Alibaug
-
రూ.19 కోట్ల లగ్జరీ ఫామ్‌హౌస్,క్రికెట్ పిచ్ కూడా: విరాట్ కోహ్లీ క్లారిటీ
అటు క్రికెట్ వరల్డ్ ఇటు గ్లామర్ ప్రపంచంలోని పవర్ అండ్ స్వీట్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ కోట్లాది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. వీరు ఏం చేసినా ఫ్యాన్స్‌కు అదో సంచలనమే. తాజాగా వీరి ఫామ్ హౌస్‌లో క్రికెట్ పిచ్‌ను నిర్మించనున్నారనే వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 11, 2017న వివాహం చేసుకుని అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ విరుష్కగా ఫ్యామస్ అయ్యారు. వీరికి 2021లో ఆడబిడ్డ (వామిక) జన్మించింది. 2022లో విరుష్క జంట గణేష్ చతుర్థి శుభ సందర్భంగా విలాస వంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. అలీబాగ్‌లోని జిరాద్ సమీపంలో 8 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. దీని విలువు దాదాపు రూ. 19 కోట్ల 24 లక్షల 50 వేలు అని అంచనా. దీంతోపాటు ఈ జంటకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి ముంబై, గుర్గావ్లో రెండు లగ్జరీ భవనాలతో పాటు, కొన్ని ఇతర విలువైన ఆస్తులతో ఈ జంటది కింగ్-సైజ్ జీవితమని ఫ్యాన్స్ నమ్ముతారు. అయితే తాజా సమాచారం ప్రకారం లగ్జరీ ఫామ్‌హౌస్ నిర్మాణానికి సంబందించిన అన్ని అనుమతులు పొందిన కోహ్లీ నిర్మాణ పనులను షురూ చేశాడు. ఇటీవల (ఆదివారం) ఈ ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించాడట. ప్రకృతి ప్రేమికులైన విరుష్క జంట విలువైన ఇన్పుట్లు ఇస్తున్నారట. చక్కటి నిర్మాణ శైలి, పచ్చదనంతో నిండి వుండేలా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌కి సూచించారట. రియల్ ఎస్టేట్ కంపెనీ సమీరా హాబిటాట్స్ ద్వారా సేకరించిన భూమిలో ఉదయన్ మజుందార్ అండ్ బ్లాంకా బ్రేవో రేయిస్ ఆధ్వర్యంలో ఈ విలాసవంతమైన ఫామ్‌హౌస్ సిద్ధమవుతోంది. మాండ్వా జెట్టీకి కేవలం 10 నిమిషాల దూరంలో అలీబాగ్‌లోని ఆవాస్ గ్రామంలోని 4BHK విల్లా, ఇది విల్లాలో నాలుగు బెడ్రూమ్లు, రెండు కవర్ కార్ గ్యారేజీలు, పౌడర్ రూమ్‌లతో నాలుగు బాత్రూమ్లు, టెర్రస్, అవుట్డోర్ డైనింగ్, ఒక ప్రైవేట్ పూల్, చాలా అవుట్డోర్ ఓపెన్ స్పేస్, స్టాఫ్ క్వార్టర్స్ తోపాటు ముఖ్యంగా కోహ్లీ మేరకు ఈ ప్రాంగణంలోనే క్రికెట్ పిచ్ కూడా ఏర్పాటు చేయనున్నారట. సో.. అతను కావాలనుకున్నపుడు క్రికెట్ ప్రాక్టీస్ చేయవచ్చు లేదా ఫ్రెండ్స్ వచ్చినపుడు సరదాగా ఆడుకోవచ్చునేది ప్లాన్.అయితే ఇటీవల సోషల్ మీడియా ఎండార్స్మెంట్ల వార్తలపై స్పందించిన ఈ స్టార్ క్రికెటర్ తాజా ఊహాగానాలపై కూడా స్పందించారు. అయితే ఈ వార్తలను విరాట్ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీలో కొట్టి పారేశారు. -
కళ్లు చెదిరే రీతిలో కోహ్లి విలాసవంతమైన విల్లా.. వైరల్ ఫొటోలు
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అలీబాగ్‌లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మతో కలిసి ఎనిమిదెకరాల భూమిని కొని.. అందులో ఫామ్‌హౌజ్ నిర్మించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. photo courtesy :archdigestindia ఇక దాదాపు 19 కోట్ల విలువైన ఈ లగ్జరీ విల్లాకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా అలీబాగ్‌లో ప్రాజెక్టు చేపట్టిన కంపెనీ.. కోహ్లి ఇంటికి సంబంధించిన వీడియో, ఫొటోలు షేర్ చేసింది. photo courtesy :archdigestindia కాగా సెలబ్రిటీ డిజైనర్ సుసానే ఖాన్ ఈ విల్లాకు ఇంటీరియర్ డిజైనర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. అవుట్డోర్ స్విమ్మింగ్‌ఫూల్, అద్భుతమైన ఇంటీరియర్‌తో ఉన్న కోహ్లి విల్లాను చూసిన నెటిజన్లు.. ‘‘మీ కొత్త ఇల్లు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కోహ్లికి ముంబై, గుర్గావ్లో విలాసవంతమైన ఇళ్లు ఉన్న విషయం తెలిసిందే. photo courtesy :archdigestindia కెరీర్ విషయానికొస్తే.. కోహ్లి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. 296 పరుగులు చేసి ఈ ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డిసెంబరు 4 నుంచి వన్డే సిరీస్ ఆరంభం నేపథ్యంలో జట్టుతో కలిసి బంగ్లాదేశ్‌కు పయనం కానున్నాడు. photo courtesy :archdigestindia photo courtesy :archdigestindia చదవండి: AUS VS WI 1stTest: లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలు.. పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న హెడ్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దే పేరిట అలీబాగ్‌లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పక్రియ మంగళవారం(డిసెంబర్-14)న అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరగినట్లు సమచారం. అలీబాగ్‌లో రోహిత్ ఒక్కడే కాకుండా, అంతకుముందు సచిన్ టెండుల్కర్,విరాట్ కోహ్లి, రవిశాస్త్రి, అజిత్ అగర్కార్‌కు సంబంధించిన అస్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. అలీబాగ్ సిటీకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరళ్ మహత్రోలి అనే గ్రామంలో కొనుగోలు చేశాడు. "ల్యాండ్ డీల్ కోసం రోహిత్ శర్మ మంగళవారం మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ అతడు భూమిని కొన్నాడా లేదా అతడితో పాటు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడా అన్నది మాకు తెలియదు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అలీబాగ్ సబ్ రిజిస్టర్ సంజాన జాదవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఆ గ్రామ సర్పంచ్ మాట్లాడూతూ.."తన భార్య పేరిట 4ఎకరాల భూమిని రోహిత్ శర్మ కొనుగోలు చేశాడు. దాని విలువ సూమారు 9 కోట్లు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత మా గ్రామానికి వచ్చి ఆ స్ధలంలో పూజ కూడా నిర్వహించాడు" అని అతడు పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా దక్షిణాఫ్రితో టెస్ట్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్ -
బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్
ఇండియన్ ఐడల్ 12వ సీజన్ మరో వివాదంలో చిక్కుకుంది. గత వారం జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ ఆదిత్య నారయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎపిసోడ్లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు అమిత్ కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇదే ఎపిసోడ్లో కంటెస్టెంట్ సవాయ్ భట్, అంజలి గైక్వాడ్‌తో కలిసి ఓ సూపర్ హిట్ పాటను పాడి వినిపించారు. వీళ్ల పర్ఫార్మెన్స్ పూర్తయ్యాక సవాయ్ భట్‌కు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని గెస్ట్ ఒకరు ప్రశ్నించగా లేదు లేదు అని సవాయ్ భట్ సమాధానం చెప్పాడు. అయితే మరో కంటెస్టెంట్ మాత్రం సవావ్ భట్‌కు జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ ఉందని, ఆమెతో తరుచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటాడని చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. ఇదే విషయంపై యాంకర్ ఆదిత్య నారాయణ్.. ఎవరా జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ అని ప్రశ్నించగా సవాయ్ భట్ అదేం లేదు అని దాటవేసే ప్రయత్నం చేయడంతో..నువ్వు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మడానికి మేము అలీభగ్ నుంచి ఏం రాలేదు అంటూ ఫన్నీగా ఆటపట్టించాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఆదిత్య మెడకు చెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని అలీభగ్ ప్రజలను అవమానించేలా ఆదిత్య వ్యాఖ్యలు ఉన్నాయని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) మండిపడింది. వెంటనే అలీభగ్ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆదిత్య నారాయణ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. 'రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్ధేశం కానే కాదు. అలీభగ్ ప్రజలపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొన్నారు. చదవండి : ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్ ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
షాకిచ్చిన హీరో.. ఈ నెల 24న పెళ్లి?!
