
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన భార్య అనుష్క శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. నా ప్రాణ స్నేహితుడు, నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. నిన్ను ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాము అంటూ అనుష్కపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
కాగా.. అనుష్క శర్మ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేసిన ముద్దుగుమ్మ డిసెంబర్ 2017లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరూ ఇటలీలోని టస్కానీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జనవరి 2021లో తమ కుమార్తె వామిక జన్మించింది. గతేడాది ఫిబ్రవరి 2024లో బాబు పుట్టగా అకాయ్ అని పేరు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.