరిగి తన ఫామ్ హౌస్‌కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, కొన్ని రోజుల పాటు ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. (Salman Khan 56th birthday: సల్లూ భాయ్‌కి హ్యాపీ బర్త్‌డే) -
సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో యువకుడి మృతి
సాక్షి, మర్కూక్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో పనికి వెళ్లిన యువకుడు మూర్ఛ వ్యాధితో బావిలో పడి మృతిచెందాడు. వర్ధరాజ్‌పూర్‌కు చెందిన ఆర్.ఆంజనేయిలు(19) కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూలి పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం కొంతమంది కూలీలతో కలసి ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. పెద్దబావి పక్కన ముళ్లపొదలను తొలగిస్తుండగా మూర్ఛ రావడంతో అందులోకి జారిపడ్డాడు. పక్కనే ఉన్న కూలీలు పనిలో నిమగ్న మై అతడిని గమనించలేదు. ఎంతకీ కనిపించకపోవడంతో బావిలో పడిఉండొచ్చని భావించి కుటుంబసభ్యులకు తెలిపారు. సాయంత్రం గజ ఈతగాళ్లతో బావినీటిలో గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం మళ్లీ గజ ఈతగాళ్లు బావిలో గాలింపుచర్యలు చేపట్టగా ఆంజనేయులు మృతదేహం లభించింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తండ్రి కిష్టయ్య ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు మర్కూక్ పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ విలపించారు. చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడి.. పదేళ్లు శిక్ష.. -
టెస్లా తెచ్చిన మినీ ఇల్లు.. కారులో ‘ఫామ్’ హౌస్, ధరెంతో తెలుసా?
‘సంచారమే ఎంత బాగున్నది...’ అంటూ ట్రావెలింగ్‌తో ప్రపంచాన్ని చూడాలనుకునేవాళ్లకు శుభవార్త. వెళ్లిన చోటల్లా డేరాలతో క్యాంపింగ్ అక్కర్లేదు. ఇప్పటిదాకా మనకు కారావాన్లే తెలుసు. దానికంటే చిన్నసైజులో తక్కువ ఖర్చుతో విలాసవంతమైన మినీ ఇల్లును కార్ల దిగ్గజం టెస్లా అందుబాటులోకి తెచ్చింది. అది సైబర్ట్రక్కు అటాచ్ చేసుకుని తీసుకెళ్లగలిగే మినీహోమ్. ‘ఫామ్’గా పిలిచే దీని ఖరీదు 51 లక్షలు. రోడ్డుపై దూసుకెళ్తూ.. 2019లో టెస్లా సీఈఓ ఎలన్‌మస్క్ సైబర్ ట్రక్‌ను ఆవిష్కరించారు. బుల్లెట్‌ప్రూఫ్ విండోస్ దీని ప్రత్యేకత. ఈ సంవత్సరం మేలో వీధుల్లోకి వచ్చిన ఈ కారును కొనేందుకు వందలాది మంది న్యూయార్క్‌లోని టెస్లా షోరూమ్ ముందు క్యూ కట్టారు. ఇప్పుడు ఈ ట్రక్కు అనుసంధానించగలిగే ‘ఫామ్’ను తయారు చేశారు. ఇది కాలిఫోర్నియా ఇంజనీర్స్, ఇండస్ట్రియల్ డిజైనర్ల ఆలోచన. డబుల్ బెడ్ విలాసవంతంగా... సోలార్ పవర్‌తో నడిచే 71 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ‘ఫామ్’ 454 కిలోల బరువు మాత్రమే ఉంటుందని టెస్లా చెబుతోంది. డబుల్‌బెడ్, కిచెన్, షవర్తోపాటు లివింగ్ ఏరియా కూడా ఉంది. స్టోరేజ్ అవకాశం ఉన్న ఈ బెడ్స్ ఫోల్డబుల్. అవసరం లేదనుకుంటే బెడ్‌ను పూర్తిగా తొలగించి సింగిల్బెడ్ను ఉపయోగించుకోవచ్చు. మొత్తం క్యాబిన్ నుంచి టాయిలెట్ ఓ పక్కకు ఉంటుంది. టాయిలెట్, షవర్ అవసరం లేదనుకుంటే దాన్ని కుషన్ బెంచ్గా మార్చుకోవచ్చు. ఇళ్లలో వాడే ఫ్రిజ్‌ను ఉంచే వీలుంది. స్టవ్, కుక్వేర్కోసం ప్రత్యేకమైన స్థలం ఉంది. క్యాంపింగ్ దగ్గర కిచెన్‌ను బయటికి ఓపెన్ చేసుకోవచ్చు. పైకప్పుతోపాటు కూర్చుని వంట చేసుకునే అవకాశంఉంది. ‘ఫామ్’పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ నుంచి ఫామ్‌కు అవసరమైన 400వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కిచెన్ ఇతర ట్రక్లకూ అనుసంధానం.. టెస్లా సైబర్ట్రక్తో పాటు... ఫోర్డ్ ఎఫ్–150, షెవర్లెట్ సిల్వరాడో వంటి ట్రక్‌లకు కూడా దీనిని చేసుకోవచ్చు. 2022లో మార్కెట్లోకి రానుంది. ఆర్డర్ చేయండి... మీ ఇంటికే తెచ్చిపెడతామని టెస్లా చెబుతోంది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
-
ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
Hero Naga Shourya Father Shivalinga Prasad Arrested: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టేబుల్‌కు 5 లక్షలు క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Allu Arjun And Sneha Reddys Diwali Celebrations: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె దీపావళి వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫాంహౌస్‌లో జరిగిన ఈ దీపావళి వేడుకల్లో రామ్‌చరణ్, ఉపాసనలతో పాటు మిగతా మెగా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. 'ఫాంహౌస్‌లో మా దీపావళి పార్టీ. డెకరేషన్ అంతా స్వయంగా స్నేహ దగ్గరుండి చేయించింది..దీపావళి వైబ్స్' అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అల్లుఅర్జున్, స్నేహరెడ్డి స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో సందడి చేశారు. ముఖ్యంగా స్నేహ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని సౌందర్యం అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి చదవండి: ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా! View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఏపీ టీడీపీ నేతలతో గుత్త సుమన్ చౌదరి కి సంబంధాలు
-
ఫామ్ హౌస్ పేకాట కేసులో గుత్తా సుమన్ చౌదరి రెండోరోజు పోలీస్ కస్టడీ
-
నాగశౌర్య ఫామ్‌హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట -
