Anushka Sharma, Virat Kohli to Build Cricket Pitch at Their Alibaug Farmhouse - Sakshi
Sakshi News home page

రూ.19 కోట్ల లగ్జరీ ఫామ్‌హౌస్‌,క్రికెట్‌ పిచ్‌ కూడా: విరాట్‌ కోహ్లీ క్లారిటీ

Published Tue, Aug 15 2023 3:39 PM | Last Updated on Wed, Aug 16 2023 8:59 AM

Anushka Sharma Virat Kohli to build cricket pitch at their Alibaug farmhouse - Sakshi

అటు క్రికెట్‌ వరల్డ్‌  ఇటు గ్లామర్ ప్రపంచంలోని పవర్‌ అండ్‌ స్వీట్‌ కపుల్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ. తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ కోట్లాది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు.  వీరు ఏం చేసినా ఫ్యాన్స్‌కు అదో  సంచలనమే. తాజాగా వీరి ఫామ్‌ హౌస్‌లో  క్రికెట్‌ పిచ్‌ను నిర్మించనున్నారనే వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు  కొడుతోంది.

డిసెంబర్ 11, 2017న వివాహం  చేసుకుని అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ  విరుష్కగా ఫ్యామస్‌ అయ్యారు. వీరికి 2021లో   ఆడబిడ్డ (వామిక) జన్మించింది. 2022లో విరుష్క జంట గణేష్ చతుర్థి శుభ సందర్భంగా విలాస వంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. అలీబాగ్‌లోని జిరాద్ సమీపంలో 8 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. దీని విలువు  దాదాపు రూ. 19 కోట్ల 24 లక్షల 50 వేలు అని అంచనా.  దీంతోపాటు ఈ జంటకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి ముంబై, గుర్గావ్‌లో రెండు లగ్జరీ భవనాలతో పాటు,  కొన్ని ఇతర విలువైన ఆస్తులతో  ఈ జంటది  కింగ్-సైజ్ జీవితమని  ఫ్యాన్స్‌ నమ్ముతారు.   

అయితే తాజా సమాచారం ప్రకారం లగ్జరీ ఫామ్‌హౌస్ నిర్మాణానికి సంబందించిన అన్ని అనుమతులు పొందిన కోహ్లీ నిర్మాణ పనులను షురూ చేశాడు.  ఇటీవల (ఆదివారం) ఈ ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించాడట. ప్రకృతి ప్రేమికులైన విరుష్క జంట విలువైన ఇన్‌పుట్‌లు ఇస్తున్నారట. చక్కటి నిర్మాణ శైలి, పచ్చదనంతో నిండి వుండేలా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌కి సూచించారట. రియల్ ఎస్టేట్ కంపెనీ సమీరా హాబిటాట్స్ ద్వారా సేకరించిన భూమిలో ఉదయన్ మజుందార్ అండ్‌ బ్లాంకా బ్రేవో రేయిస్ ఆధ్వర్యంలో ఈ  విలాసవంతమైన ఫామ్‌హౌస్‌  సిద్ధమవుతోంది.

మాండ్వా జెట్టీకి కేవలం 10 నిమిషాల దూరంలో అలీబాగ్‌లోని ఆవాస్ గ్రామంలోని  4BHK విల్లా, ఇది విల్లాలో నాలుగు బెడ్‌రూమ్‌లు, రెండు కవర్ కార్ గ్యారేజీలు, పౌడర్ రూమ్‌లతో నాలుగు బాత్‌రూమ్‌లు, టెర్రస్, అవుట్‌డోర్ డైనింగ్, ఒక ప్రైవేట్ పూల్, చాలా అవుట్‌డోర్ ఓపెన్ స్పేస్, స్టాఫ్ క్వార్టర్స్   తోపాటు ముఖ్యంగా  కోహ్లీ మేరకు ఈ ప్రాంగణంలోనే క్రికెట్ పిచ్ కూడా ఏర్పాటు చేయనున్నారట. సో.. అతను కావాలనుకున్నపుడు  క్రికెట్‌  ప్రాక్టీస్ చేయవచ్చు లేదా  ఫ్రెండ్స్‌ వచ్చినపుడు సరదాగా  ఆడుకోవచ్చునేది ప్లాన్‌.అయితే ఇటీవల సోషల్‌ మీడియా ఎండార్స్‌మెంట్ల వార్తలపై స్పందించిన ఈ స్టార్‌  క్రికెటర్‌ తాజా ఊహాగానాలపై  కూడా స్పందించారు.
 అయితే ఈ వార్తలను విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీలో కొట్టి పారేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement