
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అలీబాగ్‌లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మతో కలిసి ఎనిమిదెకరాల భూమిని కొని.. అందులో ఫామ్‌హౌజ్ నిర్మించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
photo courtesy :archdigestindia
ఇక దాదాపు 19 కోట్ల విలువైన ఈ లగ్జరీ విల్లాకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా అలీబాగ్‌లో ప్రాజెక్టు చేపట్టిన కంపెనీ.. కోహ్లి ఇంటికి సంబంధించిన వీడియో, ఫొటోలు షేర్ చేసింది.
photo courtesy :archdigestindia
కాగా సెలబ్రిటీ డిజైనర్ సుసానే ఖాన్ ఈ విల్లాకు ఇంటీరియర్ డిజైనర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. అవుట్‌డోర్ స్విమ్మింగ్‌ఫూల్, అద్భుతమైన ఇంటీరియర్‌తో ఉన్న కోహ్లి విల్లాను చూసిన నెటిజన్లు.. ‘‘మీ కొత్త ఇల్లు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కోహ్లికి ముంబై, గుర్గావ్‌లో విలాసవంతమైన ఇళ్లు ఉన్న విషయం తెలిసిందే.
photo courtesy :archdigestindia
కెరీర్ విషయానికొస్తే.. కోహ్లి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. 296 పరుగులు చేసి ఈ ఐసీసీ ఈవెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డిసెంబరు 4 నుంచి వన్డే సిరీస్ ఆరంభం నేపథ్యంలో జట్టుతో కలిసి బంగ్లాదేశ్‌కు పయనం కానున్నాడు.
photo courtesy :archdigestindia
photo courtesy :archdigestindia