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: టేబుల్‌కు 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట కేంద్రాలను సీఎం కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసివేయించారు. పేకాట ఎక్కడ ఆడినా.. ఆడించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ అనేక పేకాట క్లబ్బులను మూసివేయించి కఠిన చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది పేకాటను చీకటి వ్యవహారంగా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు. రకారకాల ఆఫర్లు చెప్పి, పండుగల స్పెషల్ అంటూ మూడు ముక్కలాటకు అన్ని హంగులున్న సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్‌లో పట్టుబడిన సుమన్ గ్యాంగ్ కేవలం ఒక చిన్న చేప మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పేకాట నడిపిస్తున్న మరో మాఫియా మూడు ముక్కలు.. ఆరు కోట్లు అన్నట్టుగా భారీస్థాయిలో జూదం నడిపిస్తోంది. సుమన్.. స్పెషల్ పేరిట... జి.సుమన్‌కుమార్ (జీఎస్కే) నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు, ప్రముఖులకు వాట్సాప్‌ల ద్వారా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలు పెడుతున్నామని సందేశాలు పంపిస్తాడు. పార్టీ లొకేషన్ షేర్ చేస్తాడు. ఫాంహౌజ్, గెస్ట్‌హౌజ్‌లు కిరాయికి తీసుకొని మందు, విందు భారీస్థాయిలో ఏర్పాటు చేస్తాడు. కనీసం 5 నుంచి 10 టేబుళ్లు పెట్టి ప్రముఖులకు మినీ క్యాసినో ఏర్పాటు చేస్తాడు. అయితే స్పెషల్ అట్రాక్షన్ కోసం గోవా డీలర్ల నుంచి సుమన్ క్యాసినో గరŠల్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమన్ ఆహ్వానం కోసం వీవీఐపీలంతా ఎదురుచూస్తారని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌లోనే కాకుండా వీవీఐపీలను ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, గోవా తీసుకెళ్లి కూడా జూదం ఆడిస్తాడని తెలిసింది. రెండు నెలల క్రితం సుమన్ కొంతమంది వ్యాపారులు, వీఐపీలతో కలిసి రష్యా వెళ్లాడు. అక్కడ క్యాసినోలో రూ.4.5 కోట్ల వ్యాపారం జరిపించినట్టు రష్యా వెళ్లి వచ్చిన ఓ వ్యాపారి ద్వారా వెల్లడైంది. ఇటీవల రష్యా వెళ్లినప్పుడు అక్కడ క్యాసినో ఆడుతున్న సుమన్ చౌదరి తదితరులు ఇది పెద్ద తిమింగళం... పేకాట దందాలో సుమన్‌కు మించిన ఓ తిమింగళం హైదరాబాద్ కేంద్రంగానే కోట్ల దందా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అండదండలు ఉండటంతోపాటు ఆయన కూడా జూదంలో చేయి తిరిగినవ్యక్తి కావడంతో పేకాట తిమింగళానికి అడ్డూఅదుపు లేదని నిఘా వర్గాలు చెప్పాయి. త్రీకార్డ్స్ (తీన్ పత్తా), రమ్మీ పాయింట్స్, పోకర్ ఈ మూడు రకాల పేకాటను ప్రముఖ వ్యక్తి అనుచరుడు జోరుగా సాగిస్తున్నాడు. వీవీఐపీలకు మాత్రమే తన అడ్డాలోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి 2 గంటల వరకు ఆయన దందా సాగిస్తున్నట్టు తెలిసింది. గతంలో టాస్క్‌ఫోర్స్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లోని ఓ ప్రముఖ హోటల్లో అతడిని అరెస్ట్ చేసినా సదరు నిర్వాహకుడి వ్యవహారం మారలేదని పోలీసులే చెప్తున్నారు. దందా ఎక్కడెక్కడ? బేగంపేటలోని ఓ క్లబ్బును ఏళ్లపాటు నిర్వహించిన పేకాట తిమింగళం తెలంగాణ ఏర్పడిన తర్వాత అనధికారిక కేంద్రాలను తెరిచింది. నగరానికి చెందిన ప్రముఖుడి అండ చూసుకొని కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్, దేవరయాంజాల్‌లోని 70 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్, జూబ్లీహిల్స్‌లో ప్రముఖ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ఓ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ మొత్తం, బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లోని ప్రముఖుల నివాస ప్రాంతం, సెంట్రల్ జోన్ పరిధిలోని ఆదర్శ్‌నగర్, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లోని సొంత ఫాంహౌజ్‌లో పేకాటను జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గేమ్‌కు ఐదు శాతం కమీషన్.. ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీని ఆడించే ఈ నిర్వాహకుడు ప్రతీ టేబుల్‌కు కనీసం రూ.5 లక్షలు ఉంటేనే అనుమతిస్తాడు. మూడు ముక్కలాటలో బ్లైండ్గేమ్ పేరిట జరిగే దందానే అతడికి కాసులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ గేమ్‌కి (కిట్) పాడిన మొత్తంలో 5 శాతం కమీ షన్‌గా తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి ఒక్కో గేమ్‌కి రూ.లక్ష చొప్పున ఆడినా రూ.5 లక్షలు అవుతాయి. అందులో ఒక గేమ్‌కి 5 శాతం కమీషన్ అంటే రూ.25 వేల చొప్పున వసూలు చేస్తాడు. ఇలా రోజుకు 20–25 గేమ్‌లు నడిపిస్తాడు. దీంతోపాటు రమ్మీ పాయింట్స్ 101కు ఐదుగురు రూ.5 లక్షల చొప్పున ఒక్కో గేమ్ ఆడితే రూ.25 లక్షలు అవుతుంది. ఇందులో 5 శాతం కమీషన్‌గా 1.25 లక్షలు తీసుకుంటాడు. ఇలాంటి రమ్మీ పాయింట్లు కనీసం నాలుగు గేములు ఆడుతున్నారంటే రూ.5 లక్షలు తన ఖాతాలోకి వెళ్లాల్సిందే. దీనికి అన్లిమిటెడ్ ఆఫర్‌గా ఆల్కహాల్, ఆహారం అందిస్తాడు. గోవా నుంచి వచ్చిన అమ్మాయిలను రంగంలోకి దించడం ఈ నిర్వాహకుడి ప్రత్యేకత. సుమన్‌తోపాటు అతనికి సహకరిస్తూ పేకాట సెంటర్లు నిర్వహిస్తున్న ప్రముఖ నిర్వాహకుడిపై పోలీసులు నజర్ పెట్టినట్లు తెలిసింది. -
నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి సుమన్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు. అంతా ప్రముఖులే... ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్రావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత -
సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకటరాయుళ్ల పట్టివేత