పది రోజుల క్రితమే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన వివాహం గురించి స్పందించారు. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్‌గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘‘ఈ నెల 24 ఆదివారం నాడు అలీబాగ్‌లో వరుణ్ ధావన్ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి’’ అని న్యూస్ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. ఇక పెళ్లి కుమార్తె ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు వరుణ్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నటాశా దలాలే. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వీరిద్దరు గతేడాది మార్చిలోనే వివాహం చేసుకోవాలని భావించారట. కానీ కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా వివాహాన్ని ఈ ఏడాదికి వాయిదా వేశారట. మొత్తానికి 2021 వరుణ్ ధావన్ వివాహంతో ప్రారంభం అవుతుంది. ఇక ఎంతమంది వీరి బాటలో నడుస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్ ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ కపూర్, నీతూ కపూర్, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
అర్నాబ్ జైలు జీవితంలో మొదటిరోజు అలా..
ముంబై : ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మొదటిరోజు అలీభాగ్‌లోని ఓ పాఠశాలలో గడిపారు. ప్రస్తుతం దీన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నారు. ప్రధాన జైలుకు పంపేముందు మందు జాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు నిందితులను జైలు అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అర్నాబ్‌ను తాత్కాలిక జైళ్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. అలీభాగ్ జైలులో మొత్తం సామర్థ్యం 82 మందికి కాగా, ప్రస్తుతం అక్కడ 99మంది ఖైదీలున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో వైరస్ తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 23 నగరాల్లో 30కి పైగా తాత్కాలిక జైళ్లను ఏర్పాటుచేశారు. (మహిళా కానిస్టేబుల్‌పై దాడి..అర్నాబ్‌పై మరో కేసు! ) ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టళ్లు , కాలేజీలలో తాత్కాలికంగా ఖైధీలను ఉంచుతున్నారు. దీని వల్ల జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా సహాయపడుతుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్ అనంతరం వైద్య పరీక్షల తర్వాత సాధారణ జైళ్లకు తరలిస్తామని పేర్కొన్నారు. చుట్టూ పోలీసుల నడుమ తగిన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఏడాది మే నెలలో అలీభాగ్ జైళ్లో 158 మంది ఖైధీలకు కరోనా నిర్ధారణ కాగా, ఆర్థర్ జైలులో 28 మంది ఖైధీలకు కరోనా సోకింది. (అర్నాబ్ వివాదం :‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు) -
20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్ కపూర్
ముంబై: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఎప్పుడు హుషారుగా తన అభిరుచులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకిష్టమైన అలీబాగ్ ప్రదేశాన్ని 20ఏళ్ల తర్వాత సందర్శించినట్లు తెలిపారు. అనిల్ కపూర్ తెల్లషర్ట్ నీలి రంగు పాయింట్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్న దృష్యాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీకు 63సంవత్సరాలంటే నమ్మలేమని చాలా యంగ్ కనిపిస్తున్నారని అనిల్ కపూర్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా అనిల్ కపూర్ సందర్శించిన బీచ్ చెట్లు, నీటితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మహారాష్ట్ర ప్రదేశంలొ ఉన్న అలీబాగ్ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిజికల్ ఫిట్ నెస్ వ్యాయామం చెస్తున్న దృష్యాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించిన సంగతి తెలిసిందే. (చదవండి: అనిల్ కపూర్ "కిల్లర్ కాంబో'' వైరల్) -
తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను
-
నిసర్గ తుఫానుతో మూడు రాష్ట్రాల్లో అలర్ట్
-
ముంబైని తాకిన నిసర్గ తుఫాను
ముంబై : అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర తుఫాను(నిసర్గ తుఫాను)గా మారిన సంగతి తెలిసిందే. కాగా నిసర్గ తుపాను బుధవారం ముంబైలోని అలీబాగ్ వద్ద మధ్యాహ్నం 1గంట సమయంలో తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో నిసర్గ సంపూర్ణంగా తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. నిసర్గ తుఫాను అలీబాగ్ వద్ద తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబై నగరానికి ఈ తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది.(నిసర్గ: చార్జింగ్ పెట్టుకోండి.. గ్యాస్ కట్టేయండి!) ముందుజాగ్రత్త చర్యగా ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాత్రి 7గంటల వరకు మూసివేశారు. కాగా తుఫాను ప్రభావంతో ముంబై నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. గుజరాత్లో 15 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. -
ఆరెంజ్ జోన్: ‘వెళ్లి బీర్ తెచ్చుకుంటాను’
ముంబై: ‘లాక్డౌన్లో నేను ఉన్న ప్రాంతం(అలీబాగ్) తొలుత రెడ్‌జోన్‌లో ఉండేది. ఇప్పుడు ఆరెంజ్ జోన్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తెరుచుకోగానే వెంటనే బీర్ తెచ్చుకుంటాను. చాలా మద్యం షాపుల దగ్గర భౌతిక దూరం పాటించడం లేదు. నేను మాత్రం తప్పకుండా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించే షాప్‌కు వెళ్లి మద్యం తెచ్చుకుంటాను. ఇక నేను ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం ఉంటే కచ్చితంగా రోజర్ బిన్నీ, లక్షణ్ శివరామకృష్ణన్‌లతో కలిసి తాగుతాను’అని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా 1985లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రవిశాస్త్రి హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా తనను మియాందాద్ స్లెడ్జింగ్ చేశాడని తెలిపాడు. ‘పాకిస్థాన్ని ఆ మ్యాచ్‌లో ఓడించడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. నిజాయతీగా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచేందుకు మియాందాద్ చాలా ప్రయత్నించాడు. కానీ.. అతనికి ఆడీ(ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ) కారు గెలుచుకునే అవకాశం దక్కలేదు’ అని రవిశాస్త్రి వెల్లడించాడు. చదవండి: ‘ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు’ 'అందుకే రైనాను పక్కన పెట్టాం' -
నీరవ్ మోదీ బంగ్లా కూల్చివేత
-
నీరవ్ మోదీకి భారీ షాక్!
-
అలీబాగ్‌లో అడుగుపెట్టలేవు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌పై మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవంబర్ 3న ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతం అలీబాగ్‌కు వెళ్లేందుకు ఎమ్మెల్సీ జయంత్ పాటిల్ ముంబైలోని గేట్ వే ఇండియా రేవుకు చేరుకున్నారు. అదే సమయంలో పుట్టిన రోజు వేడుకల కోసం అలీబాగ్ వెళ్లేందుకు సొంత పడవలో షారుక్ ఖాన్ రేవులో వేచిఉన్నారు. షారుక్ పడవ ఎంతకీ కదలకపోవడం జయంత్‌కు కోపమొచ్చింది. షారుక్ దగ్గరికెళ్లి నిలదీశారు. ‘నువ్వు సూపర్ స్టార్‌వి కావచ్చు. అలీబాగ్ను కొన్నావా? నా అనుమతి లేనిదే అలీబాగ్లోకి అడుగుపెట్టలేవు’ అని హెచ్చరించారు. ఘటనపై శనివారం ఆయన వివరణ ఇస్తూ.. ‘నేను అలీబాగ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాను. రేవులో షారూక్ పడవ చాలాసేపు అక్కడే ఉంది. అభిమానులకు చేతులూపుతూ షారుక్ చాలా తీరిగ్గా కనిపించారు. నేను తొందరగా వెళ్లాల్సి ఉండగా షారుక్ మాత్రం ఎలాంటి కంగారు లేకుండా ఉండడం వల్లే ఆగ్రహంతో మాట్లాడాను అని జయంత్ చెప్పారు. -
శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తొలిసారిగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. ఫడణవిస్ సర్కారు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అన్నారు. రాయగఢ జిల్లాలోని అలీబాగ్ లో జరిగిన ఎన్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఫడణవిస్ ప్రభుత్వానికి ఎన్సీపీ బయట నుంచి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. చిరకాల మిత్రపక్షం శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీకి ఎన్సీపీ స్నేహహస్తం అందించింది.