-
సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌజ్‌లో భారీ పేకాట వ్యవహారాన్ని ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. రెండు, మూడు రోజులు అడ్డావేసి పేకాట ఆడుదామని సిద్ధమైన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్ సినీహీరో నాగÔౌర్యకు చెందినదిగా ప్రచారం జరగడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. గోవాలోని కాసినోల తరహాలో.. హైదరాబాద్ శివార్లలో నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంచిరేవుల వద్ద గ్రీన్లాండ్స్ వెంచర్ ఉంది. అందులో రమణ అనే వ్యక్తి చెందిన ఫాంహౌస్‌ను సినీహీరో నాగశౌర్య ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో టీవీ సీరియళ్లు, సినిమాల షూటింగ్‌లు, పార్టీలు జరుగుతుంటాయి. అయితే దీపావళి పండుగ వస్తుండటంతో భారీగా పేకాట నిర్వహించేందుకు కొందరు ప్లాన్ చేశారు. నాలుగు రోజుల పాటు ఈ ఫాంహౌజ్‌ను వాడుకుంటామని సుమంత్ చౌదరి అనే పేరిట బుక్ చేసుకున్నారు. తరచూ గోవాలోని కాసినోలకు వెళ్లేవారిని సంప్రదించి ఇక్కడికి ఆహ్వానించారు. కాసినోల తరహాలో టేబుళ్లు, కాసినో కాయిన్లు, వందల పేకాట బాక్సులు, క్యాష్ కౌంటింగ్ మిషిన్లు, మద్యం, భోజన సదుపాయాలు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆదివారం రాత్రి దాడి చేశారు. 30 మంది అరెస్టు ఫామ్‌హౌజ్‌లోని పేకాట స్థావరంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 6.70 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. పేకాట స్థావరంలో అదుపులోకి తీసుకున్నవారి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వారిని రిమాండ్‌కు పంపే సమయంలో వివరాలు వెల్లడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్ తెలిపారు. -
సల్మాన్ ఖాన్‌లా నేనూ ఫామ్ హౌస్ కొంటాను: రణ్వీర్ సింగ్
హిందీచిత్రాల్లో ఆడిపాడి అలరించిన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ త్వరలోనే బుల్లితెరపైనా సందడి చేయనున్నాడు. బిగ్ పిక్చర్ అనే టీవీ షోకు హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈ షోకు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే బిగ్ పిక్చర్ షో కనుక హిట్ అయితే సల్మాన్ లాగే తను కూడా నవీ ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ కొంటానని చెప్పుకొచ్చాడు. ఈమేరకు మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్య, పిల్లలతో కలిసి ఉండటానికి ఓ మంచి ఇల్లు కోసం చూస్తున్నాను. అందులో పిల్లలు ఆడుకునేందుకు ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఇంట్లో అందరం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించగలగాలి. నా జీవితంలో ఇదే బిగ్ పిక్చర్' అని రణ్వీర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ షో సక్సెస్ అయితే పన్వేల్‌లో ఒక ఫామ్‌హౌస్ కొనుగోలు చేస్తానని తెలిపాడు. కాగా రణ్వీర్-దీపికా పదుకునే దంపతులు ఈ మధ్యే అలీ బాగ్‌లో కోట్లు విలువ చేసే బంగ్లా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! 5 బెడ్రూమ్లతో సువిశాలంగా ఉండే ఈ బంగ్లాకు రూ.22 కోట్లు వెచ్చించారని టాక్! ఇక ఇదే అలీబాగ్‌లో సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, రాహుల్ ఖన్నాలకు సైతం సొంత నివాసాలు ఉన్న విషయం విదితమే! -
Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు
‘ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ’ అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. ‘చెడు అనవద్దు వినవద్దు కనవద్దు’ అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం... ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే. గాంధీ జయంతి వస్తే తెలిసిన విషయాలు మళ్లీ తెలుస్తూ ఉంటాయి. కాని అంతగా తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. గాంధీజీకి ప్రపంచ మహనీయులతో గాఢస్నేహం ఉండేది. రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ రచనలతో గాంధీజీ ప్రభావితం అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫామ్’ పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని నడిపారు. చార్లిచాప్లిన్, గాంధీజీ ఉత్తరాలు రాసుకునేవారు. లండన్ వెళ్లినప్పుడు గాంధీజీని చార్లిచాప్లిన్ ప్రత్యేకంగా కలిశారు. గాంధీజీ ప్రభావంతో చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమా తీశారని అంటారు. ఐన్‌స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట తెలిసిందే– ‘ఈ భూమి మీద ఇలాంటి మానవుడు నడయాడాడని తెలుసుకుని భావితరాలు ఆశ్చర్యపోతాయి’. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్తో గాంధీకి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గాంధీజీకి ‘మహాత్మ’ అనే సంబోధనా గౌరవం ఇచ్చింది టాగోర్ అంటారు. ఆ తర్వాత గాంధీ పేరు ముందు మహాత్మ ఒక ఇంటి పేరులా మారిపోయింది. ► గాంధీజీ ఫుట్‌బాల్ ప్రియుడు. ఆయన ఎప్పుడూ ఆ ఆట ఆడకపోయినా సౌత్ ఆఫ్రికాలో ఉండగా వర్ణవివక్ష వ్యతిరేక స్ఫూర్తిని కలిగించేలా జొహన్నాస్బర్గ్లో, ప్రెటోరియాలో రెండు ఫుట్‌బాల్ టీమ్‌లను స్థాపించాడు. ► గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని విశ్వసించేవారు. ఒకసారి గోపాలకృష్ణ గోఖలే అనారోగ్యం పాలైతే గాంధీ ఆయనకు చాలా తేలికపాటి ఆహారం ఇవ్వసాగారు. గోఖలే దీనిని వ్యతిరేకించినా ఆయన వినలేదు. అంతేనా... ఇద్దరూ ఎక్కడికైనా ఆతిథ్యానికి వెళితే ‘గోఖలే ఏమీ తినడు’ అని ముందే ప్రకటించేసేవారు గాంధీజీ. అదే వరుసలో ఒక ఇంటికి ఆతిథ్యానికి వెళితే గోఖలే సత్యాగ్రహానికి కూచున్నారు. ‘నాకు నచ్చినవి తిననిస్తేనే కదులుతాను’ అన్నారు. గాంధీజీకి ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు గోఖలే నవ్వుతూ అన్నారట ‘చూశారా.. సత్యాగ్రాహిని సత్యాగ్రహంతోనే ఓడించాను’ అని. గాంధీజీ సుభాష్‌చంద్రబోస్‌కు కూడా డైట్ చార్ట్ ఇచ్చారు. ‘ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రక్తపోటుకు మంచిది. ఖర్జూరాలు తిను. కాని ఎండు ద్రాక్షను మర్చిపోకు. టీ, కాఫీలు ఆరోగ్యానికి అవసరం అని నేను భావించను’ అని బోస్‌కు రాశాడాయన. ► గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న గాంధీజీ స్ఫూర్తితో 12 దేశాలలో కాలక్రమంలో హక్కుల ఉద్యమాలు జరిగాయి. ► గాంధీజీకి నివాళిగా చిన్న చిన్న బస్తీలకు, వీధులకు ఆయన పేరు పెట్టడం ఆనవాయితీ. వాటి లెక్కను మినహాయిస్తే మన మొత్తం దేశంలో 53 రోడ్లకు ఆయన పేరు ఉంది. అది విశేషం కాదు. విదేశాలలో 48 రోడ్లకు ఆయన పేరు ఉంది. ► అహింసను ఆయుధంగా స్వీకరించిన గాంధీజీకి నోబెల్ బహుమతి రాలేదు. ఆయన పేరు 1937, 1938, 1939, 1947లలో నామినేట్ అయ్యింది. చివరకు ఆయన మరణించిన 1948లో ఆఖరుసారి నామినేట్ అయ్యింది. అయినా సరే నోబెల్ బహుమతి ఆయనకు రాలేదు. అన్నట్టు గాంధీజీ అంతిమయాత్ర 8 కిలోమీటర్లు సాగింది. ► 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రు దేశ స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా చేసిన చరిత్రాత్మక ప్రసంగ సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు. ► ఒకసారి గాంధీజీ ఒక మీటింగ్‌లో ఉంటే ఒక పసివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. ‘నీకు చొక్కా లేదా’ అని ఆశ్చర్యపోయాడు. ‘నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాయనా’ అన్నాడు గాంధీజీ. పసివాడికి జాలి పుట్టింది. ‘మా అమ్మ నా బట్టలు కుడుతుంది. నీకు కుట్టి తెస్తాలే’ అన్నాడు. ‘మీ అమ్మ ఎన్ని కుడుతుంది. నువ్వు ఎన్ని తేగలవు. నాలా చొక్కాలు, ఒంటి నిండా బట్టలు లేనివారు 40 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. వారు తొడుక్కోకుండా నేను తొడుక్కుంటే ఏం బాగుంటుంది’ అన్నారు గాంధీజీ ఆ పసివాడితో. ► కంప్యూటర్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్ గాంధీజీ అభిమాని. వృత్తాకార కళ్లద్దాలు గాంధీ కళ్లద్దాలుగా పేరు పొందడం తెలిసిందే. గాంధీజీ మీద గౌరవంతో స్టీవ్‌జాబ్స్ అలాంటి కళ్లద్దాలనే ధరించాడు. ► గాంధీజీ డార్జిలింగ్‌లో టాయ్‌ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఇంజన్లో సమస్య వచ్చింది. ట్రైన్ వెనక్కు నడవసాగింది. అందరూ భయభ్రాంతం అవుతుంటే గాంధీజీ తన సెక్రెట్రీకి ఉత్తరాలు డిక్టేట్ చేయసాగారు. అప్పుడు సెక్రెటరీ ‘బాపూ... మనం ఏ నిమిషం అయినా పోయేలా ఉన్నాం తెలుసా?’... దానికి గాంధీజీ జవాబు ‘పోతే పోతాం. కాని బతికితే పోతామేమో అని ఆందోళన పడిన సమయం అంతా వృధా చేసిన వాళ్లం అవుతాం. కనుక డిక్టేషన్ తీసుకో’. అన్నాడు. కాలం విలువ తెలియ చేసిన మహనీయుడు ఆయన. -
రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన ‘ది కంజురింగ్’ దెయ్యాల కొంప
వాషింగ్టన్/బురిల్‌విల్లే: దెయ్యాల గురించి ఎన్ని కథలు, సినిమాలు వచ్చినా హిట్టే తప్ప.. ఫెయిల్ అవ్వడం ఉండదు. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు, ఇళ్లు, ఆఖరికి వస్తువులు కూడా దెయ్యాల నివాసాలుగా ప్రచుర్యం పొందుతాయి. ఈ కోవకు చెందినదే అమెరికా బురిల్‌విల్లే ప్రాంతానికి చెందిన ‘రోడ్ ఐల్యాండ్’ ఫామ్‌హౌస్. ఈ ఇంటి గురించి ఆ చుట్టూ పక్కల ఎవరిని ప్రశ్నించినా.. భయంతో గజ్జున వణికిపోతారు. ఇక ఈ ఇంట్లో జరిగే వింత సంఘటనల గురించి కథలు కథలుగా వర్ణిస్తారు. రోడ్ ఐలాండ్ ఫామ్‌హౌస్‌పై ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా 2013లో హాలీవుడ్లో ‘ది కంజూరింగ్’ సినిమా తీశారు. అది బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ దెయ్యాల కొంప ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే.. తాజాగా ఈ హాంటెడ్ హౌస్‌ని వేలం వేశారు. ఆశ్చర్యంగా అది కాస్తా 1.2 మిలియన్ డాలర్లు (8,89,48,380 కోట్ల రూపాయలు) పలికి అందరిని ఆశ్చర్యపరింది. ఆ వివరాలు.. అమెరికాలోని బురిల్‌విల్లే ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిని 1826 లో నిర్మించారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతంలో ఫామ్‌హౌస్ కేవలం 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఈ ఇంట్లో మొత్తం మూడు బెడ్రూమ్లు, 1 1/2 బాత్రూమ్లు ఉన్నాయి. మొత్తంగా ఈ ఇంటిలో మొత్తం 14 గదులు ఉన్నాయి. (చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్) ఈ ఫామ్‌హౌస్ 19వ శతాబ్దానికి చెందిన పెర్రాన్ కుటుంబానికి చెందినదిగా దివంగత పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ 1971లో ప్రకటించారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మరణించిన బత్షెబా షెర్మాన్ అనే మంత్రగత్తె ఈ ఫామ్‌హౌస్‌ను వెంటాడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఫామ్‌హౌస్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది కంజురింగ్’ హర్రర్ చిత్రాన్ని ఈ ఇంటిలో చిత్రికరించలేదని.. కానీ అక్కడ నివసించిన పెర్రాన్ కుటుంబ సభ్యుల అనుభవాల ఆధారంగా రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 2013 లో సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ ఇల్లు ప్రజాదరణ పొందింది. (చదవండి: శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..) "ఈ ఇంటికి సంబంధించిన సమాజంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా డజన్ల కొద్దీ పుస్తకాలు, సినిమాలను తెరకెక్కాయి. చాలా మంది అర్హత కలిగిన పారానార్మల్ పరిశోధకులు ఇంటికి వెళ్లి దెయ్యాల గురించి పరిశోధించారు. న్యూ ఇంగ్లాండ్‌లో పురాతన దెయ్యం వేట బృందాన్ని స్థాపించిన అత్యంత ప్రసిద్ధ ఎడ్, లోరైన్ వారెన్‌లు 1970 లో ఈ ఫామ్‌హౌస్ మిస్టరీని చేధించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో వారు ‘ది కంజురింగ్’ సినిమాలో ఉన్న అనేక సంఘటనలు.. ఈ ఫామ్‌హౌస్‌లో వాస్తవంగానే జరిగాయని ధ్రువీకరించారు. "ప్రస్తుత ఈ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డులుగా ఉన్న వారు ఇంట్లో జరిగే వింతలకు సంబంధించి లెక్కలేనన్ని సంఘటనలను నివేదించారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌస్ రాత్రిపూట నిర్వహించే గ్రూప్ ఈవెంట్స్‌కి బాగా ప్రాచుర్యం పొందింది. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! -
ఫామ్‌హౌస్ పాలసీ అవసరమే!
కరోనా మొదలయ్యాక అందరిలోనూ పర్యావరణ స్పృహ పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు.. వీకెండ్ కావచ్చు కారణమేదైనా సరే సమయం దొరికితే సిటీకి దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు సేద తీరాలని కోరుకుంటున్నారు. అందుకే సామాన్య, మధ్యతరగతి వాసులు కూడా ఫ్లామ్ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 వేల గజాలపైన ఉన్న ఫామ్ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. పెద్ద సైజు ప్లాట్లను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవటంతో సామాన్యులు పర్యావరణానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్ ఫార్మింగ్, ఫామ్‌హౌస్‌లకు ప్రత్యేక పాలసీ అవసరం ఉందని ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్, అర్బన్ ఫార్మింగ్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో బడా బాబులకే పరిమితమైన ఫామ్‌హౌస్ కల్చర్.. నేడు సామాన్యులు కోరుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లకు గిరాకీని దృష్టిలో పెట్టుకొని డెవలపర్లు వందల ఎకరాలలో ఈ తరహా లేఅవుట్లను చేస్తున్నారు. సిటీకి దూరంగా 4, 5 గుంటల స్థలంలో పండ్ల మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయం పేరిట ప్లాట్లను విక్రయిస్తున్నారు. కొందరు డెవలపర్లు అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్‌ప్లాట్స్ లేఅవుట్లను చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో సామాన్యులు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో ఎక్కువగా ఈ తరహా వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్/ప్లాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకొస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఫామ్ప్లాట్లకు క్రమబద్ధీకరణ కోసం స్కీమ్‌ను తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. 20 ఎకరాలు ఉంటేనే... కనీసం 20 ఎకరాల స్థలం ఉంటేనే అర్బన్ ఫార్మింగ్ పాలసీ పరిధిలోకి వస్తాయి. ఇందులో వ్యక్తిగత ఫామ్‌ప్లాట్ల విస్తీర్ణం 9 మీటర్ల వెడల్పుతో కనీసం 500 చ.మీ. ఉండాల్సిందే. ప్రాజెక్ట్‌కు అప్రోచ్ రహదారి వెడల్పు, అంతర్గత రోడ్లు కూడా 9 మీటర్లు ఉండాలి. సెంట్రల్ ప్లాజాకు 60 అడుగుల వెడల్పు రహదారులు ఉండాలి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశం ఉండాలి. గ్రూప్ హౌసింగ్ నిర్మాణాల వలే అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లో నిర్మాణాలకు కూడా సెట్‌బ్యాక్స్ ఉంటాయి. మొత్తం సైట్ ఏరియాలో 20 శాతానికి మించి నిర్మాణాలు ఉండకూడదు. అర్బన్ ఫార్మింగ్ పరిధిలోకి ఏమొస్తాయంటే? వ్యవసాయం, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, మెడిసినల్ ప్లాంట్స్, ఆర్బోరికల్చర్, పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ సంబంధిత కార్యకలాపాలు, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ వంటివి అర్బన్ ఫార్మింగ్ కిందికొస్తాయి. పశువుల షెడ్లు, స్టోరేజ్ షెడ్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 5 శాతం వరకు నిర్మించుకోవచ్చు. కాకపోతే ఇవి ఎత్తయినవిగా ఉండకూడదు. ఆయా నిర్మాణాలు సహజ వాతావరణానికి భంగం కలిగించకూడదు. నీటి వనరులు, కొండలను తొలగించడం వంటివి చేయకూడదు. ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంత వరకు నీటి పునర్వినియోగం, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి చేపట్టాలి. క్లబ్‌హౌస్ వసతుల కోసం.. మొత్తం ఫామ్ప్లాట్ విస్తీర్ణంలో గరిష్టంగా 2 శాతం స్థలంలో మాత్రమే సెంట్రల్ స్క్వేర్/క్లబ్‌హౌస్, ప్లాజా వంటి నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. వీటి ఎత్తుపై ఎలాంటి పరిమితులు ఉండవు కానీ జీవో నంబర్ 168 హైరైజ్ బిల్డింగ్ నిబంధనలకు లోబడి ఉండాలి. ఉద్యోగులు, నిర్వహణ సిబ్బంది నిర్మించే గృహాలతో పాటు సెంట్రల్ ప్లాజాలో రైతు మార్కెట్లు, బజార్, హాట్, స్థానిక కార్యాలయాలు, హస్తకళల ఎంపోరియం, మేళా, జాయ్ రైడ్స్, ఎగ్జిబిషన్ స్పేస్ మొదలైన వాటి ప్రదర్శన వంటివి ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక కార్యకలాపాల కోసం మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో 5 శాతం స్థలం వినియోగానికి అనుమతులుంటాయి. అయితే ఆయా నిర్మాణాలకు ఎంట్రీ, ఎగ్జిట్ కోసం 12 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకమైన రహదారులుండాలి. నాలా అవసరం లేదు.. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌ల అనుమతులు, నిర్వహణ, నియంత్రణ అన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలో ఉంటాయి. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో మినహాయించి అన్ని భూ వినియోగ జోన్లలో అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టవచ్చు. కాకపోతే ఆయా జోన్ నిబంధనలకు లోబడే ఉండాలి. ఫామ్‌ప్లాట్ల ఫీజులు, డెవలప్మెంట్ చార్జీలు బిల్టప్ ఏరియా ప్రాంతానికి మాత్రమే ఉంటాయి. అవి కూడా రెసిడెన్షియల్ సైట్లతో సమానంగా ఉంటాయి. 50 ఎకరాల లోపు ఫామ్ప్లాట్లకు స్క్రూట్నీ ఫీజుగా రూ.20 వేలు, ఆ పైన వాటికి రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఫామ్‌ప్లాట్స్ ప్రాజెక్ట్‌లకు వ్యవసాయేతర భూ మార్పిడి (నాలా) అనుమతులు అవసరం లేదు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ సమయం వరకు భూమిని ఇతరత్రా అవసరాలకు వినియోగించకూడదన్నమాట. నిర్మాణాలు ఎలా ఉండాలంటే.. వ్యక్తిగత లేదా లీజు/అద్దెకు తీసుకునే ఫ్లామ్ప్లాట్ 10 శాతం స్థలంలో మాత్రమే ఫామ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులుంటాయి. గరిష్టంగా జీ+1 లేదా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం ఉండాలి. మిగిలిన స్థలాన్ని అర్బన్ ఫార్మింగ్ కోసం వినియోగించాలి. వ్యవసాయ థీమ్ పార్క్స్, అగ్రికల్చర్ టూరిజం, రిసార్ట్ టూరిజం, స్టూడియో అపార్ట్మెంట్, కొంత కాంక్రీట్ వినియోగించి నిర్మించే వెర్నాక్యులర్ హోమ్స్, గ్రామీణ జీవనశైలిని తెలిపే థీమ్ సెట్టింగ్స్ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇస్తారు. ఫామ్ఫ్లాట్ల ప్రాజెక్ట్‌లలో నీటి అవసరాల కోసం గ్రిడ్ లేదా పబ్లిక్ వాటర్ సప్లయి వ్యవస్థను వినియోగించడానికి వీలు లేదు కాబట్టి సొంతంగా నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. – సాక్షి, హైదరాబాద్ -
లక్ష నాగళ్లతో కేసీఆర్ ఫాంహౌస్‌ను దున్నుతాం
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫౌమ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అలాగే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణానికి మొదటి సంతకం చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆ«ధ్వర్యంలో నిర్వహించిన ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తూ సాగిస్తున్న దుర్మార్గాలపై ప్రజలను చైతన్యపరచడానికి ‘బడుగుల ఆత్మ గౌరవ పోరు’చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫాంహౌస్ భూములను పేదలకు పంచడం ఖాయమన్నారు. కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణను విముక్తం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. బడుగుల సమస్యలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకే కేసీఆర్ ‘దళిత బంధు’ తీసుకొచ్చారని, ఈ ఎన్నికల్లో ఓటుకు ఎన్ని లక్షలు ఇచ్చినా, మరెన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీయేనని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఎంపీ సోయం బాపూరావు, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణకు కలసి రావాలి.. ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు అందరూ కలసి రావాలని, గడీల పాలనను బద్దలు కొట్టడానికి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీసీల నేత మోదీని ప్రధానిగా, దళితుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. దళితులను మోసం చేసిన కేసీఆర్‌ను అడుగడుగునా అడ్డుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. దళిత బంధును రాష్ట్రమంతా అమలు చే యాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన భూములపై సీఎం కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, పార్టీనేతలు కె.స్వామిగౌడ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, జి. విజయరామారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఫాంహౌస్‌లో అశ్లీల నృత్యాలు.. నటి అరెస్ట్
తమిళసినిమా: విందు, విలాసాల పార్టీలు నిర్వహిస్తున్న సహాయ నటి కవితశ్రీ, అందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై తూర్పు సముద్రతీర ప్రాంతం, నీలాంగరై సమీపంలోని కానత్తూర్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్‌లో పార్టీ పేరుతో విందులు, విలాసాలతో యువతుల శృంగార డాన్సులు, రసజ్ఞులునైన యువకులతో వ్యాపారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో కానత్తూరు పోలీసులు మంగళవారం వేకువజామున ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ యువతీ యువకులు అరకొర దుస్తుల్లో మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న దృశ్యాలు పోలీసుల కంటపడ్డాయి. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. విచారణలో రామాపురానికి చెందిన శ్రీజిత్కుమార్, సినీ సహాయనటి కవితశ్రీ కలిసి ఈ పార్టీలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరు సినిమా షూటింగ్ పేరుతో ఆ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకుని విలాసాలతో కూడిన విందు పార్టీలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ పార్టీలకు యువతులను డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నట్లు విందులో పాల్గొని యువకుల నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విధంగా కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీలను నిర్వహిస్తున్న కవితశ్రీ సహా 11 మంది యువతులను, 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు. -
దొంగ అనుకుని బాలుడిపై ఫామ్‌హౌస్ యజమాని దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అని భావించి 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎంత అరిచినా సాయం చేసేవారు లేక తీవ్ర గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించిన బాధితుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో(16) బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కపాషెరా సరిహద్దు ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు వారిని దొంగలుగా భావించి, యజమాని ప్రకృత్ సాంధూను అప్రమత్తం చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని సాంధూ బాలుడు సందీప్‌ను బంధించాడు. మిగతా ఇద్దరు స్నేహితులు భయంతో పారిపోయారు. సందీప్‌ను ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. దీంతో బాలుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకున్న బాలుడు కొంతదూరంలో రోడ్డుపై పడిపోయాడు. ఎంత అరిచినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంతలో వీధి శునకాలు అతడిపై దాడి చేశాయి. కొన్ని గంటల తర్వాత సందీప్ మరణించాడు. సాయంత్రం 4.30 గంటలకు ఓ వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. సందీప్ మృతికి కారణమైన ఫామ్‌హౌస్ ఓనర్ ప్రకృత్ సాంధూ(35)తోపాటు రోహిత్(20), అతడి తండ్రి బినోద్ ఠాకూర్(62)ను అదుపులోకి తీసుకొని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ: 64 మందిపై కేసు
కడ్తాల్: లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాహకులతోపాటు మరో 64 మంది యువతీయువకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. ఇందుకు సబంధించిన వివరాలను ఆదివారం ఎస్ఐ సుందరయ్య వెల్లడించారు. ► కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో బాక్స్ ఫాంహౌస్‌లో హైదరాబాద్ నగరానికి చెందిన వరుణ్‌గౌడ్ శనివారం రాత్రి తన బర్త్‌డే వేడుకలను నిర్వహించాడు. వేడుకల్లో ఆయ న మిత్రులైన నగరానికి చెందిన 60 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. యువతీయువకులు మద్యం సేవించి డీజే సౌండ్‌తో నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ► విశ్వసనీయ సమాచారంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎస్ఓటీ సిబ్బంది, కడ్తాల్ పోలీసులు కలిసి ఫాంహౌస్‌పై దాడులు చేశారు. 47 మద్యం సీసాలతో పాటు, డీజే సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ► బర్త్‌డే వేడుకలు జరుపుకొంటున్న వరుణ్‌గౌడ్ పరారీలో ఉన్నాడని, అతడితోపాటు ఈవెంట్ నిర్వాహకులు భరత్, జీషాన్ అలీఖాన్, అన్వేష్‌తో పాటు వేడుకల్లో పాల్గొన్న 43 మంది యువకులు, 21 మంది యువతులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు తెలిపారు. చదవండి: మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా.. -
వామ్మో.. ఇది ఇంటిని మింగేసేలా ఉందిగా
కొన్ని చోట్ల ఆకస్మాత్తుగా భూమి కుంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. దీనినే సింక్ హోల్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ఓ పుట్ బాల్ గ్రౌండంతా భూమి కుంగిపోయింది. ఎక్కడంటే? మెక్సికోలోని శాంటా మారియా జాకాటెపెక్లోని ఓ పొలంలో భూమి ఉన్నట్లుండి కుంగిపోయింది. ప్రస్తుతం ఆ సింక్ హోల్ అక్కడే ఉన్న ఇంటిని త్వరలోనే మింగేసేంతలా కనపడుతోంది. సింక్ హోల్ ఏర్పడిన మొదట్లో ఆ ఇంటికి చాలా దూరంలో ఇది ఏర్పడినా.. తర్వాత మెల్లగా పెరుగుతూ ఇంటి వరకూ వచ్చేసింది. కాగా సింక్‌హోల్ చుట్టుపక్కల ఉన్న పొలంలో కుక్కలు నాలుగు రోజుల క్రితం పడిపోయాయి. వాటిని కాపాడాలని జంతుప్రేమికలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి సింక్ హోల్ నుంచి ఆ కుక్కలను రక్షించడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఇది సుమారు 125 మీటర్లు, 45 మీటర్ల లోతు ఉండవచ్చని అధికారలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ చుట్టు పక్కల 600 మీటర్ల వరకు ప్రజలను అనుమతించకూడదని మెక్సికన్ ప్రభుత్వం తెలిపింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో భూమి ఇలా ఉన్నట్టుండి కుంగిపోతుంది. VIDEO: A sinkhole that has been growing dozens of meters daily since last weekend is worrying the residents of a rural area in the Mexican state of Puebla pic.twitter.com/CJlsRjCiOP — AFP News Agency (@AFP) June 2, 2021 చదవండి: వైరల్: అమెరికా అధ్యక్షుడికి భార్య కౌంటర్.. దెబ్బకు సైలంట్ -
లాక్డౌన్: తోటపని చేస్తున్న హీరోయిన్
దొడ్డబళ్లాపురం: లాక్డౌన్ కావడంతో సినీతారలు ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితమయ్యారు. నటీమణి ఆశికా రంగనాథ్ కూడా ఫాంహౌస్‌లో కష్టపడుతోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. కుటుంబసభ్యులతో కలిసి తోటలో పనిలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె చెబుతోంది. దర్శన్ తదితర పలువురు హీరోలు కూడా ఫాంహౌస్‌లో సేద్యం పనులు చేయడం తెలిసిందే. చదవండి: కోవిడ్ ఎఫెక్ట్: హీరోయిన్ పెళ్లి వాయిదా చదవండి: నావి దొంగిలించవద్దు: నటుడికి సమంత సూచన -
కేజీఎఫ్ స్టార్ యశ్ ఫామ్‌హౌజ్ చూశారా?
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా యశ్ తలరాతను మార్చేసింది. అతడిని స్టార్ హీరోగా అందలం ఎక్కించింది. ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది ఇండస్ట్రీ గర్వపడేలా చేసింది. అప్పట్లో బాహుబలి 2 కోసం జనాలు ఎంతలా ఎదురుచూశారో ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జూలై 16న రిలీజ్ అవుతున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా ఆ టైం వరకు సినిమాను కంప్లీట్ చేయాల్సిందేనని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ‘చాప్టర్-2’ ఫైనల్ కట్ నిడివి కొంచెం ఎక్కువయ్యిందని సమాచారం. ఎలాగో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి కాబట్టి నిడివి ఎక్కువగా ఉన్నా చూస్తారని, కాబట్టి లెంగ్తీ రన్ టైంతోనే నడిపించాలని డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు వినికిడి. ఇక ఈ సినిమా కోసం యశ్ దాదాపు రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. ఇదిలా వుంటే కరోనా వల్ల సినిమా షూటింగ్స్‌కు కొంత బ్రేక్ పడటంతో యశ్ తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లాడు. అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందులో యశ్.. జేసీబీలతో తన పొలాన్ని పంటకు సిద్ధం చేయిస్తున్నాడు. ఎక్కడ ఏం చేయాలో దగ్గరుండి ఆదేశాలిస్తున్నాడు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.. చదవండి: వైరల్: విలాసవంతమైన యశ్ ఇల్లు చూసేయండి -
భార్యకు ఖరీదైన గిఫ్టిచ్చిన ఎన్టీఆర్!
జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి బర్త్‌డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మార్చి 18న లక్ష్మి ప్రణతి పుట్టినరోజు వేడుకలు జురుపుకుంది. ఈ నేపథ్యంలో తన అర్ధాంగికి విలువైన కానుకను సమర్పించాడట హీరో. సిటీలో ఓ పెద్ద ఫామ్ హౌస్‌ను భార్య పేరిట రాయించాడట. ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అదే ఫామ్‌హౌస్‌లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇచ్చిన కానుకకు ప్రణతి ఎంతో సంతోషించినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ 2011 మే 5న ప్రణతి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ దంపతులు 2014లో అభయ్ రామ్‌కు, 2018లో భార్గవ్ రామ్‌కు జన్మనిచ్చారు. ఇదిలా వుంటే అభిమానుల ప్రేమకు తానెప్పుడూ దాసోహమే అని చెప్తుండే ఎన్టీఆర్‌కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు ఆయన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో కొందరు అభిమానులు స్టేజీ పైకి దూసుకొస్తూ తారక్‌ను కాసేపటివరకు ఉక్కిరిబిక్కిరి చేశారు. అభిమానుల అత్యుత్సాహంపై ఎన్టీఆర్ కాస్త అసహనం ప్రదర్శించాడు. చదవండి: నా కష్టసుఖాల్లో ఉన్నది ఆ ఇద్దరే: ఎన్టీఆర్ తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో! -
పంథా మారిన భూ విక్రయాలు.. ‘ధరణి’ సమస్యలే కారణం
సాక్షి, మెదక్: గ్రామీణ ప్రాంతాల్లో భూ విక్రయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల కాలంలో పల్లె భూములపై ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో భూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. కరోనా ప్రభావంతో నగరాలు, జిల్లా కేంద్రా ల్లో నివసిస్తున్న మధ్యతరగతి, ఉన్నత వర్గాల జీవన శైలిలో మార్పు తెచ్చింది. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో వారానికొక్క రోజైనా గడపాలన్న ఆకాంక్షను రెట్టింపు చేసింది. ఫైనాన్స్, ఇతర రంగాల్లో కంటే భూములపైనే పెట్టుబడులు పెట్టేలా ఆలోచనా సరళిని మార్చేసింది. ‘ధరణి’ సమస్య కూడా తోడు కావడంతో వెంచర్లు, విల్లాల కొనుగోళ్లకు బ్రేక్ పడింది. నాలుగైదు గుంటలైనా సరే.. ఫాంల్యాండ్పైనే మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూములకే రిజిస్ట్రేషన్ అవుతోంది. ఈ క్రమంలో గుంటల భూముల లెక్కన అమ్మడం సులభమని రియల్ వ్యాపారులు భావిస్తున్నారు. మూడు గుంటల భూమికి తగ్గకుండా 363 గజాల స్థలంగా పరిగణించి మార్కెట్లో ఫాంహౌస్‌ల కోసం విక్రయిస్తున్నారు. 60 శాతం భూ విక్రయాలు గతేడాది నవంబర్ 3 నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఇప్పటి వరకు 1,045 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో 3 నుంచి 10 గుంటల వరకు 60 శాతం మేర భూ విక్రయాలు జరిగాయి. మిగతా 40 శాతం భూములను వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఫాంహౌస్‌ల కోసం కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో మధ్య తరగతి వర్గాలు వీటి నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. లే అవుట్ల ఖర్చు భరించలేకనే.. వ్యవసాయ భూమిని నివాసయోగ్య స్థలంగా మార్చేందుకు అనేక నిబంధనలు అడ్డొస్తున్నాయి. గతంలో టౌన్‌ప్లానింగ్, గ్రామ పంచాయతీల అనుమతితో ఇష్టానుసారంగా విల్లాలు, లేఅవుట్లు, వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించేవారు. ఇప్పుడు అలా చేయాలంటే రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ భూమి ని మొదటగా రెసిడెన్షియల్ స్థలంగా మార్పు చేయాలి. అప్పుడు ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)కు పన్ను చెల్లించాలి. ఆ తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో రియల్ వ్యాపారులు ప్లాట్లను ఫాంల్యాండ్‌గా మార్చి విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఖర్చు లేకుండానే ఆదాయం వస్తోందని అంటున్నారు. పల్లెల్లో సందడి రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి.. ఇలా అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల కొనుగోళ్లకు పట్నం వాసులు ముందుకొస్తున్నారు. శని, ఆదివారాల్లో పల్లెలు కార్లతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరమైనా ఎకరం భూమి ధర రూ.25 లక్షలు, తారు రోడ్డును ఆనుకుని ఉంటే ఎకరం ధర రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతోంది. ఫాంహౌస్‌లపైనే మక్కువ చూపుతున్నారు కొత్త వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తలేరు. జోన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడం.. ధరణిలో కమర్షియల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. మూడు గుంటల నుంచి ఎకరంలోపు భూములను కొనుగోలు చేసి.. ఫాం ల్యాండ్‌గా అభివృద్ధి చేసి విక్రయిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కువ మంది వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. – సంతోష్‌రెడ్డి, తూప్రాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి చదవండి: లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్ దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు